
బెంగళూరు / న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ నౌకాదళ వెర్షన్‌ను అధికారులు గురువారం విజయవంతంగా పరీక్షించారు. యుద్ధవాహక నౌక నుంచి టేకాఫ్ కావడం, ఆతర్వాత హుక్ వ్యవస్థ సాయంతో సురక్షితంగా ల్యాండ్ కావడం వంటి పరీక్షల్ని పూర్తిచేశారు. దీంతో ఈ సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా, యూరప్‌ల సరసన భారత్ చేరింది. యుద్ధ విమానం నౌకపై దిగే సమయంలో దాని వేగాన్ని అదుపు చేయడానికి ఉండే ‘అరెస్టర్ హుక్ సిస్టమ్’ను కూడా ఈ సందర్భంగా విజయవంతంగా పరీక్షించారు. రాబోయే రోజుల్లో ల్యాండింగ్, ఇంధనం నింపే విషయంలో తేజస్‌కు మరిన్ని ట్రయల్స్ నిర్వహిస్తామని నేవీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత వాయుసేన(ఐఏఎఫ్) ఇప్పటికే 40 తేజస్ యుద్ధ విమానాల కోసం హెచ్‌ఏఎల్‌కు ఆర్డర్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment