ఉగ్రవాదుల డంప్ స్వాధీనం
Published Sun, Aug 6 2017 1:43 PM | Last Updated on Mon, Sep 11 2017 11:26 PM
శ్రీనగర్: ఆర్మీ అధికారులతో పాటు జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ‘ఆపరేషన్ క్లీన్ అప్’ చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా బలగాలు ఉగ్రవాదుల డంప్ను స్వాధీనం చేసుకున్నారు. జమ్ము కశ్మీర్లోని రజౌరీ పర్వత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన బలగాలు పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని గుర్తించారు. అందులో ఓ ఏకే-47, ఓ ఏకే 57, ఓ పిస్టల్, 5 గ్రానెడ్లు, రెండు మ్యాగ్‌జీన్లు, 639 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement