
సాక్షి, వికారాబాద్: తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వికారాబాద్ జిల్లాలోని కాగ్నా నదిలో ఇసుక తవ్వకాలపై ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు విషయంపై వివాదం నెలకొంది . కాగ్నా నది విషయం పై తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల అధికారుల తెలంగాణ కర్ణాటక సరిహద్దు విషయంలో హద్దులు దాటిన కర్నాటక ఇసుక దోపిడి ఆధికారులు.
రాష్ట్రం నుంచి కన్నడ అధికారులు భారీగా ఇసుకను తరలిస్తున్నారు . కాగ్నా నది హద్దు నుంచి సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల ఇసుక దోచుకున్నారు. బషిరాబాద్ మండలం కాగ్నా నది సరిహద్దు వివాదంపై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. కర్ణాటక అధికారులు ఉమ్మడి సర్వేకు అంగీకరించలేదు. దీంతో తెలంగాణ ప్రాంతంలో హద్దు రాళ్లు పాతిన కర్ణాటక అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment