
సాక్షి, విజయనగరం: చైనాతో జరిగిన సరిహద్దు వివాదంలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబుకు విజయనగరంలోని కోరుకొండ సైనిక్ స్కూల్ సిబ్బంది నివాళులు అర్పించారు. అక్కడ ఉపాధ్యాయులు మాట్లాడుతూ... సంతోష్ బాబు తమ విద్యార్థి కావడం గర్వకారణమన్నారు. కల్నల్ సంతోష్ బాబు మరణం తమను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృత్యువుతో పోరాడుతూ కూడా సంతోష్ బాబు చైనా సేనకు దడ పుట్టించారని కొనియాడారు. సంతోష్ కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.