
సాక్షి, వికారాబాద్ : తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. వికారాబాద్ జిల్లాలోని కాగ్నా నదిలో ఇసుక తవ్వకాలపై ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తలెత్తింది. కాగ్నా నది విషయంపై తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కర్ణాటక నుంచి ఎవరో వచ్చి ఇసుక తవ్వుతున్నారన్న సమాచారంతో స్థానిక అధికారులు వారిని అడ్డుకున్నారు.
కాగ్నా నది మొత్తం తమ రాష్ట్రంలో ఉందంటు కర్ణాటక, సగం నది తమకు చెందుతుందంటు తెలంగాణ.. ఇలా రెండు రాష్ట్రాల అధికారులు వాదనకు దిగారు. రెండు రాష్ట్రాల మ్యాపులు వేరువేరుగా ఉండటంతో ఇసుక ఎవరు తవ్వుకోవాలనే దాని మీద స్పష్టత లేకుండాపోయింది.
Comments
Please login to add a commentAdd a comment