సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లో పలు పోస్టులకు ఎంపికైన వారి జాబితాను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. వారికి సంబంధించిన ఫలితాలను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
- కాలుష్య నియంత్రణ మండలిలో 25 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులకు అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది. విజువల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థి లభించకపోవడంతో ఆ పోస్టును భర్తీ చేయలేదు.
- జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు పోస్టులకు ముగ్గురిని ఎంపిక చేసింది.
- గిరిజన గురుకులాల్లో మూడు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. అర్హులైన ఏజెన్సీ అభ్యర్థులు లభించకపోవడంతో మరో 3 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు.
- వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఆరుగురిని ఎంపిక చేసింది. బీసీ–ఏ(మహిళ) అభ్యర్థి లభించకపోవడంతో ఒక పోస్టును భర్తీ చేయలేదు.
- సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టులకు నలుగురు అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది. మిగతా 26 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లభించలేదని పేర్కొంది. ఈ పోస్టులకు 75 దరఖాస్తులు వచ్చాయని, అందులో ఐదుగురే అర్హత సాధించారని తెలిపింది. వారిలో నలుగురు ఇంటర్వ్యూలకు హాజరైనట్లు వివరించింది.
ఐదు కేటగిరీల్లో ఉద్యోగాలు భర్తీ
Published Tue, Jan 30 2018 1:28 AM | Last Updated on Tue, Jan 30 2018 1:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment