సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం: కిషన్‌రెడ్డి  | Full Freedom Given To Army Soldiers Says Kishan Reddy | Sakshi
Sakshi News home page

సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం: కిషన్‌రెడ్డి 

Published Mon, Jun 22 2020 3:25 AM | Last Updated on Mon, Jun 22 2020 3:25 AM

Full Freedom Given To Army Soldiers Says Kishan Reddy - Sakshi

సూర్యాపేట అర్బన్‌: దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సైనిక బలగాలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చైనా దొంగ దెబ్బతీసి మన సైనికులను పొట్టన పెట్టుకుందని, వారి త్యాగం వృథా కాదన్నారు. ప్రధాని ఆదేశం మేరకే సంతోష్‌బాబు కుటుంబసభ్యులను కలిశానని, మోదీ సందేశం వారికి తెలియజేశానని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement