కాసేపట్లో హకీంపేటకు సంతోష్ పార్థీవదేహం | Colonel Santosh Babu Funeral On Thursday | Sakshi
Sakshi News home page

రేపు ఉదయం కల్నల్‌ సంతోష్‌ అంత్యక్రియలు

Published Wed, Jun 17 2020 11:21 AM | Last Updated on Wed, Jun 17 2020 8:24 PM

Colonel Santosh Babu Funeral On Thursda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద భారత్‌– చైనా మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌ బాబు అంత్యక్రియలు గురువారం ఉదయం సూర్యాపేటలో జరుగనున్నాయి. ఇప్పటికే సంతోష్‌ బాబు కుటుంబసభ్యులు ఢిల్లీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. వారిని రిసీవ్‌ చేసుకునేందుకు సంతోష్‌ బాబు తల్లిదండ్రులు, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి విమానాశ్రయానికి వెళ్లారు. సంతోష్‌బాబు భార్య, పిల్లలతో పాటు అతని తల్లిదండ్రులను ప్రత్యేక వాహనంలో నానల్‌నగర్‌ ఆర్మీ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. (చదవండి : సలామ్‌ కల్నల్‌ సంతోష్..‌)

సంతోష్‌ భార్య ఎయిర్ పోర్టు నుండి బ‌య‌లు దేరుతూ ఉద్వేగానికి లోనై కంట‌త‌డి పెట్ట‌డం అంద‌ర్నీ క‌లిచి వేసింది. కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు రేపు అధికారికంగా జరుపుతామని సీపీ సజ్జనార్‌ అన్నారు. ఈ రోజు సాయంత్రం హాకీంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు సంతోష్‌ భౌతికకాయం వస్తుందని, అక్కడ ఆయనకు గౌరవ వందనం స‌మ‌ర్పించిన అనంత‌రం సూర్యాపేట‌కు తీసుకెళ్తామ‌ని పేర్కొన్న్నారు. మరోవైపు లేహ్‌ నుంచి ప్రత్యేక విమానంలో కల్నల్‌ సంతోష్‌ బాబు పార్థీవ దేహాన్ని హైదరాబాద్‌ తరలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement