విజయనగరం: ఆల్ ఇండియా సైనికస్కూల్ ప్రవేశ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కోరుకొండ సైనిక స్కూల్ ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ పి.రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2015-16 సంవత్సరానికి సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశానికి వచ్చేనెల 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆరో తరగతికి ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గణితం (100 మార్కులకు), లాంగ్వేజీ ఎబిలిటీ (100 మార్కులకు) పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.50 గంటల వరకు ఇంటిలిజెన్సీ (100 మార్కులకు) పరీక్ష నిర్వహిస్తారన్నారు.
తొమ్మిదో తరగతికి అదే రోజు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు గణితం (200 మార్కులకు), సైన్స్ (75 మార్కులకు), మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఇంగ్లిషు (100 మార్కులకు), సోషల్ స్టడీస్ (75 మార్కులకు) పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. గత ఏడాది కంటే అదనంగా కలికిరి, విజయవాడ, రాజమండ్రిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇతర సమాచారానికి కోరుకొండ సైనిక పాఠశాల ఫోన్ నంబర్లు 08922-246119, 246168 లలో సంప్రదించాలన్నారు.
సైనిక స్కూల్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్న కేంద్రాల వివరాలు...
పరీక్షా కేంద్రం నిర్వహించే స్థలం, చిరునామా
గుంటూరు శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్, బ్రాడీపేట, గుంటూరు
హైదరాబాద్ కీస్ గర్ల్స్ హైస్కూల్, సికింద్రాబాద్
కరీంనగర్ గవర్నమెంట్ హైస్కూల్, సుభాష్‌నగర్, కరీంనగర్
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి హైస్కూల్, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఎదురుగా, తిరుపతి.
విజయనగరం సెయింట్ జోసఫ్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, కంటోన్మెంట్, విజయనగరం
విశాఖపట్నం ఎస్‌ఎఫ్‌ఎస్ హైస్కూల్, సీతమ్మధార, విశాఖపట్నం
విజయవాడ జెడ్పీ హైస్కూల్ (బాలుర), పటమట, విజయవాడ
కడప నాగార్జున మోడల్ స్కూల్, జిల్లా కోర్టు వెనుక, మారుతీనగర్, వైఎస్‌ఆర్ జిల్లా, కడప
కర్నూలు మాంటిసోరి ఇంగ్లిషు మీడియం హైస్కూల్, ఎ-క్యాంప్, కర్నూలు
రాజమండ్రి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాయికృష్ణా థియేటర్ దగ్గర, డీలక్స్ సెంటర్, రాజమండ్రి
కలికిరి సైనిక్ స్కూల్, కలికిరి, చిత్తూరు జిల్లా.