న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల నడుమ ఈనెల 9న ఘర్షణ తెలెత్తి మరోమారు సరిహద్దు వివాదంరాజుకుంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దుల్లో యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా గగనతల విహారం పెరిగినట్లు గుర్తించిన క్రమంలో ఈ మేరకు భారత్ అప్రమత్తమైనట్లు పేర్కొన్నాయి. చైనా బలగాలను తిప్పికొట్టేందుకు ఇటీవల రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఫైటర్ జెట్స్ గస్తీ పెంచినట్లు వెల్లడించాయి.
వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలో చైనా గగనతల కార్యకలాపాలు పెరిగిన క్రమంలో గగనతల పెట్రోలింగ్ పెంచినట్లు భారత వైమానిక దళ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. సరిహద్దులో తాజా ఉద్రిక్తతలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్నారు.
తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద యాంగ్‌త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది.
ఇదీ చదవండి: ఇండో-చైనా సైనికుల ఘర్షణపై రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment