అతడు రేపిస్టు కన్నా డేంజర్: వర్మ | M L Sharma the lawyer looks more dangerous than the rapists: ramgopal varma | Sakshi
Sakshi News home page

అతడు రేపిస్టు కన్నా డేంజర్: వర్మ

Published Sun, Mar 8 2015 1:09 PM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM

అతడు రేపిస్టు కన్నా డేంజర్: వర్మ

అతడు రేపిస్టు కన్నా డేంజర్: వర్మ

భిన్నంగా ఉంటూ నిత్యం ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మహిళా దినోత్సవం సందర్భంగా కాస్త సానుకూలంగా స్పందించారు. పురుషుడిలాగే మహిళలు ఎలా జీవించాలనుకుంటున్నారో అలాంటి స్వేచ్ఛ వారికి కావాలని చెప్పారు. మహిళల స్వేచ్ఛ గురించి తానిన్ని తక్కువ మాటల్లో వర్ణించగలిగినందుకు సంతోషపడుతున్నానని అన్నారు. ఓ మహిళ గురించి మరో మహిళ చేసే ప్రకటన ఎప్పటికీ చాలా అందంగా, గొప్పగా ఉంటుందని,  ఆ విషయాన్ని రాజకీయ నాయకులు, నీతులను గురించి మాట్లాడే పెద్దలు ఓ సారి ఆలోచించాలని చెప్పారు.

 

అదే సమయంలో, ఒక చిత్రం ఎన్నో మాటలు చెప్పగలదని, ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీకి ఇంటర్వ్యూ ఇచ్చిన న్యాయవాది ఎంఎల్ శర్మ లైంగిక దాడులు చేసేవాళ్లకన్నా చాలా భయంకరమైనవాడంటూ ఆయన ట్వీట్ చేశారు.  మరోపక్క,  పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్న చిత్రం జ్యోతిలక్ష్మీ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ బహుమతిలాంటిదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement