అనిల్‌కు ఎన్‌సీసీ గ్రూప్ కమాండెంట్ అభినందనలు
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : ఎన్‌సీసీ క్యాడట్‌గా శిక్షణ పొందిన పిన్నింటి అనిల్ ఇండియన్ నావల్ ఆఫీసర్ లెప్టినెంట్ సర్జన్‌గా ఎంపికయ్యారు. కాగా, పిన్నింటి అనిల్ హన్మకొండకు వచ్చిన సందర్భంగా ఆదివారం ఎన్‌సీసీ వరంగల్ గ్రూప్ కమాండర్ కల్నల్ యుఎస్ మితర్వాల్‌ను కలిశారు. నావల్ ఆఫీసర్‌గా ఎంపికయినందుకు అనిల్‌ను అభినందించారు. హన్మకొండ భవాని నగర్‌కు చెందిన పిన్నింటి అనిల్ సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ పాఠశాల విద్యను అభ్యసించారు. 2001-02లో ఎన్‌సీసీ ‘ఏ’ సర్టిఫికెట్ పాసయ్యాడు. 2005-11 వరకు కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు.
2013 ఫిబ్రవరిలో ఈస్ట్రన్ నావెల్ కమాండ్‌లో ఇండియన్ నేవీ ఆఫీసర్ సర్జన్‌గా, కల్యాణి వైజాగ్ కమాండ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం వెస్ట్రన్ నావెల్ కమాండ్ ఆఫీసర్‌గా ముంబయిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇతడి తల్లిదండ్రులు పిన్నింటి వాసవి, సురేందర్‌రావు భవానీనగర్‌లో నివాసముంటున్నారు. ఎన్‌సీసీ వరంగల్ గ్రూప్ అడ్మినిస్రేటివ్ ఆఫీసర్ కల్నల్ శ్రీనివాస్, ట్రైనింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎం.ఎల్.శర్మ, 10 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ కేఎస్‌పీఎస్ ప్రసాద్, సెకండ్ ఆఫీసర్ జి.ప్రేంచంద్రశేఖర్, సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ జి.మథ్యాస్‌రెడ్డి, సునీతరెడ్డి నావల్ ఆఫీసర్‌గా ఎంపికయిన అనిల్‌ను అభినందించారు.