నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి | child killed in karimnagar district | Sakshi
Sakshi News home page

నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

Published Wed, May 4 2016 11:22 AM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

child killed in karimnagar district

జగిత్యాల రూరల్: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం అంతర్గామ్ గ్రామంలో విషాదం అలముకుంది. ఓ చిన్నారి నీటి తొట్టిలో పడి ప్రాణాలు కోల్పోయింది. జలేందర్, సుమంత దంపతుల కుమార్తె సుష్మిత(3) బుధవారం ఉదయం ఆడుకుంటూ ఇంటి సమీపంలోనే ఉన్న పెద్దమ్మతల్లి ఆలయం వద్దకు వెళ్లింది. అక్కడే ఉన్న నీటితొట్టిపైకి ఎక్కి ఆడుకుంటూ అందులో పడిపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. అరగంట సేపు తల్లిదండ్రులు తమ కూతురు కోసం వెతకగా చివరికి ఆలయం వద్ద నీటితొట్టిలో విగతజీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement