కలైకుండ: దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అద్భుతంగా ఉందని సింగపూర్ రక్షణ మంత్రి జీ ఇంగ్ హెన్ మంగళవారం కితాబిచ్చారు. ఇది అత్యంత సమర్థవంతమైన యుద్ధ విమానమని ఆయన కొనియాడారు. పశ్చిమబెంగాల్‌లోని కలైకుండ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ఆయన.. ఎయిర్ వైస్ మార్షల్ ఏపీ సింగ్‌తో కలసి తేజస్ విమానంలో చక్కర్లు కొట్టారు.
ఆ తర్వాత మాట్లాడుతూ భారత వాయుసేనలోని పైలట్లకు నైపుణ్యంలో కొదవలేదనీ, అలాగే విమానాలు కూడా చాలా బాగున్నాయని హెన్ ప్రశంసించారు. అందుకే తమ సైనికులకు భారత వాయుసేనతో కలసి శిక్షణనిస్తున్నామన్నారు. తేజస్‌లో కూర్చుంటే విమానంలో కాకుండా ఏదో కారులో వెళ్తున్నట్లుగా ఉందని హెన్ ప్రశంసించారు. హెన్ బుధవారం రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఢిల్లీలో కలవనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment