సైనిక్‌ స్కూల్, కలికిరిలో 18 ఖాళీలు | Sainik School Kalikiri Recruitment 2021: Vacancies, Eligibility, Selection Process | Sakshi
Sakshi News home page

సైనిక్‌ స్కూల్, కలికిరిలో 18 ఖాళీలు

Jul 22 2021 6:43 PM | Updated on Jul 22 2021 7:43 PM

Sainik School Kalikiri Recruitment 2021: Vacancies, Eligibility, Selection Process - Sakshi

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు  చెందిన కలికిరి సైనిక్‌ స్కూల్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు  చెందిన కలికిరి సైనిక్‌ స్కూల్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 18
► పోస్టుల వివరాలు: టీజీటీ–02, ఎల్‌డీసీ–02, ఎంటీఎస్‌–14 తదితరాలు.

టీజీటీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ/బీఏ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 21 నుంచి 35 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు ఉంటుంది.

ఎల్‌డీసీ: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. వయసు: 18 నుంచి 50ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది.

ఎంటీఎస్‌: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18నుంచి 50ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.08.2021

► వెబ్‌సైట్‌: https://sskal.ac.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement