ఆర్మీ వస్తే.. మహిళలను ఎత్తుకెళ్లి రేప్ చేస్తారు! | Army can abduct and rape women, comments kerala cpm leader balakrishnan | Sakshi
Sakshi News home page

ఆర్మీ వస్తే.. మహిళలను ఎత్తుకెళ్లి రేప్ చేస్తారు!

Published Fri, May 26 2017 6:32 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

ఆర్మీ వస్తే.. మహిళలను ఎత్తుకెళ్లి రేప్ చేస్తారు! - Sakshi

ఆర్మీ వస్తే.. మహిళలను ఎత్తుకెళ్లి రేప్ చేస్తారు!

కేరళ సీపీఎం నాయకుడు కొడియెరి బాలకృష్ణన్ భారత సైన్యంపై సంచలన ఆరోపణలు చేశారు. కన్నూర్ ప్రాంతంలో ఆర్మీని మోహరిస్తే.. ప్రజలకు, సైనికులకు మధ్య ఘర్షణ తప్పదని అన్నారు. దాంతోపాటు, ఆర్మీవాళ్లు మహిళలను ఎత్తుకుపోయి రేప్ చేస్తారని, ప్రజలను పిట్టల్లా కాల్చిపారేస్తారని ఆరోపించారు. ఆర్మీవాళ్లు ఎవరినైనా ఏమైనా చేయొచ్చని, నలుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట నిలబడి కనిపిస్తే వాళ్లను కాల్చి పారేయొచ్చని, అలాగే మహిళలను ఎత్తుకుపోయి రేప్ చేసినా వాళ్లనెవరూ ప్రశ్నించలేరని, ఆర్మీ ఎక్కడున్నా ఇదే పరిస్థితి అని ఆయన కన్నూరులో జరిగిన ఓ సమావేశంలో చెప్పారు.

మే 12వ తేదీన కన్నూరు జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తను నరికి చంపిన ఘటన తర్వాత ఆ జిల్లాలో సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ) అమలు చేయాలని కేరళ బీజేపీ అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్ డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తను చంపింది సీపీఎం వాళ్లేనని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆరోపిస్తోంది. యుద్ధం లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సైన్యానికి స్వేచ్ఛ ఇవ్వాలని రక్షణ మంత్రిత్వశాఖను కూడా చూస్తున్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల వ్యాఖ్యానించారు.

సమయానికి తగినట్లుగా ఆర్మీ అధికారులు చర్యలు తీసుకోవాలి తప్ప ఎంపీలను అడగాల్సిన పరిస్థితి వాళ్లకు ఉండకూడదని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూనే బాలకృష్ణన్ సైన్యం గురించి వ్యాఖ్యానించారు. కన్నూరు రాజకీయ హత్యలలో సీపీఎం కార్యకర్తల హస్తం ఉందని తెలిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోడానికి వెనకాడబోమని, కానీ సైన్యాన్ని రప్పించడం, ఏఎఫ్‌ఎస్‌పీఏ అమలు లాంటివి చేస్తే మాత్రం అగ్నికి ఆజ్యం తోడవుతుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement