వాషింగ్టన్: కెర్చ్ వంతెన పేలుడుకు ప్రతీకారంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై క్షిపణులతో భీకర దాడులకు దిగింది రష్యా. ఈ దాడుల్లో 10 మందికిపైగా మృతి చెందారు. మిసైల్స్‌తో విరుచుకుపడుతున్న రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు మరోమారు అండగా నిలిచింది అమెరికా. మిసైల్స్‌ను గాల్లోనే ధ్వంసం చేసేందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అందిస్తామని హామీ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
రష్యా క్షిపణి దాడుల క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో ఫోన్ ద్వారా మాట్లాడారు బైడెన్. ‘అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తోపాటు అవసరమైన రక్షణ వ్యవస్థలను అందిస్తామని బైడెన్ భరోసా కల్పించారు. విచక్షణారహిత దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారికి బైడెన్ తన సంతాపం తెలిపారు. అలాగే.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించటం, యుద్ధ నేరాలకు రష్యాను బాధ్యుడిగా చేయటానికి మిత్రపక్షాలపై ఒత్తిడి తెస్తామన్నారు.’ అని వైట్‌హౌస్ ఓ ప్రకటన చేసింది. మరోవైపు.. బైడెన్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ట్వీట్ చేశారు జెలెన్‌స్కీ. రక్షణ సహకారంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌కు మా తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కీవ్‌పై రష్యా భీకర దాడులు
Comments
Please login to add a commentAdd a comment