
సాక్షి, సూర్యాపేట : సరిహద్దులో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సూర్యాపేట జిల్లావాసి కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ‘హిట్’ సినిమా హీరో విశ్వక్‌సేన్ పరామర్శించారు. శనివారం సూర్యాపేట వెళ్లి, సంతోష్‌బాబుకు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంతోష్‌బాబు లాంటి వీరుపుత్రుడిని దేశానికి అందించిన ఆయన తల్లికి ధన్యవాదాలు తెలిపారు. (పిల్లలు ఆర్మీకి వెళ్తానంటే సంతోషంగా పంపిస్తా)
ఈ సందర్భంగా విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. ‘ఈ కుటుంబం చేసిన త్యాగం కేవలం మన ఒక్కరి కోసం కాదు, మన రాష్ట్రం కోసం కాదు, మన భారత దేశం కోసం చేసిన త్యాగం. ఆర్మీకి మనం రుణపడి ఉండాలి. అందుకే సంతోష్‌బాబు తల్లిని ఒకసారి కలుసుకోవాలని అనిపించింది. కనీసం నేను ఆ తల్లిని సందర్శించి, మన సంతోష్‌బాబును దేశం కోసం త్యాగం చేసిన ఆమెకు కృతజ్ఞతలతో పాటు సంతాపాన్నీ తెలపగలిగాను. పూడ్చలేని లోటు నుంచి కోలుకొని మన వీర సైనికుల కుటుంబాలకు ఆత్మ స్థైర్యం లభించాలని ప్రార్థిద్దాం. జైహింద్’అన్నారు.
(చదవండి : కల్నల్ సంతోష్ కుటుంబానికి రూ. 5 కోట్లు )
Comments
Please login to add a commentAdd a comment