న్యూఢిల్లీ: మహిళా అధికారులకు కల్నల్‌గా పదోన్నతి కలి్పంచేందుకు సైన్యం నిరాకరించడం నిబంధనలకు విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమకు కల్నల్‌గా ప్రమోషన్ ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు మహిళా సైనికాధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస మనోజ్ మిశ్రా ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. మహిళా సైనికాధికారులు సైనయంలో తమకు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్లు, బాధ్యతలను చిరకాలం పాటు పోరాడి మరీ సాధించుకున్నారని అభిప్రాయపడింది.
కల్నల్ ప్రమోషన్ల విషయంలో మహిళా అధకారుల రహస్య వార్షిక నివేదిక (సీఆర్)లకు సైన్యం కటాఫ్ తేదీని వర్తింపజేసిన తీరు వారికి అన్యాయం చేసేదిగా ఉందంటూ ఆక్షేపించింది. కనుక కల్నల్ ప్రమోషన్ల ప్రక్రియను 15 రోజుల్లోగా తాజాగా చేపట్టాలని సైన్యాన్ని ఆదేశించింది. లింగ వివక్షకు తావులేకుండా మహిళా సైనికాధికారులకు కూడా కల్నల్ తదితర పదోన్నతులు కలి్పంచాలంటూ 2020లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. నేవీలో కూడా దీన్ని వర్తింపజేయాలంటూ కొద్ది రోజులకే మరో తీర్పు వెలువరించింది. సాయుధ దళాల్లో మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడేందుకు తమ తీర్పులు తోడ్పడతాయని ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment