విజయనగరం: వచ్చే నెల నాలుగున నిర్వహించాల్సిన ఆల్ ఇండియా సైనికస్కూల్ ప్రవేశ పరీక్షలు వాయిదా పడినట్లు కోరుకొండ సైనికస్కూల్ ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ పి.రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
2015-16 విద్యా సంవత్సరానికి జనవరి 4న జరగాల్సిన ప్రవేశ పరీక్షలు 2015 ఫిబ్రవరి 22కి వాయిదా పడినట్లు ఆయన తెలిపారు. ఇతర సమాచారం కోసం కోరుకొండ సైనికపాఠశాల ఫోన్ నంబర్లు 08922-246119, 246168లలో సంప్రదించాలన్నారు.
సైనికస్కూల్ ప్రవేశ పరీక్షలు వాయిదా
Published Wed, Dec 31 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM
Advertisement
Advertisement