border clash
-
ఎడిటర్ కామెంట్: అనగనగా ఒక చైనా కథ..!
-
పార్లమెంట్లో ‘సరిహద్దు’ రగడ.. లోక్‌సభ ఐదుసార్లు వాయిదా
న్యూఢిల్లీ: సరిహద్దులో భారత్, చైనా జవాన్ల ఘర్షణ, చైనా దురాక్రమణ గురించి పార్లమెంట్లో చర్చించాలన్న డిమాండ్‌పై ప్రతిపక్షాలు పట్టువీడడం లేదు. లోక్‌సభలో గురువారం సైతం ఇదే అంశాన్ని విపక్ష సభ్యులు లేవనెత్తారు. సభలో ఇతర వ్యవహారాలను పక్కనపెట్టి, చైనా ఆగడాలపై వెంటనే చర్చ ప్రారంభించాలని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి, సమాధానం చెప్పాలని, నిరంకుత్వం చెల్లదని నినాదాలు చేశారు. చర్చకు సభాపతి నిరాకరించడంతో సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. సభ సజావుగా సాగడానికి సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ కోరినా వారు పట్టించుకోలేదు. దీంతో ఐదుసార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో లోక్‌సభను ఒకేరోజు ఐదుసార్లు వాయిదా ఇదే మొదటిసారి. విపక్షాల నినాదాల హోరు కొనసాగుతుండగానే మరోవైపు కేంద్ర వాణిజ్యమంత్రి గోయల్ ‘జన విశ్వాస్ (సవరణ) బిల్లు–2022’ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లును పార్లమెంట్ జాయింట్ కమిటీ పరిశీలనకు పంపాలని సిఫార్సు చేశారు. విపక్షాల ఆందోళన కారణంగా సభా వ్యవహారాలేవీ సాగలేదు. ప్రశ్నోత్తరాల్లో పాల్గొనాలని స్పీకర్ బిర్లా పదేపదే కోరినా కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు వినిపించుకోలేదు. సరిహద్దులో ఘర్షణపై చర్చ ప్రారంభించాలని పట్టుబట్టారు. కరోనా వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన చేస్తున్న సమయంలోనూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. చైనా దురాక్రమణపై చర్చించాలని కోరుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో పలువురు విపక్ష సభ్యులు ఇప్పటికే వాయిదా తీర్మానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకరోజు బహిష్కరించిన విపక్షాలు సరిహద్దు అంశంపై చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ విపక్షాలన్నీ గురువారం రాజ్యసభ కార్యకలాపాలను బహిష్కరించాయి. తొలుత ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలు ప్రారంభించారు. సభను అడ్డుకోవద్దంటూ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. అయినా నినాదాలు ఆపలేదు. సరిహద్దు వ్యవహారంపై చర్చకు చైర్మన్ అంగీకరించకపోవడంతో సభను బహిష్కరిస్తున్నట్లు విపక్ష ఎంపీలు చెప్పారు. -
భారత్-చైనా సైనికుల ఘర్షణపై అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై స్పందించింది అమెరికా. తవాంగ్ ఘర్షణ తలెత్తగా ఇరు దేశాలు త్వరగా వెనక్కి తగ్గి ఉద్రిక్తతలు సద్దుమణగటం ఆహ్వానించదగ్గ విషయమని అమెరికా శ్వేతసౌధం పేర్కొంది. వైట్‌హౌస్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్-పీయెర్ మాట్లాడారు. భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వివాదాస్పద సరిహద్దుల అంశంపై ప్రస్తుత దౌత్యపరమైన మార్గాల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. ‘ఘర్షణ నుంచి ఇరు పక్షాలు వెనక్కి తగ్గటం ఆహ్వానించదగ్గ విషయం. మేము పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. వివాదాస్పద అంశాలపై ద్వైపాక్షిక మార్గాల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాలి. ఈసారి ఘర్షణ వాతావరణం త్వరగా సద్దుమణిగినందుకు సంతోషం.’ అని తెలిపారు శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్-పీయెర్. మరోవైపు.. సరిహద్దులో ఉద్రిక్తతలు సద్దుమణిగేందుకు భారత్ తీసుకున్న చర్యలకు తమ మద్దతు ఉంటుందని పెంటగాన్ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వద్ద డిసెంబర్ 9న సుమారు 300 మంది చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ సైనికులు భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించారు. వారిని భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. భారత సైనికులు చైనా కుతంత్రాన్ని దీటుగా తిప్పికొట్టారని పార్లమెంట్లో ప్రకటన చేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఇదీ చదవండి: సైనికుల ఘర్షణపై స్పందించిన చైనా.. సరిహద్దులో పరిస్థితులపై ప్రకటన -
సైనికుల ఘర్షణపై స్పందించిన చైనా.. ఏమందంటే?
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద భారత్, చైనా సైనికుల నడుమ ఘర్షణ తెలెత్తడంతో మరోమారు సరిహద్దు వివాదం తెరపైకి వచ్చింది. ఈ నెల 9న చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. మన సైన్యం వారి ప్రయత్నాలను తిప్పికొట్టింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైనికుల ఘర్షణ తర్వాత తొలిసారి స్పందించింది చైనా. భారత్ సరిహద్దులో పరిస్థితులు ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా స్థిరంగా ఉన్నాయని ప్రకటించింది. ‘మాకు ఉన్న సమాచారం మేరకు చైనా-భారత్ సరిహద్దులో పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయి. సరిహద్దు వివాదంపై ఇరు పక్షాలు దౌత్య, మిలిటరీ మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తున్నాయి.’ అని పేర్కొన్నారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్. తవాంగ్ సెక్టార్లో సైనికుల ఘర్షణపై పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రకటన చేశారు. చైనా కుతంత్రాన్ని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయన ప్రకటన చేసిన కొద్ది సేపటికే చైనా స్పందించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: తవాంగ్ ఘర్షణ: చైనా సరిహద్దులో భారత ఫైటర్ జెట్స్ గస్తీ -
చైనా రాయబారుల నుంచి కాంగ్రెస్ నేతలకు డబ్బులు: అమిత్ షా
న్యూఢిల్లీ: సరిహద్దులో సైనికుల ఘర్షణపై పార్లమెంట్లో విపక్షాలు ఆందోళన చేయటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అయితే, మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఆక్రమించులేదని స్పష్టం చేశారు. చైనాకు ఒక్క ఇంచు కూడా వదులుకునేది లేదన్నారు. తవాంగ్ ఘర్షణను చూపుతూ కాంగ్రెస్ మరేదో అంశంపై ఈ విధంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. చైనా రాయబారుల వద్ద కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకున్నారని, ఆ డబ్బులను రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌లో ఖర్చు చేశారని ఆరోపించారు. ‘సరిహద్దు ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేసినప్పటికీ ప్రశ్నోత్తరాల సమయానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించింది. నేను ప్రశ్నోత్తరాల జాబితాను చూశాను. 5వ ప్రశ్న తర్వాత కాంగ్రెస్ అత్యుత్సాహం కనిపించింది. ఆ ప్రశ్నను కాంగ్రెస్ సభ్యుడే అడిగారు. సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ వారు సభకు అంతరాయం కలిగించారు. వారు అనుమతించి ఉంటే నేను సమాధానం ఇచ్చేవాడిని. 2006-06, 2006-07 మధ్య చైనా ఎంబసీ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు రూ 1.35 కోట్లు అందాయి. అది ఎఫ్సీఆర్ఏ ప్రకారం సరైనది కాదు. నిబంధనల ప్రకారమే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్‌ను హోంశాఖ రద్దు చేసింది. నరేంద్ర మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఎవరూ ఆక్రమించుకోలేదని స్పష్టం చేస్తున్నా.’ అని తెలిపారు హోంమంత్రి అమిత్ షా. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: చైనా కుతంత్రానికి దీటుగా బదులిచ్చిన భారత బలగాలు: రాజ్‌నాథ్ -
తవాంగ్ ఘర్షణపై లోక్‌సభలో రాజ్‌నాథ్ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: తవాంగ్ సెక్టార్ ఘటనపై లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. చైనా ఆర్మీ మన భూభాగంలోకి వచ్చేందుకు యత్నించిందని, చైనా కుత్రంతానికి భారత బలగాలు దీటుగా బదులిచ్చాయని స్పష్టం చేశారు. భారత పోస్టును ఆక్రమించేందుకు చైనా జవాన్లు యత్నించినట్లు పేర్కొన్నారు. సరైన సమయంలో భారత బలగాలు స్పందించటంతో పీఎల్ఏ సైన్యం తోకముడుచుకుని తిరిగి వారి పోస్టులోకి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. భారత సైనికుల్లో ఎవరూ తీవ్రంగా గాయపడలేదన్నారు. ‘డిసెంబర్ 9న తవాంగ్ సెక్టార్లో పీఎల్ఏ బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు యత్నించాయి. చైనా కుతంత్రాన్ని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. వారిని వెనక్కి వెళ్లేలా చేశాయి. ఈ అంశాన్ని దౌత్యపరమైన విధానంలో చైనా ముందుకు తీసుకెళ్తాం. మన సరిహద్దులను కాపాడేందుకు, ఎలాంటి సంఘటనలు ఎదురైనా తిప్పికొట్టేందుకు మన బలగాలు సిద్ధంగా ఉన్నాయని భరోసా ఇస్తున్నాం. ఈ ఘర్షణలో ఇరువైపుల కొద్ది మంది సైనికులు గాయపడ్డారు. మన సైనికులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు, తీవ్రంగా గాయపడలేదు. మన బలగాలు సరైన సమయంలో స్పందించటంతో పీఎల్ఏ సైనికులు తిరిగి వారి వారి ప్రాంతానికి వెళ్లిపోయారు.’ - రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. తవాంగ్ ఘర్షణ తర్వాత డిసెంబర్ 11న స్థానిక కమాండర్ చైనా కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు రాజ్‌నాథ్. ఈ సందర్భంగా సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకే తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా కమాండ్ తెలిపినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: తవాంగ్ ఘర్షణ: చైనా సరిహద్దులో భారత ఫైటర్ జెట్స్ గస్తీ -
తవాంగ్ ఘర్షణ: ‘ఫైటర్ జెట్స్’ను రంగంలోకి దింపిన భారత్
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల నడుమ ఈనెల 9న ఘర్షణ తెలెత్తి మరోమారు సరిహద్దు వివాదంరాజుకుంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దుల్లో యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా గగనతల విహారం పెరిగినట్లు గుర్తించిన క్రమంలో ఈ మేరకు భారత్ అప్రమత్తమైనట్లు పేర్కొన్నాయి. చైనా బలగాలను తిప్పికొట్టేందుకు ఇటీవల రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఫైటర్ జెట్స్ గస్తీ పెంచినట్లు వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలో చైనా గగనతల కార్యకలాపాలు పెరిగిన క్రమంలో గగనతల పెట్రోలింగ్ పెంచినట్లు భారత వైమానిక దళ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. సరిహద్దులో తాజా ఉద్రిక్తతలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పార్లమెంట్లో కీలక ప్రకటన చేయనున్నారు. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: ఇండో-చైనా సైనికుల ఘర్షణపై రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష -
తవాంగ్ ఘర్షణ: రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికల నడుమ తలెత్తిన ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, త్రివిద ధళాల అధిపతులు, విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 9న జరిగిన ఘటనపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. సరిహద్దులో ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్లమెంట్‌లోనూ ఈ అంశంపై రాజ్‌నాథ్ మాట్లాడనున్నారు. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: భారత్-చైనా సరిహద్దు ఘర్షణ.. ప్రతిపక్షాలకు పార్లమెంట్లో గట్టి కౌంటర్ పడేనా? -
సరిహద్దు ఘర్షణ పార్లమెంట్‌ను కుదిపేయనుందా?
న్యూఢిల్లీ: సరిహద్దు ఘర్షణ.. దేశ చట్ట సభను కుదిపేయనుందా?. అవుననే సంకేతాలు అందిస్తున్నాయి ప్రతిపక్షాలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2022లో భాగంగా.. ఇవాళ(మంగళవారం) చైనా-భారత్ సరిహద్దు ఘర్షణ అంశాన్ని లేవనెత్తి.. కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని ప్రధానంగా ప్రతిపక్ష కాంగ్రెస్ భావిస్తోంది. డిసెంబర్ 9వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ వాస్తవ నియంత్రణ రేఖ వెంట భారత్-చైనా బలగాలు గొడవ పడ్డాయని, ఈ ఘనటలో ఇరు వర్గాలకు స్వల్ఫ గాయాలు అయ్యాయనేది సమాచారం. ఈ సమాచారం తెలియగానే.. కాంగ్రెస్ కేంద్రాన్ని ఏకిపారేయడం ప్రారంభించింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సీనియర్లు మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇక ఈ అంశంపై పార్లమెంట్లో చర్చించడం ద్వారా ప్రభుత్వ తీరును దేశం దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ఇరు సభల్లో వాయిదా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు ఎంఐఎం అధినేత, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం వాయిదా తీర్మానం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని.. ఎందుకు బహిర్గత పర్చలేదని ఆయన అధికార పక్షాన్ని నిలదీస్తున్నారు. సరిహద్దు విషయంలో నిజాలు బయటకు రాకుండా మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతోందనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. అయితే.. ఈ విషయంలో ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని కేంద్రం భావిస్తోందట. కేంద్రం ఎప్పుడూ ఎలాంటి చర్చలకు వెనుకాడలేదని, వాస్తవాలతో సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా పార్లమెంట్లో ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు. 2020లో లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద 20 మంది భారతీయ సైనికులు మరణించిన భీకర ఘర్షణ తర్వాత.. భారత్-చైనా మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ ఘర్షణలో ఐదుగురు చైనా సైనిక అధికారులు, సైనికులు మరణించారని చైనా ప్రకటించినా.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందన్న కథనాలు వినిపించాయి. Congress MP Randeep Singh Surjewala gives Suspension of Business Notice under Rule 267 in Rajya Sabha to discuss the India-China face-off in Tawang sector, Arunachal Pradesh on 9th December; urges the PM & Defence Minister to make a statement & have a discussion in the House. — ANI (@ANI) December 13, 2022 ఇదీ చదవండి: మోదీ సర్కారు మెతక వైఖరి వల్లే చైనా ఆగడాలు! -
హైఅలర్ట్: ఏ క్షణంలోనైనా యుద్ధట్యాంకర్ పేలొచ్చు!
High Alert At Ukrain Border Amid Forces Deploy: అగ్రరాజ్యాల మధ్య వైరం.. ఎక్కడో చిన్న దేశం మీద అగ్గి కురిపించేందుకు సిద్ధమైంది. అమెరికా-నాటో, రష్యా దళాల మోహరింపు నడుమ ఉక్రెయిన్ సరిహద్దు రణరంగాన్ని తలపిస్తోంది. ఉక్రెయిన్ ఆక్రమణ రష్యా సిద్ధమైంది(ఆ ఉద్దేశం లేదని వ్లాదిమిర్‌పుతిన్ బుకాయిస్తుండడం తెలిసిందే) . తన సైన్య బలగాల్లో మెజార్టీని పశ్చిమ వైపున మోహరించింది. సుమారు లక్ష మంది సైనికులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు శాటిలైట్ ద్వారా తీసిన చిత్రాలు కొన్నిబయటకు లీక్ అయ్యాయి. బెలారస్‌లోని బ్రెస్ట్స్కై శిక్షణ కేంద్రం దగ్గర రష్యా దళాలు, వాళ్ల టెంట్లకు సంబంధించిన ఫొటోలు సైతం బయటకు పొక్కాయి. మరోవైపు అమెరికా 8,500 సైనికులను మోహరించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు NATO బలగాలను పంపుతూనే.. మరికొన్ని బలగాలను సిద్ధంగా ఉంచింది. ఈ రెండు వర్గాల విస్తరణ.. పొరుగున ఉన్న క్రిమియా, బెలారస్ పొడవునా ఉంది. కేవలం దళాల మోహరింపు మాత్రమే కాకుండా.. భారీ ఆయుధాలు, కవచాలు ఫిరంగిలతో యుద్ద వాతావరణం నెలకొంది. ఈ ఎక్విప్మెంట్ మొత్తాన్ని చాలా వరకు దూరప్రాంతాల నుండి రైలులో రవాణా చేయబడినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఐరోపాలో బహిరంగ సంఘర్షణను నివారించడానికి.. పాశ్చాత్య దేశాలు దౌత్యపరమైన చర్చల దిశగా అగ్రరాజ్యాలపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ తరుణంలో రష్యా, అమెరికా సోమవారం UN భద్రతా మండలిలో చర్చలు నిర్వహించాయి. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సరిహద్దులో పోటాపోటీ బలగాలను మోహరించడం ద్వారా ప్రపంచానికి యుద్ధ సంకేతాలు పంపడం ఆపాలని, తమ పౌరుల భయాందోళనలను రెట్టింపు చేయొద్దంటూ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ.. ఈ వేదిక నుంచి అగ్రరాజ్యాలకు పిలుపు ఇవ్వడం విశేషం. చెక్క తుపాకులతో శిక్షణ!! Ukrainian Civilians.. రష్యా ఆక్రమణ భయాందోళనల నడుమ.. ఎలాంటి కేవలం అమెరికా-నాటో దళాల్ని నమ్ముకోకూడదని ఉక్రెయిన్ బలంగా ఫిక్స్ అయ్యింది. సరిహద్దులో ఇప్పటికే లక్షా ముప్ఫైవేలమంది సైనికులను మోహరించింది. అందుకే సాధారణ పౌరులకు యుద్ధ శిక్షణను ఆఘమేఘాల మీద ఇస్తోంది. ఈ మేరకు ఢిపెన్స్ ఫోర్స్ అధికారులు.. యువత, వయో వృద్ధులను సైతం రంగంలోకి దించుతోంది. ఈమేరకు చెక్కు తుపాకులతో శిక్షణ ఇస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి కూడా. యుద్ధం తమదాకా వచ్చేసిందని బలంగా నమ్ముతున్న పౌరులు శిక్షణకు ఆసక్తి చూపిస్తున్నారు. సంబంధిత వార్త: ఉక్రెయిన్ కేంద్రంగా.. అగ్రరాజ్యాల కొట్లాటకు కారణం ఇదే.. -
చైనాతో ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయ్
న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య ఒక ఒప్పందం కుదిరే వరకు సరహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె వ్యాఖ్యానించారు. డ్రాగన్ దేశం ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా గతంలో మాదిరిగా బుద్ధి చెప్పడానికి మన సైన్యం సన్నద్ధంగా ఉందన్నారు. గురువారం పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సదస్సులో పాల్గొన్న నరవణె మాట్లాడారు. అఫ్గానిస్తాన్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఏర్పడే ముప్పుపై దృష్టి సారించామని చెప్పారు. దానికనుగుణంగా వ్యూహాలను రచిస్తున్నట్టుగా తెలిపారు. -
నేడు భారత్-చైనా సైనిక కమాండర్ల కీలక సమావేశం
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో శాంతే లక్ష్యంగా నేడు 11వ విడత కోర్ కమాండర్ల సమావేశం జరగనుంది. తూర్పు లడ్డాఖ్ చుషుల్ ప్రాంతంలోని భారత్ శిబిరం వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే పలుమార్లు భారత్-చైనా మధ్య సైనిక, దౌత్య చర్చలు అవి అనుకున్నంత ఫలితాలను ఇవ్వలేదనే చెప్పాలి. లడ్డాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరణ తర్వాత జరుగుతున్నఈ భేటీ కీలకం కానుంది. గతేడాది మే నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతునే ఉంది. ఈ నేపథ్యంలో ఎల్వోసీ వెంబడి ఇరుదేశాలు భారీగా తమ సైన్యాన్ని మోహరించాయి. ఈ సందర్భంగా లడ్డాఖ్‌లోని గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, డెప్పాంగ్ మైదానాల నుంచి కూడా బలగాలను ఉపసంహరించుకునే అంశంపై అధికారులు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న కోర్ కమాండర్ స్థాయి అధికారుల సమావేశం కీలకమనే చెప్పాలి. ( చదవండి: తారస్థాయికి ఉద్రిక్తతలు: చైనా కీలక వ్యాఖ్యలు ) -
ఆ వ్యూహం మా దగ్గర పని చేయదు: నరవాణే
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు ముగింపు దశకు చేరుకున్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద భారత్–చైనా సైనిక బలగాలను ఉపసంహరించుకున్నాయి. ఈ క్రమంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎం ఎం నరవాణే బలగాల ఉపసంహరణ ఇరు దేశాల సమిష్టి విజయం అన్నారు. అంతేకాక దళాల తొలగింపు, విస్తరణ వంటి తదుపరి చర్యలకు చాలా సమయం పడుతుందన్నారు. లద్దాఖ్ ఉద్రిక్తతల సమయంలో చైనా, పాకిస్తాన్ల మధ్య బహిరంగ కలయిక సంకేతాలు లేవని స్పష్టం చేశారు నరవాణే. కానీ ఇండియా మాత్రం ఈ రెండు ప్రధాన శత్రువులతో పాటు అంతర్గత భద్రత అనే మరో సగం సమస్యను ఎదుర్కొవడానికి సిద్దంగా ఉందని.. ఈ మేరకు ఈ రెండున్నర శత్రువులతో తలపడేందుకు దీర్ఘకాలిక వ్యూహ రచన చేస్తోందని వెల్లడించారు. దళాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత మరికొన్ని అంశాల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు నరవాణే. "మనం ఏమి చేస్తున్నామో, దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మేం ఎల్లవేళలా గుర్తుంచుకుంటాము. మేము చాలా జాగ్రత్తగా ఉంటాము. ఇరు దేశాల మధ్య విశ్వాస లోపం ఉంది. దాన్ని తొలగించే వరకు మే చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎల్ఏసీ వద్ద ఇరువైపులా జరిగే ప్రతి కదలికను జాగ్రత్తగా గనిస్తాం’’ అని తెలిపారు నరవాణే. సరిహద్దు వివాదాల సమస్యలకు హింస ఎన్నటికి పరిష్కారం కాదన్నారు నరవాణే. చైనాకు ప్రారంభం నుంచి ముందుకు పాకే అలవాటు ఉందని.. దాని వల్ల కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి అన్నారు నరవాణే. అయితే ప్రతి మార్పుకు సంబంధించి ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఇక దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ అనుసరించిన వ్యూహం భారత్‌తో పని చేయదని స్పష్టం చేశారు. ఇక ఉద్రికత్తలు ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వం, ఆర్మీ అందరు కలిసి సమిష్టిగా పని చేశారని.. వాటి ఫలితమే ఈ రోజు మనం చూస్తున్న బలగాల ఉపసంహరణ అన్నారు నరవాణే. చదవండి: భారత్-చైనా యుద్ధం కాస్తలో తప్పింది..! తూర్పు లద్దాఖ్ నుంచి వెనక్కి మళ్లుదాం -
తూర్పు లద్దాఖ్ నుంచి వెనక్కి మళ్లుదాం
న్యూఢిల్లీ: పాంగాంగ్ సరస్సు నుంచి బలగాల ఉపసంహరణ పూర్తి కావడంతో తూర్పు లద్దాఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్పాంగ్‌పై భారత్, చైనా ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఆయా ప్రాంతాల్లో విధుల్లో ఉన్న బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఇరు దేశాలు సంప్రదింపులు ప్రారంభించాయి. భారత్, చైనా మధ్య పదో దఫా కమాండర్ స్థాయి చర్చలు శనివారం ఎల్ఏసీ వద్ద మోల్డో బోర్డర్ పాయింట్లో జరిగాయి. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ సంప్రదింపులు రాత్రి 9.45 గంటల వరకు కొనసాగాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల సైనిక అధికారులు హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్పాంగ్ నుంచి బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా చర్చించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా ఈ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై అభిప్రాయాలు పంచుకున్నారు. సైనిక బలగాలను వెనక్కి మళ్లించే ప్రక్రియ చాలా వేగంగా జరగాలని భారత్ నొక్కి చెప్పింది. చైనా కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
మూడోరోజూ అమ్మకాలే..!
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఇంధన, ఐటీ రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 531 పాయింట్లను కోల్పోయి 48,348 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 133 పాయింట్లు పతనమైన 14,238 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా మూడోరోజూ నష్టాల ముగింపు. ఈ మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1444 పాయింట్లకు పైగా పతనమవగా, నిఫ్టీ 407 పాయింట్లు నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, అధిక వెయిటేజీ షేర్లలో లాభాల స్వీకరణతో పాటు సిక్కిం సరిహద్దుల్లో భారత్– చైనా సైనిక బలగాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం మన మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. నష్టాల మార్కెట్లోనూ మెటల్ షేర్లు మెరిశాయి. ఫార్మా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. సూచీల ఒకశాతం పతనంతో రూ.2.1 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. వెరసి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.192.3 లక్షల కోట్లకు దిగివచ్చింది. దేశీయ ఇన్వెస్టర్ల(డీఐఐ)తో పాటు విదేశీ ఇన్వెస్టర్లూ నికర అమ్మకందారులుగా మారి మొత్తం రూ.765 కోట్ల షేర్లన విక్రయించారు. రిపబ్లిక్ డే సందర్భంగా నేడు (మంగళవారం) మార్కెట్లకు సెలవు. ఇంట్రాడేలో 988 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్..! ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల పరిణామాలతో సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. ప్రారంభంలో కొంత షార్ట్ కవరింగ్ జరగడంతో సెన్సెక్స్ 385 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు లాభపడ్డాయి. అయితే దేశీయ మార్కెట్లో నెలకొన్న అంతర్గత బలహీనతలు సూచీల లాభాలకు అడ్డువేశాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. నేడు మార్కెట్‌కు సెలవు, ఎల్లుండి జనవరి ఎఫ్అండ్ఓ ముగింపు తేది కావడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. చివరి అరగంటలో అమ్మకాల తీవ్రత మరింత పెరగడంతో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం నుంచి(49,263) 988 పాయింట్లను కోల్పోయి 48,275 వద్దకు వచ్చింది. నిఫ్టీ సైతం డే హై(14,491) నుంచి 274 పాయింట్లు నష్టపోయి 14,491 స్థాయిని తాకింది. రిలయన్స్‌ను అధిగమించిన టీసీఎస్ రిలయన్స్ షేరు పతనం టీసీఎస్ కంపెనీకి కలిసొచ్చింది. మార్కెట్ క్యాప్ విషయంలో రిలయన్స్‌ను అధిగమించి టీసీఎస్ దేశంలోనే అత్యంత విలువ కలిగిన కంపెనీగా అవతరించింది. టీసీఎస్ షేరు ఇంట్రాడేలో రూ.3,345 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకి చివరికి 0.36% స్వల్ప నష్టంతో రూ.3,291 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్ 12.34 లక్షల కోట్లకు చేరింది. ఇక 5.36% పతనమైన రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.12.29 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ఒక్కరోజులో ముకేశ్ అంబానీకి రూ. 38వేల కోట్ల నష్టం రిలయన్స్ షేరు భారీ పతనంతో ఈ కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ఒక్కరోజులోనే రూ.38 వేల కోట్ల సంపదను కోల్పోయారు. రిలయన్స్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లు మెప్పించలేకపోయాయి. దీంతో షేరు ఇంట్రాడేలో 5.71% నష్టపోయి రూ.1932 స్థాయికి చేరుకుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ భారీగా క్షీణించింది. ఫలితంగా కంపెనీలో సగానికి పైగా వాటా కలిగిన ముకేశ్ ఏకంగా రూ.38 వేల కోట్ల నష్టాన్ని చవిచూశారు. దీంతో బ్లూమ్‌బర్గ్ బిలినియర్ ఇండెక్స్‌లో అంబానీ 11వ స్థానం నుంచి 12వ స్థానానికి తగ్గింది. -
చైనాతో మళ్లీ ఘర్షణ
న్యూఢిల్లీ: ఉత్తర సిక్కింలోని 16 వేల అడుగుల ఎత్తైన నాకు లా ప్రాంతంలో ఉన్న సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల మధ్య గతవారం స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. జనవరి 20న జరిగిన ఈ ఘర్షణ ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ బాహాబాహీలో రెండు దేశాల సైనికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. సుమారు 20 మంది చైనా సైనికులు, నలుగురు భారత జవాన్లు గాయపడ్డారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల స్థానిక కమాండర్లు ఈ సమస్యను పరిష్కరించారని ఆర్మీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తొలగించే లక్ష్యంతో ఇరుదేశాల మధ్య 9వ విడత చర్చలు ఆదివారం ఉదయం ప్రారంభమై.. సోమవారం మధ్నాహ్నం వరకు కొనసాగాయి. తాజా ఘటనను భూతద్దంలో చూసి, అనవసర, అబద్ధపు ప్రచారం చేయవద్దని మీడియాను కోరుతున్నామని భారతీయ ఆర్మీ ప్రకటించింది. ఈ నెల 20న ఉత్తర సిక్కింలోని నాకు లా వద్ద వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి వచ్చేందుకు చైనా సైనికులు ప్రయత్నించారు. భారత సైనికులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. దీనిపై తమ వద్ద సమాచారం లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ వ్యాఖ్యానించారు. ‘సరిహద్దుల్లో శాంతి నెలకొనేందుకు చైనా దళాలు కట్టుబడి ఉన్నాయన్నారు. అహంకార ధోరణి సరికాదు: జిన్‌పింగ్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్)ను ఉద్దేశించి జిన్‌పింగ్ సోమవారం ప్రత్యేకంగా ప్రసంగించారు. వారంపాటు జరిగే ఈ డబ్ల్యూఈఎఫ్ ఆన్లైన్ సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీ గురువారం ప్రసంగిస్తారు. సొంత ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఇతర దేశాలను ఇబ్బంది పెడ్తూ అహంకార పూరిత ధోరణితో వ్యవహరించే దేశాలు ఒంటరిగా మిగిలిపోతాయని హెచ్చరించారు. ఏ దేశం పేరునూ ప్రస్తావించనప్పటికీ.. అమెరికా, భారత్‌లను ఉద్దేశించే జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. -
అస్సాం–మిజోరం సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
ఐజ్వాల్/సిల్చార్/గువాహటి: అస్సాం, మిజోరం సరిహద్దులో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సరిహద్దులోని ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని అధికారులు చెప్పారు. భద్రతా సిబ్బంది రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు. ఘర్షణకు దారి తీసిన పరిణామాలు, తక్షణం చేపట్టాల్సిన కార్యాచరణపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా సోమవారం ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. (అత్యంత సంక్లిష్ట దశలో ప్రజాస్వామ్యం) అస్సాంలోని లైలాపూర్, మిజోరంలోని వైరెంగ్టే గ్రామ ప్రజల మధ్య ఘర్షణ మొదలైంది. ఇరు వర్గాల ప్రజలు కర్రలతో దాడి చేసుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. దాదాపు 20 గుడిసెలకు నిప్పుపెట్టారు. సరిహద్దులో చెట్లు కొట్టే విషయంలో వీరి మధ్య వివాదం మొదలైందని స్థానికులు అంటుండగా బయటి వారి జోక్యం ఉందని అధికారులు అంటున్నారు -
చైనాతో బంధంపై ‘సరిహద్దు’ ప్రభావం
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత తీవ్రంగా దెబ్బతిన్నాయనీ, ఈ పరిస్థితులు రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. తను రాసిన ‘ది ఇండియా వే’పై జరిగిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. భారత్–చైనా సరిహద్దు సమస్య చాలా కష్టమైందీ, క్లిష్టమైంది అంటూ ఆయన.. గత మూడు దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలను చారిత్రక కోణంలో ఆవిష్కరించారు. వాణిజ్యం, పర్యాటకం, ఇతర కార్యక్రమాల ద్వారా 1980ల నుంచి ఈ సంబంధాలు క్రమంగా మెరుగుపడుతూ వచ్చాయన్నారు. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణానికి భంగం కలిగితే ఆ ప్రభావం రెండు దేశాల మధ్య సంబంధాలపైనా ఉంటుందని, ఏం జరుగనుందో చూడాలని అన్నారు. అంతర్జాతీయంగా ప్రముఖ పాత్ర పోషిస్తున్న భారత్, చైనాలు..తమ మధ్య సమతౌల్యాన్ని ఎలా సాధిస్తాయనేదే పెద్దప్రశ్న అని వ్యాఖ్యానించారు. ఈ పుస్తకాన్ని ఏప్రిల్‌కు ముందే రాశాననీ, అప్పటికి తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట ఉద్రిక్తతలు మొదలుకాలేదని ఆయన అన్నారు. -
యుద్ధానికి సిద్ధంకండి!
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సైన్యాన్ని యుద్ధానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీకున్న శక్తియుక్తులన్నింటినీ యుద్ధంపైనే నిమగ్నం చేయండని చైనా ఆర్మీతో జిన్‌పింగ్ చెప్పినట్టుగా సీఎన్ఎన్ ఒక కథనాన్ని ప్రచురించింది. గాంగ్‌డాంగ్‌లో మంగళవారం ఒక సైనిక స్థావరాన్ని సందర్శించిన జిన్‌పింగ్ అక్కడ సైనికులతో మాట్లాడుతూ దేశం పట్ల విశ్వసనీయంగా వ్యవహరించండంటూ వారికి హితబోధ చేశారు. ‘‘మీకున్న శక్తిని, మేధస్సుని యుద్ధ వ్యూహ రచనపై కేంద్రీకరించండి. అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండండి. యుద్ధానికి సిద్ధంగా ఉండండి ’’అని జిన్‌పింగ్ చెప్పినట్టుగా సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. అయితే ఏ దేశంపైన, ఎప్పుడు దండెత్తడానికి జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారన్న దానిపై స్పష్టత లేదు. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌తో ఉద్రిక్తతలు, అగ్రరాజ్యం అమెరికాతో విభేదాలతో పాటుగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి సంబంధించి ఇతర దేశాలతో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) నావికాదళ జవాన్లతో జిన్‌పింగ్ మాట్లాడారు. మరోవైపు చైనా మీడియా మాత్రం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరింత బలోపేతం కావడానికి, సైనికుల్లో ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పడానికి జిన్‌పింగ్ సైనిక స్థావరాన్ని సందర్శించారని చెబుతోంది. ఇప్పటివరకు భారత్, చైనా ఏడు రౌండ్లు చర్చలు జరిగినప్పటికీ ఉద్రిక్తతల నివారణకు చర్యలు అమలు చేయడంలో చైనా వెనుకడుగ వేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో జిన్‌పింగ్ నోటి వెంట యుద్ధం ప్రస్తావన తేవడం మరింత ఆందోళనని పెంచుతోంది. -
ఎల్ఏసీ వద్ద పాకిస్తాన్ సైనికులు!
న్యూఢిల్లీ/లేహ్: భారత్–చైనా సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా సైన్యంతోపాటు దాని సన్నిహిత మిత్ర దేశం పాకిస్తాన్ సైనికులు కూడా తిష్ట వేశారా? చైనాకు మద్దతుగా వారు కూడా పహారా కాస్తున్నారా? చైనా జర్నలిస్టు షెన్ షెవీ శనివారం షేర్ చేసిన ఓ వీడియోను గమనిస్తే ఇది నిజమేనని స్పష్టమవుతోంది. 52 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో చైనా సైనికులతోపాటు గుబురు గడ్డంతో ఉన్న మరో సిపాయి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాడు. అతడి రూపురేఖలు, ఎత్తు, దేహ దారుఢ్యం వంటివి చైనా పౌరుల కంటే పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎల్ఏసీ వద్ద చైనాకు సాయంగా పాకిస్తాన్ సైన్యం సైతం రంగంలోకి దిగిందని పలువురు భావిస్తున్నారు. అలాగే పాకిస్తాన్ సైనికులకు చైనా శిక్షణ ఇస్తోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సరిహద్దులో భారత్–చైనా సైనికుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 12న భారత్–చైనా ఆర్మీ ఏడో రౌండ్ చర్చలు న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించుకునే దిశగా భారత్–చైనా ఆర్మీ ఏడో దఫా చర్చలు ఈ నెల 12వ తేదీన జరగనున్నాయి.తూర్పు లద్దాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి ఇరు దేశాలు సైన్యాలను ఉపసంహరించుకునే కచ్చితమైన రోడ్ మ్యాప్ రూపొందించడమే ఈ సమావేశం ఎజెండా అని విశ్వసనీయ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 21వ తేదీన జరిగిన చర్చల్లో సరిహద్దుల్లోకి మరిన్ని అదనపు బలగాలను పంపించరాదనే నిర్ణయంతోపాటు పలు కీలక అంశాల్లో ఏకాభిప్రాయం సాధించారు. సైన్యం, వైమానిక దళం ఉమ్మడి కార్యాచరణ తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యం దూకుడును అడ్డుకోవాలని భారత సైన్యం నిర్ణయించింది. వైమానిక దళంతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని భావి స్తోంది. సరిహద్దులో చెలరేగిపోతున్న చైనా సైనికులకు తగిన గుణపాఠం నేర్పడానికి భారత సైన్యం, వైమానిక దళం సన్నద్ధమ వుతున్నాయి. త్రివిధ దళాలను ఎప్పటి కప్పుడు సమన్వయ పరుస్తూ ముందుకు నడిపించడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సూచనలతోనే సైన్యం, వైమానిక దళం కలిసి పని చేయనున్నాయి. లేహ్ ఎయిర్ ఫీల్డ్‌లో ఇప్పటికే వైమానిక దళం యుద్ధ విమానాలను మోహరించింది. వాస్తవా« దీన రేఖ(ఎల్ఏసీ) వద్ద పరిస్థితి మరింత దిగజారితే వెంటనే ఉమ్మడిగా కొన్ని ఆపరేషన్లు చేపట్టడానికి సైన్యం, వైమానిక దళం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
సయోధ్య దిశగా...
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతల నివారణకు భారత్, చైనా మధ్య బుధవారం జరిగిన మరో దఫా చర్చల్లో ముందడుగు పడింది. ఇరు పక్షాలు అపార్థాలను, అనుమానాలను పక్కన పెట్టి సుస్థిరత నెలకొల్పే దిశగా సామరస్యంగా అడుగులు ముందుకు వేయాలని నిర్ణయించాయి. అయిదు నెలలుగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్ని నివారించడానికి సెప్టెంబర్ 10న మాస్కోలో ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల మధ్య కుదిరిన అయిదు అంశాల ఒప్పందం అమలుకు సంబంధించి చర్చలు జరిపారు. సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) మార్గదర్శకాలకు అమలుకి చేపట్టాల్సిన చర్యలపై ఇరు దేశాలకు చెందిన దౌత్య ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా చర్చించారు. వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యాన్ని వెంటనే ఉపసంహరించడం, సరిహద్దు నిర్వహణలో అన్ని ప్రోటోకాల్స్‌ని పాటించడం, శాంతి స్థాపన వంటి అంశాలపై దృష్టి సారించారు. సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల్ని కూడా సమీక్షించారు. ఈ చర్చల అనంతరం విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. -
భారత్, చైనా సుదీర్ఘ చర్చలు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య చర్చలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదలైన ఆరో విడత చర్చలు రాత్రి 9 గంటల తర్వాత కూడా ఒక కొలిక్కి రాలేదు. రెండు దేశాల మధ్య కుదిరిన ఐదు అంశాల ఒప్పందం అమలే లక్ష్యంగా జరుగుతున్న ఈ చర్చల్లో భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్‌తోపాటు మొదటిసారిగా విదేశాంగ శాఖ తరఫున జాయింట్ సెక్రటరీ నవీన్ శ్రీవాస్తవ కూడా పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన మాస్కోలో రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య కుదిరిన ఒప్పందంలోని ఐదు అంశాల అమలుకు కాలపరిమితిని ఖరారు చేయడంపైనే భారత బృందం దృష్టి పెట్టిందని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించిన చైనా బలగాలను సాధ్యమైనంత త్వరలో, పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఈ బృందం కోరుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఐదు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిగినా చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ లేకుండానే ముగిసిన విషయం తెలిసిందే. -
మన గస్తీని ఏ శక్తీ అడ్డుకోలేదు
న్యూఢిల్లీ: భారత సైన్యం లద్దాఖ్ ప్రాంతంలో సరిహద్దు గస్తీ నిర్వహించకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్æ స్పష్టం చేశారు. తూర్పులద్దాఖ్‌లో పరిస్థితిపై గురువారం రక్షణ మంత్రి రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. చైనా తన సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించిందని, భారత్ తదనుగుణంగా బలగాలను సిద్ధంగా ఉంచిందని తెలిపారు. చైనా చెప్పే మాటలకు, చేతలకూ పొంతన ఉండటం లేదని అన్నారు. గల్వాన్ లోయపై గతంలో ఎన్నడూ చైనాతో వివాదం తలెత్తలేదని, ఫింగర్ పాయింట్–8 వరకు మన బలగాలు గస్తీ చేపట్టేవని రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. ఆయన ప్రశ్నకు రాజ్‌నాథ్ వివరణ ఇస్తూ.. చైనాతో గొడవంతా గస్తీ విషయంలోనేనని తెలిపారు. గస్తీ విధానం విస్పష్టంగా ఉందని, చాలా కాలంగా కొనసాగుతున్నదేనని చెప్పారు. సరిహద్దు వివాదాల్లాంటి సున్నితమైన అంశాలపై చర్చ వద్దన్న అంశంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు అంగీకరించిన తరువాత రాజ్‌నాథ్æ రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో సభ్యులు కొన్ని అంశాలపై కోరిన వివరణకు రక్షణ మంత్రి స్పందించారు. చైనా సరిహద్దుల్లో ఏప్రిల్ నాటి పరిస్థితులను పునరుద్ధరించాలని అంతకుముందు ప్రతిపక్షం డిమాండ్ చేసింది. తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యంతో ప్రతిష్టంభన కొనసాగుతున్న ఈ సమయంలో పార్టీల కతీతంగా సభ సైన్యానికి మద్దతు, సంఘీభావం ప్రకటించింది. భారత భూభాగాన్ని ఆక్రమించింది లద్దాఖ్ ప్రాంతంలో సుమారు 38 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ 5,180 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలిగి ఉందని రాజ్‌నాథ్ తెలిపారు. భారత్, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి అతితక్కువ సైనిక బలగాల మోహరింపు ఉండాలని 20 ఏళ్ల క్రితమే ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు. పార్లమెంట్ ఆవరణలో రైతు బిల్లు ప్రతులు దహనం కేంద్రం ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదించిన రైతుల బిల్లులపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో నిరసన తెలిపారు. పంజాబ్‌కు చెందిన ఆ పార్టీ ఎంపీలు బిల్లుల ప్రతులను పార్లమెంట్ ఆవరణలో తగులబెట్టి, మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. కేంద్రం తప్పుడు విధానాల కారణంగా రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురి ఆరోపించారు. సాయుధ సంపత్తికి బిలియన్ డాలర్లువాస్తవాధీన రేఖ వెంట ప్రస్తుతం మోహరించిన బలగాలను చలికాలం ముగిసేవరకు కొనసాగించాలని చైనా నిర్ణయించిన నేపథ్యంలో.. ఈ నెలాఖరులో జరగనున్న ఇరుదేశాల మిలటరీ స్థాయి చర్చల్లో ప్రాదేశిక మార్పులకు సంబంధించి గొప్ప ఫలితాలేవీ రాకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింతకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తుండటంతో.. సుమారు బిలియన్ డాలర్ల(రూ. 7,361 కోట్లు) విలువైన మిలటరీ సాయుధ సంపత్తిని అత్యవసరంగా సమకూర్చుకునేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించాయి. ఒకవేళ నెలరోజులకు పైగా యుద్ధం కొనసాగే పరిస్థితే ఉంటే.. అందుకు అవసరమైన సాయుధ సంపత్తిని సమకూర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాయి. ఇందులో టీ–72, టీ–90 యుద్ధ ట్యాంకులకు అవసరమైన పేలుడు పదార్ధాలు, ఇజ్రాయెల్ తయారీ క్షిపణులు, హెరోన్ డ్రోన్లు, ఎస్ఐజీ 716 రైఫిల్స్, ఇతర యుద్ధ సామగ్రి ఉన్నాయని వెల్లడించాయి. అలాగే, సుమారు 50 వేల మంది జవాన్లకు అవసరమైన.. తీవ్ర చలిని తట్టుకోగల దుస్తులు, హీటర్లు, టెంట్స్‌ను సమకూర్చుకోవాల్సి ఉందని తెలిపాయి. మరోవైపు, చైనా పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధపడకపోవచ్చని, భారత దళాలను నెలలు, లేదా సంవత్సరాల తరబడి సరిహద్దుల్లో ఎంగేజ్ చేయడం ద్వారా భారత్‌ను దెబ్బతీయాలనే లక్ష్యంతో పనిచేయవచ్చని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు మనోజ్ జోషి వ్యాఖ్యానించారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను దృష్టిలో పెట్టుకుంటే, భారత్‌కు ఇది భారమే అవుతుందన్నారు. మరోవైపు, ఆర్మీ చీఫ్ నరవాణే గురువారం శ్రీనగర్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కశ్మీర్‌లోని సరిహద్దు వెంట పరిస్థితులను స్వయంగా సమీక్షిస్తున్న ఆర్మీ చీఫ్ నరవాణే -
చైనా నుంచి చొరబాట్లు లేవు
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల నుంచి గత ఆరునెలల్లో ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో పాక్ సరిహద్దుల నుంచి 47 చొరబాటు యత్నాలు చోటు చేసుకున్నాయని బుధవారం రాజ్యసభకు తెలిపింది. గత మూడేళ్లలో పాక్ నుంచి కశ్మీర్లోకి జరిగిన చొరబాటు యత్నాల సంఖ్య 594 అని, వాటిలో 312 విజయవంతమయ్యాయని వెల్లడించింది. మూడేళ్లలో అక్కడ 582 మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయని హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆరు నెలలుగా చైనా సరిహద్దుల్లో ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం ప్రకటించడంపై కాంగ్రెస్ మండిపడింది. ఆ ప్రకటన గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో ప్రాణాలర్పించిన వీర జవాన్లను అవమానించడమేనని పేర్కొంది. చైనా దురాక్రమణపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి చేసిన వేర్వేరు ప్రకటనలను వరుసగా ప్రస్తావిస్తూ.. ‘మోదీ ప్రభుత్వం మన సైనికుల పక్షాన ఉందా? లేక చైనా వైపు ఉందా?’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నేడు రాజ్‌నాథ్ ప్రకటన తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నేడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ రాజ్యసభలో ప్రకటన చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్‌నాథ్ ప్రకటన అనంతరం, విపక్ష సభ్యులను మాట్లాడే అవకాశం ఇస్తారని, ఆ తరువాత అవసరమైతే, రాజ్‌నాథ్ సభ్యుల అనుమానాలకు వివరణ ఇస్తారని వెల్లడించాయి. రాష్ట్రపతి, ప్రధాని కూడా.. చైనా టెక్నాలజీ కంపెనీ డేటా చౌర్యం అంశాన్ని బుధవారం కాంగ్రెస్ పార్లమెంట్ ఉభయసభల్లో లేవనెత్తింది. దాదాపు 10 వేల మంది ప్రముఖుల సమాచారంపై నిఘా వేశారన్న వార్త ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో, చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న షెంజెన్ కేంద్రంగా ఉన్న ఒక టెక్నాలజీ కంపెనీ 10 వేల మంది భారతీయ ప్రముఖుల డిజిటల్ డేటాను ట్రాక్ చేస్తోందని పత్రికల్లో కథనం వచ్చిందని కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ వివరించారు. ఆ ప్రముఖుల్లో భారత రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, ఆర్మీ చీఫ్, ముఖ్యమంత్రులు ఉండడం షాక్‌కు గురిచేస్తోందన్నారు. డేటా చౌర్యంపై నిపుణుల కమిటీ భారత్‌లోని దాదాపు 10 వేల మంది ప్రముఖులపై చైనా టెక్నాలజీ సంస్థ నిఘాపెట్టి డేటా చౌర్యం చేస్తోందన్న ఆరోపణలపై కేంద్రం ఒక నిపుణుల కమిటీని నియమించింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్ నేతృత్వంలో ఈ కమిటీ ఈ ఆరోపణల్లోని నిజానిజాలను నిర్ధారిస్తుంది. -
మార్కెట్ అక్కడక్కడే...
కొనుగోళ్లకు పురికొల్పే తాజా ట్రిగ్గర్లు ఏమీ లేనందున శుక్రవారం స్టాక్ మార్కెట్ అక్కడక్కడే ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటంతో స్టాక్ సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. భారత్–చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నివారణకు ఐదు సూత్రాల ఒప్పందం కుదరడం ఒకింత సానుకూల ప్రభావం చూపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు తగ్గి 73.53కు చేరింది. సెన్సెక్స్ 14 పాయింట్లు లాభపడి 38,855 పాయింట్ల వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 11,464 పాయింట్ల వద్ద ముగిశాయి. సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. ఈ వారంలో సెన్సెక్స్‌లో 497 పాయింట్లు, నిఫ్టీ 131 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఆరు గంటలు పరిమిత శ్రేణిలోనే... ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా మన మార్కెట్ లాభాల్లోనే మొదలైంది. ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. దాదాపు ఆరుగంటల పాటు సూచీలు చాలా పరిమిత శ్రేణిలో లాభ,నష్టాల మధ్య కదలాడాయి. చివరి అరగంటలోనే నిలకడగా పెరిగాయి. సెన్సెక్స్ ఒక దశలో 128 పాయింట్లు పతనం కాగా, మరో దశలో 139 పాయింట్లు పెరిగింది. మొత్తం మీద రోజంతా 267 పాయింట్ల రేంజ్లో కదలాడింది. టీసీఎస్, హిందుస్తాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్ లాభాలను హెచ్డీఎఫ్సీ జోడీ, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ హరించి వేశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ► ఎస్బీఐ 2.3% లాభంతో రూ.203 వద్ద ముగి సింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో ఐటీ షేర్లు లాభపడ్డాయి. ► దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఎస్బిఐ కార్డ్స్, లారస్ ల్యాబ్స్, ఇమామి, జుబిలంట్ ఫుడ్‌వర్క్స్, విప్రోలు ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 250కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ రిటైల్, యస్‌బ్యాంక్, డిష్ టీవీ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి.