కన్నకొడుకు ప్రాణం తీసిన భార్యాభర్తల గొడవ | Husband and wife Fight and Killed Child With Poisoned Water | Sakshi
Sakshi News home page

కన్నకొడుకు ప్రాణం తీసిన భార్యాభర్తల గొడవ

Published Tue, Nov 21 2017 11:45 AM | Last Updated on Wed, Nov 22 2017 3:58 AM

Husband and wife Fight and Killed Child With Poisoned Water - Sakshi - Sakshi - Sakshi

నాగర్‌కర్నూల్‌ క్రైం: కలకాలం కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు గొడవ పడడమే కాకుండా నవమాసాలు కనిపెంచుతున్న పసి బిడ్డకు విషగుళికలు కలిపిన నీరు తాగించి చంపేశారు. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌ కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం గుట్టలపల్లికి చెందిన రాములు– రాములమ్మ భార్యాభర్తలు. వీరికి కుమారుడు చింటూ(4) ఉన్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ సోమవారం భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ చిలికిచిలికి గాలివానగా మారగా విష గుళికలు కలిపిన నీటిని చింటూతో తాగించారు.

దీంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఆయన తాత చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ చింటూ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా.. చింటూ పుట్టుకతోనే వికలాంగుడు. ఆ కారణంతోనే బాలుడికి విషగుళికల నీరు తాగించి చంపారా.. లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియరాలేదు. అయితే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement