చిన్నారిని బలిగొన్న ట్రాక్టర్‌ | Tractor killed kid | Sakshi
Sakshi News home page

చిన్నారిని బలిగొన్న ట్రాక్టర్‌

Published Mon, Mar 20 2017 11:27 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

Tractor killed kid

యాడికి (తాడిపత్రిరూరల్‌) : యాడికి మండలం బొయిరెడ్డిపల్లిలో సోమవారం రాత్రి ట్రాక్టర్‌ ఢీకొని రెండేళ్ల చిన్నారి మృత్యువాతపడ్డాడు.  పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన ప్రసాద్‌, కుళ్లాయమ్మ దంపతుల కుమారుడు నాగచైతన్య(2) ఇంటి సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. వెనుకవైపు నుంచి ట్రాక్టర్‌ చిన్నారిపైకి దూసుకెళ్లింది.
 
దీంతో నాగచైతన్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ కత్తిశ్రీనివాసులు సిబ్బందితో సంఘటన స్థలం చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ట్రాక్టర్‌ డ్రైవర్‌ నారాయణస్వామి, యజమాని ఆదినారాయణలపై కేసు నమోదు చేసుకున్నారు. లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ఆయన వాహనదారులను హెచ్చరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement