శ్రీనగర్ / న్యూఢిల్లీ: ఆర్మీ అధికారులు తనను మానవకవచంగా వాడుకున్న తర్వాత జీవితం నరకప్రాయమైందని కశ్మీరీ ఎంబ్రాయిడరీ కళాకారుడు ఫరూక్ అహ్మద్ దార్(28) ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీనగర్ ఎన్నికల్లో ఓటేయడంతో భారత ప్రభుత్వ ఏజెంట్‌గా ముద్రవేసిన సొంత గ్రామస్తులు తనను సామాజికంగా బహిష్కరించారని వాపోయాడు. ‘ నేను కనీసం నిద్రపోలేకపోతున్నాను. మందులు కూడా పనిచేయడం లేదు. నాకు ఎవ్వరూ పని ఇవ్వడం లేదు. ఆరోజు ఓటేయడానికి వెళ్లడమే నా తప్పా?’ అని దార్ కన్నీటి పర్యంతమయ్యాడు.
తన తల్లి ఫైజాబేగం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోందనీ, ఆమె చికిత్సకు ఇంట్లో డబ్బులులేవని దార్ ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం దినసరి కూలీగా పనిచేసుకుందామన్నా ఎవ్వరూ పని ఇవ్వడం లేదని పేర్కొన్నాడు. గతేడాది ఏప్రిల్ 9న శ్రీనగర్ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బుద్గామ్ జిల్లాలో ఆర్మీ వాహనాలపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనాకారుల్ని అదుపుచేసేందుకు మేజర్ లీతుల్ గొగోయ్ దార్‌ను జీప్ బానెట్‌కు తాడుతో కట్టేసి 28 గ్రామాలకు తిప్పారు. రాళ్లు విసిరిన అల్లరిమూకలో దార్ ఒకడని ఆర్మీ వాదించగా, అతను రాళ్లు విసరలేదని కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు తేల్చాయి.
Comments
Please login to add a commentAdd a comment