combat aircraft
-
సమున్న‘తరంగ్’
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్ వరుస అంతర్జాతీయ విన్యాసాలకు వేదికగా నిలుస్తూ.. ప్రపంచ దేశాలకు ఆతిథ్యమిస్తోంది. మిలాన్, ఐఎఫ్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్ని నిర్వహించిన భారత్.. మరో కీలక విన్యాసాలకు సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీ నుంచి రెండు దశల్లో జరిగే తరంగ్‌శక్తి యుద్ధ విన్యాసాలు తమిళనాడులోని సూలూరులో జరగనున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో భారత నౌకాదళ సహకారంతో ప్రారంభం కానున్న విన్యాసాల్లో 30 దేశాలకు పైగా పాల్గొంటున్నాయి.భారత్ సత్తా చాటేలా..భారత రక్షణ వ్యవస్థ సత్తా ప్రపంచానికి చాటేలా త్రివిధ దళాల సమన్వయం ఎలా ఉంటుందో శత్రు దేశాలకు తెలియజేసేలా.. భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర సహకారం మరింత పెంపొందేలా ‘తరంగ్ శక్తి’ యుద్ధ విన్యాసాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. భారత వాయుసేన, ఆర్మీ, ఇండియన్ నేవీ కలిసి నిర్వహిస్తున్న అంతర్జాతీయ విన్యాసాలకు 51 దేశాలకు ఆహ్వానమందించగా.. 30కి పైగా దేశాలు హాజరవుతున్నాయి. మొదటి దశ ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకూ తమిళనాడులో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకూ రాజస్థాన్‌లోని జో«ధ్‌పూర్‌లో రెండో దశ విన్యాసాలు జరగనున్నాయి. భారత త్రివిధ దళాల అధిపతులతో పాటు జర్మనీ, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెన్యా, జపాన్, నేపాల్, గినియా దేశాలకు చెందిన చీఫ్ ఆఫ్ ఎయిర్‌స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ విన్యాసాలకు రష్యా, ఇజ్రాయిల్ దూరంగా ఉంటున్నాయి.తొలి దశలో భారత నౌకాదళంతమిళనాడులో జరిగే ఫేజ్–1 విన్యాసాల్లో భారత నౌకాదళం ప్రాతినిధ్యం వహిస్తోంది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరిగే విన్యాసాల్లో యుద్ధ నౌకలపై హెలికాప్టర్ల ల్యాండింగ్, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లపై మిగ్–29, రాఫెల్ యుద్ధ విమానాల ల్యాండింగ్, ఫైరింగ్ తదితర విన్యాసాలు నిర్వహించనున్నారు. రక్షణ రంగంలో స్వావలంబన, అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు తరంగ్ శక్తి కీలకంగా మారనుంది. సత్తా చాటనున్న ఐఏఎఫ్ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఈ విన్యాసాల్లో సత్తా చాటనుంది. ఎల్సీఏ తేజస్ యుద్ధ విమానాలు, రాఫెల్, మిరాజ్ 2000, ఎల్సీహెచ్ ప్రచండ్, ధృవ్, రుద్ర, జాగ్వర్, మిగ్–29, సీ–130, ఐఎల్–78 తదితర యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. భారత వైమానిక దళంతో పాటుగా ఆస్ట్రేలియాకు చెందిన ఎఫ్–18, బంగ్లాదేశ్‌కు చెందిన సీ–130, ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్, జర్మనీకి చెందిన టైఫూన్, గ్రీస్‌కు చెందిన ఎఫ్–16, స్పెయిన్‌కు చెందిన టైపూన్, యూఏఈకి చెందిన ఎఫ్–16, యూకేకి చెందిన టైపూన్, యూఎస్ఏకి చెందిన ఏ–10, ఎఫ్–16, ఎఫ్ఆర్ఏ, సింగపూర్‌కు చెందిన సీ–130 యుద్ధ విమానాలు, బలగాలు విన్యాసాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. -
ఉక్రెయిన్‌కు నాటో భారీ ఆయుధ సాయం
కీవ్: రష్యాపై ఎదురుదాడి ప్రయత్నాల్లో ఉన్న ఉక్రెయిన్ బలగాలకు నాటో భారీ సాయం లభించింది. నాటోలోని మొత్తం 31 సభ్య దేశాలు కలిపి ఉక్రెయిన్‌కు 1,550 పోరాట వాహనాలు, 230 ట్యాంకులు, ఇతర పరికరాలతోపాటు పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని అందించాయి. దీంతో ఉక్రెయిన్‌కు ఇచ్చిన హామీల్లో 98% వరకు నెరవేర్చినట్లయిందని నాటో సెక్రటరీ–జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. అంతేకాకుండా, కొత్తగా ఏర్పాటైన9 ఉక్రెయిన్ బ్రిగేడ్లకు చెందిన 30 వేల బలగాలకు ఆయుధ, శిక్షణ సాయం కూడా ఇచ్చామని చెప్పారు. ఇవన్నీ కలిపితే ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాను వెళ్లగొట్టేందుకు జరిగే పోరులో ఉక్రెయిన్ పైచేయిగా నిలుస్తుందన్నారు. శాంతి చర్చల్లోనూ ఆ దేశం పటిష్ట స్థానంలో ఉంటుదన్నారు. ఇలా ఉండగా, బుధ, గురువారాల్లో రష్యా కాలిబర్ క్రూయిజ్ మిస్సైళ్ల దాడిలో ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిందని అధికారులు చెప్పారు.. కనీసం ఏడుగురు చనిపోగా, మరో 33 మంది గాయపడ్డారు. దాడుల్లో 22 బహుళ అంతస్తుల భవనాలు, 12 ప్రైవేట్ ఇళ్లు, ఇతర నివాస భవనాలు దెబ్బతిన్నాయి. -
తవాంగ్ ఘర్షణ: ‘ఫైటర్ జెట్స్’ను రంగంలోకి దింపిన భారత్
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల నడుమ ఈనెల 9న ఘర్షణ తెలెత్తి మరోమారు సరిహద్దు వివాదంరాజుకుంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దుల్లో యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా గగనతల విహారం పెరిగినట్లు గుర్తించిన క్రమంలో ఈ మేరకు భారత్ అప్రమత్తమైనట్లు పేర్కొన్నాయి. చైనా బలగాలను తిప్పికొట్టేందుకు ఇటీవల రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఫైటర్ జెట్స్ గస్తీ పెంచినట్లు వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలో చైనా గగనతల కార్యకలాపాలు పెరిగిన క్రమంలో గగనతల పెట్రోలింగ్ పెంచినట్లు భారత వైమానిక దళ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. సరిహద్దులో తాజా ఉద్రిక్తతలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పార్లమెంట్లో కీలక ప్రకటన చేయనున్నారు. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: ఇండో-చైనా సైనికుల ఘర్షణపై రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష -
Woman combat pilot: ఫస్ట్ టైమ్ అభిలాష నెరవేరింది
చిన్నప్పుడు అభిలాషకు తండ్రి కథలు చెప్పేవాడు. అవి కాలక్షేప కథలు, కంచికి వెళ్లే కథలు కావు. మన వీరసైనికుల నిజమైన జీవిత కథలు. ఆ కథలు వింటూ పెరిగిన అభిలాష భారత సైన్యంలో పనిచేయాలని గట్టిగా అనుకుంది. తాజాగా ‘ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమన్ కంబాట్ ఏవియేటర్’గా చారిత్రక గుర్తింపు పొందింది కెప్టెన్ అభిలాష బరాక్. అభిలాష బరాక్కు మిలిటరీ అనే మాట కొత్త కాదు. నాన్న ఓమ్‌సింగ్ సైనిక అధికారి. దీంతో దేశంలోని రకరకాల కంటోన్మెంట్లలో పెరిగింది అభిలాష. సైనికుల వీరగాథలను తండ్రి స్ఫూర్తిదాయకంగా చెబుతుండేవాడు. ఆ ప్రభావం తన మీద పడింది. అలా మిలిటరీలో పనిచేయాలనే కలకు అంకురార్పణ జరిగింది. ఒకరోజు ఇండియన్ మిలిటరీ అకాడమీలో తన సోదరుడి పాసింగ్ ఔట్ పరేడ్‌కు హాజరైంది అభిలాష. ఆ వాతావరణం తనను ఎంత ఉత్తేజపరిచింది అంటే...పనిచేస్తే మిలిటరీలోనే పనిచేయాలన్నంతగా. ‘మిలిటరీ యూనిఫామ్’లో తనను తాను చూసుకొని మురిసిపోవాలనుకునేంతగా! ‘నా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసుకున్న రోజు అది’ అని గతాన్ని గుర్తు చేసుకుంది అభిలాష. దిల్లీ టెక్నాలజికల్ యూనివర్శిటీలో బీటెక్ పూర్తిచేసిన అభిలాష 2018లో ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాప్స్’లో చేరింది. దీనికి ముందు కొన్ని ప్రొఫెషనల్ మిలిటరీ కోర్స్‌లు పూర్తిచేసింది. ‘ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు ఇది. కంబాట్ ఏవియేషన్ కోర్స్ విజయవంతంగా పూర్తి చేసిన కెప్టెన్ అభిలాష ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమన్ కంబాట్ ఏవియేటర్...’ అని ఆర్మీ తన అధికార ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలియజేసింది. ప్రత్యేక విధులు నిర్వర్తించే దళంగా ప్రసిద్ధమైన ఏవియేషన్ కాప్స్‌కు ఉన్న ఘనచరిత్ర తక్కువేమీ కాదు. రుద్ర, చీతా, ధృవ...మొదలైన హెలికాప్టర్లను ఆపరేట్ చేయడంతో పాటు సియాచిన్‌లాంటి సున్నిత ప్రాంతాలలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంది. ‘రెట్టించిన అంకితభావంతో పనిచేయడానికి తాజా బాధ్యత ప్రేరణ ఇస్తుంది’ అంటుంది హరియాణాకు చెందిన 26 సంవత్సరాల అభిలాష ‘స్విఫ్ట్ అండ్ ష్యూర్’ అనేది మన సైన్యానికి సంబంధించిన లక్ష్య ప్రకటిత నినాదం. ఈ నినాదాన్ని వేగంగా అందుకున్న యువ సైనికులలో అభిలాష ఒకరు. ఆమెకు అభినందనలు. -
45 రోజుల్లో ఏడంతస్తుల భవనం
సాక్షి, బెంగళూరు: యుద్ధ విమానాల (అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఏఎంసీఏ) తయారీ కోసం బెంగళూరులో డీఆర్డీఓ 1.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఏడంతస్తుల భవనాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గురువారం ప్రారంభించారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో డీఆర్డీఓ సొంతంగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో కేవలం 45 రోజుల్లో విమాన నియంత్రణ వ్యవస్థకు సంబంధించిన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐదో తరం మీడియం వెయిట్ డీప్ పెన్ట్రేషన్ ఫైటర్ జెట్‌కు అవసరమైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సదుపాయాలు ఇందులో ఉన్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. దేశ వైమానిక సామర్థ్యం మరింత పెంచేందుకు ఈ ఫైటర్ జెట్ అభివృద్ధి పథకం ఉపయోగపడుతుందన్నారు. ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.15 వేల కోట్లని తెలిపారు. ప్రధాని నేతృత్వంలోని భద్రతావ్యవహారాల కేబినెట్ కమిటీ త్వరలోనే దీనికి ఆమోదం తెలపనుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీఎం బసవరాజ్ బొమ్మై, డీఆర్డీఓ చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ భవనానికి 2021 నవంబర్ 22వ తేదీన శంకుస్థాపన జరగ్గా ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన వాస్తవ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని అధికారులు చెప్పారు. సంప్రదాయ, ప్రీ ఇంజినీర్డ్ ప్రీ కాస్ట్ మెథడాలజీతో రికార్డు స్థాయిలో 45 రోజుల్లోనే డీఆర్డీవో ఈ భవనాన్ని నిర్మించిందని తెలిపారు. ఐఐటీ రూర్కీ, ఐఐటీ మద్రాస్‌కు చెందిన నిపుణులు డిజైన్‌కు సంబంధించి సహకారం అందించారన్నారు. -
విశాఖ సిగలో సీ'హారియర్'
ఒకవైపు కురుసుర సబ్‌మెరైన్.. మరోవైపు టీయూ 142 ఎయిర్‌క్రాఫ్ట్.. విశాఖ సుందరి మెడలో కంఠాభరణం లాంటి బీచ్‌రోడ్డులో కలికితురాళ్లుగా నిలుస్తున్నాయి. ఇప్పుడు వాటి సరసన సీ హారియర్ యుద్ధ విమానం చేరబోతోంది.నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ హంస విమానవాహక యుద్ధనౌకలో గోవా కేంద్రంగా సుదీర్ఘ సేవలందించిన ఈ విమానం 2016లో విశ్రమించింది. ఇప్పుడు దాన్ని విశాఖ తీసుకొచ్చారు. టీయూ 142 యుద్ధ విమాన మూజియం పక్కనే దీన్నీ మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. సాక్షి, విశాఖపట్నం: సుందర సాగరతీరంలో మరో యుద్ధ విమానం కొలువుదీరనుంది. ఇప్పటికే ఆర్కే బీచ్‌లో టీయూ–142 ఎయిర్‌క్రాఫ్ట్ సందర్శకులను ఎంతగానో అలరిస్తోంది. కురుసుర జలాంతర్గామి సందర్శకుల మనసు దోచుకుంటోంది. సాగరతీరానికి అదనపు ఆభరణంలా ఇప్పుడు సీ హారియర్ యుద్ధ విమానం సన్నద్ధమవుతోంది. 1983లో బ్రిటిష్ ఏరోస్పేస్ నుంచి కొనుగోలు చేసిన ఈ సీ హారియర్ నౌకాదళం ఏవియేషన్ విభాగంలో చేరింది. గోవాలోని ఐఎన్ఎస్ హంస యుద్ధనౌకలో 32 ఏళ్ల పాటు దేశానికి సేవలందించింది. 2016లో సేవల నుంచి నిష్క్రమించింది. ఈ యుద్ద విమానాన్ని వీఎంఆర్డీఏ విశాఖపట్నం సాగరతీరంలో మ్యూజియంగా ఏర్పాటు చేయాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వీఎంఆర్డీఏ ఇంజినీర్లు ఈ విమానాన్ని గోవా నుంచి మంగళవారం లారీపై తీసుకొచ్చారు. ప్రస్తుతం దీనిని టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు. త్వరలో అక్కడకు సమీపంలోని రాజీవ్ స్మృతిభవన్‌లో మ్యూజియంగా ఏర్పాటు చేయనున్నారు. మరో ఆరు నెలల్లో ఈ సీ హారియర్ యుద్ధ విమాన మ్యూజియంను అందుబాటులోకి తేవడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాగరతీరంలో సీ హారియర్, ఇంటిగ్రెటెడ్ మ్యూజియం, అండర్‌గ్రౌండ్ పార్కింగ్‌కు రూ.80 కోట్ల అంచనా వ్యయంతో వీఎంఆర్డీఏ, టూరిజం, స్మార్ట్ సిటీ నిధులను వెచ్చిస్తున్నారు. త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామని వీఎంఆర్డీఏ కమిషనర్ పి.బసంత్‌కుమార్ తెలిపారు. -
ఆమె భౌతికాయాన్ని చూసి ఈ దేశం తట్టుకోగలదా?
‘‘యుద్ధం చేస్తూ మహిళ చనిపోతే, గుడ్డల్లో చుట్టి తెచ్చిన ఆమె మృతదేహాన్ని చూసేందుకు మన దేశం సిద్ధంగా ఉందా? ఫ్రంట్‌లైన్ కంబాట్‌లోకి మహిళల్ని తీసుకోవడం నాకు ఇష్టమే. అలాగని ఆర్మీకి ఇష్టం లేదని కాదు. కొన్ని చెయ్యలేం’’.. అన్నది మన ఆర్మీ చీఫ్ మనసులోని మాట. నిజమే, చెయ్యలేకపోవచ్చు. కానీ చెయ్యగలిగినప్పుడే ‘చెయ్యగలం’ అని చెప్పి ఉండాల్సింది. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ భారత సైన్యంలోకి వచ్చి ఈ డిసెంబర్ 16కి సరిగ్గా నలభై ఏళ్లు. ఇప్పుడు ఆయన జనరల్. ఆర్మీలో చేరినప్పుడు సోల్జర్. ఆర్మీ చీఫ్‌ల పదవీ కాలం మూడేళ్లు. మూడేళ్లకు ముందే వాళ్లకు 62 ఏళ్ల వయసు నిండితే కనుక ముందే పదవీ విరమణ చెయ్యవలసి ఉంటుంది. 2016 డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు రావత్. ఇంకో ఏడాదికి గానీ ఆయన పదవీకాలం పూర్తవదు. ఆ తర్వాత కూడా ఆర్మీలో సేవలు అందించడానికి వయసు రీత్యా ఆయనకు ఇంకో రెండేళ్లు అవకాశం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎంపిక చేసుకుని మరీ రావత్‌ని తెచ్చుకున్నారు. తన పదవీ కాలం నిండే వరకు ఆర్మీ చీఫ్.. చైర్లోంచి లేవకూడదని! రావత్ ఆర్మీ చీఫ్ అవడానికి రెండున్నర నెలల ముందే నియంత్రణ రేఖ దగ్గర ‘సర్జికల్ స్ట్రయిక్స్’ జరిగాయి. ఆ సమయంలో రావత్ వైస్ చీఫ్‌గా ఉన్నారు. భారత్ మీద పాక్ ‘ప్రాక్సీ వార్’ జరుపుతున్న ప్రస్తుత కీలక తరుణంలో రావత్ కూడా మోదీ అంతటి వారే అనుకోవాలి. అంత మాత్రాన రావత్.. జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి లేదు. మోదీలా ‘మన్ కీ బాత్’ని చెప్పడానికీ లేదు. ఏదైనా లోపలే ఉంచుకోవాలి. లేదంటే రిటైర్ అయ్యేంత వరకు ఆగి, అప్పుడు బయట పెట్టుకోవాలి. నలభై ఏళ్ల సర్వీసులో ఏడు యుద్ధాలను చూసిన రావత్‌కు ఈ సంగతి తెలియకుండా ఉంటుందా? అయినప్పటికీ ఆయన తన ఉద్దేశాలను దాచుకోలేకపోయారు! ఆర్మీలో ‘ఫ్రంట్‌లైన్ కంబాట్’లోకి మహిళల్ని తీసుకోలేమని చెబుతూ, అందుకు ఆయన చూపిన కారణాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ‘ఆయన ఆ పదవికి తగనివారు’ అని ట్రోలింగ్ మొదలైంది. ఫ్రంట్‌లైన్ కంబాట్ అంటే.. ప్రత్యక్ష యుద్ధక్షేత్రం. శత్రువు యుద్ధట్యాంకు పేలిస్తే ముందుగా గాలిలోకి ఎగిరిపడే దేహాలు ఫ్రంట్‌లైన్ కంబాట్‌లో ఉన్నవాళ్లవే. బందీగా శత్రువు చేతికి చిక్కే ప్రమాదం ఉండేది ఫ్రంట్‌లైన్ కంబాట్‌లో ఉన్నవాళ్లకే. అందుకే మహిళల్ని కంబాట్‌లోకి తీసుకోలేమని రావత్ చెప్పారు. చెప్పి, అక్కడితో ఆగి ఉంటే కొంత నయంగా ఉండేది. తన మనసులోని భయాలన్నీ బయట పెట్టేసుకున్నారు. ‘‘ప్రాక్సీ – వార్ (దొంగ దాడి) నడుస్తున్నప్పుడు మహిళల్ని యుద్ధవిధుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. అయినా మహిళల్ని తీసుకోకుండా ఏమీ లేము. మందుపాతర్లని ఏర్పాటు చేయడానికి, ఏరిపారేయడానికి మన దగ్గర మహిళా ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. ప్రతిభ, నైపుణ్యం అవసరమైన మిగతా ముఖ్య విభాగాల్లోనూ మహిళలు ఉన్నారు. ఒక్క యుద్ధవిధుల్లోకే వారిని తీసుకోవడం లేదు. తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి. ఫ్రంట్లైన్లో మహిళా అధికారిని కమాండర్‌గా పెడితే ఆమె కింద ఉన్న మగ సోల్జర్లు ఆమె మాట వినకపోవచ్చు. ఎందుకంటే వారంతా గ్రామాల నుంచి వచ్చినవారు. ఆడమనిషి చెబితే చెయ్యడం ఏంటనే భావన వారిలో ఉంటుంది. మరో సమస్య.. మహిళలు బట్టలు మార్చుకునేటప్పుడు వస్తుంది. మగవాళ్లు చూస్తున్నారని కంప్లైంట్ చేస్తారు వాళ్లు. విశ్రమ, విరామాలలోనూ మహిళలకు వేరుగా గుడారం వెయ్యాలి. గుడారం చుట్టూ గుడ్డ కప్పాలి. ఇక అత్యవసర సమయాల్లో ఆరు నెలలు మెటర్నిటీ లీవు ఇవ్వడానికి ఉండదు. ఇవ్వనందుకు రాద్ధాంతం అవుతుంది. ఇవన్నీ కాదు.. యుద్ధంలో మహిళా కమాండర్ చనిపోతే, గుడ్డల్లో చుట్టి తెచ్చిన ఆమె భౌతికాయాన్ని చూసి ఈ దేశం తట్టుకోగలదా? ఫ్రంట్‌లైన్ కంబాట్‌లోకి మహిళల్ని తీసుకోవడం నాకు ఇష్టమే. అలాగని ఆర్మీకి ఇష్టం లేదని కాదు. కొన్ని చెయ్యలేం’’ అన్నారు రావత్. ఇదంతా ఏకబిగిన చెప్పుకుంటూ రాలేదు ఆయన. సి.ఎన్.ఎన్. న్యూస్ 18 చానల్ సీనియర్ ఎడిటర్ శ్రేయా దౌండియాల్‌తో సంభాషణలో ఆమె ప్రశ్నలకు సమాధానంగా మాత్రమే చెప్పారు. ఆయనేం ఆమెను పిలిచి ఇవన్నీ మాట్లాడలేదు. ఆమె వచ్చి అడిగితే మనసు విప్పారు. అదీ తన ఆఫీస్‌లో కాదు. పిచ్చాపాటీగా, పచ్చిక బయళ్లలో! పూర్తి ఇంటర్వ్యూలో ఇది కొంతభాగం మాత్రమే. మిగతా విషయాలు గాల్లో కొట్టుకుపోయాయి. కంబాట్‌లోకి ఆడవాళ్లను తీసుకోవడంపై ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రం వాయుగుండం అయ్యాయి. అందులోనూ.. ‘బట్టలు మార్చుకోడానికి ఇబ్బంది’ అవుతుంది అనే పాయింట్ చుట్టూ సిటిజన్స్ ప్రదక్షిణ చేస్తున్నారు. ‘దేశం పరువు తీసేశాడు రావత్’ అని విరుచుకు పడుతున్నారు. కొన్నాళ్ల క్రితం కూడా రావత్ పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ ‘పాసింగ్ అవుట్ పరేడ్’లో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ, ‘మహిళల్ని యుద్ధక్షేత్రంలోకి తీసుకోడానికి ఇప్పటికైతే ఆర్మీ సిద్ధంగా లేదు. పాశ్చాత్య దేశాలతో మనం పోల్చుకోకూడదు. వాళ్లు ఓపెన్ ఉంటారు’ అన్నారు. కానీ అవకాశం వస్తే ఫ్రంట్‌లైన్ కంబాట్‌లోకి వెళ్లేందుకు యువతులు సిద్ధంగా ఉన్నారన్నది నిజం. అంటే వాళ్లు ఓపెన్ గానే ఉన్నారు. ఆర్మీనే ఓపెన్ అవ్వాలి. ఒకవేళ ఆర్మీ ఓపెన్‌గా లేకపోయినా, పనిగట్టుకుని ఓపెన్‌గా లేమన్న విషయాన్ని చెప్పాల్సిన సమయం, సందర్భం ఏముంటుందని?! ఓపెన్ అయినప్పుడే ఓపెన్ అయ్యాం అని చెబితే సరిపోదా?దేశ రక్షణదళంలోని అత్యున్నత స్థానాలలో ఉన్నవారు దేశ రహస్యాలను దాచినట్లే వ్యక్తిగత అభిప్రాయాలను దాచుకోలేకపోతే జాతిని ఉద్దేశించి ప్రసంగించినట్లే. అది ప్రమాదం. మీడియా ప్రతినిధులు కూడా జాతిని ఉద్దేశించి ప్రసారం చేస్తున్నామేమో గమనించుకోవాలి. రావత్ మాట్లాడితే మాట్లాడారు, ఆ రెండు ముక్కల్ని మీడియా బహిర్గతం చేయకపోతే దేశ ప్రజలకు వచ్చే నష్టం ఏముంటుంది? చేస్తే వచ్చిన లాభం ఏముంది? - మాధవ్ శింగరాజు -
పదునెక్కిన మిగ్–29
అదంపూర్ (జలంధర్): భారత వాయుసేన (ఐఏఎఫ్) అమ్ములపొదిలో ఉన్న పాత ఎంఐజీ–29 యుద్ధ విమానం ఆధునిక యుద్ధా లకు తగ్గట్టుగా పదునెక్కింది. ఈ ప్రతిష్టాత్మక యుద్ధ విమనాలకు నూతన సాంకేతికత జోడించి పలు ప్రత్యేకతలతో అభివృద్ధి చేసినట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త ఎంఐజీ–29 యుద్ధ విమానాల శక్తి సామర్థ్యాలను గతవారమే అదం పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో విజయ వంతంగా పరీక్షించినట్లు అదంపూర్ ఫ్లైట్ లెఫ్టినెంట్ కరన్ కోహ్లి పేర్కొన్నారు. సోమ వారం వైమానిక దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఐఏఎఫ్‌కు ఇది తీపీ కబురే. కొత్త ఎంఐజీ–29 ప్రత్యేకతలివీ... ► గాల్లోనే ఇంధనం నింపుకోవచ్చు. ► అత్యంత వేగంతో నిట్టనిలువుగా టేకాఫ్ తీసుకుని 5 నిమిషాల్లోనే క్షిపణులతో విరుచుకుపడి శత్రు విమానాన్ని ధ్వంసం చేయగలదు. ► పాత దానితో పోల్చితే ఎక్కువ దూరంలో ఉన్న శత్రువును కూడా గుర్తించి సమర్థవంతంగా నాశనం చేయగలదు. ► దీనిలో ఉన్న మల్టీ ఫంక్షనల్ డిస్ప్లేలో ఏ వైపు నుంచి శత్రు విమానం వస్తుందో పైలట్ స్పష్టంగా కనబడుతుంది. దీంతో కావాల్సిన దిశలో పైలట్ క్షిపణులను ప్రయోగించగలడు. ► ఏ వైపు నుంచైనా క్షిపణులను ప్రయోగించగల సౌకర్యం దీనిలో ఉంది ఎప్పుడొచ్చింది ఈ మిగ్–29.. ఈ ఎంఐజీ–29 యుద్ధవిమానాల్ని రష్యా తయారు చేస్తుంది. యుద్ధాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలనే వ్యూహంతో 1980ల్లోనే యుద్ధప్రాతి పదికన పాత ఎంఐజీ–29 యుద్ధ విమానా లను భారత్ కొనుగోలు చేసిందని, ఇవి అత్యవసర సమయాల్లో దేశాన్ని రక్షించ డంలో ముఖ్య భూమిక పోషించాయని ఓ అధికారి చెప్పారు. ఈ విమానాలే 1999 కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషించా యన్నారు. ప్రభుత్వం 42 ఐఏఎఫ్ దళాలకు యుద్ధవిమానాలు మంజూరు చేసినా 31 దళాలకే విమానాలున్నాయి. -
నౌకాదళ తేజస్ పరీక్ష సక్సెస్
బెంగళూరు / న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ నౌకాదళ వెర్షన్‌ను అధికారులు గురువారం విజయవంతంగా పరీక్షించారు. యుద్ధవాహక నౌక నుంచి టేకాఫ్ కావడం, ఆతర్వాత హుక్ వ్యవస్థ సాయంతో సురక్షితంగా ల్యాండ్ కావడం వంటి పరీక్షల్ని పూర్తిచేశారు. దీంతో ఈ సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా, యూరప్‌ల సరసన భారత్ చేరింది. యుద్ధ విమానం నౌకపై దిగే సమయంలో దాని వేగాన్ని అదుపు చేయడానికి ఉండే ‘అరెస్టర్ హుక్ సిస్టమ్’ను కూడా ఈ సందర్భంగా విజయవంతంగా పరీక్షించారు. రాబోయే రోజుల్లో ల్యాండింగ్, ఇంధనం నింపే విషయంలో తేజస్‌కు మరిన్ని ట్రయల్స్ నిర్వహిస్తామని నేవీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత వాయుసేన(ఐఏఎఫ్) ఇప్పటికే 40 తేజస్ యుద్ధ విమానాల కోసం హెచ్ఏఎల్కు ఆర్డర్ ఇచ్చారు. -
భారత్‌కు ఫైటర్లు : ముందంజలో బోయింగ్
న్యూయార్క్ : పెద్ద మొత్తంలో యుద్ద విమానాల కొనుగోలుకై భారత్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. యుద్ద విమానాల కొనుగోలుకు సంబంధించి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డీల్ కావడంతో.. దీనిని దక్కించుకోవడానికి అనేక సంస్థలు పోటీపడుతున్నాయి. కాగా ఈ ప్రాజెక్టును తామే సొంతం చేసుకుంటామని ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ సీనియర్ అధికారి ఒకరు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ఖరారైతే వచ్చే రెండేళ్లలోనే తాము భారత్‌కు కావాల్సిన యుద్ద విమానాలను అందిస్తామని పేర్కొన్నారు. బోయింగ్ డిఫెన్స్ సెల్స్ ఉపాధ్యక్షుడు జీన్ కన్నింగ్హమ్ కూడా భారత వైమానిక దళానికి 110 ఫైటర్ జెట్స్ అందించేందుకు జరుగుతున్న టెండర్ ప్రక్రియలో తాము ముందు వరుసలో ఉన్నట్టు పేర్కొన్నారు. సింగపూర్‌లో జరిగిన ఓ సదస్సులో మాట్లాడిన ఆయన.. తమకు భారత మార్కెట్‌పై పూర్తి అవగాహన ఉందన్నారు. ఇప్పటికే భారత నావికా దళానికి 57 ఫైటర్ జెట్స్‌ను సరఫరా చేసేందుకు నిర్వహించిన ప్రక్రియలో తమ సంస్థ తుది జాబితాలో చోటు దక్కించుకుందని తెలిపారు. భారత్ ప్రతిపాదించిన 110 యుద్ధ విమానాల తయారీ అంచనా వ్యయం 15 బిలియన్ డాలర్లు. ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్ ఫైటర్ల తయారీకి దేశీయ సంస్థలైన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, మహీంద్ర డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్‌తో కలసి పనిచేస్తామని గత ఏప్రిల్‌లోనే బోయింగ్ తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు బోయింగ్, స్వీడన్‌కు చెందిన సాబ్‌తోపాటు ఇతర సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. -
సుఖోయ్‌లో ప్రయాణించిన సీతారామన్
జోధ్‌పూర్: రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(57) బుధవారం రెండు సీటర్ల సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధవిమానంలో ప్రయాణించారు. ఆలివ్ రంగు యాంటీ గ్రావిటీ సూట్ ధరించిన సీతారామన్.. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో ఐఏఎఫ్ పైలెట్‌తో కలిసి 45 నిమిషాల సేపు ఆకాశంలో విహరించారు. దీంతో సుఖోయ్‌లో ప్రయాణించిన తొలి మహిళా రక్షణ మంత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు. సుఖోయ్‌లో ప్రయాణించిన తర్వాత సీతారామన్ మాట్లాడుతూ ఈ ప్రయాణం చిరస్మరణీయమైన అనుభవమని వ్యాఖ్యానించారు. ఈ ప్రయాణానికి ముందు ఐఏఎఫ్ ఎయిర్‌బేస్ నిర్వహణ, యుద్ధ సన్నద్ధతపై ఆమె సమీక్ష నిర్వహించారు. అనంతరం సుఖోయ్ ప్రయాణంతో పాటు కాక్‌పిట్ పరిస్థితులపై అధికారులు మంత్రికి వివరించారు. సీతారామన్ కంటే ముందు మాజీ రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్ కలామ్ 2003లో, ప్రతిభా పాటిల్ 2009లో సుఖోయ్‌లో ప్రయాణించారు. సీతారామన్ కంటే ముందు 2003లో అప్పటి రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ సుఖోయ్–30 విమానంలో చక్కర్లు కొట్టారు. రక్షణమంత్రి ప్రయాణించిన విమానం 8 వేల మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ ధ్వని వేగాన్ని అధిగమించిందని ఓ ఐఏఎఫ్ అధికారి తెలిపారు. ‘ ఈ ప్రయాణంలో ఎవరెస్ట్ శిఖరమంత(8,848 మీటర్ల) ఎత్తుకు చేరుకోవడంతో పాటు ధ్వని వేగాన్ని అధిగమించడం మన పైలెట్లకున్న సామర్థ్యాన్ని తెలియజేస్తోంది’ అని సీతారామన్ వ్యాఖ్యానించారు. -
‘తేజస్’ అద్భుతం: సింగపూర్ మంత్రి
కలైకుండ: దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అద్భుతంగా ఉందని సింగపూర్ రక్షణ మంత్రి జీ ఇంగ్ హెన్ మంగళవారం కితాబిచ్చారు. ఇది అత్యంత సమర్థవంతమైన యుద్ధ విమానమని ఆయన కొనియాడారు. పశ్చిమబెంగాల్లోని కలైకుండ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ఆయన.. ఎయిర్ వైస్ మార్షల్ ఏపీ సింగ్‌తో కలసి తేజస్ విమానంలో చక్కర్లు కొట్టారు. ఆ తర్వాత మాట్లాడుతూ భారత వాయుసేనలోని పైలట్లకు నైపుణ్యంలో కొదవలేదనీ, అలాగే విమానాలు కూడా చాలా బాగున్నాయని హెన్ ప్రశంసించారు. అందుకే తమ సైనికులకు భారత వాయుసేనతో కలసి శిక్షణనిస్తున్నామన్నారు. తేజస్‌లో కూర్చుంటే విమానంలో కాకుండా ఏదో కారులో వెళ్తున్నట్లుగా ఉందని హెన్ ప్రశంసించారు. హెన్ బుధవారం రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఢిల్లీలో కలవనున్నారు. -
ఫ్యామిలీ 2015
365 రోజులు. అంటే ఎన్నో గంటలు. ఇంకెన్నో నిమిషాలు. లెక్కపెట్టలేనన్ని సెకండ్లు. అంతకంటే లెక్కలేనన్ని ఆవిష్కారాలు... జయాలు... అపజయాలు... కలగలిస్తే 2015. ఒక్కసారి చేయి కదిలిస్తే దాని వల్ల కదలిన గాలి... కొన్నేళ్ల తర్వాత తుపానుగా మారుతుందని ఒక మహాశయుడు చెప్పాడు. ఈ ఏడాదిలో జరిగిన ప్రతి చిన్న ఘటన... అలాగే ఎదిగి పెద్ద అలై ఈ ప్రపంచ స్వభావాన్ని మారుస్తుంది. మనమందరం మంచే కోరుకుంటాం. మంచే జరగాలని ప్రార్థిస్తాం. అవసరమైతే పోరాడతాం. 2015లో అలాంటి జయాలు, అపజయాలు కొన్ని మీ కోసం... మరింత రక్షణ షీ క్యాబ్స్ మహిళల భద్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ క్యాబ్స్ సేవలు హైదరా బాద్‌లో ప్రారంభం అయ్యాయి. జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన షీ క్యాబ్స్‌ను పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానం చేశారు. దాని వల్ల క్యాబ్‌ల కదలికలు ఎప్పటికప్పుడు ఈ కేంద్రంలో నమోదు అవుతాయి. సెప్టెంబర్ 8న ‘షీ క్యాబ్స్’ ప్రారంభం అయ్యాయి. మరింత న్యాయం కట్నం ఎప్పుడు అడిగినా నేరమే! వరకట్నం అనేది ఎప్పుడైనా అడిగే అవకాశముందని, పెళ్లి తర్వాత అడిగినా అది నేరమేనని ఓ కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భార్యకు విషమిచ్చి, కాల్చి చంపిన కేసులో ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ వ్యక్తికి కింది కోర్టు గతంలో విధించిన జీవితఖైదును సుప్రీంకోర్టు సమర్థించింది. పెళ్లికి ముందు తాను ఎలాంటి కట్నం అడగలేదని, పెళ్లి తర్వాతే అడిగినందున దానిని పరిగణనలోకి తీసుకోరాదని భీమ్‌సింగ్ అనే వ్యక్తి చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తులు ఎం.వై.ఇక్బాల్, పినాకీ చంద్రఘోష్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. మరింత తెగువ యుద్ధ విమానాల పైలట్లు దేశంలోని సైనిక దళాల్లో నేరుగా యుద్ధక్షేత్రంలో పనిచేసే విభాగాల్లో మహిళా పైలట్లను నియమిస్తామని అక్టోబర్ 24న రక్షణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం వైమానిక దళ అకాడమీలో శిక్షణ పొందుతున్న బ్యాచ్‌లోంచి తొలి మహిళాయుద్ధ విమాన పైలట్లను కేంద్రం ఎంపిక చేస్తుంది. 2017 జూన్ నాటికి వారికి పూర్తిస్థాయిలో పైలట్ బాధ్యతలు అప్పగిస్తారు. ముందడుగు హర్యానాలో 21 మహిళా పోలీస్ స్టేషన్లు మహిళలకు మరింత భద్రత కల్పించే చర్యలో భాగంలో హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం 21 జిల్లాలో పూర్తిగా మహిళా సిబ్బందితో పనిచేసే పోలీస్స్టేషన్లను ఆగస్టు 28న ప్రారంభించింది. ఈ స్టేషన్లలో స్త్రీలకు సబంధించిన వివిధ నేరాలు, కేసుల దర్యాప్తును మహిళా పోలీసులే నిర్వర్తిస్తారు. మేలిమి సంతకం నీతి ఆయోగ్ సీఈవో గా సింధుశ్రీ ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటు అయిన ‘నీతి ఆయోగ్’ (భారత జాతీయ పరివర్తన సంస్థ)కు సీఈవోగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి సింధుశ్రీ ఖుల్లర్ నియమితులయ్యారు. సింధుశ్రీని నియమించినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ జనవరి 10న వెల్లడించింది. అప్పటివరకు ఆమె ప్రణాళికా సంఘం కార్యదర్శిగా పని చేశారు. ఐరాస శాంతిస్థాపన ప్యానెల్లో సరస్వతీ మీనన్ ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ బాన్‌కీ మూన్.. శాంతి స్థాపన కార్యక్రమాల సమీక్ష ప్యానల్లో భారత సామాజికవేత్త సరస్వతీ మీనన్‌ను నియమించారు. ఈ నియామకం ఐరాస జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి ఆమోదించిన నిబంధనలకు అనుగుణంగా జరిగింది. ప్యానెల్లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. ఈ సలహా బృందం బురుండీ, దక్షిణ సూడాన్ తదితర దేశాల్లో పర్యటించి, శాంతిస్థాపన చర్యలను సమీక్షిస్తుంది. అమెరికా విద్యామండలి అధిపతిగా భారతీయ మహిళ అమెరికా విద్యామండలి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల ఛైర్‌పర్సన్‌గా భారతీయ అమెరికన్ మహిళ రేణూ కట్టర్ ఎన్నికయ్యారు. మార్చి16న వాషింగ్టన్లో జరిగిన విద్యామండలి 97వ వార్షిక సమావేశంలో ఆమెను ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రేణు 2008 నుంచి యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. మరెన్నో నవ్వులు బేటీ బచావో.. బేటీ పఢావో బాలికా సంక్షేమం, లింగ వివక్ష నిర్మూలన లక్ష్యాలుగా ‘బేటీ బచావో బేటీ పఢావో’ (ఆడపిల్లల్ని కాపాడండి... ఆడపిల్లల్ని చదవించండి) ప్రచార ఉద్యమాన్ని హరియాణలోని పానిపట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 22న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలికలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ‘సుకన్య సమృద్ధి యోజన’నను మోదీ ప్రారంభించారు. దీనిని బాలికలు తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఇది పదేళ్ల లోపు బాలికలకు ఎక్కువ వడ్డీ (9.1శాతం), ఆదాయపు పన్ను రాయితీ లభించే డిపాజిట్ పథకం. పుట్టినప్పటి నుంచి పదేళ్ల లోపు కనీసం వెయ్యి రూపాయల డిపాజిట్‌తో బ్యాంకుల్లోగానీ, పోస్టాఫీసుల్లోగానీ అకౌంట్ ప్రారంభించవచ్చు. అందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 1.5 లక్షల రూపాయలను డిపాజిట్ చెయ్యొచ్చు. ప్రారంభించిన నాటి నుంచి 21 ఏళ్లపాటు లేదా ఆ బాలికకు వివాహం అయ్యేంత వరకు ఆ అకౌంట్ క్రియాశీలంగా ఉంటుంది. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువుల కోసం పాక్షికంగా డబ్బును తీసుకోవచ్చు. మనో ధైర్యం మూడు మంచి ఆలోచనలు హిమ్మత్: మహిళల భద్రత కోసం ‘హిమ్మత్’అనే మొబైల్ అప్లికేషన్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జనవరి 1న ఢిల్లీలో ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను రూపొందించారు. మహిళలు అత్యవసర పరిస్థితిలో వీలైనంత త్వరగా పోలీసులను అప్రమత్తం చేయడానికి ఇది పనికొస్తుంది. అభయం: ఆపదలో చిక్కుకున్నవారిని ఆదుకునేందుకు ఏపీ పోలీసులు ‘అభయం’ అనే నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దీని కింద టోల్ ఫ్రీ నెంబర్ 040-7101-1800ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా మిస్డ్‌కాల్ ఇచ్చిన రెండు నిమిషాల్లోనే బాధితులకు ఆపన్నహస్తం అందుతుంది. ఆరోగ్యలక్ష్మి: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనం అందించే కార్యక్రమాన్ని నూతన సంవత్సర కానుకగా తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ‘ఆరోగ్యలక్ష్మి’గా నామకరణం చేశారు. శిశు వికాసం ప్రతి నెలా టీకాల వారం వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతి చిన్నారికీ టీకాలు అందేలా మిషన్ ఇంద్రధనుష్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్చి 23న ఢిల్లీలో ప్రారంభించింది. ఈ ఏడాది తొలి విడతలో దేశవ్యాప్తంగా 201 జిల్లాల్లో ఈ సంపూర్ణ టీకా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో తెలంగాణ నుంచి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలను, ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణ, కర్నూలు, విశాఖపట్నం జిల్లాలను ఎంపిక చేశారు. బుజ్జి అడుగు శిఖరంపై చిచ్చర పిడుగులు ఇద్దరు భారత చిన్నారుల అరుదైన రికార్డును నెలకొల్పారు. పిన్న వయసులో ఎవరెస్టు శిఖరం బేస్ క్యాంప్‌ను అధిరోహించిన వారిగా రికార్డుల కెక్కారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన కందర్ప్ శర్మ, రిత్విక 5380 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్టు శిఖరం బేస్‌క్యాంపు వద్దకు ఆగస్టు 10న చేరుకున్నారు. కందర్ప్ వయసు 5 ఏళ్ల 10 నెలలు. రిత్విక వయసు 8 ఏళ్ల 11నెలలు. ఆగస్టు 2న వీరు ప్రయాణం మొదలు పెట్టారు. మహా విజయం ప్రపంచ నెంబర్ వన్ సైనా నెహ్వాల్ హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మహిళల విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే 1980లో నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్నారు. మరువలేని విషాదం విలవిలలాడిన పసిప్రాణం విజయవాడ కృష్ణలంకలో నివసిస్తున్న చావలి నాగ చిరుద్యోగి. బట్టల షాపులో గుమస్తా. భార్య లక్ష్మి రెండో కాన్పుకు సిద్ధమైంది. ఆగస్టు 17న మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ పుట్టుకతోనే ఆ పసికందులో అసాధారణ శారీరక సమస్య... కన్జెనిటల్ ఎనామలీ కనిపించింది. వైద్యులు చూసి శస్త్ర చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారు. అదొక నరకమనీ, యమభటులు అక్కడ ఎలుకల రూపంలో తిరుగుతుంటారనీ తెలియని ఆ అమాయక తల్లితండ్రులు ఎన్నో ఆశలతో బిడ్డను తీసుకు వెళ్లారు. ఆగస్టు 16న ఆపరేషన్ జరిగింది. బిడ్డను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. బాలింతరాలైన తల్లి కూడా అక్కడే ఉంది. ఐసీయూ అంటే ఇరవై నాలుగు గంటలూ సిబ్బంది పర్యవేక్షణలో ఉండే అత్యవసర చికిత్సా గది. డ్యూటీ డాక్టర్లు, నర్సులు, ఆయాలు తిరుగుతూనే ఉండాలి. కానీ ఆగస్టు 23 న బాబు కాలి వేళ్ల నుంచి, చేతి వేళ్ల నుంచి రక్తం కారుతూ కనిపించింది! ఎలుకలు కొరికాయి. తల్లి గమనించి, ఫిర్యాదు చేస్తే... ఆ రోజుల పసిగుడ్డు ఎలుక కాటు వల్ల ఎంత బాధ పడి ఉంటాడో, ఎంత నొప్పిని అనుభవించి ఉంటాడో అన్న కనీస స్పందన కూడా లేకుండా... డాక్టర్లు నిర్లక్ష్యం చేశారు. ఆశలు వదులుకోండి అన్నారు. వైద్యం చేయకుండా వదిలేశారు. ఆ పసికందు చనిపోయాడు. ఈ అమానుష ఘటన రాష్ర్టవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ నవ్వు గుర్తొస్తూనే ఉంటుంది! ముంబైతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రభాన్ సానప్ అలియాస్ లౌక్యాకు ఉరిశిక్ష పడింది. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 30న న్యాయమూర్తి వృషాలీ జోషీ శిక్షను ఖరారు చేశారు. 2014 జనవరి 5న లోకమాన్య తిలక్ (కుర్లా) టెర్మినస్ నుంచి అదృశ్యమైన ఎస్తేర్ అనూహ్య 2014 జనవరి 16వ తేదీన కంజూర్ మార్గ్-ఖండూప్ల మధ్య శవమై తేలింది. ఈ కేసులో నిందితుడైన చంద్రభాన్‌ను అక్టోబర్ 27న కోర్టు దోషిగా నిర్ధారించి, 30న శిక్ష ఖరారు చేసింది. ఆ కార్టూన్లు మరి లేవు! తన కార్టూన్లతో నవ్వులు పూయించిన రాగతి పండరి (50) అనారోగ్యంతో విశాఖపట్నంలో ఫిబ్రవరి 19న మరణించారు. పోలియో వల్ల రెండు కాళ్లూ బలహీన పడినా తెలుగునాట ఆమె కార్టూన్ మాత్రం దిటవుగా బలంగా నిలబడగలిగింది. ఉమన్ కార్టూనిస్ట్‌గా ఆమె విజయం స్ఫూర్తిదాయకం. ర్యాగింగ్‌కు బలైన రిషితేశ్వరి జులై 14 గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హాస్టల్ గదిలో ఎం. రిషితేశ్వరి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీనియర్స్ వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన డైరీలో రాసుకుంది రిషితేశ్వరి. జడలు విప్పిన ర్యాగింగ్ భూతం రిషితేశ్వరిని పొట్టనపెట్టుకున్న తీరు తెలుగురాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన మురళీకృష్ణ, దుర్గాబాయిల ఏకైక కూతురు రిషితేశ్వరి. కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలలో ఆమె సీనియర్ల వేధింపులకు గురైంది. ఆ తర్వాత వాళ్లు కొన్ని రోజుల పాటు రిషితేశ్వరి వెంటపడి మానసికంగా, శారీరకంగా వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పుకోలేక హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందింది. మహానటి మరణం ప్రముఖ తమిళ నటి మనోరమ (78) అక్టోబర్ 10న అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో సుమారు 1500 చిత్రాల్లో ఆమె నటించారు. అత్యధిక చిత్రాల్లో నటించిన నటిగా గిన్నిస్ రికార్డు సృష్టించారు. అస్తమించిన అరుణ లైంగికదాడికి గురైనప్పుడు తీవ్రంగా గాయపడి 42 ఏళ్లుగా కోమాలో ఉన్న మాజీ నర్సు అరుణా షాన్‌బాగ్ (65) మే 18న తుదిశ్వాస విడిచారు. ఆమెకు కొన్ని రోజులుగా న్యూమోనియా తీవ్రం కావడంతో వెంటిలేటర్‌పై ఉంచి, చికిత్స చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ముంబైలోని కేఈఎం ఆసుపత్రి నర్సుగా పని చేస్తున్న అరుణపై 1973 నవంబర్ 27న వార్డుబాయ్ సోహన్‌లాల్ లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. ఇనుప గొలుసుతో బంధించాడు. గొలుసును విడిపించుకునే ప్రయత్నంలో తలకు గట్టి దెబ్బ తగలడంతో మెదడుకు రక్తసరఫరా నిలిచిపోయింది. దీంతో అప్పటి నుంచి ఆమె కోమాలో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు కోమాలో ఉన్న అరుణను కేఈఎం ఆసుపత్రి నర్సులు 42 ఏళ్ల పాటు అనుక్షణం కంటికి రెప్పలా చూసుకున్నారు. మృత్యువుతో ఆమె చేసిన పోరాటానికి వాళ్లంతా అండగా నిలిచి అన్ని రకాల సేవలు అందించారు. ప్రాణం తీసిన నిర్లక్ష్యం... ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి పుష్కరాల్లో తొలిరోజు విషాదం చోటు చేసుకుంది. జూలై 14న రాజమండ్రి పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో 24మంది మహిళలే. ఇంటికి కొడుకు...పర్వతానికి ముద్దుబిడ్డ పర్వతారోహకుడు మల్లె మస్తాన్‌బాబు (40) అర్జెంటీనా, చిలీ మధ్య ఉన్న ఆండిస్ పర్వతాల్లో మరణించినట్లు ఏప్రిల్ 4న గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన మస్తాన్‌బాబు ఇంజినీరింగ్ పట్టభద్రుడు. 7 ఖండాల్లోని 172 దేశాల్లో 7 పర్వతాలను అధిరోహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందారు. -
విమానం.. నదీయానం..
ఓడలు బళ్లవడమంటే ఇదే.. ఇది ఒకప్పుడు ‘యుద్ధ విమానం’.. మరిప్పుడు ఓ పడవ. అదెలా అంటే.. వియత్నాం యుద్ధంలో పాల్గొని.. క్షిపణి దాడిలో దెబ్బతిని పడిపోయిన అనేక యుద్ధ విమానాలు, వాటి తాలూకు ఇంధన ట్యాంకులు ఇప్పటికీ మనకు దక్షిణ వియత్నాం అడవుల్లో కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా యుద్ధ విమానాల తాలూకు ఇంధన ట్యాంకులైతే వేలల్లోనే ఉంటాయి. దూర ప్రయాణాలు చేసే యుద్ధ విమానానికి అదనపు ఇంధన సరఫరాకు ఉపయోగపడే ఈ అల్యూమినియం ట్యాంకు లు విమానం కింది భాగంలో తగిలించి ఉంటాయి. అత్యవసర సమయాల్లో విమానం వేగాన్ని మరింత పెంచేందుకు వీలుగా.. చాలా మంది పైలట్లు ఇంధనం నింపుకోవడం పూర్తై తర్వాత వీటిని కిందకు వదిలివేసేవారు. యుద్ధం ముగిసింది. ఇవి మాత్రం మిగిలిపోయాయి. అయితే, వియత్నాం రైతులు ఊరుకుంటారా? అడవుల్లో వేల సంఖ్యలో పడి ఉన్న వీటిని ఏం చేయాలా అని ఆలోచించారు. చివరకు ఇంధన ట్యాంకులను ఇలా పడవలుగా మార్చేశారు. కొందరైతే.. యుద్ధ విమానాల నూ పలు రకాలుగా మార్చేసి.. పడవలుగా చేసేశారు. వాట్ ఎన్ ఐడియా సర్జీ..