army officers
-
Madhya Pradesh: ఆర్మీ అధికారులపై దుండగుల దాడి.. ఒకరిపై అత్యాచారం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి మరో ఇద్దరు యువ ఆర్మీ అధికారులపై గుర్తు తెలియని దుండగులు తీవ్రంగా దాడిచేశారు. దోపిడీ చేయడానికి వచ్చిన దుండగులు.. వారిపై దాడి చేసి ఓ మహిళా అధికారిణిపై అత్యాచారం చేసినట్లు బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ తీసుకుంటున్న అధికారులు మంగళవారం జామ్‌లోని ఫైరింగ్ రేంజ్ సమీపంలో మహిళలతో కలిసి బయటకు వెళ్లారు. అకస్మాత్తుగా ఎనిమిది మంది దుండగులు తుపాకులు, కత్తులు కర్రలతో వారిని చుట్టుముట్టారు. ట్రైనీ ఆఫీసర్లు, మహిళల డబ్బు, వస్తువులను దోచుకునే ముందు వారిపై దాడి చేశారు. ఒక మహిళను, మరో ఆర్వీ అధికారిని బందీలుగా పట్టుకుని.. మిగతా ఇద్దరు రూ.10 లక్షల ఇవ్వాలని అలాఅయితే వారివద్ద ఉన్న అధికారులను వదిపెడతామని డిమాండ్ చేశారు. ట్రైనింగ్ సెంటర్ వెళ్లిన యువ అధికారులు మోవ్ ఆర్మీ కాలేజీ అధికారులు, పోలీసులకు సమాచారం అధించారు. దీంతో పోలీసులను అప్రమత్తమై.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావటాన్ని గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన నలుగురినీ వైద్య పరీక్షల నిమిత్తం మోవ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు అధికారులు గాయపడినట్లు డాక్టర్లు తెలిపారు. అదేవిధంగా వైద్య పరీక్షల్లో ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లు తెలిసిందని బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగు పోలీసు స్టేషన్లకు చెందిన సిబ్బంది రంగంలోకి దిగి నేరస్తుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.చదవండి: ప్రజ్వల్‌కు చీర చిక్కు -
Lok Sabha Election 2024: పొలిటికల్ టాప్ గన్స్.. రాజకీయాల్లో రాణించిన సైనికాధికారులు
వారు కదన రంగంలో శత్రువుల భరతం పట్టిన వీర సైనికులు. రెండో ఇన్సింగ్స్‌లో రాజకీయ రణరంగంలోనూ అంతే గొప్పగా రాణించారు. త్రివిధ దళాల్లో పలు హోదాల్లో దేశానికి సేవలందించిన సైనిక ఉన్నతాధికారులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పారు. జశ్వంత్‌సింగ్, రాజేశ్ పైలట్ మొదలుకుని తాజాగా ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) బదౌరియా దాకా ఈ జాబితా పెద్దదే...జశ్వంత్ సింగ్ బహుముఖ ప్రజ్ఞాశీలి సైనికాధికారిగా శత్రువులతో పోరాడిన జశ్వంత్ రాజకీయాల్లో చేరి రక్షణ మంత్రిగా త్రివిధ దళాలకు బాస్ అయ్యారు. 1965లో ఇండో–పాక్ యుద్ధంలో పాల్గొన్న జశ్వంత్ మేజర్ హోదాలో 1966లో పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. భారతీయ జన సంఘ్, ఆర్ఎస్ఎస్ సభ్యుడు. బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1980లో బీజేపీ తరఫున తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 దాకా ఐదుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1989లో సొంత రాష్ట్రం రాజస్తాన్‌లోని జో«ద్‌పూర్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో 1998 నుంచి 2004 దాకా కీలకమైన ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటి శాఖలు చూశారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అత్యధిక కాలం పార్లమెంటు సభ్యునిగా కొనసాగిన కొద్దిమందిలో జశ్వంత్ ఒకరు. రాజేశ్ ‘పైలట్’ అసలు పేరు రాజేశ్వర్ ప్రసాద్ బిధూరి. పైలట్ వృత్తినే పేరులోనే చేర్చుకుని రాజకీయాల్లో వెలుగు వెలిగారు. భారత వైమానిక దళంలో బాంబర్ పైలట్‌గా 1971 భారత్–పాక్ యుద్ధంలో పోరాడారు. స్క్వాడ్రన్ లీడర్ హోదాలో రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజీవ్‌కు సన్నిహితుడు. 1980లో కాంగ్రెస్ తరఫున భరత్పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి 1999 దాకా ఎంపీగా గెలిచారు. కేంద్రంలో పలు కీలక శాఖలకు మంత్రిగా చేశారు. 2000 జూన్‌లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన తనయుడు సచిన్ పైలట్ కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగుతున్నారు.అమరీందర్ కెప్టెన్ టు సీఎం కెపె్టన్ అమరీందర్ సింగ్ జవాన్ల కుటుంబం నుంచి వచ్చారు. 1965 ఇండో–పాక్ యుద్ధంలో శత్రువుకు చుక్కలు చూపించారు. కెపె్టన్ హోదాలో రిటైరైన ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది రాజీవ్. అమరీందర్ 1980లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2017 దాకా మూడుసార్లు పంజాబ్ పీసీసీ చీఫ్‌గా, 2002 నుంచి 2007 దాకా సీఎంగా చేశారు. 2017లో మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి రెండోసారి సీఎం అయ్యారు. కాంగ్రెస్ వర్గ విభేదాలతో పార్టీకి, సీఎం పదవికి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టారు. తర్వాత దాన్ని బీజేపీలో విలీనం చేశారు. బి.సి.ఖండూరీ స్వర్ణ చతుర్భుజి సారథి మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించిన భువన్ చంద్ర ఖండూరీ 1954 నుంచి 1990 దాకా భారత సైన్యంలో సేవలందించారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇంజనీర్ స్థాయి నుంచి ఆర్మీ ఇంజనీర్ ఇన్ చీఫ్ విభాగంలో అదనపు డైరెక్టర్ జనరల్ దాకా కీలక హోదాల్లో పని చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో రెజిమెంట్ కమాండర్‌గా పోరాడారు. మేజర్ జనరల్ హోదాలో రిటైరయ్యారు. 1991లో తొలిసారి ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. ఐదుసార్లు ఎంపీ అయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో రహదారులు, హైవేల మంత్రిగా చేశారు. దేశ నలు దిక్కులను కలిపిన స్వర్ణ చతుర్భుజి హైవేల ప్రాజెక్టును దిగ్విజయంగా అమలు చేసిన ఘనత ఖండూరీదే. నిజాయితీకి మారుపేరైన ఆయన ఉత్తరాఖండ్ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజేతగా నిలిపి సీఎం అయ్యారు.అయూబ్ ఖాన్ వార్ హీరో సైనికుల కుటుంబం నుంచి వచ్చిన అయూబ్ ఖాన్ 1965 ఇండో పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. భారత సైన్యంలోని 18వ సాయుధ అశి్వక దళంలో రిసాల్దార్గా పని చేస్తున్న అయూబ్‌ను యుద్ధంలో జమ్మూకశీ్మర్ సియాల్కోట్ సెక్టార్లో నియమించారు. పాకిస్తాన్ సైన్యం యుద్ధ ట్యాంకులతో మన జవానులను చుట్టుముడుతున్న తరుణంలో నాలుగు పాక్ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడంతో పాటు ఒక ట్యాంకును స్వా«దీనం చేసుకుని శత్రువుకు చుక్కలు చూపించారు. ఆ యుద్ధంలో పరాక్రమానికి వీర్ చక్ర పురస్కారం అందుకున్నారు. గౌరవ కెపె్టన్ హోదా కూడా దక్కింది. ‘నేను పాక్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్‌ను కలుసుకోలేదు గానీ భారతీయ అయూబ్‌ను కలిసినందుకు గర్వంగా ఉంది’ అంటూ నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఈ వీర సైనికున్ని హత్తుకోవడం విశేషం. 1983లో రిటైరయ్యాక అయూబ్ రాజకీయాల్లోనూ సత్తా చాటారు. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అయూబ్‌ను ఒప్పించి మరీ ఎన్నికల్లో నిలబెట్టారు. రాజస్తాన్‌లోని ఝుంఝును నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఆ రాష్ట్రం నుంచి తొలి ముస్లిం ఎంపీగా కూడా చరిత్ర సృష్టించారు. 1991లో రెండోసారి విజయం సాధించి, పీవీ కేబినెట్లో వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.కాండెత్ గోవా విముక్తి వీరుడు దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా గోవాలో మాత్రం 1961 దాకా పోర్చుగీసు వలస పాలనే సాగింది. 1961లో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాను విలీనం చేసుకుంది. ఈ కీలక సైనిక చర్యకు సారథ్యం వహించిన ధీరుడు కేరళకు చెందిన మేజర్ జనరల్ కున్హిరామన్ పాలట్ కాండెత్. తర్వాత కొంతకాలం గోవా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో పశి్చమ కమాండ్ సైనిక బలగాన్ని నడిపించారు. పరమ విశిష్ట సేవా మెడల్‌తో పాటు పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 1972లో లెఫ్టినెంట్ జనరల్‌గా రిటైరయ్యారు. 1990ల్లో బీజేపీలో చేరారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా చేశారు. జనరల్ వీకే సింగ్... రాజకీయాల్లో సక్సెస్ భారత సైన్యంలో కమాండో స్థాయి నుంచి ఆర్మీ ఛీఫ్ అయిన తొలి వ్యక్తి జనరల్ విజయ్ కుమార్ సింగ్. 1971 ఇండో–పాక్ యుద్ధంతో సహా అనేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. 2010 నుంచి 2012 దాకా సైనిక దళాధిపతిగా చేశారు. రిటైరయ్యాక 2014లో బీజేపీలో చేరారు. స్వరాష్ట్రం యూపీలోని ఘాజియాబాద్ నుంచి ఎంపీ అయ్యారు. 2019లో రెండోసారి విజయం సాధించారు. మోదీ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా చేశారు.విష్ణు భగవత్... గురి తప్పిన టార్పెడో భారత నావికాదళంలో అత్యంత ప్రతిభాపాటవాలతో అత్యున్నత పదవికి చేరుకున్న అడ్మిరల్ విష్ణు భగవత్... వివాదాస్పద వ్యవహార శైలితో అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో, పోర్చుగీస్ చెర నుంచి గోవాకు విముక్తి కలి్పంచిన ఆపరేషన్ విజయ్‌లో కీలక పాత్ర పోషించారు. ఎన్డీఏ ప్రభుత్వంతో విభేదాల కారణంగా 1998లో ఉద్వాసనకు గురయ్యారు. నేవీ చీఫ్‌గా ఉంటూ వేటుకు గురైన తొలి వ్యక్తి ఆయనే. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అడ్మిరల్ హోదానూ కోల్పోయారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిహార్ రాజకీయాల్లో కొంతకాలం చురుగ్గా వ్యవహరించారు. ‘ఉత్తమ’ ఫైటర్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైమానిక దళంలో మిగ్ 21, మిగ్ 23 వంటి ఫైటర్ జెట్లు నడిపి శత్రువులపై పోరాడారు. రాజకీయాల్లోనూ రియల్ ఫైటర్‌గా కొనసాగుతున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ 1982 నుంచి 1991 దాకా ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ పైలట్‌గా చేశారు. 1994లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ఎన్నికల్లో కోదాడ నుంచి ఓడినా 1999లో అక్కడి నుంచే విజయఢంకా మోగించారు. మూడు దశాబ్డాల రాజకీయ జీవితంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి నల్లగొండ ఎంపీగా, పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా చేశారు. తాజాగా హుజారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఉత్తమ్ భార్య పద్మావతి కూడా రెండుసార్లు కోదాడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో వచి్చన టెర్రర్ అనే తెలుగు సినిమాలో ఆయన సీఎం పాత్ర పోషించడం విశేషం!జేజే సింగ్... తొలి సిక్కు ఆర్మీ చీఫ్ జోగిందర్ జస్వంత్ సింగ్. తొలి సిక్కు ఆర్మీ జనరల్. 2005 నుంచి 2007 దాకా దేశ 21వ ఆర్మీ చీఫ్‌గా సేవలందించారు. రిటైరయ్యాక 2008లో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా అయ్యారు. 2017లో అకాలీదళ్‌లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కెపె్టన్ అమరీందర్ సింగ్ చేతిలో ఓడారు. 2019లో అకాలీదళ్ (తక్సలీ)లో నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2022లో బీజేపీలో చేరారు. వీకే సింగ్ తర్వాత కాషాయం తీర్థం పుచ్చుకున్న రెండో జనరల్‌గా నిలిచారు.బదౌరియా... పొలిటికల్ టేకాఫ్ రాజకీయాల్లోకి వచి్చన తొలి వైమానిక దళపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ బదౌరియా చరిత్ర సృష్టించారు. ఎయిర్‌ఫోర్స్ ఫైటర్‌గా విధుల్లో చేరిన ఆయన 41 ఏళ్ల కెరీర్లో 26 రకాల ఫైటర్ జెట్స్, రవాణా విమానాలు నడిపిన విశేష ప్రతిభావంతుడు. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ చీఫ్ టెస్ట్ పైలట్‌గా, ప్రాజెక్ట్ టెస్టింగ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. 2019 నుంచి 2021 దాకా ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా చేసి రిటైరయ్యారు. ఇటీవలే బీజేపీలో చేరారు. రాథోడ్ గురి పెడితే... టార్గెట్ తలొంచాల్సిందే! యుద్ధభూమి అయినా, క్రీడా మైదానమైనా ఆయన గురి పెడితే టార్గెట్ తలొంచాల్సిందే! ఆయనే కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. విశ్వ క్రీడా ప్రపంచంలో భారత్‌కు ఘన కీర్తి సాధించి పెట్టిన అభినవ అర్జునుడు. చదువులోనూ, ఆటలోనూ ‘గోల్డెన్’ బాయ్‌గా నిలిచిన రాథోడ్ కార్గిల్ యుద్ధంలో పోరాడారు. 2002 కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ కొట్టారు. ఆ ఈవెంట్లో ఆయన నెలకొలి్పన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 2004 గ్రీస్ ఒలింపిక్స్ డబుల్ ట్రాప్ ఈవెంట్లో వెండి పతకం కొట్టడంతో రాథోడ్ పేరు మారుమోగింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు అదే తొలి వ్యక్తిగత వెండి పతకం! కెరీర్లో ఏకంగా 25 అంతర్జాతీయ పతకాలను సొంతం చేసుకున్నారు. 2013లో ఆర్మీ నుంచి రిటైరై బీజేపీలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. మోదీ ప్రభుత్వంలో సమాచార, క్రీడా మంత్రిగా చేశారు. 2019లోనూ ఎంపీగా గెలిచారు. 2023లో రాజస్తాన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ముగ్గురు పౌరుల అనుమానాస్పద మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లాలు పూంఛ్, రాజౌరీల్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విచారణ కోసమని తీసుకెళ్లి ముగ్గురు పౌరులను ఆర్మీ అధికారులు చంపేశారంటూ పార్టీల నేతలు, స్థానికులు నిరసనకు దిగారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది. సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఆర్మీ ప్రకటించింది. వదంతులు వ్యాపించకుండా పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ నెల 21న పూంఛ్ జిల్లాలో ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు సైనికులు అసువులు బాయడం తెలిసిందే. అనంతరం ఆర్మీ అధికారులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు శుక్రవారం రాత్రి శవాలై కనిపించారు. వారిని చిత్రహింసలు పెట్టిన వీడియోలు బహిర్గతమయ్యాయి. ఇది ఆర్మీ అధికారుల పనేనని స్థానికులు ఆరోపించారు. తీవ్ర గాయాలపాలైన నలుగురిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. కశ్మీర్లో మళ్లీ ఉద్రిక్తతలు -
కల్నల్ నియామకాల్లో మహిళలకు అన్యాయం... నిబంధనలకు విరుద్ధం: సుప్రీం
న్యూఢిల్లీ: మహిళా అధికారులకు కల్నల్‌గా పదోన్నతి కలి్పంచేందుకు సైన్యం నిరాకరించడం నిబంధనలకు విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమకు కల్నల్‌గా ప్రమోషన్ ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు మహిళా సైనికాధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస మనోజ్ మిశ్రా ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. మహిళా సైనికాధికారులు సైనయంలో తమకు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్లు, బాధ్యతలను చిరకాలం పాటు పోరాడి మరీ సాధించుకున్నారని అభిప్రాయపడింది. కల్నల్ ప్రమోషన్ల విషయంలో మహిళా అధకారుల రహస్య వార్షిక నివేదిక (సీఆర్)లకు సైన్యం కటాఫ్ తేదీని వర్తింపజేసిన తీరు వారికి అన్యాయం చేసేదిగా ఉందంటూ ఆక్షేపించింది. కనుక కల్నల్ ప్రమోషన్ల ప్రక్రియను 15 రోజుల్లోగా తాజాగా చేపట్టాలని సైన్యాన్ని ఆదేశించింది. లింగ వివక్షకు తావులేకుండా మహిళా సైనికాధికారులకు కూడా కల్నల్ తదితర పదోన్నతులు కలి్పంచాలంటూ 2020లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. నేవీలో కూడా దీన్ని వర్తింపజేయాలంటూ కొద్ది రోజులకే మరో తీర్పు వెలువరించింది. సాయుధ దళాల్లో మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడేందుకు తమ తీర్పులు తోడ్పడతాయని ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది. -
నూపుర్ శర్మపై తీవ్ర వ్యాఖ్యలు దురదృష్టకరం
ఢిల్లీ: అధికారం ఉందన్న పొగరుతో ఇష్టానుసారం మాట్లాడారంటూ.. బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఆగ్రహం వెల్లగక్కింది. అయితే ఆమెకు మద్దతుగా.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌పైనా సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలను తప్పుబడుతూ మాజీలంతా కలిసి బహిరంగ ప్రకటన విడుదల చేయడం, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. పదిహేను మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 77 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, 25 మంది ఆర్మీ మాజీ అధికారులు ఈ బహిరంగ ప్రకటనలో సంతకం చేశారు. నూపుర్ శర్మ పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దీవాలా చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆ వ్యాఖ్యలు దురదృష్టకరమని, మునుపెన్నడూ వినలేదని పేర్కొన్నారు. తన భద్రత దృష్ట్యా.. దేశంలో తనకు వ్యతిరేకంగా నమోదు అయిన ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా.. నూపుర్ శర్మ భద్రతకు ముప్పు కాదని.. ఆమె తన వ్యాఖ్యలతో దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రవక్తకు సంబంధించి కామెంట్లు చేయాల్సిన అవసరం ఏముందని, ఆమె వ్యాఖ్యలే దేశంలో కొన్ని దురదృష్టకర ఘటనలకు కారణమైందని(ఉదయ్‌పూర్ ఘటనను ఉద్దేశించి) బెంచ్ వ్యాఖ్యానించింది. ఇటువంటి వ్యక్తులు మతం కోసం మాట్లాడినట్లు కాదు. అసలు వీళ్లు ఇతర మతాలను గౌరవించే రకం కూడా కాదు. నోటి దురుసుతో దేశం మొత్తాన్ని రావణ కాష్టం చేశారని, యావత్ జాతికి ఆమె మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని సుప్రీం కోర్టు మండిపడింది. అయితే సుప్రీం కోర్టు బెంచ్‌లో జస్టిస్ సూర్యకాంత్.. నూపుర్‌ను ఉద్దేశించి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారని, తక్షణమే వాటిని వెనక్కి తీసుకోవాలంటూ ఫోరమ్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్, జమ్ము అండ్ లడఖ్ అనే సంస్థ లెటర్‌ను రిలీజ్ చేసింది. నూపుర్‌పై తీవ్రవ్యాఖ్యలతో న్యాయమూర్తులు లక్ష్మణరేఖ దాటారు.. తక్షణ దిద్దుబాటు అవసరం అంటూ ఈ మేరకు లేఖను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు పంపింది. An open letter has been sent to CJI NV Ramana, signed by 15 retired judges, 77 retd bureaucrats & 25 retd armed forces officers, against the observation made by Justices Surya Kant & JB Pardiwala while hearing Nupur Sharma's case in the Supreme Court. pic.twitter.com/ul5c5PedWU — ANI (@ANI) July 5, 2022 చదవండి: న్యాయవాది అని నూపుర్ చెప్పుకోవడం సిగ్గుచేటు- నూపుర్ -
Agnipath Scheme: ఈ మార్పులు మేలు
అగ్నిపథ్ పథకంపై రాజుకున్న అగ్గి ఇప్పట్లో చల్లారే సూచనలు కన్పించడం లేదు. మిలటరీ ఉద్యోగాల కోసం రెండేళ్లుగా రేయింబవళ్లు కష్టపడుతున్న వారికి నాలుగేళ్ల సర్వీసుతోనే రిటైరవ్వా లన్న నిబంధన మింగుడు పడలేదు. ఉద్యోగం లేక, పెన్షనూ రాక రోడ్డున పడతామన్న భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై కేంద్రం ఏం చెప్పినా ఫ్రస్ట్రేషన్లో ఉన్న యువత వినే పరిస్థితి లేదు. వారి అసంతృప్తిన చల్లార్చేలా పథకానికి చేయాల్సిన మార్పుచేర్పులను రిటైర్డ్ ఆర్మీ నిపుణులు ఇలా సూచిస్తున్నారు... కాలపరిమితి 12 ఏళ్లకు పెంచాలి అగ్నివీరులకు ప్రస్తుతం పేర్కొన్న నాలుగేళ్ల కాలపరిమితిని కనీసం 10 నుంచి 12 ఏళ్లకు పెంచాలని రిటైర్డ్ వింగ్ కమాండర్ ప్రఫుల్ భక్షి సూచించారు. ‘‘అప్పుడే సైన్యంలో చేరి సేవ చేసేందుకు యువత ముందుకొస్తుంది. పైగా కార్గిల్ వంటి యుద్ధాల్లో సత్తా చాటాలంటే 10–12 ఏళ్లయినా సైన్యంలో చేసి ఉండాలి. అదీగాక కేవలం ఆరు నెలల శిక్షణ కాలం అస్సలు చాలదు. నాలుగేళ్ల సర్వీసంటే గణతంత్ర పెరేడ్లలో పాల్గొనడానికే పనికొస్తారు’’ అన్నారు. సగం మందినైనా పర్మినెంట్ చేయాలి 25 శాతం మందినే పర్మినెంట్ చేయడం సబబు కాదని మేజర్ జనరల్ (రిటైర్డ్) బిఎస్ ధనోవా అభిప్రాయపడ్డారు. ‘‘50 శాతానికైనా పెంచితే మేలు. మిగతా వారికి సెంట్రల్ ఆర్మ్డ్ పారా మిలటరీ ఫోర్సెస్, రాష్ట్ర పోలీసు యంత్రాంగాల్లో ఉద్యోగ హామీ ఇవ్వాలి. భవిష్యత్తుకు భరోసా ఉండేలా పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టాలి’’ అని సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలి అగ్నిపథ్‌పై భయాందోళనలు నెలకొనడంతో తొలుత కొన్ని రెజిమెంట్లలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని, సాదక బాధకాలన్నీ తెలిసొచ్చాక అవసరమైన మార్పుచేర్పులతో పూర్తి స్థాయిలో అమలు చేయొచ్చని లెఫ్ట్‌నెంట్ జనరల్ (రిటైర్డ్) వినోద్ భాటియా అభిప్రాయపడ్డారు. ‘‘కేవలం నాలుగేళ్ల ఉద్యోగానికి ఎవరైనా ఎందుకు ముందుకొస్తారు? ఎందుకంత రిస్క్ తీసుకుంటారు?’’ అని ఆయనన్నారు. పథకాన్ని సమగ్రంగా ఆలోచించి రూపొందించినట్టు కన్పించడం లేదు. కనుక పైలెట్ ప్రాజెక్టుగా తెచ్చే ముందు కూడా మరిన్ని చర్చలు తప్పనిసరి’’ అన్నారు. మరింత చర్చ తప్పనిసరి పథకంపై మరింతగా చర్చ తప్పనిసరని బీఎస్ఎఫ్ మాజీ ఏడీజీ సంజీవ్ సూద్ అభిప్రాయపడ్డారు. నాలుగేళ్ల సర్వీసు తర్వాత 75 శాతం మందిని ఇంటికి పంపేయడం పథకంలో ప్రధాన లోపమన్నారు. ఇలా ఏటా లక్షల్లో యువకులు సాయుధ బలగాలను వీడితే వారి భవిష్యత్తుతో పాటు దేశ రక్షణా ప్రమాదంలో పడుతుంది. ‘‘ఇంతమందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ఇతరత్రా ఉద్యోగాలెలా కల్పిస్తారు? పైగా కేవలం 6 నెలల శిక్షణతో మూడున్నరేళ్లకు సర్వీసుకు తీసుకుంటే ఏ జవానూ పూర్తి సామర్థ్యంతో పని చేయలేడు’’ అన్నారు. పథకాన్ని పూర్తిగా వెనక్కు తీసుకోవడమో, కొన్ని బెటాలియన్లలో పైలెట్‌గా చేపట్టడమో చేయాలని సూచించారు. సైనిక నియామకాలు... ఏ దేశాల్లో ఎలా? అమెరికా అగ్రరాజ్యంలో సైన్యంలో చేరడం స్వచ్ఛందమే. సైనికులు నాలుగేళ్లు విధుల్లో ఉంటారు. తర్వాత మరో నాలుగేళ్లు వారిని రిజర్వ్‌లో ఉంచి అవసరమైనప్పుడు పిలుస్తారు. నాలుగేళ్లలో ప్రతిభ కనబరిచి మిలటరీనే వృత్తిగా తీసుకొని 20 ఏళ్లు సేవలందించిన వారికి మాత్రమే పింఛను, ఇతర భత్యాలుంటాయి. చైనా డ్రాగన్ దేశంలో నిర్బంధంగా సైన్యంలో చేరాల్సిందే. 18 ఏళ్లు పైబడిన మగవాళ్లంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో చేరి రెండేళ్లు విధిగా పని చేయాలి. పూర్తికాలం సైనికులుగా చేసి రిటైరైన వారికి సొంత వ్యాపారాలు చేసుకోవడానికి డిస్కౌంట్‌తో రుణాలు, పన్ను రాయితీలు ఇస్తారు. ఫ్రాన్స్ సైనికుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తారు. ముందు ఏడాది కాంట్రాక్ట్ ఇచ్చి క్రమంగా ఐదేళ్ల దాకా పొడిగిస్తారు. 19 ఏళ్లు సర్వీసులో ఉంటే పెన్షన్ ఇస్తారు. రష్యా సైన్యంలో నియామకాలు హైబ్రిడ్ విధానంలో జరుగుతాయి. నిర్బంధ, కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలుంటాయి. నిర్బంధంగా చేరిన వారికి ఏడాది శిక్షణ, ఏడాది సర్వీసు ఉంటుంది. తర్వాత వారు రిజర్వ్‌లో ఉంటారు. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్న సైనికులకు కాంట్రాక్ట్ ముగిశాక సైనిక విద్యా సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఇజ్రాయెల్ పురుషులతో పాటు మహిళలు కూడా నిర్బంధంగా సైన్యంలో చేరాల్సిం దే. మగవారు 32 నెలలు, మహిళలు 24 నెలలు పని చేయాలి. వీరిలో 10% మందిని పూర్తి స్థాయి సైనికులుగా నియమిస్తారు. ఏడేళ్ల కాంట్రాక్ట్ ఉంటుంది. ప్రతిభ కనబరిచిన వారు 12 ఏళ్లు పదవిలో ఉంటారు. వారికే పెన్షన్ అందుతుంది. పాకిస్తాన్ నియామకాలు స్వచ్ఛందమే. 17–25 ఏళ్ల వారిని పోటీ పరీక్షల ద్వారా తీసుకుంటారు. పూర్తికాలం పని చేసిన వారికే పెన్షన్, ఇతర భత్యాలు. కొందరిని రిజర్వ్‌లో ఉంచుతారు. వారికి బెనిఫిట్సేమీ ఉండవు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎంఐ–17వీ5 ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తు
న్యూఢిల్లీ: ఎంఐ–17వీ5 హెలికాప్టర్ ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తు ప్రారంభమైనట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో దర్యాప్తు సాగుతున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడి, సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లైఫ్ సపోర్టు సిస్టమ్‌పై ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రాణాలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. రాజ్‌నాథ్ గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడారు. హెలికాప్టర్ దుర్ఘటన గురించి తెలియజేశారు. ఐఏఎఫ్ ఆదేశాల మేరకు దర్యాప్తు బృందం బుధవారమే తమిళనాడులోని వెల్లింగ్టన్కు చేరుకుందని, వెంటనే రంగంలోకి దిగి, దర్యాప్తు ప్రారంభించిందని పేర్కొన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తోపాటు ఇతర సైనికుల అంత్యక్రియలను పూర్తి సైనిక లాంఛనాలతో నిర్వహిస్తామన్నారు. ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి ‘జనరల్ రావత్ షెడ్యూల్ ప్రకారం వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో విద్యార్థులు, అధికారులతో భేటీ కావాల్సి ఉంది. ఇందుకోసం సూలూరు ఎయిర్‌బేస్ నుంచి బుధవారం ఉదయం 11.48 గంటలకు వాయుసేనకు చెందిన ఎంఐ–17వీ5 హెలికాప్టర్లో బయలుదేరారు. 12.15 గంటలకు వెల్లింగ్టన్లో దిగాల్సి ఉండగా, సూలూరులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో హెలికాప్టర్‌కు మధ్యాహ్నం 12.08 గంటలకు సంబంధాలు తెగిపోయాయి. కూనూరు వద్ద అడవిలో మంటలు చెలరేగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్న హెలికాప్టర్ శిథిలాలు వారికి కనిపించాయి. స్థానిక అధికారులు, సహాయక సిబ్బంది చేరుకున్నారు. క్షతగాత్రులను బయటకు తీసి, వెల్లింగ్టన్లోని మిలిటరీ హాస్పిటల్‌కు తరలించారు. మాకు అందిన సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్లో మొత్తం 14 మంది ఉన్నారు. వీరిలో 13 మంది మరణించారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరిని సంఘటనా స్థలానికి పంపించాం’’ అని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ఉభయ సభల్లో నివాళులు తమిళనాడు నీలగిరి కొండల్లో చోటుచేసుకున్న దుర్ఘటనలో మరణించిన వారికి లోక్‌సభ, రాజ్యసభలో ఎంపీలు నివాళులర్పించారు. మృతుల ఆత్మశాంతి కోసం కొద్దిసేపు మౌనం పాటించారు. జనరల్ బిపిన్ రావత్ మృతిపట్ల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సంతాపం తెలిపారు. దేశం ఒక గొప్ప యోధుడు, వ్యూహకర్త, అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిపిన్ రావత్ అసాధారణమైన, ఎనలేని పేరు ప్రఖ్యాతలు కలిగిన సైనికాధిపతి అని రాజ్యసభలో డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ కొనియాడారు. రావత్ సంతాప సందేశాన్ని సభలో చదివి వినిపించారు. ఆయన అందించిన సేవలను దేశ ప్రజలు, సైనికులు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతిచెందడం బాధాకరం, దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజ్యసభలో ఎంపీలు మౌనం పాటించారు. బ్లాక్ బాక్స్ లభ్యం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్ దంపతులతోపాటు మరో 11 మందిని బలిగొన్న ఎంఐ–17వీ5 హెలికాప్టర్ ప్రమాదంపై ఆర్మీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కీలకమైన ఫ్లైట్ డేటా రికార్డర్(బ్లాక్ బాక్స్)ను గురువారం వెలికితీశారు. ఘటనా స్థలంలో గాలింపు చేపడుతుండగా 300 మీటర్ల దూరంలో ఇది లభ్యమైందని చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్‌లోని సమాచారం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ బాక్స్‌ను ఢిల్లీ లేదా బెంగళూరుకు తరలించి, సమాచారాన్ని విశ్లేషించాలని యోచిస్తున్నారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధినేత ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరి గురువారం ఘటనా స్థలాన్ని సందర్శించారు. సీనియర్ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. హెలికాప్టర్ ప్రమాదంపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో హెలికాప్టర్ వీడియో తమిళనాడులోని నీలగిరి కొండల్లో నేలకూలిన ఎంఐ–17వీ5 హెలికాప్టర్ పేరిట ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీన్ని నెటిజన్లు విస్తృతంగా షేర్ చేశారు. కొండపై దట్టమైన పొగమంచులో వెళ్తున్న హెలికాప్టర్ కొన్ని క్షణాల తర్వాత అదృశ్యమైనట్లు ఈ వీడియోలో రికార్డరయ్యింది. ఈ దృశ్యాన్ని ఓ పర్యాటకుడు చిత్రీకరించినట్లు చెబుతున్నారు. అయితే, ఈ వీడియోపై వైమానిక దళం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. -
ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
గుంటూరు వెస్ట్: భారీ బందోబస్తు, కఠిన ఆంక్షలు, ఫ్లడ్‌లైట్ల వెలుగుల మధ్య గురువారం తెల్లవారుజామున ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. గుంటూరులోని బీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఎంపికలకు ఏడు జిల్లాల నుంచి సుమారు 2వేల మంది హాజరయ్యారు. అభ్యర్థులకు ముందుగా స్క్రీనింగ్, ఎత్తు, సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. రన్నింగ్ ట్రాక్ తడిగా ఉండడంతో పొన్నూరు రోడ్డులో 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది అభ్యర్థులు కనీసం విద్యార్హత, కోవిడ్ నెగిటివ్, నో రిస్క్ సర్టిఫికెట్స్ తీసుకురాలేదు. వారికి 29న హాజరు కావాలని మరో అవకాశం కల్పించారు. 18 ఏళ్లలోపు యువకులు తల్లిదండ్రుల వద్ద నుంచి అనుమతి పత్రం తీసుకుని రావాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కొందరిని అనర్హులుగా ప్రకటించారు. కొందరు దళారులు స్టేడియం వద్ద అభ్యర్థులను మభ్యపెడుతున్న విషయాన్ని స్థానిక అధికారులు గుర్తించారు. పూర్తిగా ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలో ఎటువంటి సిఫార్సులు ఉండవని, దళారులను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు. కొన్ని కోచింగ్ సెంటర్లు కూడా రాత పరీక్షను పాస్ చేస్తామని చెబుతున్నాయని, దీనిని నమ్మవద్దని వారు కోరుతున్నారు. ఈ నెల 30 వరకు రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తారు. -
నేటి నుంచి మెగా ఆర్మీ రిక్రూట్మెంట్
గుంటూరు వెస్ట్: మెగా ఆర్మీ రిక్రూట్మెంట్కు గుంటూరులోని బీఆర్ స్టేడియం సిద్ధమైంది. గురువారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు జరగనున్న ఈవెంట్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి 34 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రోజూ 2,500 నుంచి 3,000 మంది వరకు అభ్యర్థులు అర్హత పోటీల్లో పాల్గొంటారు. కఠినమైన శారీరక, రాత పరీక్షలను దాటితేగానీ ఉద్యోగం సంపాదించే వీలుండదు. ఆర్మీ అధికారులు అభ్యర్థులకు ముందుగానే తేదీల వారీగా అడ్మిట్ కార్డులు ఆన్లైన్ ద్వారా జారీ చేశారు. ఇప్పటికే చాలా మంది గుంటూరుకు చేరుకున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌తో ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే వివిధ స్థాయిలకు సంబంధించిన 150 మంది ఆర్మీ అధికారులు స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్టెప్ సీఈవో డాక్టర్ శ్రీనివాసరావు లైజనింగ్ అధికారిగా ఉన్నారు. కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. అభ్యర్థులు మాస్క్‌తోపాటు శానిటైజర్ తెచ్చుకోవాలని సూచించారు. పోలీసుల పటిష్ట ఏర్పాట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. సుమారు 250 మంది సాయుధులైన పోలీసులతో పాటు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఆర్మీ అధికారులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ల నేతృత్వంతో రోడ్లు భవనాల శాఖ, జీఎంసీ, పోలీస్, మెడికల్ అండ్ హెల్త్, విద్యుత్ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 500 ఫ్లడ్లైట్స్, బారికేడ్లు, సీసీ కెమెరాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. వర్షం వల్ల ఇబ్బంది కలిగితే పొన్నూరు రోడ్డులో అదనపు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ క్రమశిక్షణతో మెలగాలి ఆర్మీ అధికారులతో కలిసి మన జిల్లా అధికారులు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో మెలగాలి. దేశానికి సేవ చేసే గొప్ప అవకాశం ఈ ఉద్యోగాల ద్వారా యువతకు లభిస్తుంది. ప్రతిభ ఆధారంగా ఆర్మీ ఆధ్వర్యంలో ఎంపిక ఉంటుంది. ఈ విషయం అభ్యర్థులు గుర్తించాలి. వర్షాలు పడినా ఇబ్బంది లేకుండా అదనపు ఏర్పాట్లు చేశాం. – వివేక్‌యాదవ్, కలెక్టర్ -
ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులపై సీబీ‘ఐ’
సాక్షి, విశాఖపట్నం: ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డులో వివిధ స్థాయిలో అధికారులను నియమించే సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ)లోని నియామకాల్లో కొంతమంది అధికారులు అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐకి ఫిర్యాదులు అందాయి. ఈ కేసులో ఆర్మీ ఉన్నతస్థాయి అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు ఉండటంతో సీబీఐ రంగంలోకి దిగి విచారించింది. దేశవ్యాప్తంగా విశాఖతో పాటు 30 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. అవినీతి, అక్రమాల్లో 15 మంది ఆర్మీ ఉన్నతస్థాయి అధికారులతో పాటు లెఫ్ట్‌నెంట్ కల్నల్ మేజర్ నాయిబ్ సుబేదార్, సీపోయ్‌లు, మరో ఆరుగురు ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉన్నట్లు గుర్తించింది. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆర్మీ అధికారుల మానవత్వం.. నెటిజన్లు ఫిదా!
ఆర్మీ అంటే దేశానికి సేవ చేయడమే కాదు ఏదైనా సమస్య వస్తే స్పందించే గుణం వారి సొంతమని ఆర్మీ మహిళా వైద్యాధికారులు నిరూపించారు. వివరాల్లోకి వెళితే.. 172 మిలిటరీ ఆస్పత్రికి చెందిన ఆర్మీ వైద్యులు కెప్టెన్ లలితా, కెప్టెన్ అమన్‌దీప్ హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా.. ఓ సహ ప్రయాణికురాలు శిశువును ప్రసవించే క్రమంలో ఆమెకు వైద్య సహాయం అవసరమైంది. ఈ నేపథ్యంలో ఆర్మీ వైద్యులు తమ వృత్తి ధర్మాన్ని పాటించారు. దగ్గరుండి ఆమెకు కాన్పు చేశారు. దీంతో సదరు ప్రయాణికురాలు పండంటి పాపకి జన్మనిచ్చింది. ఆర్మీ అధికారుల చొరవతో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఇండియన్ ఆర్మీ అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారిక ట్విటర్లో పేర్కొన్నారు. మహిళా అధికారులు చూపించిన మానవత్వానికి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మానవత్వం చూపించిన ఆర్మీ అధికారులే నిజమైన హీరోలంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పలువురు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ధైర్యానికి, మానవత్వానికి మహిళా అధికారులు నిదర్శనం.. ఏ సమయంలోనైనా ఆర్మీ తమకు రక్షణ కల్పిస్తుంది.. సైనికుడు ఎప్పుడూ విధుల్లో ఉంటాడంటూ నెటిజన్లు తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. -
ఇండియన్ ఆర్మీపై ఎంఎస్ ధోని టీవి షో..!
న్యూఢిల్లీ: ప్రపంచం గుర్తించేలా క్రికెట్లో ఎన్నో రికార్డులు సృష్టించిన మిస్టర్ పర్ఫెక్ట్ ధోని ఇండియన్ ఆర్మీపై ఎప్పటికప్పుడు తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు. ఎంఎస్ ధోని ప్రపంచకప్ తర్వాత బ్యాట్ పట్టలేదు. సైన్యంలో రెండు నెలలు పనిచేయాలంటూనే ఆ పని పూర్తయినా.. తన విరామాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే ఈ విరామ సమయంలో కూతురు జీవా, భార్య సాక్షితో సరదాగా వివిధ ప్రదేశాలను చుట్టేస్తున్నాడు. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా గౌరవాన్ని పొందిన మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు మన సైనికుల కోసం మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు. వారితో కలిసి కొంత కాలం పనిచేసినపుడు సైనికుల సమస్యల మీద కొంత అవగాహన ఏర్పడడంతో.. సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో తెలియజేసేందుకు సొంతంగా ఒక టీవీ షోని నిర్మించేందుకు ధోని సిద్దమయ్యాడు. భారతదేశ సాయుధ దళాల పనితనాన్ని అలాగే వారు దేశం కోసం చేసిన, చేస్తున్న కృషిని గురించి అందరికీ తెలియచేసేలా ఈ షో నిర్వహించనున్నారని తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక క్రికెటర్ ఒక మంచి పనికి సిద్దమవడం విశేషం. స్టార్ ప్లస్‌లో షో టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం. షో ఇంకా మొదలవ్వకముందే జనాల్లో ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ధోని నిర్మిస్తున్న ఈ షో సోనీ టీవీలో ప్రసారం అయ్యే అవకాశాలున్నాయి. కాగా..ధోని గత కొద్ది కాలంగా విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. -
డ్రెస్‌కోడ్‌ని పునఃసమీక్షిస్తాం
న్యూఢిల్లీ: రాజ్యసభలో మార్షల్స్ ధరించే యూనిఫాం తీరును తాజాగా మార్చిన విషయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆదేశించారు. నూతన డ్రెస్‌కోడ్‌పై సైనికాధికారుల నుంచి అభ్యంతరాలు రావడంతో వెంకయ్య పై విధంగా ఆదేశించారు. ఇప్పటివరకు మార్షల్స్ ధరిస్తోన్న భారత సాంప్రదాయ సఫారీ డ్రెస్, తలపాగా స్థానంలో సైనికాధికారులు ధరించే ముదురు నీలం రంగు, ముదురు ఆకుపచ్చరంగు యూనిఫాంలను రాజ్యసభ మార్షల్స్కి కేటాయించారు. అయితే ఇది సైనికాధికారులు ధరించే యూనిఫాంలను పోలి ఉందని అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై రాజకీయవేత్తలు, ఇతర ప్రముఖుల నుంచి అభ్యంతరాలు రావడంతో డ్రెస్‌కోడ్‌లో మార్పులను పునఃసమీక్షించాలని సచివాలయ సిబ్బందిని వెంకయ్య ఆదేశించారు. -
పునరావాసమే సవాల్!
తిరువనంతపురం/కొచ్చి: వర్షాలు తెరిపివ్వడంతో కేరళలో వరద ఉధృతి తగ్గినా కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. లక్షల మంది నిరాశ్రయులకు పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడం సవాల్‌గా మారింది. తిండి, నీరు, తాత్కాలిక ఆశ్రయం కల్పించడంతోపాటు అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వం, అధికారుల ముందు అతిపెద్ద సమస్యగా నిలిచింది. వరదల కారణంగా మృతుల సంఖ్య 376కు చేరింది. 5,645 పునరావాస కేంద్రాల్లో 7.24 లక్షల మంది నిరాశ్రయులున్నారు. మరోవైపు, పలుప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గకపోవడంతో నీటిలో చిక్కుకున్న వారిని కాపాడే కార్యక్రమాలు సాగుతున్నాయని సదరన్ కమాండ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ డీఆర్ సోనీ పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా ఇంకెవరు చిక్కుకుని ఉన్నారనే విషయం తెలుసుకుని.. ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ‘అందరినీ కాపాడి పూర్తి పునరావాసం కల్పించడంపైనే దృష్టిపెట్టాం’ అని ఆయన తెలిపారు. సహాయక బృందాలకు అవసరమైన కనీస సదుపాయాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్లు దాదాపుగా ముగిసినట్లేనని వైస్ అడ్మిరల్ గిరీశ్ లుథారా పేర్కొన్నారు. అక్కడక్కడ చిక్కుకుని ఉన్నవారిని గుర్తించామని వారిని కాపాడేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సహాయక చర్యలు ముమ్మరం ఇళ్లపైకప్పుల పైన, మిద్దెల పైన నిలబడి సాయం కోసం అర్థిస్తున్నారు. ఎవరైనా రాకపోతారా.. కాపాడకపోతారా అనే ఆశతో తిండితిప్పల్లేకుండా ఆశగా ఎదురుచూస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని శాటిలైట్ ఫోన్ల ద్వారా చేరుకుంటున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఎర్నాకులం జిల్లా పరూర్‌లో ఆదివారం రాత్రి ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వీడీ సతీశన్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న దాదాపు అందరినీ క్షేమంగా పునరావాస కేంద్రాలకు పంపించినట్లు ఆయన వెల్లడించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో ఇళ్లలో పేరుకుపోయిన బురద, రాళ్లురప్పలు తొలగించే పనులు కూడా ఊపందుకున్నాయి. ఈ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతోపాటు విద్యుత్ సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నారు. నేవల్ ఎయిర్‌బేస్, కొచ్చి పోర్టు ద్వారా.. కొచ్చి నేవల్ ఎయిర్‌బేస్‌లో వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. బెంగళూరునుంచి సరుకులతో వచ్చిన విమానం సోమవారం ఉదయం ఎయిర్‌బేస్‌లో ల్యాండైంది. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు 26వరకు విమానాల రాకపోకలకు అవకాశం లేకపోవడంతో.. కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాలనుంచి సహాయసామాగ్రి కోసం ఈ ఎయిర్‌బేస్‌నే వినియోగించనున్నారు. మరోవైపు, కేరళ పోర్టుకు కూడా వివిధ రాష్ట్రాలనుంచి సముద్రమార్గం ద్వారా సహాయ సామగ్రి రవాణా మొదలైంది. ముంబై నుంచి 800 టన్నుల స్వచ్ఛమైన నీరు, 18 టన్నుల సరుకుతో నేవల్షిప్ ఐఎన్ఎస్ దీపక్ చేరుకుందని కొచ్చి పోర్టు ట్రస్టు అధికారులు తెలిపారు. పోర్టునుంచే పునరావాస కేంద్రాలకు ట్రక్కుల్లో ఈ సామగ్రిని పంపిస్తున్నారు. మరోవైపు, కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మరో భారీ సరుకుల నౌక వల్లార్‌పదం పోర్టుకు చేరుకుంది. మరోవైపు, ముంబై నుంచి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు చెందిన భారీ నౌకలో 50వేల మెట్రిక్ టన్నుల ఇంధనం కూడా కొచ్చి పోర్టుకు చేరుకుంది. సహాయక కార్యక్రమాలు, ట్రక్కుల కోసం భారీగా ఇంధనం అవసరమైన నేపథ్యంలో బీపీసీఎల్ ఈ నౌకను పంపించింది. అటు, తిరువనంతపురం, ఎర్నాకులం మధ్య రైలు సేవలను పునరుద్ధరిస్తున్నారు. ట్రయల్‌రన్ తర్వాత సహాయకసామగ్రిని తరలించేందుకు ఈ ట్రాక్ కీలకంగా ఉపయోగపడుతుంది. మరోవైపు, తిరువనంతపురం నుంచి చెన్నై, ముంబై, బెంగళూరు, ఢిల్లీలకు రైలు సేవలు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. సాయం అందుతోంది! వరదకోరల్లో చిక్కుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రూ.3కోట్లు, అస్సాం ప్రభుత్వం రూ.3కోట్ల సాయం అందిస్తున్నట్లు ప్రకటించాయి. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు ఆయా ప్రభుత్వాలు వెల్లడించాయి. అటు, రూ.10 కోట్ల సాయం అందించిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2,500 టన్నుల బియ్యాన్ని ప్రత్యేక రైల్లో కేరళకు పంపించింది. కేంద్ర ప్రభుత్వం కూడా 100 మెట్రిక్ టన్నుల ధాన్యాలు, 52 మెట్రిక్ టన్నుల అత్యవసర మందులను సోమవారం కేరళకు పంపించింది. దీంతోపాటుగా 2,600 మెగావాట్ల విద్యుత్‌ను అందించేందుకు అంగీకారం తెలిపింది. జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్సీఎమ్సీ) కేరళలో వరద పరిస్థితి, అందుతున్న సాయంపై సమీక్ష నిర్వహించింది. తలచుకుంటేనే భయమేస్తోంది: బాధితులు అటు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారు కూడా భవిష్యత్తును తలచుకుని భయభ్రాంతులకు గురవుతున్నారు. తిరిగి ఇళ్లకు వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తలచుకుంటేనే ఒళ్లుగగుర్పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వరదలకు ముందుపరిస్థితి నెలకొనడం ఎలాగనేదే పెద్ద సమస్యంటున్నారు. ‘మళ్లీ ఇళ్లకు వెళ్లాక మా పరిస్థితేంటో అర్థం కావడం లేదు. సర్వం నష్టపోయాం. మా ఇళ్లను కట్టుకునేందుకు తగినంత సాయంకావాలి’ అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పునరావాస కేంద్రాల్లోనూ పరిస్థితి ఒకేలా లేదు. చాలాచోట్ల కనీస వసతులు కూడా ఇంకా ఏర్పాటుచేయలేదు. ఎర్నాకులంలోని ఓ కేంద్రంలో ఓ చిన్నారికి తట్టు (చికెన్ పాక్స్) సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆ చిన్నారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రత్యేక ఏర్పాట్లతో చికిత్సనందిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చల్లేందుకు అవసరమైన బ్లీచింగ్ పౌడర్ కొరత కారణంగా మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. రండి.. కాపాడుకుందాం: కేంద్రం పిలుపు వరదలతో అతలాకుతలమైన కేరళ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలు, బడా కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ‘విషాదకరమైన మానవత్వ సంక్షోభం’లో ఉన్న కేరళను ఆదుకునేందుకు తోచినంత సాయం చేయాలని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు విజ్ఞప్తి చేశారు. సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయదలచుకోవడం లేదని.. సహాయం చేయడం, చేసేవారిని కలుపుకుని వెళ్లడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం పారిశ్రామికవేత్తలు, సీఐఐ, ఫిక్కీ వంటి వ్యాపార సంస్థలు తదితరులతో అధికారులు మాట్లాడుతున్నారన్నారు. అటు కేరళనుంచి వివిధ ప్రాంతాలకు విమానచార్జీలు పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై మంత్రి స్పందిస్తూ.. విమానయాన కంపెనీలు మానవతాధృక్పథంతో వ్యవహరించాలన్నారు. అటు, కేరళ సాధారణస్థితికి చేరుకునేందుకు వందలు, వేల సంఖ్యలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు అవసరమని మరో కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ అన్నారు. జాతీయవిపత్తుగా గుర్తించబోం: కేంద్రం న్యూఢిల్లీ: కేరళలో వరద విలయాన్ని తీవ్రమైన విపత్తుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ‘కేరళలో వరదల తీవ్రత, కొండచరియలు విరిగిపడిన ఘటనలను, జరిగిన అపార నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని తీవ్రమైన ప్రకృతి విపత్తుగా గుర్తించాం’ అని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రకృతి ప్రకోపాన్ని అరుదైన/తీవ్రమైన విపత్తుగా గుర్తించినపుడు రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయస్థాయిలో సహాయం అందుతుంది. ఎన్డీఆర్ఎఫ్ నిధి నుంచి అదనపు సాయంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య 3:1 నిష్పత్తితో విపత్తు సహాయ నిధి (సీఆర్ఎఫ్)ను ఏర్పాటుచేస్తారు. ఈ నిధిలో డబ్బులు తగ్గినపుడు నేషనల్ కెలామిటీ కంటిన్జెన్సీఫండ్ (100%కేంద్ర నిధులు) నుంచి సాయం అందిస్తారు. తీవ్రమైన విపత్తు ప్రకటించిన ప్రాంతాల్లో బాధితుల రుణాల చెల్లింపులో వెసులుబాటు, కొత్త రుణాలు ఇచ్చే అవకాశాన్ని చూస్తారు. కేరళ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించబోమని కేరళ హైకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం ఈ విషయం తెలిపింది. ‘కేరళ విపత్తు తీవ్రమైనది. జాతీయ విపత్తు నిర్వహణ నిబంధనల ఆధారంగా దీన్ని లెవల్ 3 విపత్తుగా గుర్తించాం. ఎంత పెద్ద విపత్తు ఎదురైనా ఈ నిబంధనల ఆధారంగానే కేటగిరీలు నిర్ణయిస్తాం. కేరళ వరదల విలయాన్ని జాతీయ విపత్తుగా గుర్తించబోవడం లేదు’ అని పేర్కొంది. తగ్గిన కర్ణాటక వరదలు కర్ణాటకలోని కొడగు జిల్లాలో నాలుగురోజులుగా బీభత్సం సృష్టించిన వరద తగ్గుముఖం పట్టింది. జిల్లాలోని అన్ని హోటళ్లు, లాడ్జీల్లో పర్యాటకుల బుకింగ్స్‌ను రద్దుచేసి నిరాశ్రయులకు గదులు కేటాయించారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, సైన్యం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఒక్కో కుటుంబానికి రూ.3,800 చొప్పున మధ్యంతర సహాయం అందించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. అలువా జిల్లాలో అంటువ్యాధులు సోకకుండా మందుల పంపిణీ కొచ్చి ఆడిటోరియంలో బాధితుల కోసం సహాయ సామగ్రిని సిద్ధం చేస్తున్న వాలంటీర్లు -
ఏడాదిగా జీవచ్ఛవంలా బతుకుతున్నా
శ్రీనగర్ / న్యూఢిల్లీ: ఆర్మీ అధికారులు తనను మానవకవచంగా వాడుకున్న తర్వాత జీవితం నరకప్రాయమైందని కశ్మీరీ ఎంబ్రాయిడరీ కళాకారుడు ఫరూక్ అహ్మద్ దార్(28) ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీనగర్ ఎన్నికల్లో ఓటేయడంతో భారత ప్రభుత్వ ఏజెంట్‌గా ముద్రవేసిన సొంత గ్రామస్తులు తనను సామాజికంగా బహిష్కరించారని వాపోయాడు. ‘ నేను కనీసం నిద్రపోలేకపోతున్నాను. మందులు కూడా పనిచేయడం లేదు. నాకు ఎవ్వరూ పని ఇవ్వడం లేదు. ఆరోజు ఓటేయడానికి వెళ్లడమే నా తప్పా?’ అని దార్ కన్నీటి పర్యంతమయ్యాడు. తన తల్లి ఫైజాబేగం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోందనీ, ఆమె చికిత్సకు ఇంట్లో డబ్బులులేవని దార్ ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం దినసరి కూలీగా పనిచేసుకుందామన్నా ఎవ్వరూ పని ఇవ్వడం లేదని పేర్కొన్నాడు. గతేడాది ఏప్రిల్ 9న శ్రీనగర్ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బుద్గామ్ జిల్లాలో ఆర్మీ వాహనాలపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనాకారుల్ని అదుపుచేసేందుకు మేజర్ లీతుల్ గొగోయ్ దార్‌ను జీప్ బానెట్‌కు తాడుతో కట్టేసి 28 గ్రామాలకు తిప్పారు. రాళ్లు విసిరిన అల్లరిమూకలో దార్ ఒకడని ఆర్మీ వాదించగా, అతను రాళ్లు విసరలేదని కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు తేల్చాయి. -
పత్రిబల్ ఎన్కౌంటర్లో ఆర్మీకి నోటీసులు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన పత్రిబల్ ఎన్కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. బూటకపు ఎన్కౌంటర్ ఆరోపణల నేపథ్యంలో సైన్యానికి నోటీసులు జారీ చేసింది. ఎన్కౌంటర్ లో ఆర్మీ అధికారుల హస్తం లేదంటూ సైన్యం ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ బాధిత కుటుంబాలు ఓ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ‘డీఎన్ఏ పరీక్షల్లో సైన్యం చంపింది కశ్మీర్ ప్రజలనే అని తేలింది. సీబీఐ దర్యాప్తు కూడా నిజమేనని ధృవీకరించింది. హైదరాబాద్, కోల్‌కతాలోని ఫోరెనిక్స్ ల్యాబ్ ల నివేదికలు కూడా మాత్రం చనిపోయిన వాళ్లు బాధిత కుటుంబ సభ్యులేనని నిర్థారించాయి. అలాంటప్పుడు ఇవి ముమ్మాటికీ సైన్యం చేసిన హత్యలే’అని పిటిషన్ లో బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పిటిషనర్ వాదనతో ఏకీ భవించిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, సీబీఐ మరియు సైన్యానికి ఆరువారాల గడువు విధిస్తూ నోటీసులు జారీచేసింది. ఎన్కౌంటర్.. ఏం జరిగిందంటే... 2000 సంవత్సరం మార్చిలో అనంతనాగ్ జిల్లాలో అయిదుగురు పౌరులను సైన్యం కాల్చిచంపింది. వీరంతా సరిహద్దులకు ఆవలినుంచి చొరబడి వచ్చిన లష్కరే తొయిబా ఉగ్రవాదులని ప్రకటించింది. అంతకు కొన్ని రోజుల క్రితం కశ్మీర్‌లోని చిట్టిసింగ్‌పురా అనేచోట కూలీలుగా పనిచేస్తున్న 36 మంది సిక్కులను హతమార్చిన ఉగ్రవాదులు ఈ అయిదుగురేనని తెలిపింది. అయితే బాధిత కుటుంబాలు మాత్రం సైన్యం బూటకపు ఎన్కౌంటర్ చేసిందని ఆరోపించాయి. మానవహక్కుల సంఘం జోక్యం చేసుకోవటంతో చివరకు సీబీఐ చేతికి కేంద్రం దర్యాప్తును అప్పగించింది. మరోవైపు డీఎన్ఏ పరీక్షల్లో ఎన్కౌంటర్ మృతులంతా కశ్మీర్వాసులేనని తేలింది. సీబీఐ దర్యాప్తు నివేదిక సైతం సైన్యాన్ని తప్పుబట్టింది. ఒక బ్రిగేడియర్, ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఇద్దరు మేజర్లు, ఒక సుబేదారు ఈ నేరంలో భాగస్వాములని నిర్ధారించింది. కింది కోర్టులో సీబీఐ చార్జిషీటు దాఖలుచేసినప్పుడు సాయుధ దళాల (ప్రత్యేకాధికారాల) చట్టం ప్రకారం తమను విచారించడానికి ముందస్తు అనుమతులు తీసుకోవాలని చార్జిషీటులోని సైనికాధికారులు అభ్యంతరం లేవనెత్తారు. దీంతో బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. -
ఉగ్రవాదుల డంప్ స్వాధీనం
శ్రీనగర్: ఆర్మీ అధికారులతో పాటు జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ‘ఆపరేషన్ క్లీన్ అప్’ చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా బలగాలు ఉగ్రవాదుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. జమ్ము కశ్మీర్‌లోని రజౌరీ పర్వత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన బలగాలు పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని గుర్తించారు. అందులో ఓ ఏకే-47, ఓ ఏకే 57, ఓ పిస్టల్, 5 గ్రానెడ్లు, రెండు మ్యాగ్జీన్లు, 639 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
ఆర్మీ వస్తే.. మహిళలను ఎత్తుకెళ్లి రేప్ చేస్తారు!
కేరళ సీపీఎం నాయకుడు కొడియెరి బాలకృష్ణన్ భారత సైన్యంపై సంచలన ఆరోపణలు చేశారు. కన్నూర్ ప్రాంతంలో ఆర్మీని మోహరిస్తే.. ప్రజలకు, సైనికులకు మధ్య ఘర్షణ తప్పదని అన్నారు. దాంతోపాటు, ఆర్మీవాళ్లు మహిళలను ఎత్తుకుపోయి రేప్ చేస్తారని, ప్రజలను పిట్టల్లా కాల్చిపారేస్తారని ఆరోపించారు. ఆర్మీవాళ్లు ఎవరినైనా ఏమైనా చేయొచ్చని, నలుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట నిలబడి కనిపిస్తే వాళ్లను కాల్చి పారేయొచ్చని, అలాగే మహిళలను ఎత్తుకుపోయి రేప్ చేసినా వాళ్లనెవరూ ప్రశ్నించలేరని, ఆర్మీ ఎక్కడున్నా ఇదే పరిస్థితి అని ఆయన కన్నూరులో జరిగిన ఓ సమావేశంలో చెప్పారు. మే 12వ తేదీన కన్నూరు జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తను నరికి చంపిన ఘటన తర్వాత ఆ జిల్లాలో సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) అమలు చేయాలని కేరళ బీజేపీ అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్ డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తను చంపింది సీపీఎం వాళ్లేనని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆరోపిస్తోంది. యుద్ధం లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సైన్యానికి స్వేచ్ఛ ఇవ్వాలని రక్షణ మంత్రిత్వశాఖను కూడా చూస్తున్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల వ్యాఖ్యానించారు. సమయానికి తగినట్లుగా ఆర్మీ అధికారులు చర్యలు తీసుకోవాలి తప్ప ఎంపీలను అడగాల్సిన పరిస్థితి వాళ్లకు ఉండకూడదని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూనే బాలకృష్ణన్ సైన్యం గురించి వ్యాఖ్యానించారు. కన్నూరు రాజకీయ హత్యలలో సీపీఎం కార్యకర్తల హస్తం ఉందని తెలిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోడానికి వెనకాడబోమని, కానీ సైన్యాన్ని రప్పించడం, ఏఎఫ్ఎస్పీఏ అమలు లాంటివి చేస్తే మాత్రం అగ్నికి ఆజ్యం తోడవుతుందని అన్నారు. -
పోలీసులు, ఆర్మీ అధికారుల తీరుతో అభ్యర్థుల అవస్థలు
ఆరో రోజు 805 మంది అభ్యర్థుల ఎంపిక అర్హత ఉన్నా అడ్డుకుంటున్న వైనం పీఎన్‌కాలనీ : పోలీసులు, సైనిక అధికారుల తీరుతో ఆర్మీ రిక్రూట్మెంటు ర్యాలీలో పాల్గొంటున్న అభ్యర్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అర్హత ఉన్నా అడ్డుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడిరామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్ కళాశాలలో బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, యానాం ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు సోల్జర్ టెక్నికల్స్ విభాగంలో ఎంపికలు నిర్వహించారు. వీరికి పరుగు పందెం నిర్వహించగా 805 మంది అర్హత సాధించారు. అనంతరం విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల అభ్యర్థులకు 3,500 టోకెన్లు అందజేశారు. వీరిలో 1100 మందికి మాత్రమే గురువారం పరుగుపందెం నిర్వహించనున్నట్టు రిక్రూట్మెంట్ డెరైక్టర్ కల్నల్ ఏకే సింగ్ తెలిపారు. కాగా ఎంపికల్లో భాగంగా పరుగుపందెంలో పాల్గొంటున్న అభ్యర్థులను సమయం పూర్తికాకముందే ఆర్మీ అధికారులు, పోలీసులు పక్కకు నెట్టేయడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఎంపికల్లో భాగంగా నాలుగు రౌండ్లు పూర్తి చేయాల్సి ఉండగా రెండు రౌండ్లలోనే వెనుకబడిన వారిని పక్కకు నెట్టేస్తున్న వైనం బుధవారం కనిపించింది. -
ముస్తఫా కేసులో ఏ దర్యాప్తుకైనా సిద్ధమే
హైకోర్టుకు నివేదించిన సైనికాధికారులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో ఉన్న సైనిక ప్రాంతంలో గత ఏడాది అక్టోబర్ 9న వెలుగుచూసిన షేక్ ముస్తఫాయుద్దీన్ అనే తొమ్మిదేళ్ల బాలుడి అనుమానాస్పద మృతిపై నమోదైన కేసును ఏ దర్యాప్తు సంస్థకు అప్పగించినా అభ్యంతరం లేదని సైనికాధికారులు హైకోర్టుకు నివేదించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడంతోపాటు ఈ ఘటనకు బాధ్యులైన మిలటరీ అధికారులపై కేసు నమోదుచేసేలా పోలీసులను ఆదేశించాలంటూ గతవారం హైకోర్టులో గులాం రబ్బానీ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్‌పై సైనిక క్యాంప్ కమాం డెంట్ అతుల్ దేవ్లీ కౌంటర్ దాఖలు చేశారు. ఇద్దరు సైనికాధికారులే తనకు నిప్పంటించినట్లు మరణ వాంగ్మూలంలో బాలుడు పేర్కొన్నా.. పోలీసులు ఇప్పటివరకు వారిని అరెస్ట్ చేయలేదని ఆయన ఆరోపించగా సైనికాధికారులు దీన్ని తోసిపుచ్చారు. వదంతుల ఆధారంగా తమను నేరస్తులుగా చిత్రీకరించడం న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. ముస్తఫా మృతితో సంబంధం ఉందన్న కారణంగా లాన్స్‌నాయక్ అప్పలరాజు ఆత్మహత్య చేసుకోలేదని, ఈ కేసులో పోలీసుల విచారణ ఒత్తిడి కారణంగా అప్పలరాజు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని దేవ్లీ తన కౌంటర్లో పేర్కొన్నారు. విలువైన సైనిక క్యాంపస్ భూమిపై రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను ఆశిస్తున్న కొన్ని శక్తుల ప్రమేయాన్ని ఈ కేసుల్లో అనుమతించొద్దని ఆయన కోర్టును కోరారు. పిటిషనర్ ఆరోపణల్లో ఆధారాలు లేనందున ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని ఆయన కోర్టును కోరారు.