colonel
-
నోరూరించే కేఎఫ్‌సీ చికెన్ తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ..!
ప్రస్తుతం యువతరం చాలా ఇష్టంగా లాగించే చికెన్ వెరైటీలో కేఎఫ్‌సీ ఒకటి. చాలామందికి ఈ కేఎఫ్‌సీ చికెన్ అంటే మహా ఇష్టం. ఫ్రైడ్ చికెన్‌లో ఇంతలా ప్రత్యేకతను సంతరించుకునేలా విభిన్నంగా ఎలా తయారు చేయాగలిగారో వింటే ఆశ్చర్యపోతారు. అందులోనూ లేటు వయసులో తన ఆర్థిక భద్రత గురించి కలిగిన ఆందోళన బిజినెస్ మెదలుపెట్టాలన్న ఆలోచనకు దారితీసింది. అదే చివరికి వెరైటీ రెసిపీని తయారు చేసేందుకు పురిగొల్పింది. చివరకు కనివిని ఎరుగని రీతీలో సక్సెస్‌ని అందుకుని స్ఫూర్తిగా నిలిచాడు. కలను సాకారం చేసుకోవాలన్న తపన ఉంటే వయసు పెద్ద అడ్డంకి కాదని ప్రూవ్ చేశాడు.అతడే కేఎఫ్‌సీ చికెన్ సృష్టికర్త కల్నల్ హార్లాండ్ సాండర్స్. అందరూ యంగ్ ఏజ్‌లో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు. కొందరూ పూర్తి స్థాయిలో విజయవంతమవ్వగా మరికొందరూ..చిన్న చిన్న విజయాలతో సరిపెట్టుకుంటారు. చివరికి రిటైర్డ్ వయసు వచ్చేటప్పటికీ ఎంతోకొంత ఆర్థిక భద్రతతో కాలం వెళ్లదీస్తుంటారు. అయితే కల్నల్ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. చెప్పాలంటే ఎన్నో బిజినెస్‌లు చేశాడుగానీ ఎందులోనూ మంచి విజయం దక్కించుకోలేదు. అలా 65 ఏళ్లు వచ్చేటప్పటికీ అతడు ఎందులోనూ సక్సెస్ అందుకోని వ్యక్తిగా మిగిలిపోయాడు. పోనీ మిగతా జీవితం సాఫీగా గడిపేందుకు ఎలాంటి ఆర్థిక భద్రతను వెనకేసుకోలేదు. అతడి వద్ద కేవలం రూ. 8వేల రూపాయలే ఉన్నాయి. ఒక్కసారిగా ఏంటీ జీవితం ఇలా వృధాగా అయిపోయిందన్న బాధ కల్నల్‌ని నిలువనివ్వలేదు. ఆ సమయంలోనే తాను ఒక రుచకరమైన రెసిపీని తయారు చేయాలని గట్టిగా అనుకున్నాడు. తాను తయారు చేసే రెసిపీని చూడగానే తానే గుర్తొచ్చేలా.. అత్యద్భుతంగా తయారు చేయాలనుకున్నాడు. తన వద్ద కొద్దిపాటి వనరులతో చికెన్‌తో వెరైటీ రెసిపీ ఏదైనా చేయాలనుకున్నాడు. చెప్పాలంటే రెస్ట్ తీసుకునే వయసులో లక్ష్యం కోసం ఆహర్నిశలు కష్టపడటం మొదలుపెట్టాడు కల్నల్. ఫ్రైడ్ చికెన్ అంటే చాలామందికి ఇష్టమనే విషయం గ్రహించాడు. దానిలోనే ప్రత్యేక రుచితో కూడిన వెరైటీ ఫ్రైడ్ చికెన్ చేయాలనుకున్నాడు. అక్కడకు వరకు బాగానే ఉంది. తాను తయారు చేసిన ఫ్రైడ్ చికెన్లు సమీపంలోని రెస్టారెంట్ల వద్దకు వెళ్లి చేసి చూపించి వాళ్ల చేత శెభాష్ అనిపించుకోవడం అంత ఈజీ కాలేదు కల్నల్‌కి. ఏకంగా ఒక వెయ్యి తొమ్మిది సార్లుకు పైగా అతడు చేసిన రెసిపీ రిజక్ట్ అయ్యింది. విసుగు, కోపం వచ్చేస్తున్నా.. వెనకడుగు వేయకుండా వారి చేత బాగుంది అని ఒప్పుకునేదాక ప్రయత్నం విరమించలేదు. ఒక రోజు మజ్జిగలో నానబెట్టిన చికెన్‌ని బ్రెడ్ పౌడర్‌లో దొల్లించి తాను రెడీ చేసి పెట్టుకున్న మసాల మిశ్రమంలో ముంచి డీప్ ఫ్రై చేసి ఇవ్వగా ఒక రెస్టారెంట్ ఆ టేస్ట్‌కి ఫిదా అయిపోయింది. ఇక అంతే కొద్ది కాలంలో కల్నల్ చేసిన ఫ్రైడ్ చికెన్ బాగా ఫేమస్ అయిపోయింది. దానికి కెంటకీ ఫ్రైడ్ చికెన్ పేరుతో కేఎప్సీగా జనాల్లోకి తీసుకురావడం, ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోవడం చకచక జరిగిపోయాయి. అలా 1964 నాటికి అతడి బ్రాండ్ కెంటకీ ఫ్రైడ్ చికెన్ దేశవ్యాప్తంగా 600 ఫ్రాంచైజీలను కలిగి ఉంది. అదే సంవత్సరం తన బ్రాండ్‌ని సుమారు రూ. 16 కోట్లుకు విక్రయించాడు(ప్రస్తుత రోజుల్లో రూ. 144 కోట్లకు సమానం). అయితే అతనే ఆ బ్రాండ్‌కి అంబాసిడర్, ప్రతినిధి. దీంతో కల్నల్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సెలబ్రిటీగా మారిపోయాడు. కనీస ఆర్థిక భద్రత లేని వ్యక్తి కోటీశ్వరుగా మారిపోయాడు. చాలా లేటు వయసులో లక్ష్యం కోసం యత్నంచి అతిపెద్ద సక్సెస్‌ని అందుకుని.. లక్ష్యానికి వయసుతో సంబంధం లేదని ప్రూవ్ చేశాడు.(చదవండి: 77 ఏళ్ల నాటి కేకు ముక్క..! వేలంలో ఏకంగా..) -
కల్నల్ మన్‌ప్రీత్‌కు కీర్తిచక్ర
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులతో పోరులో వీరమరణం పొందిన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్, జమ్మూకశ్మీర్ డీఎస్పీ హుమయూన్ ముజ్జామిల్ భట్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర అవార్డ్‌ను ప్రకటించింది. రైఫిల్మన్ రవికుమార్ (మరణానంతరం), మేజర్ మల్ల రామగోపాల్ నాయుడు, (మరణానంతరం)లనూ కీర్తిచక్రతో ప్రభుత్వం గౌరవించింది. శాంతిసమయంలో ప్రకటించే రెండో అత్యున్నత గ్యాలెంట్రీ అవార్డ్‌కు ఈసారి నలుగురికి ఎంపికచేశారు. అనంత్ నాగ్ అడవుల్లో ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా ఉగ్రవాదులను నేరుగా ఎదుర్కొని ఒక ఉగ్రవాదిని కల్నల్ మన్‌ప్రీత్ హతమార్చారు. తర్వాత నక్కిన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. త్రివిధ దళాల సర్వసైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి ముర్ము బుధవారం మొత్తం 103 గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించారు. కీర్తిచక్రతోపాటు 18 మందికి శౌర్య చక్ర, ఒకరికి బార్ టు సేనా మెడల్, 63 మందికి సేనా మెడల్, 11 మందికి నావో సేనా మెడల్, ఆరుగురికి వాయుసేనా మెడల్ ప్రకటించారు. ఒక ప్రెసిడెంట్ తట్‌రక్షక్ మెడల్, మూడు తట్‌రక్షక్ మెడళ్లనూ తీర గస్తీ దళాలకు ప్రకటించారు. -
సెల్యూట్ టు కల్నల్ స్వప్న రాణా
‘ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ సిరీస్‌లో భాగంగా కల్నల్ స్వప్న రాణా అసా«ధారణ ప్రయాణానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌పై ఆన్లైన్ కమ్యూనిటీలో ప్రశంసల జల్లు కురుస్తోంది. కంగనా రనౌత్‌లాంటి బాలీవుడ్ నటీమణులు రాణా జీవిత కథను తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని చిన్న గ్రామంలో పుట్టిన స్వప్న వ్యవసాయ పనులు చేసింది. బస్సు ఎక్కడానికి డబ్బులు లేక నడుచుకుంటూనే కాలేజీకి వెళ్లేది. కష్టపడుతూనే చదువుకుంది. ‘హిమాచల్‌ప్రదేశ్ యూనివర్శిటీ’లో ఎంబీఏలో చేరిన స్వప్న ఆ తరువాత సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేరవుతూనే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి సెలెకై్టంది. ఆ తరువాత చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. 2004లో లెఫ్టినెంట్‌గా నియమితురాలైంది. ప్రస్తుతం ఈశాన్యరాష్ట్రాల్లో ఆర్మీ సర్వీస్ కార్ప్స్ బెటాలియన్‌కు కమాండింగ్ ఆఫీ సర్గా విధులు నిర్వహిస్తున్న స్వప్న రాణా ప్రతిష్ఠాత్మక మైన అవార్డ్లు ఎన్నో అందుకుంది. -
కల్నల్ నియామకాల్లో మహిళలకు అన్యాయం... నిబంధనలకు విరుద్ధం: సుప్రీం
న్యూఢిల్లీ: మహిళా అధికారులకు కల్నల్‌గా పదోన్నతి కలి్పంచేందుకు సైన్యం నిరాకరించడం నిబంధనలకు విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమకు కల్నల్‌గా ప్రమోషన్ ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు మహిళా సైనికాధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస మనోజ్ మిశ్రా ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. మహిళా సైనికాధికారులు సైనయంలో తమకు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్లు, బాధ్యతలను చిరకాలం పాటు పోరాడి మరీ సాధించుకున్నారని అభిప్రాయపడింది. కల్నల్ ప్రమోషన్ల విషయంలో మహిళా అధకారుల రహస్య వార్షిక నివేదిక (సీఆర్)లకు సైన్యం కటాఫ్ తేదీని వర్తింపజేసిన తీరు వారికి అన్యాయం చేసేదిగా ఉందంటూ ఆక్షేపించింది. కనుక కల్నల్ ప్రమోషన్ల ప్రక్రియను 15 రోజుల్లోగా తాజాగా చేపట్టాలని సైన్యాన్ని ఆదేశించింది. లింగ వివక్షకు తావులేకుండా మహిళా సైనికాధికారులకు కూడా కల్నల్ తదితర పదోన్నతులు కలి్పంచాలంటూ 2020లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. నేవీలో కూడా దీన్ని వర్తింపజేయాలంటూ కొద్ది రోజులకే మరో తీర్పు వెలువరించింది. సాయుధ దళాల్లో మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడేందుకు తమ తీర్పులు తోడ్పడతాయని ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది. -
కల్నల్ మన్‌ప్రీత్‌కు సైనిక దుస్తుల్లో చిన్నారుల కడసారి వీడ్కోలు..
చండీగఢ్: కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. దేశం కోసం వీరమరణం పొందిన ఆ సైనికుని ఇంటిముందు గ్రామవాసులంతా కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ మధ్య రెండు పసి హృదయాల అమాయకపు సెల్యూట్లు గుండె బరువెక్కేలా చేశాయి. అక్కడ ఏం జరుగుతుందో కూడా సరిగా తెలియని ఆ సైనికుని ఇద్దరు పిల్లలు జై హింద్ అంటూ కడసారి వీడ్కోలు పలికారు. జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్ భౌతికకాయం స్వగ్రామం పంజాబ్‌లోని మల్లాన్‌పూర్‌కు చేరింది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులను ఆపడం ఎవరితరం కాలేదు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న కుటుంబ సభ్యుల రోదనలు చూసి గ్రామస్థులంతా కన్నీరు పెట్టుకున్నారు. మన్‌ప్రీత్ ఆరేళ్ల కుమారుడు ఆర్మీ దుస్తులు ధరించి జై హింద్ నాన్న అంటూ చివరిసారి సెల్యూట్ చేశాడు. మన్‌ప్రీత్ రెండేళ్ల కూతురు కూడా అన్నను అనుకరించింది. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ భార్య, సోదరి, తల్లి, ఇతర కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. #WATCH | Son of Col. Manpreet Singh salutes before the mortal remains of his father who laid down his life in the service of the nation during an anti-terror operation in J&K's Anantnag on 13th September The last rites of Col. Manpreet Singh will take place in Mullanpur… pic.twitter.com/LpPOJCggI2 — ANI (@ANI) September 15, 2023 కల్నల్ మన్‌ప్రీత్ సింగ్(41).. 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతుండగా.. అనంతనాగ్ జిల్లాలో బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో మన్‌ప్రీత్ ప్రాణాలు కోల్పోయారు. ఈయనతో పాటు మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూ కశ్మీర్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమయూన్ వీరమరణం పొందారు. మేజర్ ఆశిష్ ధోంచక్ మృతహానికి కూడా పానిపట్‌లోని స్వగ్రామంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న 33 ఏళ్ల హిమాయున్ ముజామిల్ భట్ అంత్యక్రియలకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీసు చీఫ్ దిల్బాగ్ సింగ్ నివాళులర్పించారు. ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్.. -
Women Army Officers: నెరవేరిన దశాబ్దాల కల.. ఆమె కమాండ్‌లో...
ఆకాశంలో సగం కాదు... నింగి నేల నీరు దేనినైనా పూర్తిగా కమాండ్ చేస్తామంటోంది మహిళాలోకం కఠోరమైన శారీరక శ్రమ చేయాల్సిన కదనరంగాన్ని కూడా నడిపించడానికి ముందుకొచ్చింది.. దశాబ్దాలుగా ఎందరో మహిళా అధికారుల కల ఎట్టకేలకు నెరవేరింది. 100 మందికిపైగా మహిళలు పదోన్నతులు పొంది కల్నల్ స్థాయికి ఎదిగారు. భారత ఆర్మీలో చరిత్రాత్మక ముందడుగు పడింది. సియాచిన్ సహా వివిధ కమాండ్ యూనిట్లను మహిళలు కూడా ముందుండి నడిపించనున్నారు. ఇన్నాళ్లూ పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ బాధ్యతల్ని మొట్టమొదటి సారిగా మహిళలు కూడా నిర్వర్తించనున్నారు. రెజిమెంట్లు, బెటాలియన్లకు అధికార పదవుల్లో మహిళల నియామకానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఈ నెల 9 నుంచి 22 వరకు జరిగింది. దాదాపుగా 108 మంది మహిళా అధికారులు కల్నల్‌గా పదోన్నతులు పొందారు. 1992 నుంచి 2006 బ్యాచ్‌కు చెందిన మహిళా అధికారులకు పదోన్నతులు ఇవ్వడానికి ప్రత్యేక కమిటీ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. వీరంతా ఇంజనీర్స్, సిగ్నల్స్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్ కోర్, ఆర్మీ సర్వీస్ కోర్, ఆర్మీ ఆర్డన్స్ కోర్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్స్ వంటి విభాగాలకు అధికారులుగా సేవలందిస్తారు. భారత సాయుధ బలగాల్లో 1992 నుంచి మహిళా అధికారులు ఉన్నారు. అయితే వారంతా షార్ట్ సర్వీసు కమిషన్ (ఎస్ఎస్సీ) అధికారులుగానే ఇన్నేళ్లుగా కొనసాగుతున్నారు. ఇంజనీర్లు, న్యాయవాదులు, వంటి అడ్మినిస్ట్రేటివ్ పాత్రలే పోషిస్తున్నారు. యుద్ధ క్షేత్రాల్లో గాయపడ్డ జవాన్లకి చికిత్స అందించే వైద్యులు, నర్సులుగా కూడా ఉన్నారు. 16–18 ఏళ్లు సర్వీసు ఉంటేనే కమాండర్ పదవికి అర్హత సాధిస్తారు. ఇప్పుడు కోర్ ఆఫ్ ఆర్టిలరీ, కంబాట్ సపోర్ట్ ఆర్మ్‌లలో మహిళా అధికారుల్ని నియమించనున్నారు. భారత వాయుసేన, నావికాదళంలో అన్ని విభాగాల్లో మహిళా అధికారులు ఉన్నారు. వారికి శాశ్వత కమిషన్లు కూడా ఉన్నాయి. యుద్ధ విమానాలను, యుద్ధ నౌకల్ని నడిపించే మహిళలూ ఉన్నారు. త్రివిధ బలగాల్లో అతి పెద్దదైన పదాతి దళంలో మాత్రమే మహిళల పట్ల ఇన్నాళ్లూ వివక్ష కొనసాగుతూ వచ్చింది. ఎందుకీ వివక్ష పురుషులతో పోలిస్తే మహిళల శారీరక దారుఢ్యంపైనున్న సందేహాలే ఇన్నాళ్లూ వారికి అవకాశాల్ని దూరం చేశాయి. మాతృత్వం, పిల్లల పోషణ, ప్రసూతి సెలవులు వంటివి మహిళలకు తప్పనిసరిగా ఇవ్వాలని, యుద్ధం ముంచుకొచ్చే నేపథ్యాల్లో అది సాధ్యం కాదనే వాదన వినిపించింది. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. మహిళలకు ఎక్కడైనా పని చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వినిపించాయి. భారత వాయుసేన, నావికాదళంతో పోలిస్తే ఆర్మీలో వివక్ష ఎక్కువగా ఉంది. యుద్ధభూమిలో నేరుగా మహిళలుంటే శత్రు దేశానికి చిక్కితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికీ పోరాట క్షేత్రాల్లో మహిళా కమాండర్లను నియమించడానికి భారత సైన్యం ఇంకా సిద్ధంగా లేదు. సుప్రీం తీర్పుతో నెరవేరిన కల భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్, కమాండింగ్ పదవులు ఇవ్వాల్సిందేనని 2020 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. వారు ఎన్ని సంవత్సరాలుగా సర్వీసులో ఉన్నారనే విషయంతో సంబంధం లేకుండా అందరికీ శాశ్వత కమిషన్ వర్తింపచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో ఆర్మీలో మహిళలు పురోగతి సాధించడానికి, నాయకత్వ సామర్థ్యాలను ప్రదర్శించడానికి, పదోన్నతులకు మార్గం సుగమమైంది. యూనిట్‌ను కమాండ్ చేయడమంటే..? పదాతి దళంలో క్షేత్రస్థాయిలో సైనికులందరికీ నేరుగా ఆదేశాలు ఇస్తూ వారిని ముందుకు నడిపించే కీలక బాధ్యత. ఇప్పటివరకు పురుషులు మాత్రమే నిర్వహించిన ఈ బాధ్యతల్ని మహిళలు కూడా అందుకున్నారు. సైన్యంలో కల్నల్ పదవి మహిళకి లభిస్తే ఆమె కనుసన్నల్లోనే సైన్యం నడుస్తుంది. బ్రిగేడర్, మేజర్ జనరల్, లెఫ్ట్‌నెంట్ జనరల్ వంటి ఉన్నతాధికారులు నేరుగా సైనికులతో సంబంధాలను కొనసాగించరు. ఇలాంటి పదవుల్లోనే ఎన్నో సవాళ్లను మహిళలు ఎదర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే మహిళల్లో నాయకత్వ సామర్థ్యం బయట ప్రపంచానికి తెలుస్తుంది. ‘‘సియాచిన్‌లో మొట్టమొదటి మహిళా అధికారిగా శివ చౌహాన్‌ను నియామకం మాలో కొత్త ఉత్సాహాన్ని పెంచింది. స్త్రీ, పురుషులన్న భేదం లేకుండా ప్రతీ ఒక్కరికీ వారికి మాత్రమే సొంతమయ్యే సామర్థ్యాలుంటాయి. ఆర్మీలో మహిళలకు మంచి భవిష్యత్ ఉంది. శారీరక దారుఢ్యం ఉన్నవారు కూడా ఇన్నాళ్లూ వివక్ష కారణంగా పదవులకి దూరమయ్యారు. ఇక ఆ రోజులు పోయాయి’’ – దీక్షా ధామిన్, ఆర్మీకి శిక్షణ పొందుతున్న యువతి ‘‘ఆర్మీలోకి రావాలనుకునే మహిళల సంఖ్య ఇంకా పెరుగుతుంది. పోరాట క్షేత్రాలకు సంబంధించిన విభాగాల్లో కూడా మహిళా అధికారులు రావాలి. ఎందుకంటే మహిళలు ఎంతో చురుగ్గా, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో ఉంటారు’’ – దీప్‌నూర్ సహోతా, ఆర్మీకి శిక్షణ పొందుతున్న యువతి – సాక్షి, నేషనల్ డెస్క్ -
కల్నల్ కుటుంబంపై జనసేన నేత దౌర్జన్యం
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఇది దేశ రక్షణలో నిమగ్నమైన కల్నల్ కుటుంబంపై ఓ జనసైనికుడి దాష్టీకం. కల్నల్ ఇంటిని నివాసానికని అద్దెకు తీసుకొని, పార్టీ కార్యాలయం పెట్టారు. అందులో అనైతిక కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా, ఇదేమిటని ప్రశ్నించి ఇల్లు ఖాళీ చేయమన్న ఆయన తల్లినీ బెదిరించాడు. దౌర్జన్యానికి దిగాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాలను కార్గిల్‌లో పనిచేస్తున్న కల్నల్ మహేశ్వరరెడ్డి ట్విట్టర్లో వెల్లడించారు. తరచూ అక్కడ మహిళలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఈ పోస్టు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ‘సాక్షి’తో కూడా మాట్లాడారు. వివరాలివీ.. కర్నూలు సీ క్యాంపు గణేశ్‌నగర్‌కు చెందిన మహేశ్వరరెడ్డి భారత సైన్యంలో కల్నల్‌గా కార్గిల్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఇంటిని (హౌస్ నంబర్ 87/1024)ను 2021 మేలో షేక్‌మహ్మద్ మహబూబ్‌బాషా, అతని భార్య హసీనా బేగం అద్దెకు తీసుకున్నారు. నివాసానికి అని చెప్పి తీసుకున్నప్పటికీ, అందులో నేషనల్ ఉమెన్స్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం జనసేనలో చేరి, ఆ పార్టీ కార్యాలయంగా మార్చారు. అద్దె కూడా చెల్లించలేదు. నివాసానికి అని చెప్పి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని, అద్దె కూడా చెల్లించడంలేదని, వెంటనే ఖాళీ చేయాలని కల్నల్ నోటీసులు ఇచ్చారు. జనవరిలో స్వయంగా కల్నల్ వచ్చి వారితో మాట్లాడారు. ఫిబ్రవరి 28 లోపు ఖాళీ చేయాలని గట్టిగా చెప్పారు. అయినా ఖాళీ చేయలేదు. మంగళవారం కల్నల్ తల్లి లక్ష్మీదేవి ఇంటిని ఖాళీ చేయాలని బాషాకు చెప్పారు. ఖాళీ చేయనని, గట్టిగా మాట్లాడితే మీ అంతు చూస్తామని బాషా బెదిరించారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కల్నల్ కుటుంబ సభ్యులు జనసేన కార్యాలయంలోని ఫర్నీచర్‌ను బయట పెట్టి తాళం వేసుకున్నారు. తమను బెదిరించిన బాషాపై కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహబూబ్ బాషాపై కల్నల్, ఆయన తల్లి చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని త్రీ టౌన్ సీఐ మహ్మద్ తబ్రేజ్ చెప్పారు. బాషాపై గతంలోనే ఓ అత్యాచారం కేసు నమోదైంది. తన కార్యాలయంలో పనిచేసిన ఓ మహిళపై అత్యాచారం చేసినట్లు, ఫోన్లో పలుమార్లు బాధితురాలిని బెదిరించినట్లు 2021 అక్టోబరు 18న కేసు నమోదైంది. ఆడియో రికార్డులతో సహా ఆమె త్రీటౌన్, దిశ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బాషాపై సెక్షన్ 376 క్లాజ్–1, 376 క్లాజ్–సి, 354 డి, 506, 108 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన రిమాండ్‌కు కూడా వెళ్లొచ్చాడు. జనసేనకు ప్రశ్నలు సంధించిన కల్నల్ తాను సరిహద్దుల్లో దేశం కోసం శ్రమిస్తున్నానని, కానీ జనసేన నేతలు తమను, తమ కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారని కల్నల్ అన్నారు. జనసేన రాష్ట్ర నాయకత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. పార్టీలోకి చేర్చుకునే వ్యక్తుల పూర్వాపరాలు పరిశీలించరా? పార్టీ నేతలు, కార్యకర్తలకు కనీస విలువలు ఉండవా? నేరస్తులను పార్టీలోకి చేర్చుకుని ఏం సందేశం ఇస్తున్నారు? ఇతరుల నివాసాల్లో అసాంఘిక కార్యకలాపాలు చేసుకోండని జనసేన ప్రోత్సహిస్తోందా? మహిళను దూషించడం, కొట్టడం లాంటి చర్యలకు పార్టీ మద్దతిస్తోందా? అని ప్రశ్నించారు. బాషాపై వెంటనే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకత్వాన్ని కోరారు. -
1971 ఇండియా–పాక్ యుద్ధం జరిగి 50 ఏళ్లు!: ఒక్కడున్నాడు
సైనికుడిగా సరిహద్దుల్లోసేవలందించడం విద్యార్థులుగా చాలామంది కల. ఆ కలను నిజం చేసుకున్నారు ఇద్దరు మిత్రులు. యుద్ధంలో పాల్గొనడం ప్రతి సైనికుడి ఆశయం. ఆ ఆశయంలోనూవాళ్లు పాలుపంచుకున్నారు. కానీ ఆ యుద్ధంలో ఒకరు ప్రాణాలు కోల్పోతే... ఇంకొకరు ఆ మిత్రున్ని ఇలా స్మరించుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్ విమోచనలో భాగంగా జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు నిండాయి. ఆ యుద్ధంలో హైదరాబాద్‌కు చెందిన 11 మంది అధికారులు ఉన్నారు. వారిలో మాజీ కల్నల్ డాక్టర్ వీఆర్కే ప్రసాద్, అమరుడైన సెకండ్ లెఫ్ట్‌నెంట్ విక్రమ్ బర్న్ అప్పలస్వామి నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో పట్టభద్రులయ్యారు. సికింద్రాబాద్‌లో నివసిస్తూ ప్రస్తుతం రెండు ప్రైవేట్ వర్సిటీలకు వీసీగా సేవలు అందిస్తున్న వీఆర్కే ప్రసాద్ ఆప్తమిత్రుడైన విక్రమ్ గురించి పంచుకున్న జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే... మాణిక్ షాకు లేఖ రాసిన విక్రమ్... విక్రమ్ బర్న్ అప్పలస్వామి, నేను హిమాయత్‌నగర్, నారాయణగూడల్లోని పక్కపక్క కాలనీల్లో నివసించే వాళ్లం. నిజాం కాలేజీలో 1967–69 మధ్య బీఎస్సీ పూర్తి చేశాం. ఆర్మీలో చేరాలనే ఉత్సుకతతో ప్రయత్నాలు ప్రారంభించాం. ఎన్నోసార్లు ఇంటర్వ్యూల వరకు వెళ్లినా విజయం సాధించలేదు. తనకు ఆర్మీలో చేరాలనే కోరిక బలంగా ఉందని, అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా విజయం వరించట్లేదని విక్రమ్ అప్పటి ఆర్మీ జనరల్ మాణిక్ షాకు ఓ లేఖ రాశారు. దీన్ని చూసిన మాణిక్ షా తన అధికారిక లెటర్ హెడ్‌పై ‘నిరాశ పడకుండా ప్రయత్నించు. నీ పట్టుదల చూస్తుంటే కచ్చితంగా సాధిస్తావనే నమ్మకం ఉంది’ అని ప్రత్యుత్తరం రాశారు. దాంతో విక్రమ్ మరెంతో స్ఫూర్తి పొందారు. ఆ తర్వాత ఇద్దరం ఎంపికయ్యాం. విక్రమ్ రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీలో, నేను కోర్ ఆఫ్ సిగ్నల్స్‌లో (టెలిమ్యూనికేషన్స్ బ్రాంచ్) బాధ్యతలు తీసుకున్నాం. సెకండ్ లెఫ్ట్‌నెంట్ హోదాలో విక్రమ్ «గుజరాత్లో దరంగ్‌ధరలోని ఫీల్డ్ రెజిమెంట్‌లో, నేను పఠాన్‌కోట్ సిగ్నల్ రెజిమెంట్‌కు వెళ్లాం. అప్పట్లో ఉత్తరప్రత్యుత్తరాలు, గ్రీటింగ్ కార్డుల ద్వారా మాత్రమే మా మధ్య సమాచార మార్పిడి జరిగేది. ఎయిర్ బేస్‌లపై ఏక కాలంలో దాడులు.. 1971 సెప్టెంబర్ నుంచి యుద్ధవాతావరణం నెలకొంది. డిసెంబర్ 3న పఠాన్‌కోట్ కమ్యూనికేషన్ సెంటర్లో విధుల్లో ఉన్నా. సాయంత్రం 5.45కి పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. బయటకు వెళ్లి చూస్తే అక్కడి సమీపంలోని ఎయిర్‌ఫీల్డ్ పొగలు కక్కుతోంది. ఆరా తీస్తే పాకిస్థాన్ యుద్ధ విమానాలు ఓ బాంబు వేసి వెళ్లాయని చెప్పారు. అది మొదలు పఠాన్‌కోట్, ఆగ్రా, గ్వాలియర్.. ఇలా ఉత్తరాన ఉన్న ఎయిర్‌ఫీల్డ్స్‌పై ఒకేసారి ఎయిర్ ఎటాక్ జరిగింది. దీన్ని మన బలగాలు సమర్థంగా తిప్పి కొట్టాయి. డిసెంబర్ 16 సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ మధ్యలోనే విక్రమ్‌కు ఓ లేఖ రాశాను. అయితే యుద్ధం నేపథ్యంలో అది పోస్టు చేయడం సాధ్యం కాలేదు. ఆ నెలాఖరు వరకు విక్రమ్‌నుంచి ఎలాంటి సమాచారం లేదు. క్రిస్ట్మస్, న్యూ ఇయర్ సమీపిస్తుండటంతో విక్రమ్ కోసం గ్రీటింగ్ కార్డులు సిద్ధం చేసే పనిలో ఉన్నా. నిజాం కాలేజీకే గర్వకారణం.. ఈ లోపు మా సిగ్నల్స్ ఛానల్లో ఓ పిడుగులాంటి వార్త వచ్చింది. విక్రమ్ బర్న్ అప్పలస్వామి యు ద్ధంలో చనిపోయారు. అసలు ఏం జరిగిందనేది ఎంతో శోధించి తెలుసుకున్నా. అప్పట్లో విక్రమ్ వాళ్ల రెజిమెంట్‌కు ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఈయన వాహనం కమాండింగ్ ఆఫీసర్ వాహనం వెనుకే ఉంటుంది. డిసెంబర్ 5న ఈ జీపు రాజస్థాన్‌లోని బర్మేర్ సెక్టార్లో శత్రు సైన్యం ఏర్పాటు చేసిన ఓ యాంటీ ట్యాంక్ మైన్ మీద నుంచి వెళ్లింది. ఆ పేలుడు ధాటికి విక్రమ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ 9న కన్ను మూశారు. తర్వాత జమ్మూ నుంచి జోథ్‌పూర్ బదిలీ అయ్యా. అప్పుడు విక్రమ్ తల్లిదండ్రుల కోరిక మేరకు సెలవుపై వెళ్లి విక్రమ్ అంత్యక్రియలు నిర్వహించిన పాస్టర్‌ను కలిశాను. ఆయన చెప్పిన వివరాలతో వెళ్లి సమాధిని గుర్తించి నివాళులర్పించా. స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత హైదరాబాద్ వచ్చా. నిజాం కాలేజీకే గర్వకారణమైన విక్రమ్ ఫొటోను ఆ కాలేజీలో పెట్టించా. ఇప్పటికీ ఏటా విక్రమ్ సంస్మరణ లెక్చర్ ఇస్తున్నా. వీఆర్కే ప్రసాద్ -
వీరుడా వందనం
న్యూఢిల్లీ : త్రివిధ బలగాల్లో సేవలందించి ప్రత్యేకత చాటుకున్న ఒకే ఒక్క భారతీయుడు, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సాహసికుడు, ప్రీతిపాల్ సింగ్ గిల్ 100 ఏళ్ల పుట్టిన రోజు పండుగని కుటుంబ సభ్యుల మధ్య వేడుకగా జరుపుకున్నారు. ఆర్మీలో కల్నల్‌గా రిటైర్ అయిన ప్రీతిపాల్ సింగ్ గిల్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం తన నూరవ పుట్టిన రోజు నాడు బొటనవేలు పైకెత్తి చూపిస్తూ ప్రీతిపాల్ పోస్టు చేసిన ఫొటోకి నెటిజన్లు చెయ్యెత్తి జై కొట్టారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట జిల్లా పాఖీ గ్రామానికి చెందిన ప్రీతిపాల్ కుటుంబం తరతరాల నుంచి సైన్యంలోనే పనిచేస్తోంది. 1920 డిసెంబర్ 11న పాటియాలాలో పుట్టిన ప్రీతిపాల్ సింగ్ 1942లో భారత వాయుసేనలో చేరారు. అయితే ఆయన తండ్రి తన కుమారుడు విమానం కూలి ఎక్కడ మరణిస్తాడో అన్న భయంతో నేవీకి పంపించారు. కార్గో నౌకలకు ఎస్కార్ట్‌గా ప్రీతిపాల్‌సింగ్ రెండో ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. కొన్నేళ్ల తర్వాత ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆర్మీకి బదిలీ చేశారు. గ్వాలియర్ మౌంటెన్ రెజిమెంట్‌లో సేవలు అందిస్తూ 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ సెక్టార్ కమాండర్‌గా పని చేస్తూ 1970లో రిటైర్ అయ్యారు. పదవీ విరమణ తర్వాత తన స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య ప్రమీందర్ కౌర్‌కి ఇప్పుడు 95 ఏళ్లు. వారిద్దరికీ ఒకే ఒక్క కుమారుడు ఉన్నారు. సింగ్ శరీరానికే వయ సు వచ్చిందే తప్ప ఆయన మనసు ఎప్పు డూ నిత్య యవ్వనంతో ఉరకలేస్తూ ఉంటుం దని ప్రీతిపాల్ మనవడు అభయ్‌పాల్ చెప్పారు. టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడడం అం టే ఆయనకి చాలా ఇష్టం. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌తో పాటు పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. -
కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషితో స్పెషల్ ఇంటర్వూ
-
అండగా ఉంటా: సీఎం కేసీఆర్
సాక్షి, సూర్యాపేట: ‘కల్నల్ సంతోష్‌బాబు మరణం నన్ను ఎం తగానో కలచివేసింది. దేశ రక్షణ కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు. ఇంతటి త్యాగం చేసిన కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉం టుంది’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కల్నల్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. సరిహద్దులో చైనా దాడిలో వీరమరణం పొందిన సూర్యాపేటవాసి కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 3:40 గంటలకు సూర్యాపేటలోని సంతోష్‌బాబు నివాసానికి చేరుకున్నారు. ముం దుగా కల్నల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆ తర్వాత మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్‌లతో కలసి కల్నల్ సతీమణి సంతోషి, పిల్లలు అభిజ్ఞ, అనిరుధ్, తల్లి దండ్రులు ఉపేందర్, మంజుల, చెల్లెలు శృతితో కేసీఆర్ మాట్లాడి వారిని ఓదార్చారు. దేశం కోసం సంతోష్‌బాబు చేసిన త్యాగం చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. ప్రభుత్వం సంతోష్ కుటుంబా నికి ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని చెప్పారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డికి కేసీఆర్ సూచించారు. సీఎం ఓదార్పుతో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. సూర్యాపేటలో సోమవారం కల్నల్ సంతోష్‌బాబు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రూ.5 కోట్ల చెక్కులు అందించిన సీఎం.. కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషికి గ్రూప్–1 ఉద్యోగం కల్పిస్తూ జారీ చేసిన నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆమెకు అందజేశారు. అలాగే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సమీపాన ఉన్న 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాలను కూడా ఆమెకు అందించారు. వాటితోపాటు సంతోషికి రూ. 4 కోట్ల చెక్కును, కల్నల్ తల్లిదండ్రులకు రూ. కోటి చెక్కును అందజేశారు. ఇంటి స్థలాన్ని ముఖ్యమంత్రే స్వయంగా ఎంపిక చేశారని మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు సీఎస్ సోమేశ్ కుమార్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సూర్యాపేటలో సోమవారం కల్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషి, పిల్లలు అభిజ్ఞ, అనిరుధ్‌లను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లోకి సీఎంతోపాటు ముగ్గురే.. కరోనా విజృంభణ నేపథ్యంలో జిల్లాలో అధికార యంత్రాంగం సీఎం కేసీఆర్ రాక సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సీఎం కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలెవరూ రావొద్దని ముందుగానే ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనలను అనుసరిస్తూ సీఎంతోపాటు కేవలం మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్‌లు మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సీఎం వెంట వచ్చిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రవణ్రెడ్డిలు సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావులు సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంతోష్ బాబు చిత్రపటంపై జైహింద్ అని రాస్తున్న సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన పర్యటన.. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి తుర్కపల్లి, భువనగిరి, వలిగొండ, చిట్యాల మీదుగా సూర్యాపేటకు చేరుకున్నారు. కల్నల్ కుటుంబాన్ని పరామర్శించాక తిరుగు ప్రయాణంలోనూ అదే మార్గంలో ఫాంహౌస్‌కు వెళ్లారు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా సంతోషి: ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, సూర్యాపేట: కల్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషిని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (గ్రూప్–1 కేడర్)గా నియమిస్తూ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమ వారం రాత్రి జీవో నంబర్ 80 జారీ చేశారు. ఆమె నియామకాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించినట్లు పేర్కొన్నారు. ఆమె 30 రోజుల్లోగా సం బంధిత శాఖ కమిషనర్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ జీవో ప్రకారం సంతోషి వేత నం రూ. 40,270–93,780 వరకు ఉండనుంది. దీనికి అలవెన్స్‌లు అదనం. అయితే సంతోషి ఒకవేళ వేరే పోస్టును కోరుకుంటే ఆ విషయాన్ని రెండు రోజుల్లోగా తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. స్థలం కేటాయిస్తూ మరో జీవో.. సంతోషికి 711 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ జీవో నంబర్ 59ను సీఎస్ విడుదల చేశారు. హైదరాబాద్ జిల్లాలోని షేక్‌పేట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 6/1, వార్డు నంబర్ 10, రోడ్డు నంబర్ 14 బంజారాహిల్స్‌లో కల్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషి పేరు మీద 711 గజాల స్థలం ఇస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు మా కుటుంబాన్ని పరామర్శించి వెళ్లారు. సంతోష్‌బాబును తీసుకురాలేం కానీ ఆయన లేని లోటు పూడుస్తామని భరోసా ఇచ్చారు. గ్రూప్–1 స్ధాయి ఉద్యోగాన్ని ఇస్తామన్నారు. ఈ అవకాశం నాకే ఇచ్చారు. ఏ శాఖలో చేరితే ఆ శాఖను కేటాయిస్తామన్నారు. రూ. 4 కోట్లను పిల్లల పేరున, రూ. కోటిని మా అత్తగారి పేరున చెక్కులు అందించారు. బంజారాహిల్స్‌లో నివాస స్ధలాన్ని కేటాయించారు. ఈ సంఘటనలో వీరమరణం పొందిన ఇతర సైనికులకు త్వరలోనే ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. మాకు అండగా నిలిచిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు, సహకరించిన మంత్రి జగదీశ్‌రెడ్డికి ధన్యవాదాలు. ప్రభుత్వానికి, మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం. ఇంట్లో కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తన ఇంటికి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. – బిక్కుమళ్ల సంతోషి, కల్నల్ సంతోష్‌బాబు సతీమణి కొండంత ధైర్యం వచ్చింది సీఎం కేసీఆర్ ఎప్పటికీ అందుబాటులో ఉంటామన్నారు. ఏ సాయం వచ్చినా అండగా నిలుస్తానన్నారు. కేసీఆర్ రావడంతో మాకు కొండంత ధైర్యం వచ్చింది. కేసీఆర్ గొప్పతనం మాటల్లోనే కాదు.. చేతుల్లోనూ చూపిస్తారని మా ఇంటికి స్వయంగా రావడంతో తెలిసొచ్చింది. మా బాబు లేకున్నా మా కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. మా బాబు చనిపోయిన నాటి నుంచి అన్ని విషయాల్లోనూ సహకరించిన మంత్రి జగదీశ్‌రెడ్డికి ధన్యవాదాలు. – మంజుల, కల్నల్ సంతోష్‌బాబు తల్లి సూర్యాపేటలో కల్నల్ కాంస్య విగ్రహం: మంత్రి జగదీశ్‌రెడ్డి వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు కాంస్య విగ్రహాన్ని సూర్యాపేటలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించి వెళ్లిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. సూర్యాపేట పాత బస్టాండ్–కోర్టు జంక్షన్ రహదారికి కల్నల్ పేరు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. కల్నల్ సంతోష్‌బాబుతోపాటు వీరమరణం పొందిన మరో 19 మంది సైనికుల కుటుంబాలకు సైతం ఆర్థిక సాయం ప్రకటించి సీఎం కేసీఆర్ ఔదార్యం చాటుకున్నారన్నారు. -
సీఎం కేసీఆర్ ఇంటికి ఆహ్వానించారు : సంతోషి
సాక్షి, సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తమను పరామర్శించడానికి ఇంటికి రావడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషి అన్నారు. తమ పిల్లలకు రూ.4 కోట్లు, సంతోష్‌బాబు తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కును అందజేయడంతో పాటు, తనకు గ్రూప్-1 ఉద్యోగం, బంజారాహిల్స్‌లో 711 గజాల ఇంటిస్థలం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని సీఎం కేసీఆర్ భరోపా ఇచ్చారని చెప్పారు. తన పిల్లలతో కూడా సీఎం కేసీఆర్ మాట్లాడారని, తమను ఇంటికి కూడా ఆహ్వానించారని ఆమె చెప్పారు. ఏ అవసరం ఉన్న ఫోన్ చేయమని సీఎం కేసీఆర్ చెప్పారని ఆమె తెలిపారు. తనకు మాదిరిగానే ఇతర జవాన్లకు ఆర్థిక సహాయం ప్రకటించడం సంతోషకరమన్నారు. (చదవండి : సంతోష్ కుటుంబానికి అండగా ఉంటాం : కేసీఆర్) సీఎం కేసీఆర్ మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించారని సంతోష్‌బాబు తల్లి మంజుల కొనియాడారు. తమకు అండగా నిలిచిన మంత్రి జగదీశ్‌రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. కాగా,సంతోష్‌బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పరామర్శించిన విషయం తెలిసిందే. రోడ్డు మార్గంలో సూర్యాపేట, విద్యానగర్‌లో ఉన్న సంతోష్‌బాబు నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతోష్‌బాబు తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, భార్య సంతోషిని పరామర్శించారు. సీఎంతో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు సూర్యాపేటకు వెళ్లారు. -
సంతోష్ కుటుంబానికి అండగా ఉంటా: కేసీఆర్
సాక్షి, సూర్యాపేట : భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం సుర్యాపేటలో పరామర్శించారు. మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమర్ లతో కలిసి సోమవారం మధ్యాహ్నం సూర్యాపేటకు చేరుకున్న కేసిఆర్, ముందుగా సంతోష్ చిత్రపటానికి పూలు చల్లి అంజలి ఘటించారు. అనంతరం సంతోష్ భార్య సంతోషి, తల్లితండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శృతిలను ఓదార్చారు. సంతోష్ పిల్లలు, అభిగ్న, అనిరుధ్ తేజలతో మాట్లాడారు. దేశరక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతగానో కలచివేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి ఎల్లవేళ్లలా అండగా వుంటుందని హామి ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని చెప్పారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. (చదవండి : రాళ్ల దెబ్బలు.. నిలువెల్లా గాయాలతో..) సంతోష్ భార్య సంతోషీకి గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చే నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. హైదరాబాద్ లోని బంజార్ హిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని సంతోష్ భార్యకు ముఖ్యమంత్రి అందించారు. సంతోష్ భార్యకు రూ. 4 కోట్ల చెక్కును, తల్లితండ్రులకు రూ.1 కోటి చెక్కును ముఖ్యమంత్రి అందించారు.(చదవండి : పిల్లలు ఆర్మీకి వెళ్తానంటే సంతోషంగా పంపిస్తా) ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జె. సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంఎల్ఎలు గ్యాదరి కిషోర్, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి, సైదిరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ దీపికా యుగంధర్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణమ్మ, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం: కిషన్‌రెడ్డి
సూర్యాపేట అర్బన్: దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సైనిక బలగాలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కల్నల్ సంతోష్‌బాబు కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చైనా దొంగ దెబ్బతీసి మన సైనికులను పొట్టన పెట్టుకుందని, వారి త్యాగం వృథా కాదన్నారు. ప్రధాని ఆదేశం మేరకే సంతోష్‌బాబు కుటుంబసభ్యులను కలిశానని, మోదీ సందేశం వారికి తెలియజేశానని పేర్కొన్నారు. -
నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్
సాక్షి, సూర్యాపేట: చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూర్యాపేటకు రానున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ సోమవారం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ విద్యానగర్‌లో ఉన్న సంతోష్‌బాబు నివాసానికి వెళ్లి ఆయన తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, భార్య సంతోషిని పరామర్శిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5 కోట్ల నగదు, సంతోషికి గ్రూప్–1 స్థాయి ఉద్యోగానికి సంబం ధించిన ఉత్తర్వులను సీఎం వారికి అందజేయనున్నారు. అలాగే హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఇంటిస్థలం పత్రాలను కూడా సీఎం, సంతోష్‌బాబు కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నట్లు సమాచారం. సీఎం వెంట విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్ సంతోష్‌బాబు నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. -
జవాన్ల త్యాగాలు వృథా పోవు: కిషన్‌రెడ్డి
సాక్షి, సూర్యాపేట: దేశ రక్షణలో వీర మరణం పొందిన అమర జవాన్ కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్‌బాబు త్యాగం వెలకట్టలేనిదన్నారు. సంతోష్ కుటుంబానికి భారత సైన్యం, ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందన్నారు. చిన్న వయసులో మంచి భవిష్యత్తు ఉన్న అధికారిని కోల్పోవడం కుటుంబానికే కాకుండా దేశానికి, సైన్యానికి తీరని నష్టం అని పేర్కొన్నారు.కష్టకాలంలో ప్రతి ఒక్కరు సంతోష్ కుటుంబానికి అండగా నిలిచి మనోధైర్యం కల్పించాలని కోరారు. (రేపు సూర్యాపేటకు సీఎం కేసీఆర్) చైనా దొంగ దెబ్బ తీసింది.. ‘‘భారత భూ భాగాన్ని, సైనికుల ప్రాణాలను రక్షించడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. పరిణామాలను ఎదుర్కోవడానికి షరతులు లేకుండా వ్యవహరించాలని సైన్యానికి ఆదేశాలిచ్చాం. సంప్రదింపులు జరుపుతూనే చైనా దొంగ దెబ్బ తీసిందని’’ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం ఎలా వ్యవహరించాలని అఖిలపక్షం సమావేశం నిర్వహించామని, ఇతర దేశాధినేతలతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. జవాన్ల త్యాగాలు వృధాపోవని, ఏ లక్ష్యం కోసం ప్రాణ త్యాగం చేశారో ఆ లక్ష్య సాధన కోసం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ కల్పించామని తెలిపారు. ప్రతీకార జ్వాలతో ఉన్న ప్రజల్లో చైనా వ్యతిరేక భావజాలం పెరుగుతుందన్నారు. చైనా వస్తువులను వాడకుండా ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. (ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం) కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచదర్‌రావు,బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్‌రావు తదితరులు ఉన్నారు. అంతకు ముందు రోడ్లు,భవనాల శాఖ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న కేంద్రమంత్రికి బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. -
రేపు సూర్యాపేటకు సీఎం కేసీఆర్
సాక్షి, ప్రతినిధి, సూర్యాపేట: కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం సూర్యాపేటకు రానున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. శనివారం మంత్రితో పాటు ఆయన భార్య సునీత.. సంతోష్‌బాబు తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, భార్య సంతో షిని పరామర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సంతోష్‌బాబు కుటుంబ సభ్యుల అభీష్టం మేరకు సీఎం కేసీఆర్ వారి నివాసానికి వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయంతో పాటు గ్రూప్–1 ఉద్యోగానికి సంబంధించిన ఉత్తర్వులను సీఎం కేసీఆర్ స్వయంగా కల్నల్ కుటుంబ సభ్యులకు అందజేస్తారన్నారు. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. భవిష్యత్‌లో వారి కుటుంబ అవసరాల రీత్యా రూ.5 కోట్ల నగదు, నివాస స్థలాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు. అయితే ఇంటిస్థలం అన్నది సూర్యాపేటలోనా లేక హైదరాబాద్‌లోనా అన్నది సంతోష్‌బాబు కుటుంబ సభ్యుల ఇష్టానుసారంగా ప్రభుత్వం నిర్ణయం తీసు కుంటుందని తెలిపారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఉన్నారు. వాడపల్లి సంగమంలో సంతోష్‌బాబు అస్థికల నిమజ్జనం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి కృష్ణా – మూసీ సం గమంలో కల్నల్ సంతోష్ అస్థికలను శనివా రం కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. సంతోష్ తండ్రి ఉపేందర్, తల్లి మంజులతో పాటు భార్య సంతోషి, కొడుకు, కూతురు ప్రత్యేక వాహనంలో వాడపల్లికి వచ్చారు. పడవలో సంగమం వద్దకు వెళ్లి వేదమంత్రాల నడుమ అస్థికలను నిమజ్జనం చేశారు. -
కల్నల్ సంతోష్‌కు నివాళులర్పించిన యువ హీరో
సాక్షి, సూర్యాపేట : సరిహద్దులో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సూర్యాపేట జిల్లావాసి కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ‘హిట్’ సినిమా హీరో విశ్వక్సేన్ పరామర్శించారు. శనివారం సూర్యాపేట వెళ్లి, సంతోష్‌బాబుకు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంతోష్‌బాబు లాంటి వీరుపుత్రుడిని దేశానికి అందించిన ఆయన తల్లికి ధన్యవాదాలు తెలిపారు. (పిల్లలు ఆర్మీకి వెళ్తానంటే సంతోషంగా పంపిస్తా) ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ.. ‘ఈ కుటుంబం చేసిన త్యాగం కేవలం మన ఒక్కరి కోసం కాదు, మన రాష్ట్రం కోసం కాదు, మన భారత దేశం కోసం చేసిన త్యాగం. ఆర్మీకి మనం రుణపడి ఉండాలి. అందుకే సంతోష్‌బాబు తల్లిని ఒకసారి కలుసుకోవాలని అనిపించింది. కనీసం నేను ఆ తల్లిని సందర్శించి, మన సంతోష్‌బాబును దేశం కోసం త్యాగం చేసిన ఆమెకు కృతజ్ఞతలతో పాటు సంతాపాన్నీ తెలపగలిగాను. పూడ్చలేని లోటు నుంచి కోలుకొని మన వీర సైనికుల కుటుంబాలకు ఆత్మ స్థైర్యం లభించాలని ప్రార్థిద్దాం. జైహింద్’అన్నారు. (చదవండి : కల్నల్ సంతోష్ కుటుంబానికి రూ. 5 కోట్లు ) -
నేను ‘సంతోషం’గా ఒప్పుకుంటా..
ఇటీవల చైనా సరిహద్దుల్లో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన భారతమాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్‌బాబు. ఆయన సతీమణి సంతోషి తన భర్త జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు. ఆమె మనోగతం ఆమె మాటల్లోనే... చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచడం, తానూ సంతోషంగా ఉండడమే ఆయన బలం. ఎదుటివారికి చేతనైన సహాయం చేయాలని తపన పడేవారు. కుమారుడిగా తండ్రి కోరిక మేరకు ఆర్మీలో చేరారు. అయినా కుటుంబానికి ఏమీ లోటు చేయలేదు. భర్తగా నన్ను బాగా చూసుకున్నారు. తండ్రిగా నా పిల్లలకు రోల్ మోడల్ అయ్యారు. రేపు నా పిల్లలు పెరిగి పెద్దయ్యాక వారు ఆర్మీలో చేరతానన్నా నేను సంతోషంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే బాధ్యతాయుతమైన యువత ఆర్మీలో చేరి దేశభక్తిని చాటుకోవాలి’ అని సంతోషి ఆకాంక్షించారు. నేనే కావాలని.. సైనికుడిగా తన జీవన సరళి అంతా వేరేలా ఉంటుందని, సగటు ఆడపిల్లలు కోరుకునే మామూలు జీవితాన్ని తాను ఇవ్వలేకపోవచ్చని, కనుక తనను అర్థం చేసుకునే అమ్మాయి కావాలని, అలాంటి సంబంధమే చూడమని సంతోష్ తన అమ్మా, నాన్నతో అన్నాడట. అలా చుట్టాలమ్మాయని నన్ను అతనికి చూపించారు. ‘నిన్ను చూసిన తర్వాత సంతోష్ రెండు, మూడు మ్యాచ్‌లు చూశాడమ్మా.. కానీ నువ్వే కావాలని అన్నాడు’ అని అత్తయ్య ఎప్పుడూ నాతో అనేది. (కల్నల్ సంతోష్ కుటుంబానికి రూ. 5 కోట్లు) సమన్యాయం చేశారు డ్యూటీలో ఉన్నప్పుడు పనికి ప్రాధాన్యత ఇచ్చాడు. కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు కుటుంబానికి అంతే స్థాయిలో ప్రాధాన్యత నిచ్చారు. మా దగ్గరకు మార్చి 21న ఢిల్లీ వచ్చి ఏప్రిల్ 15కు వెళ్లారు. సెలవులకు వచ్చినప్పుడు విహార యాత్రలకు పిల్లలతో కలిసి వెళ్లాలనుకున్నాం. కానీ లాక్డౌన్ వల్ల వెళ్లలేకపోయాం. అదే సమయంలో మా నాన్నకు హాస్పిటల్లో చెకప్ ఉంటే సూర్యాపేటకు రమ్మని అడిగారు. అయితే ఇక్కడకు వస్తే తానే దగ్గరుండి చూపిస్తానని, వాళ్లనే ఇక్కడికి రమ్మని చెప్పారు. మా అమ్మానాన్నని కూడా వాళ్ల అమ్మానాన్నల్లాగే చూసుకునేవాడు. అక్కడ సగం.. ఇక్కడ సగం.. మా పెళ్లయి పదిన్నరేళ్లు అయింది. పెళ్లి తర్వాత మేము రెండేళ్లు కలిసి ఉన్నాం. తర్వాత నాలుగేళ్లు సర్వీస్‌లో ఉన్నారు. మళ్లీ మూడేళ్లు కలిసి ఉన్నాం. గత ఏడాది జూన్ నుంచి ఫీల్డ్‌లో ఉన్నారు. నాకు, పిల్లలకు ఏది ఇష్టమైతే అది కొనిచ్చేవారు. తన గురించి తర్వాత ఆలోచించే వారు. పిల్లల గురించి కలలు కన్నారు.. పిల్లలకు మంచి విద్యనందించాలని, వారిని మంచి స్థాయికి తీసుకురావాలని కలలు కన్నారు. కానీ ఇంతట్లోనే ఇలా అవుతుందని అనుకోలేదు...(దుఃఖంతో గొంతు పూడుకుపోయింది) మా పాపకు 9 ఏళ్లు, బాబుకు మూడేళ్లు. ఎప్పుడు ఫోన్ చేసినా ముందు వాళ్లతో మాట్లాడిన తర్వాతనే నాతో మాట్లాడేవారు. అదే చివరి మాట.. చివరిసారిగా ఈ నెల 14న ఆయన నాతో మాట్లాడారు. పిల్లల యోగ క్షేమాలు అడిగారు. అంతలోనే బిజీగా ఉన్నానని, ఆ తర్వాత తీరిగ్గా కాల్ చేస్తానని చెప్పారు. ఇదే నాకు అతని నుంచి వచ్చిన చివరి ఫోన్. తర్వాత రెండు రోజులకే.. తాను ఇక లేడన్న విషాద వార్త నాకు చేరింది. యుద్ధంలో కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారని టీవీలో స్క్రోలింగ్ చూశాను. పిల్లలు ఆర్మీకి వెళ్తా అంటే పంపిస్తా.. పిల్లలు భవిష్యత్‌లో ఏది చేయాలనుకుంటే ఆ స్వేచ్ఛ ఇవ్వాలనే వారు. ఆయన పోయారని నేను వెనుకాడేది లేదు. పిల్లలకు భవిష్యత్‌లో ఏది ఇష్టమైతే అదే చేయిస్తా. ఒకవేళ వాళ్లు ఆర్మీలోకి వాళ్లు వెళ్లాలనుకుంటే అక్కడికైనా పంపిస్తానని‘సాక్షి’అడిగిన ప్రశ్నకు ఆమె సగర్వంగా సమాధానమిచ్చారు. ఆయనపై దేశభక్తిని చాటారు.. ఆయన ఒక గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆయన ఆలోచనలు ఎంతో ఉదాత్తంగా ఉండేవి. మాటలు ఎదుటివారికి ఎంతో ధైర్యాన్నిచ్చేవి. వృత్తిధర్మంగా శత్రువులను చీల్చి చెండాడేవారు. ఆయన ఎంత గొప్పవ్యక్తో ఆయన అంత్యక్రియల సందర్భంగా అందరూ మాట్లాడుకునే మాటలు వింటుంటే బాధతోపాటు గర్వంగా కూడా అనిపించింది. సరిహద్దుల్లో మన కోసం ఎందరో ప్రాణ త్యాగం చేస్తున్నారు. డిఫెన్స్‌లోకి రావాలంటే ప్రాణాలు పోతాయన్న భయం ఉండొద్దు. దేశరక్షణకు ఎంతమంది ఉంటే.. మనకు అంత బలం. తండ్రి ఆదర్శాలకు అనుగుణంగా... మా మామగారికి ఒక ఆలోచన ఉండేది. పుట్టిన ప్రతి వాళ్లు బతుకుతారు, చస్తారు.. కానీ ఆ చావుకు ఒక అర్థం ఉండాలన్నది ఆయన భావన. ఆ ఆలోచనలకు అనుగుణంగానే తండ్రి తనను, చెల్లిని పెంచేవారని నాకు చెబుతుండేవారు. ఆయన తన తండ్రి ఆదర్శాలకు అనుగుణంగా పెరిగినట్లే నేను రేపు నా పిల్లలను వాళ్ల తండ్రి ఆలోచనలకు తగ్గట్టే తీర్చిదిద్దుతాను. – బొల్లం శ్రీనివాస్, సూర్యాపేట -
కల్నల్ సంతోష్‌కు కాంస్య విగ్రహం
సాక్షి, సూర్యాపేట : భారత్, చైనా సరిహద్దులో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలను సైనిక అధికార లాంఛనాలతో నిర్వహించారు. సూర్యాపేట కేసారంలోని సంతోష్ బాబు వ్యవసాయక్షేత్రం వరకు అంతిమయాత్ర కొనసాగింది. సంతోష్‌బాబు దహన సంస్కారాలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్య సభ ఎంపీ బడుగుల లింగయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసన సభ్యులు గాదరి కిషోర్ , సైది రెడ్డి , చిరుమర్తి లింగయ్య , మాజీ ఎంపీ బూర నర్సయ్య , మాజీ కేంద్ర రక్షణ శాఖా మంత్రి పల్లంరాజు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. (చదవండి : ముగిసిన కల్నల్ సంతోష్ అంత్యక్రియలు) సంతోష్‌ను కడసారి చూసేందుకు దారి పొడవునా భౌతికదూరం పాటిస్తూనే ప్రజలు సెల్యూట్ చేస్తూ ఘన నివాళి అర్పించారు. దహన సంస్కారాల ముగిసిన అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంతోష్ భార్యకు ఉద్యోగం ఇవ్వడానికి సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపినట్లు చెప్పారు. అంత్యక్రియలు జరిగిన చోట సంతోష్ స్మారక స్థూపం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సూర్యాపేట కూడలిలో కాంస్య విగ్రహం ఏర్పాటుతో పాటు, నగరంలోని ఓ సర్కిల్‌కు సంతోష్ పేరు పెడుతామని మంత్రి జగదీశ్ వెల్లడించారు. -
లక్సెట్టిపేటలో సంతోష్ బాబు విద్యాభ్యాసం
లక్సెట్టిపేట(మంచిర్యాల): వీరమరణం పొందిన జవాన్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ సంతోష్‌బాబు విద్యాబ్యాసం జిల్లాలోని లక్సెట్టిపేటలోని శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ప్రారంభమైంది. ఆయ న తండ్రి ఉపేందర్ స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో బ్రాంచ్‌లో మేనేజర్‌గా 1988లో ఇక్కడకు బదిలీపై వచ్చారు. సంతోష్‌బాబును స్థానిక శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. నాలుగో తరగతి వరకు ఇక్కడే చదువుకుని ఐదవ తరగతిలో కోరుకొండ సైనిక్ పాఠశాల ప్రవేశపరీక్షలో అర్హత సాధించగా విజయనగరంలోని సైనిక్ పాఠశాలలో చేరారు. ఉపేందర్‌కు బదిలీ కావడంతో ఆయన కుటుంబసభ్యులు కూడా ఇక్కడినుంచి విజయనగరం వెళ్లిపోయారు. మరిపోలేని చిన్ననాటి స్నేహితులు సంతోష్‌బాబు మరణాన్ని అతడి స్నేహితులు తట్టుకోలేకపోతున్నారు. అప్పటి పాఠశాల ఆచార్యులు రామన్న సంతోష్‌బాబును గుర్తు చేసుకున్నారు. పాఠశాలలో చిన్నప్పుడు తీయించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఉన్నత హోదాలో ఉండి దేశరక్షణ కోసం ఆయన చేసిన త్యాగం మరువలేనిదన్నారు. స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకున్నారు. -
‘సంతోష్ దేశానికి మంచి చేయాలని తపించేవాడు’
సాక్షి, హైదరాబాద్: భారత్ - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి సహోద్యోగులు సంతోష్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ‘సంతోష్ నిగర్వి.. దూకుడుగా ఉండే వాడు కాదు. మృదు స్వభావి. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. చాలా మంచి మనిషి’ అని కల్నల్ ఎస్ శ్రీనివాసరావు తెలిపాడు. అంతేకాక ‘మరో రెండేళ్లలో సంతోష్‌కు సికింద్రాబాద్‌కు పోస్టింగ్ వచ్చేది. దాని కోసం అతడు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. ఏ అధికారి అయినా తన సొంత రాష్ట్రంలో సేవ చేయడం చాలా గౌరవంగా భావిస్తారు. సంతోష్ కూడా అలానే. ఇప్పటి నుంచే అతడు తన పిల్లలకు మంచి స్కూల్ గురించి వెతుకుతున్నాడు. తెలుగు అధికార్లుగా మేం ఎప్పుడు టచ్‌లో ఉండే వాళ్లం. ఒకరికి ఒకరం మర్యాద ఇచ్చుకునే వాళ్లం. ఒకరి బాగోగులు ఒకరం తెలుసుకునే వాళ్లం’ అని శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాక తనతో పాటు పని చేసే జూనియర్ల గురించి సంతోష్ ఎంతో శ్రద్ధ తీసుకునేవాడన్నారు. కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ అరుణ్ కులకర్ణి మాట్లాడుతూ.. ‘పూర్వ విద్యార్థుల కార్యక్రమాల్లో సంతోష్ చురుగ్గా పాల్గొనేవాడు. టీచర్లతో కాంటక్ట్‌లో ఉండేవాడు’ అని తెలిపారు. మరో అధికారి మాట్లాడుతూ.. ‘సంతోష్ సమస్యలకు భయపడేవాడు కాదు. దేశానికి, తన బెటాలియన్‌కు మంచి చేయాలని తపిస్తుండేవాడు. ఎప్పుడు కంబాట్ దుస్తుల్లోనే ఉండేవాడు. ఏ పని అయినా చేస్తాడు.. ఎంత కష్టమైన ఆపరేషన్‌లో అయినా పాల్గొంటాడు. అతడి ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు చెరగదు’ అని తెలిపారు. కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు గురువారం ఉదయం సూర్యాపేటలో జరుగనున్నాయి. (చనిపోతున్నా.. చైనాకు చుక్కలు చూపించాడు) -
చనిపోతున్నా.. చైనాకు చుక్కలు చూపించాడు
సాక్షి, విజయనగరం: చైనాతో జరిగిన సరిహద్దు వివాదంలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబుకు విజయనగరంలోని కోరుకొండ సైనిక్ స్కూల్ సిబ్బంది నివాళులు అర్పించారు. అక్కడ ఉపాధ్యాయులు మాట్లాడుతూ... సంతోష్ బాబు తమ విద్యార్థి కావడం గర్వకారణమన్నారు. కల్నల్ సంతోష్ బాబు మరణం తమను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృత్యువుతో పోరాడుతూ కూడా సంతోష్ బాబు చైనా సేనకు దడ పుట్టించారని కొనియాడారు. సంతోష్ కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. (సలామ్ కల్నల్ సంతోష్..) -
కన్నీటి పర్యంతమైన కల్నల్ సోదరి
సాక్షి, సూర్యాపేట : ‘అన్నయ్య కొద్ది రోజులు పాకిస్తాన్ బార్డర్లో పని చేశాడు. ఆ సమయంలో కొంతమంది చొరబాటుదారుల్ని ఆన్నయ్య హతమార్చాడు. అప్పుడు మేము ఎంతో గర్వంగా ఫీలయ్యాం. దేశం కోసం అన్నయ్య చేస్తున్న సేవను చూసి మురిసిపోయాం. ఎంతో రిస్క్ ఉన్న ఏరియాల్లోనే బాగా విధులు నిర్వర్తించారు. కానీ పెద్దగా రిస్క్‌లేని ఏరియాల్లో ఇలా జరగడం బాధగా ఉంది. అన్నయ్య మరణాన్ని తట్టుకోలేకపోతున్నాం’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు చైనాతో ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్‌బాబు సోదరి శృతి. తనతో ఎంతో ఆప్యాయంగా ఉండే అన్నయ్య.. ఇక లేడనే విషయాన్ని ఆ సోదరి తట్టుకోలేకపోతోంది. తనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.తనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. (చదవండి : తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన తనయుడు) ‘చిన్నప్పటి నుంచి అన్నయ చాలా యక్టివ్. చదువులో కానీ, ఇతర కాంపిటీషన్లలో కానీ అన్నింట్లో ముందుండేవాడు. సైనిక్ స్కూల్ గురించి డాడీ చిన్నప్పుడే ట్రై చేశాడు. కానీ కుదరలేదు. ఆయన కోరిక మేరకు అన్నయ్య సాధించాడు. అన్నయ్య గురించే డాడీ ఆదిలాబాద్ నుంచి విజయనగరం ట్రాన్స్ఫర్ పెట్టుకొని అక్కడికి వెళ్లాము. అన్నయ్య ఒక సంవత్సరం మొత్తం కష్టపడి సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో పాసయ్యారు. అక్కడ మాకు తెలిసిన వాళ్లు ఎవరూ లేరు. అమ్మ, డాడీ సపోర్ట్‌తో అన్నయ్య ఆల్ ఇండియా 3వ ర్యాంకు సాధించారు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత అన్నయ్య 6 నుంచి 12వ తరగతి వరకు అక్కడే చదివాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆర్మీలో చేరాడు. పాఠశాలలో మౌర్య, గుప్తాహౌస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. తర్వాత అన్నయ్య కమిషనర్ అయ్యారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా అన్నయ్య కమిషనర్ అయ్యారు. తర్వాత పాకిస్తాన్ బార్డర్లో పనిచేశారు. అప్పడు కూడా కొంతమంది చొరబాటుదారుల్ని హతమార్చారు. అప్పుడు మేము గర్వంగా ఫీలయ్యాం. ఎంతో రిస్క్ ఉన్న ఏరియాల్లోనే బాగా విధులు నిర్వర్తించారు. కానీ పెద్దగా రిస్క్‌లేని ఏరియాలో ఇలా జరగడం బాధగా ఉంది. ( చదవండి : చైనాతో ఘర్షణ: 20 మంది భారత జవాన్లు మృతి!) అదే లాస్ట్ కాల్ రెండు రోజుల క్రితం జూన్ 14 రాత్రి 9 గంటల ప్రాంతంలో అన్నయ్య మాతో మాట్లాడారు. ఆ రోజు మా పెళ్లి రోజు. మాకు విషెష్ చెప్పడం కోసమే అన్నయ్య కాల్ చేశారు. కొన్ని సెకన్లు మాత్రమే మాట్లాడారు. ఎలా ఉన్నావ్ అన్నయ్యా అని అడగ్గా.. ఏం చెప్పలేను. నన్ను అడుగొద్దు అన్నాడు. తర్వాత అడిగే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పడు చాలా సంతోష పడ్డాం అన్నయ్య హైదరాబాద్‌కు ట్రాన్స్ఫర్ అయ్యారని తెలియగానే ఎంతో సంతోష పడ్డాం. అన్నయ్య చిన్నప్పటి నుంచి మాకు దూరంగా పెరిగాడు. ఇప్పుడు హైదరాబాద్‌కు వస్తే అందరం కలిసి హ్యాపీగా ఉంటాం అనుకున్నా.ఇంతలోనే ఇలా జరిగిపోయింది. ఇప్పుడు మా వదిన, పిల్లల్ని ఎలా సముదాయించాలో అర్థం కావడంలేదు. ఉద్యోగం రిత్యా అన్నయ్య పిల్లలతో (కూతురు అభిజ్ఞ(9), కుమారుడుఅనిరుధ్(4) ) ఎక్కువగా గడపలేదు. అనురిధ్ అచ్చం అన్నయ్యలా ఉంటాడు. వాడు ఎప్పుడూ పప్పా.. పప్పా అని ఏడుస్తూ ఉన్నాడు. అత్తా.. మే పప్పాకే పాస్ జాతా హూ అంటూ ఉండేవాడు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు’ అని సంతోష్‌బాబు సోదరి శృతి ‘సాక్షి’తో చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. -
కాసేపట్లో హకీంపేటకు సంతోష్ పార్థీవదేహం
సాక్షి, హైదరాబాద్ : లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద భారత్– చైనా మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు గురువారం ఉదయం సూర్యాపేటలో జరుగనున్నాయి. ఇప్పటికే సంతోష్ బాబు కుటుంబసభ్యులు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. వారిని రిసీవ్ చేసుకునేందుకు సంతోష్ బాబు తల్లిదండ్రులు, సైబరాబాద్ సీపీ సజ్జనార్, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి విమానాశ్రయానికి వెళ్లారు. సంతోష్‌బాబు భార్య, పిల్లలతో పాటు అతని తల్లిదండ్రులను ప్రత్యేక వాహనంలో నానల్‌నగర్ ఆర్మీ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. (చదవండి : సలామ్ కల్నల్ సంతోష్..) సంతోష్ భార్య ఎయిర్ పోర్టు నుండి బయలు దేరుతూ ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టడం అందర్నీ కలిచి వేసింది. కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు రేపు అధికారికంగా జరుపుతామని సీపీ సజ్జనార్ అన్నారు. ఈ రోజు సాయంత్రం హాకీంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు సంతోష్ భౌతికకాయం వస్తుందని, అక్కడ ఆయనకు గౌరవ వందనం సమర్పించిన అనంతరం సూర్యాపేటకు తీసుకెళ్తామని పేర్కొన్న్నారు. మరోవైపు లేహ్ నుంచి ప్రత్యేక విమానంలో కల్నల్ సంతోష్ బాబు పార్థీవ దేహాన్ని హైదరాబాద్ తరలిస్తున్నారు.