womens day comments
-
అదే నిజమైన ఉమెన్స్ డే
‘‘ఉమెన్స్ డే కాన్సెప్ట్‌ని నేను పెద్దగా నమ్మను. ఉమెన్స్ డేని కేవలం ఒక్కరోజు జరుపుకోవడం ఏంటి? ఉమెన్స్ డే స్ఫూర్తిని ప్రతిరోజూ సెలబ్రేట్ చేసుకోవాలి’’ అన్నారు రకుల్ ప్రీత్‌సింగ్. ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్లో మహిళా దినోత్సవం గురించి తన అభిప్రాయాలను ఈ విధంగా పంచుకున్నారు రకుల్. ‘‘మెన్స్ డే అని ప్రత్యేకంగా జరుపుకోం. మరి ఉమెన్స్ డే ఎందుకు? ఉమెన్స్ డే అని ఒకరోజు పెట్టుకొని ఆ ఒక్క రోజు మాత్రమే సెలబ్రేట్ చేసుకోని మిగతా రోజులు మర్చిపోవడం కాదు. ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే... మన చుట్టూ ఉన్న మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి. అదే నిజమైన ఉమెన్స్ డే సెలబ్రేషన్‌లా నేను భావిస్తాను’’ అంటూ, ‘‘ఈ ఏడాది హోలీ (ఈ నెల 10) రోజు కూడా నాకు షూటింగ్ ఉంది. హోలీ ఆడటం పదో తరగతిలోనే ఆపేశాను. సంబరం కోసం చేసుకునే హోలీ వల్ల నీరు ఎంత వృథా అవుతుందో అవగాహన వచ్చింది అప్పుడే. అప్పటినుంచి కేవలం రంగులతోనే ఆడేవాళ్లం. ఇప్పుడు అది కూడా తగ్గించేశాం’’ అని చెప్పారు. -
అతడు రేపిస్టు కన్నా డేంజర్: వర్మ
భిన్నంగా ఉంటూ నిత్యం ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మహిళా దినోత్సవం సందర్భంగా కాస్త సానుకూలంగా స్పందించారు. పురుషుడిలాగే మహిళలు ఎలా జీవించాలనుకుంటున్నారో అలాంటి స్వేచ్ఛ వారికి కావాలని చెప్పారు. మహిళల స్వేచ్ఛ గురించి తానిన్ని తక్కువ మాటల్లో వర్ణించగలిగినందుకు సంతోషపడుతున్నానని అన్నారు. ఓ మహిళ గురించి మరో మహిళ చేసే ప్రకటన ఎప్పటికీ చాలా అందంగా, గొప్పగా ఉంటుందని, ఆ విషయాన్ని రాజకీయ నాయకులు, నీతులను గురించి మాట్లాడే పెద్దలు ఓ సారి ఆలోచించాలని చెప్పారు. అదే సమయంలో, ఒక చిత్రం ఎన్నో మాటలు చెప్పగలదని, ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీకి ఇంటర్వ్యూ ఇచ్చిన న్యాయవాది ఎంఎల్ శర్మ లైంగిక దాడులు చేసేవాళ్లకన్నా చాలా భయంకరమైనవాడంటూ ఆయన ట్వీట్ చేశారు. మరోపక్క, పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్న చిత్రం జ్యోతిలక్ష్మీ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ బహుమతిలాంటిదని చెప్పారు.