
నిరుద్యోగం అనేది భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒక సమస్యగా ఉంది. యూరప్ దేశమైన ఎస్టోనియాలో నిరుద్యోగం రేటు 2024 రెండో త్రైమాసికంలో 7.6 శాతం పెరిగిందని స్టాటిస్టిక్స్ ఎస్టోనియా సంస్థ 'టీ వాసిల్జెవా' (Tea Vassiljeva) వెల్లడించారు.
టీ వాసిల్జెవా గణాంకాల ప్రకారం, 2023 రెండో త్రైమాసికంతో పోలిస్తే 2024 రెండో త్రైమాసికంలో నిరుద్యోగుల సంఖ్య 7,600 పెరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువ భాగం యువత ఉన్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే.. రెండవ త్రైమాసికంలో నిరుద్యోగుల సంఖ్య కొంత ఎక్కువే అని వాసిల్జెవా పేర్కొన్నారు.

పెరిగిన స్వయం ఉపాధి
ఎస్టోనియాలో ఉద్యోగం రాలేదని ఎదురు చూడకుండా.. చాలామంది స్వయం ఉపాధివైపు అడుగులు వేశారు. దీంతో స్వయం ఉపాధి పెరిగింది, ఉపాధిలో ఉన్నవారి సంఖ్య వృద్ధి చెందింది. ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో ఉపాధిలో ఉన్న వ్యక్తుల నిష్పత్తి 10.6 శాతానికి చేరింది.
రాబోయే రోజుల్లో (మూడో త్రైమాసికం) స్వయం ఉపాధి మరింత పెరిగే అవకాశం ఉందని వాసిల్జెవా వెల్లడించింది. ఇందులో 15 నుంచి 74 సంవత్సరాల వయసున్న వారు ఉన్నారు. వీరందరూ ఉద్యోగం కోసం వేచి చూడక సొంత పని ప్రారంభిస్తున్నారు. ఇది వారి ఆర్థిక వృద్ధికి దోహదపడుతోంది.

ఇదీ చదవండి: మార్చి నాటికి భారత్‌లో 6 లక్షల ఉద్యోగాలు: యాపిల్
లేబర్ ఫోర్స్ సర్వే గణాంకాల ప్రకారం, ఎస్టోనియాలో శాశ్వత నివాసులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తాత్కాలికంగా ఉండేవారు లేదా ఉక్రేనియన్ శరణార్ధుల సంఖ్య తక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది కూడా ఎస్టోనియాలో స్వయం ఉపాధి పెరగటానికి ఓ కారణమనే చెప్పాలి. ఎందుకంటే తాత్కాలికంగా ఉండే ప్రజలు ఉద్యోగం లేకుంటే.. ఇతర దేశాలకు వెళ్ళిపోతారు. కానీ శాశ్వతంగా నివాసం ఉండేవారు అక్కడే ఉండాలని, ఉద్యోగం లేకపోతే స్వయం ఉపాధి చూసుకుంటున్నారు. ఇలా అక్కడ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పెరుగుతోంది. ఇదే ఫార్ములా ఎక్కడైనా, ఏ దేశంలో అయినా ఉపయోగించవచ్చు. ఉద్యోగం రాలేదని ఎదురు చూడక, స్వయం ఉపాధి పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment