Air Defense
-
ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలు అందజేస్తాం
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో రష్యాకు పరాభవం తప్పదని తేలి్చచెప్పారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని, గగనతలంలో శత్రువును మట్టికరిపించే ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలు అందజేస్తామని ప్రకటించారు. తాజాగా ‘నాటో’ 75వ సదస్సులో బైడెన్ ప్రసంగించారు. అమెరికాతోపాటు జర్మనీ, నెదర్లాండ్స్, రొమేనియా, ఇటలీ దేశాలు ఉక్రెయిన్‌కు అదనంగా ఐదు వ్యూహాత్మక ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలను అందజేయబోతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో పదుల సంఖ్యలో టాక్టికల్ ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలను ఉక్రెయిన్‌కు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. తాము అందజేసే క్రిటికల్ ఎయిర్–డిఫెన్స్ ఇంటర్సెప్టర్లతో రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ పైచేయి సాధిస్తుందని స్పష్టం చేశారు. రష్యా క్షిపణుల దాడులు, వైమానిక దాడుల నుంచి ఉక్రెయిన్ నగరాలతోపాటు ఉక్రెయిన్ సైన్యాన్ని కాపాడే ఇంటర్సెప్టర్లను వందల సంఖ్యలో అందిస్తామని పేర్కొన్నారు. యుద్ధంలో 3.50 లక్షల మందికిపైగా రష్యా సైనికులు మరణించడమో, గాయపడడమో జరిగిందని చెప్పారు. ఉక్రెయిన్ స్వేచ్ఛాయుతమైన, స్వతంత్రదేశంగా కొనసాగుతుందని ఉద్ఘాటించారు. ఎన్నికల దాకా ఎదురు చూడాలా?: జెలెన్స్కీ ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే ముందే రష్యా అధినేత పుతిన్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. నాటో సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల దాకా ప్రపంచం ఎదురు చూడొద్దని చెప్పారు. ఉక్రెయిన్‌కు ఎఫ్–16 ఫైటర్ జెట్లు ఇస్తాం: నార్వే ఉక్రెయిన్‌కు ఆరు ఎఫ్16 ఫైటర్ జెట్లు అందజేస్తామని నాటో సభ్యదేశమైన నార్వే ప్రధాని జోనాస్ ప్రకటించారు. అయితే, ఎప్పటి నుంచి ఈ యుద్ధ విమానాలు ఉక్రెయిన్‌కు అందజేస్తారన్నది ఆయన వెల్లడించలేదు. -
తవాంగ్ ఘర్షణ: ‘ఫైటర్ జెట్స్’ను రంగంలోకి దింపిన భారత్
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల నడుమ ఈనెల 9న ఘర్షణ తెలెత్తి మరోమారు సరిహద్దు వివాదంరాజుకుంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దుల్లో యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా గగనతల విహారం పెరిగినట్లు గుర్తించిన క్రమంలో ఈ మేరకు భారత్ అప్రమత్తమైనట్లు పేర్కొన్నాయి. చైనా బలగాలను తిప్పికొట్టేందుకు ఇటీవల రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఫైటర్ జెట్స్ గస్తీ పెంచినట్లు వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలో చైనా గగనతల కార్యకలాపాలు పెరిగిన క్రమంలో గగనతల పెట్రోలింగ్ పెంచినట్లు భారత వైమానిక దళ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. సరిహద్దులో తాజా ఉద్రిక్తతలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పార్లమెంట్లో కీలక ప్రకటన చేయనున్నారు. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: ఇండో-చైనా సైనికుల ఘర్షణపై రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష -
ఉక్రెయిన్ను కాపాడేందుకు రంగంలోకి అమెరికా!
వాషింగ్టన్: కెర్చ్ వంతెన పేలుడుకు ప్రతీకారంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై క్షిపణులతో భీకర దాడులకు దిగింది రష్యా. ఈ దాడుల్లో 10 మందికిపైగా మృతి చెందారు. మిసైల్స్‌తో విరుచుకుపడుతున్న రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు మరోమారు అండగా నిలిచింది అమెరికా. మిసైల్స్‌ను గాల్లోనే ధ్వంసం చేసేందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అందిస్తామని హామీ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. రష్యా క్షిపణి దాడుల క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో ఫోన్ ద్వారా మాట్లాడారు బైడెన్. ‘అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తోపాటు అవసరమైన రక్షణ వ్యవస్థలను అందిస్తామని బైడెన్ భరోసా కల్పించారు. విచక్షణారహిత దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారికి బైడెన్ తన సంతాపం తెలిపారు. అలాగే.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించటం, యుద్ధ నేరాలకు రష్యాను బాధ్యుడిగా చేయటానికి మిత్రపక్షాలపై ఒత్తిడి తెస్తామన్నారు.’ అని వైట్‌హౌస్ ఓ ప్రకటన చేసింది. మరోవైపు.. బైడెన్‌తో ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్వీట్ చేశారు జెలెన్స్కీ. రక్షణ సహకారంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌కు మా తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఇదీ చదవండి: కీవ్‌పై రష్యా భీకర దాడులు -
తైవాన్‌లోకి 27 చైనా ఫైటర్ జెట్స్.. ఇక బాంబుల వర్షమేనా?
తైపీ: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యాటనపై మొదటి నుంచే హెచ్చరికలు చేస్తోంది చైనా. జరగబోయే ఏ పరిణామానికైనా అమెరికానే కారణమంటూ తన అక్కసును వెళ్లగక్కింది. అయినప్పటికీ.. తైవాన్‌లో పర్యటించి తిరిగి స్వదేశానికి వెళ్లారు పెలోసీ. తైవాన్ నుంచి పెలోసీ వెళ్లిపోయిన వెంటనే ఆ ద్వీప దేశంపై చర్యలకు ఉపక్రమించింది చైనా. ఇప్పటికే ఆ దేశ దిగుమతులపై నిషేధం విధించింది. తాజాగా తైవాన్ గగనతలంలోకి చైనాకు చెందిన 27 ఫైటర్ జెట్స్ ప్రవేశించినట్లు తైపీ ప్రకటించింది. ‘27 పీఎల్ఏ విమానాలు ఆగస్టు 3న తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. ఆరు జే11 ఫైటర్ జెట్స్, 5 జే16 జేట్స్ 16 ఎస్‌యూ-30 జేట్స్ ప్రవేశించాయి. వాటికి ప్రతిస్పందనగా తైవాన్ సైతం తమ ఫైటర్ జెట్స్‌ను రంగంలోకి దించింది. ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్‌ని మోహరించింది. ’ అంటూ ట్వీట్ చేసింది రక్షణ శాఖ. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పెలోసీ పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ తైవాన్ లెక్కచేయలేదు. దీంతో అతి సమీపంలో ప్రమాదకర మిలిటరీ ప్రదర్శన చేపట్టి భయపెట్టే ప్రయత్నం చేసింది డ్రాగన్. స్పీకర్ విజిట్‌పై అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది. అలాగే.. హైఅలర్ట్ ప్రకటించింది చైనా మిలిటరీ. సైనిక డ్రిల్స్‌లో భాగంగా లాంగ్ రేంజ్ షూటింగ్ వంటివి ప్రదర్శించింది. దీంతో తైవాన్‌లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. తైవాన్‌కు అమెరికా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రకటించారు పెలోసీ. 27 PLA aircraft (J-11*6, J-16*5 and SU-30*16) entered the surrounding area of R.O.C. on August 3, 2022. Please check our official website for more information: https://t.co/m1gW2N4ZL7 pic.twitter.com/Aw71EgmRjj — 國防部 Ministry of National Defense, R.O.C. 🇹🇼 (@MoNDefense) August 3, 2022 ఇదీ చదవండి: భగ్గుమంటున్న చైనా!...తైవాన్ పై కక్ష సాధింపు చర్యలు -
Woman combat pilot: ఫస్ట్ టైమ్ అభిలాష నెరవేరింది
చిన్నప్పుడు అభిలాషకు తండ్రి కథలు చెప్పేవాడు. అవి కాలక్షేప కథలు, కంచికి వెళ్లే కథలు కావు. మన వీరసైనికుల నిజమైన జీవిత కథలు. ఆ కథలు వింటూ పెరిగిన అభిలాష భారత సైన్యంలో పనిచేయాలని గట్టిగా అనుకుంది. తాజాగా ‘ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమన్ కంబాట్ ఏవియేటర్’గా చారిత్రక గుర్తింపు పొందింది కెప్టెన్ అభిలాష బరాక్. అభిలాష బరాక్కు మిలిటరీ అనే మాట కొత్త కాదు. నాన్న ఓమ్‌సింగ్ సైనిక అధికారి. దీంతో దేశంలోని రకరకాల కంటోన్మెంట్లలో పెరిగింది అభిలాష. సైనికుల వీరగాథలను తండ్రి స్ఫూర్తిదాయకంగా చెబుతుండేవాడు. ఆ ప్రభావం తన మీద పడింది. అలా మిలిటరీలో పనిచేయాలనే కలకు అంకురార్పణ జరిగింది. ఒకరోజు ఇండియన్ మిలిటరీ అకాడమీలో తన సోదరుడి పాసింగ్ ఔట్ పరేడ్‌కు హాజరైంది అభిలాష. ఆ వాతావరణం తనను ఎంత ఉత్తేజపరిచింది అంటే...పనిచేస్తే మిలిటరీలోనే పనిచేయాలన్నంతగా. ‘మిలిటరీ యూనిఫామ్’లో తనను తాను చూసుకొని మురిసిపోవాలనుకునేంతగా! ‘నా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసుకున్న రోజు అది’ అని గతాన్ని గుర్తు చేసుకుంది అభిలాష. దిల్లీ టెక్నాలజికల్ యూనివర్శిటీలో బీటెక్ పూర్తిచేసిన అభిలాష 2018లో ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాప్స్’లో చేరింది. దీనికి ముందు కొన్ని ప్రొఫెషనల్ మిలిటరీ కోర్స్‌లు పూర్తిచేసింది. ‘ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు ఇది. కంబాట్ ఏవియేషన్ కోర్స్ విజయవంతంగా పూర్తి చేసిన కెప్టెన్ అభిలాష ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమన్ కంబాట్ ఏవియేటర్...’ అని ఆర్మీ తన అధికార ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలియజేసింది. ప్రత్యేక విధులు నిర్వర్తించే దళంగా ప్రసిద్ధమైన ఏవియేషన్ కాప్స్‌కు ఉన్న ఘనచరిత్ర తక్కువేమీ కాదు. రుద్ర, చీతా, ధృవ...మొదలైన హెలికాప్టర్లను ఆపరేట్ చేయడంతో పాటు సియాచిన్‌లాంటి సున్నిత ప్రాంతాలలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంది. ‘రెట్టించిన అంకితభావంతో పనిచేయడానికి తాజా బాధ్యత ప్రేరణ ఇస్తుంది’ అంటుంది హరియాణాకు చెందిన 26 సంవత్సరాల అభిలాష ‘స్విఫ్ట్ అండ్ ష్యూర్’ అనేది మన సైన్యానికి సంబంధించిన లక్ష్య ప్రకటిత నినాదం. ఈ నినాదాన్ని వేగంగా అందుకున్న యువ సైనికులలో అభిలాష ఒకరు. ఆమెకు అభినందనలు. -
500 రాకెట్ల దాడిని అడ్డుకున్న ‘ఐరన్ డోమ్’
గాజా సిటీ: దాదాపు 500 రాకెట్లు ఒక్కసారిగా దాడి చేస్తే.. ఎంతటి విధ్వంసం జరగాలి. కానీ ఇజ్రాయెల్ మాత్రం చాలా తక్కువ నష్టంతో బయటపడింది. ఇదేలా సాధ్యం అంటే ఐరన్ డోమ్. ఇజ్రాయెల్‌ను రక్షించిన అధునాతన వాయు రక్షణ వ్యవస్థ. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శత్రుత్వం కొనసాగుతున్న తరుణంలో, సోమవారం సూర్యాస్తమయం నుంచి గాజాలోని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పైకి 1,050 కి పైగా రాకెట్లు, మోర్టార్ షెల్స్‌తో దాడులకు తెగబడ్డారు. ఈ హింసాకాండలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ దాదపు 500 రాకెట్లను అడ్డుకున్నట్లు తెలిపింది. ఐరన్ డోమ్ అంటే ఏంటి.. సాధారణంగా తక్కువ దూరాల్లోని శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయడానికి స్వల్ప శ్రేణి రాకెట్లు, మోర్టార్లను వినియోగిస్తుంటారు. దూరం తక్కువ ఉండటంతో ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి శత్రువులకు తగినంత సమయం లభించదు. ఇటువంటి ప్రమాదాలను ముందుగానే పసిగట్టి గాల్లోనే ధ్వంసంచేసే వ్యవస్థే ఐరన్ డోమ్. దీన్ని అమెరికా సాయంతో ఇజ్రాయిల్‌కు చెందిన రఫేల్ డిఫెన్స్ సిస్టమ్స్ పది సంవత్సరాల క్రితం అభివృద్ధి చేసింది. 2011లో దీనిని వినియోగంలోకి తీసుకొచ్చింది. గాజాస్ట్రిప్ వైపు నుంచి ఉగ్రవాదులు ప్రయోగించే రాకెట్లు, మోర్టార్ షెల్స్‌ని ఇది ఎదుర్కొంటుంది. దీని రేంజ్ 70 కిలోమీటర్ల వరకు ఉంది. ఎలా పని చేస్తుంది.. ఈ వ్యవస్థ మొత్తంలో రాడార్లు,సాఫ్ట్వేర్,రాకెట్ ప్రయోగించే బ్యాటరీలు ఉంటాయి. గాజాస్ట్రిప్ లో రాకెట్ ప్రయోగించిన వెంటనే రాడార్ పసిగట్టి.. దాని గురించిన సమాచారాన్ని సాఫ్ట్వేర్ వ్యవస్థకు పంపిస్తుంది. టార్గెట్ రాకెట్ ఏ ప్రదేశంలో పడుతుందో గుర్తిస్తుంది. ఆ ప్రదేశం ఖాళీగా ఉంటే రాకెట్‌ను ప్రయోగించదు. ఒకవేళ అది జనావాసాలపై పడే అవకాశం ఉంటే మాత్రం బ్యాటరీ నుంచి రాకెట్‌ను ప్రయోగించి శత్రువుల రాకెట్‌ను గాల్లోనే పేల్చివేస్తుంది. దీని సక్సెస్ రేట్ 90 శాతంగా ఉంది. చదవండి: భర్తతో వీడియో కాల్.. ఇంట్లోకి దూసుకొచ్చిన రాకెట్ The #IronDome is truly a life saver! This is the Iron Dome in action tonight, as rockets are fired at southern #Israel from #Gaza! pic.twitter.com/y4HCyaTntK — Arsen Ostrovsky (@Ostrov_A) May 10, 2021 -
గగనతలందాకా గట్టి నిఘా
న్యూఢిల్లీ: 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ రాజధాని నగరంలో భారీభద్రతా ఏర్పాట్లు చేశారు. భూఉపరితలం నుంచి గగనతలందాకా గట్టి నిఘా ఉంచారు. ఎర్రకోట పరిసరాల వద్ద భారీఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ప్రధానమంత్రికి పలు ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసు శాఖతోపాటు పారామిలిటరీ బలగాలకు చెందిన దాదాపు 30 వేలమంది భద్రతా సిబ్బందికి నిఘా బాధ్యతలను అప్పగించారు. స్పెషల్ సెల్‌కు చెందిన ఐదు వేలమంది స్థానిక పోలీసులు కూడా ఈ నిఘా బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నారు. మరోవైపువాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ శాఖ తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ విషయమై పోలీసు శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. తమకు నగరవాసులు అన్నివిధాలుగా సహకరించాలని ఆయన కోరారు. 17వ శతాబ్దం నాటి మొఘల్ కోటతోపాటు నగరంలోని అత్యంత ఎత్తయిన భవనాలపై ఎన్ఎస్జీకి చెందిన షార్ప్షూటర్లను మోహరించామన్నారు. దీంతోపాటు సత్వర స్పందన బృందాలు (క్యూఆర్ఎస్), బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్. ఎస్‌డబ్ల్యూటీ, వజ్ర బృందాలను కూడా రంగంలోకి దించామన్నారు. వేదిక సమీపంలో హెలికాప్టర్లతోపాటు ఎయిర్ డిఫెన్స్ మెకానిజంను కూడా సిద్ధం చేశారు. ఎర్రకోట పరిసరాల్లో 200 సీసీటీ వీ కెమెరాలను కూడా ఏర్పాటుచేశారు. దీంతోపాటు కంట్రోల్‌రూంను కూడా ఏర్పాటు చేశారు. రద్దీ ప్రదేశాల వద్ద అదనపు సిబ్బంది ఢిల్లీ మెట్రో, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, ఇంటర్ స్టేట్ బస్ టెర్మినస్‌ల వద్ద సీఐఎస్ఎఫ్కు చెందిన అదనపు బలగాలను మోహరించారు. కాగా ఎర్రకోటకు వచ్చే నగరవాసుల కోసం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డీటీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ఉచిత ప్రయా ణ సదుపాయం కల్పించారు. అంతేకాకుండా అల్పాహారం అందించడానికి కూడా తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఢిల్లీ బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ శాఖలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. మోడీ ప్రసంగం ఆలకించేందుకు నగరం సిద్ధం న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం ఆలకించేందుకు నగరం సన్నద్ధమైంది. ఎర్రకోటపై శుక్రవారం జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని జాతినుద్దేశించి ఎర్రకోటనుంచి ప్రసంగించనున్నారు. మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన అనంతరం మోడీ జాతినుద్దేశించి ఎర్రకోటనుంచి ప్రసంగించడం తొలిసారి. మోడీ ప్రసంగం అసాధారణ రీతిలో సాగుతుందని భావిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసే సమయంలో ఆయన స్వాతంత్య్ర దినోత్సవాన్ని గొప్ప పండుగగా మార్చివేశారు. కాగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని చెరగని జ్ఞాపకంగా మార్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సకల ఏర్పాట్లుచేసింది. 68వ ఇదిలాఉంచితే నగరంలోని అసోలా భట్టి వన్యపరిరక్షణ కేంద్రంలో మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. వారంరోజుల స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా నగరవ్యాప్తంగా ఇప్పటికే 4.16 లక్షల మొక్కలను నాటిన సంగతి విదితమే.