ML sharma
-
‘సీబీఐని నిరోధించే అధికారం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని రాష్ట్రంలోకి ప్రవేశించకుండా నిరోధించే అధికారం రాష్ట్రాలకు లేదని సుప్రీం కోర్టు న్యాయవాది ఎం.ఎల్ శర్మ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీబీఐ విచారణ చేపట్టే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీబీఐని పూర్తిగా నియంత్రించే అధికారం రాష్ట్రానికి ఉండదన్నారు. కేసులను బట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నియంత్రణ విధించవచ్చని, కానీ ఏకమొత్తంగా సీబీఐని నిరోధించడం సాధ్యం కాదన్నారు. షెడ్యూల్ 7ఏ ప్రకారం సీబీఐపై పార్లమెంట్‌కు అధికారం ఉందని, ఇది రాజ్యంగ పరమైన సంక్లిష్ట సమస్యగా ఈ జీవోను కోర్టు కొట్టేస్తుందని పేర్కొన్నారు. షెడ్యూల్ 7 ప్రకారం కేంద్రానికి సీబీఐపై అధికారం ఉదని, పార్లమెంట్ చట్టానికి వ్యతిరేకంగా కన్సెండ్ ఇవ్వడానికి వీలులేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ ప్రభుత్వం ఈ జీవో తెచ్చినట్లు అర్థమవుతోందన్నారు. ఈ కేసును చాలా సూక్ష్మంగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. సెక్షన్ 6 కొట్టివేయాలని సుప్రీంకోర్టులో సోమవారం కేసు వేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిషేధం విధిస్తుందో కారణాలు చెప్పాలని, సుప్రీంకోర్టు ఈ విషయాల్లో తప్పనిసరిగా డైరెక్షన్స్ ఇస్తుందన్నారు. ఈ జీవోను నిరోధిస్తూ తక్షణమే కేంద్రం ఆర్డినెన్సు తీసుకురావాలన్నారు. టీడీపీ ఎంపీ పై ఇప్పటికే ఐటీ సోదాలు జరిగాయని, ఈ నేపథ్యంలోనే భయంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుందన్నారు. చదవండి: ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ -
అతడు రేపిస్టు కన్నా డేంజర్: వర్మ
భిన్నంగా ఉంటూ నిత్యం ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మహిళా దినోత్సవం సందర్భంగా కాస్త సానుకూలంగా స్పందించారు. పురుషుడిలాగే మహిళలు ఎలా జీవించాలనుకుంటున్నారో అలాంటి స్వేచ్ఛ వారికి కావాలని చెప్పారు. మహిళల స్వేచ్ఛ గురించి తానిన్ని తక్కువ మాటల్లో వర్ణించగలిగినందుకు సంతోషపడుతున్నానని అన్నారు. ఓ మహిళ గురించి మరో మహిళ చేసే ప్రకటన ఎప్పటికీ చాలా అందంగా, గొప్పగా ఉంటుందని, ఆ విషయాన్ని రాజకీయ నాయకులు, నీతులను గురించి మాట్లాడే పెద్దలు ఓ సారి ఆలోచించాలని చెప్పారు. అదే సమయంలో, ఒక చిత్రం ఎన్నో మాటలు చెప్పగలదని, ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీకి ఇంటర్వ్యూ ఇచ్చిన న్యాయవాది ఎంఎల్ శర్మ లైంగిక దాడులు చేసేవాళ్లకన్నా చాలా భయంకరమైనవాడంటూ ఆయన ట్వీట్ చేశారు. మరోపక్క, పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్న చిత్రం జ్యోతిలక్ష్మీ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ బహుమతిలాంటిదని చెప్పారు. -
అనిల్‌కు ఎన్సీసీ గ్రూప్ కమాండెంట్ అభినందనలు
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : ఎన్సీసీ క్యాడట్గా శిక్షణ పొందిన పిన్నింటి అనిల్ ఇండియన్ నావల్ ఆఫీసర్ లెప్టినెంట్ సర్జన్‌గా ఎంపికయ్యారు. కాగా, పిన్నింటి అనిల్ హన్మకొండకు వచ్చిన సందర్భంగా ఆదివారం ఎన్సీసీ వరంగల్ గ్రూప్ కమాండర్ కల్నల్ యుఎస్ మితర్వాల్ను కలిశారు. నావల్ ఆఫీసర్‌గా ఎంపికయినందుకు అనిల్‌ను అభినందించారు. హన్మకొండ భవాని నగర్‌కు చెందిన పిన్నింటి అనిల్ సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ పాఠశాల విద్యను అభ్యసించారు. 2001-02లో ఎన్సీసీ ‘ఏ’ సర్టిఫికెట్ పాసయ్యాడు. 2005-11 వరకు కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. 2013 ఫిబ్రవరిలో ఈస్ట్రన్ నావెల్ కమాండ్‌లో ఇండియన్ నేవీ ఆఫీసర్ సర్జన్‌గా, కల్యాణి వైజాగ్ కమాండ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం వెస్ట్రన్ నావెల్ కమాండ్ ఆఫీసర్‌గా ముంబయిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇతడి తల్లిదండ్రులు పిన్నింటి వాసవి, సురేందర్‌రావు భవానీనగర్‌లో నివాసముంటున్నారు. ఎన్సీసీ వరంగల్ గ్రూప్ అడ్మినిస్రేటివ్ ఆఫీసర్ కల్నల్ శ్రీనివాస్, ట్రైనింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎం.ఎల్.శర్మ, 10 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ కేఎస్పీఎస్ ప్రసాద్, సెకండ్ ఆఫీసర్ జి.ప్రేంచంద్రశేఖర్, సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ జి.మథ్యాస్‌రెడ్డి, సునీతరెడ్డి నావల్ ఆఫీసర్‌గా ఎంపికయిన అనిల్‌ను అభినందించారు. -
దుర్గాశక్తి సస్పెన్షన్‌పై 12న విచారణ
న్యూఢిల్లీ: ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపి సస్పెన్షన్‌కు గురైన ఉత్తరప్రదేశ్ యువ ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్‌పాల్ వ్యవహారం అత్యున్నత న్యాయస్థానాన్ని చేరుకుంది. ఆమెపై చేపట్టిన అన్ని చర్యలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనవ్యాజ్యం(పిల్)పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై ఈనెల 12న విచారణ నిర్వహించనున్నట్లు చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. దుర్గాశక్తికి వ్యతిరేకంగా యూపీ సర్కారు చేపట్టిన చర్యలు దురుద్దేశంతో కూడుకున్నవని, అవి చెల్లవని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఎంఎల్ శర్మ పేర్కొన్నారు. ఇది రాజ్యాంగాన్ని కించపరచటమేనన్నారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా మతపరమైన భవనాల నిర్మాణాన్ని నిరోధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాటించినందుకు దుర్గాశక్తి తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని, అత్యున్నత న్యాయస్థానం ఆమెను కాపాడాలని అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలను పిటిషనర్ ప్రతివాదులుగా పేర్కొన్నారు. మీడియాది అత్యుత్సాహం: ఆజంఖాన్ దుర్గాశక్తి నాగ్‌పాల్ సస్పెన్షన్ విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని యూపీ మంత్రి ఆజంఖాన్ మండిపడ్డారు. నాగ్‌పాల్‌ను దుర్గామాతలా ప్రచారంచేస్తూ ఎక్కువ చేసి చూపుతోందని విమర్శించారు. ఐఏఎస్ అధికారులు లేకుండానే రాష్ట్రాన్ని నడుపుతామంటూ కొందరు అధికార ఎస్పీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆజంఖాన్ సమర్థించారు. దేశంలోని 125 కోట్ల జనాభాకు కేవలం వెయ్యి నుంచి రెండు వేల మంది ఐఏఎస్ అధికారులున్నారని...వారి బదులు ఇతరులు దేశా న్ని నడపలేరా? అని ప్రశ్నించారు. బ్రిటీష్‌కాలం నాటి సివిల్ సర్వీసు వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్య లు తీసుకుంటామని మరోమంత్రి శివ్‌పాల్‌సింగ్ యాదవ్ హెచ్చరించారు. మరోవైపు దుర్గాశక్తి సస్పెన్షన్ వేటును వెన క్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐపీఎస్ అధికారుల సం ఘం యూపీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు లేఖ రాసింది.