ఒకటో తరగతిలో సంతోష్(ఫైల్)
లక్సెట్టిపేట(మంచిర్యాల): వీరమరణం పొందిన జవాన్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ సంతోష్‌బాబు విద్యాబ్యాసం జిల్లాలోని లక్సెట్టిపేటలోని శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ప్రారంభమైంది. ఆయ న తండ్రి ఉపేందర్ స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో బ్రాంచ్‌లో మేనేజర్‌గా 1988లో ఇక్కడకు బదిలీపై వచ్చారు. సంతోష్‌బాబును స్థానిక శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. నాలుగో తరగతి వరకు ఇక్కడే చదువుకుని ఐదవ తరగతిలో కోరుకొండ సైనిక్ పాఠశాల ప్రవేశపరీక్షలో అర్హత సాధించగా విజయనగరంలోని సైనిక్ పాఠశాలలో చేరారు. ఉపేందర్‌కు బదిలీ కావడంతో ఆయన కుటుంబసభ్యులు కూడా ఇక్కడినుంచి విజయనగరం వెళ్లిపోయారు.
మరిపోలేని చిన్ననాటి స్నేహితులు
సంతోష్‌బాబు మరణాన్ని అతడి స్నేహితులు తట్టుకోలేకపోతున్నారు. అప్పటి పాఠశాల ఆచార్యులు రామన్న సంతోష్‌బాబును గుర్తు చేసుకున్నారు. పాఠశాలలో చిన్నప్పుడు తీయించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఉన్నత హోదాలో ఉండి దేశరక్షణ కోసం ఆయన చేసిన త్యాగం మరువలేనిదన్నారు. స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment