అదే నిజమైన ఉమెన్స్‌ డే | Why should we celebrate woman just one day | Sakshi
Sakshi News home page

అదే నిజమైన ఉమెన్స్‌ డే

Published Sat, Mar 7 2020 12:22 AM | Last Updated on Sat, Mar 7 2020 8:13 AM

Why should we celebrate woman just one day - Sakshi

‘‘ఉమెన్స్‌ డే కాన్సెప్ట్‌ని నేను పెద్దగా నమ్మను. ఉమెన్స్‌ డేని కేవలం ఒక్కరోజు జరుపుకోవడం ఏంటి? ఉమెన్స్‌ డే స్ఫూర్తిని ప్రతిరోజూ సెలబ్రేట్‌ చేసుకోవాలి’’ అన్నారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్‌ ఈవెంట్‌లో మహిళా దినోత్సవం గురించి తన అభిప్రాయాలను ఈ విధంగా పంచుకున్నారు రకుల్‌. ‘‘మెన్స్‌ డే అని ప్రత్యేకంగా జరుపుకోం. మరి ఉమెన్స్‌ డే ఎందుకు?  ఉమెన్స్‌ డే అని ఒకరోజు పెట్టుకొని ఆ ఒక్క రోజు మాత్రమే సెలబ్రేట్‌ చేసుకోని మిగతా రోజులు మర్చిపోవడం కాదు.

ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే... మన చుట్టూ ఉన్న మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి. అదే నిజమైన ఉమెన్స్‌ డే సెలబ్రేషన్‌లా నేను భావిస్తాను’’ అంటూ, ‘‘ఈ ఏడాది హోలీ (ఈ నెల 10) రోజు కూడా నాకు షూటింగ్‌ ఉంది. హోలీ ఆడటం పదో తరగతిలోనే ఆపేశాను. సంబరం కోసం చేసుకునే హోలీ వల్ల నీరు ఎంత వృథా అవుతుందో అవగాహన వచ్చింది అప్పుడే. అప్పటినుంచి కేవలం రంగులతోనే ఆడేవాళ్లం. ఇప్పుడు అది కూడా తగ్గించేశాం’’ అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement