husband and wife fight
-
కూతురిని కిడ్నాప్ చేశారంటూ అల్లుడిపై ఫిర్యాదు
పెనుమంట్ర: విడాకుల కేసు కోర్టులో ఉండగా భార్యను కిడ్నాప్‌చేసి, పుట్టింటి నుంచి తీసుకుపోయిన సంఘటన నెగ్గిపూడి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెగ్గిపూడి గ్రామానికి చెందిన చిర్ల శ్రీనివాసరెడ్డి, కనకలక్ష్మి దంపతులు తెలిపిన వివరాల ప్రకారం తమ రెండో కుమార్తె పూజారెడ్డిని అదే గ్రామానికి చెందిన సత్తి శ్రీరామారెడ్డికి ఇచ్చి 2020లో వివాహం చేశారు. మొదట్లో తమ కుమార్తెను అల్లుడు బాగానే చూసుకున్నాడని, బాబు పుట్టిన అనంతరం వేధింపులకు గురిచేస్తూ, కొట్టేవాడని చెప్పారు. 2022లో పెనుమంట్ర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా గృహహింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉండగా ఈనెల 17న సాయంత్రం 4 గంటలకు అల్లుడు శ్రీరామారెడ్డి ఇంటికి వచ్చి తమను తిట్టడమే కాకుండా ఇంట్లోనే నిర్భంధించి కుమార్తె, మనవడిని బలవంతంగా తీసుకువెళ్లిపోయాడని చెప్పారు. అనంతరం 100కి ఫోన్ చేస్తే పోలీసుల నుంచి స్పందన లేదని, గాయాలతో సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లామన్నారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమని పోలీసులు చెప్పడంతో తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై పెనుమంట్ర ఎస్సై సురేంద్రకుమార్‌ను సాక్షి వివరణ కోరగా తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, ఆసుపత్రి నుంచి సమాచారం వస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
అవాంఛిత సంబంధాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు.. కుటుంబాన్ని కాపాడుకోలేమా?
అపనమ్మకం, ఆర్థిక కష్టాలు.. వ్యసనాలు, పొసగని అంచనాలు కమ్యూనికేషన్ గ్యాప్, అవాంఛిత సంబంధాలు.. భార్యాభర్తల మధ్య తగాదాలకు కారణాలై పెను పరిణామాలకు దారి తీస్తున్నాయి. భార్య మీద కోపం, భర్త మీద అసహనం పిల్లల మీద, పరస్పరం పగ తీర్చుకునేలా చేస్తున్నాయి. క్షణికోద్రేకం జీవితాలను నాశనం చేస్తున్నది. కుటుంబాన్ని కాపాడుకోలేమా? కనీసం తక్కువ నష్టంతో సమస్యలను సరిచేసుకోలేమా? ఇవాళ నివురుగప్పిన నిప్పులా ఉన్న అన్ని కుటుంబాలు వేసుకోవాల్సిన ప్రశ్నలు ఇవి. సులభంగా బతకడం అత్యంత జటిలం అవుతున్న కాలం ఇది. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు కలిసి బతకడం ఎందుకు జటిలం అవుతుంది? భార్య గృహిణిగా లేదా ఉద్యోగిగా ఉండొచ్చు. భర్త ఏదో ఒక సంపాదనపరుడై ఉండొచ్చు. పిల్లలు చదువుకుంటూ ఉండొచ్చు. ఇల్లు గడవడానికి, పిల్లల్ని చదివించడానికి, అవసరాలకు తగిన సంపాదన ఉంటే సులభంగా, సంతోషంగా జీవించడం సాధ్యం అవుతుందా? ఎందుకు అశాంతి వస్తున్నది. భార్య లేదా భర్త ఎందుకు తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు? ఎందుకు క్షణికోద్రేకంలో పిచ్చి పనులు చేస్తున్నారు. ఎందుకు ఏదైనా తీవ్ర చర్య చూపితే తప్ప భార్యకో, భర్తకో బుద్ధిరాదని అనుకుంటున్నారు. వారి మనసుల్లో ఇంత కల్లోలం రేగుతుంటే రక్త సంబంధీకులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అను సమాజం ఏం చేస్తోంది? ఇదంతా ఏమిటి? ఇంత రుగ్మతలోకి కుటుంబాలు వెళుతుంటే సమాజం కూడా రుగ్మతలోకి వెళుతున్నట్టేనని ఎందుకు అందరం జాగృతం కావడం లేదు. ఇవి ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ప్రశ్న. చదవండి: ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నాయా?! ఒక్క క్లిక్‌తో అంతా ఉల్టా పల్టా! సహనా వవతు మన సంస్కృతిలో ‘సహనా వవతు’ అనే భావన అవసరం పెద్దలు ఎప్పుడో చెప్పారు. ‘కలిసి ముందుకు సాగడం’ దీని అర్థం. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వధువు లేదా వరుడు రేపు ఏర్పరచుకోబోయే కుటుంబానికి సంబంధించి ముఖ్యంగా వంటబట్టించుకోవాల్సిన సూత్రం ఈ సహనా వవతు. ఇంతవరకూ నేను ఒక్కడిని ఇకపై కలిసి జీవించాలి అని అర్థం చేసుకుంటే, కలిసి జీవించడం అంటేనే సర్దుబాటు అనుకుంటే చాలా సమస్యలు రావు. భార్య/భర్త పూర్తిగా నచ్చేలా లేకపోయినా, పిల్లల ప్రవర్తన పూర్తిగా లోబడి ఉండకపోయినా, ఇంట్లో రకరకాల అభిప్రాయ భేదాలు వస్తూ ఉన్నా అవన్నీ సర్దుబాటు చేసుకునేలా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండాలి. తెగేదాకా లాగని మనస్తత్వం పొదు చేసుకోవాలి. లేకపోతే అశాంతి... ఆందోళన. ఏడు కారణాలు భార్యాభర్తల మధ్య గొడవలకు, ఘర్షణకు, వాగ్వివాదాలకు ప్రధానంగా 7 కారణాలు కనిపిస్తాయి. మానసిక దూరం: భార్యాభర్తల మధ్య మానసిక దూరం పెరిగి΄ోతే ఒక చూరు కింద వారు ఎన్నేళ్లు జీవించినా వారు సన్నిహితులు కారు. నిజమైన సంతోషం పొందలేరు. తమ మధ్య మానసిక దూరం పెరిగిందని భార్యాభర్తలకు తెలిసినా దానిని నివారించడానికి ప్రయత్నించరు. ఫలితం.. ఏదో ఒక పెను ఘటన. చదవండి: మా పాట అడవి దాటింది.. ఆదివాసీ గాయని లక్ష్మీబాయ్ పెంపకం కొట్లాట: పిల్లల విషయంలో నిరంతర తగువు. ఒకరు వెనకేసుకు రావడం ఒకరు కఠినంగా ఉండటం... చదువు, స్కూళ్ల విషయంలో రభస... తిండి గురించి మరో తగవు... మార్కులు, హోమ్ వర్క్‌లు... కొద్దిసేపు కూచుని ఓర్పుగా మాట్లాడుకుంటే ఎవరైనా ఎక్స్పర్ట్ సలహాకు తల వొగ్గితే ఈ సమస్య ఉండదు. కాని వినరు. కమ్యూనికేషన్ లోపం: ఏదీ చెప్పరు. చెప్పుకోరు. చెప్పాలని గుర్తించరు. అతని ఖర్చు ఆమెకు తెలియదు. ఆమె కొనుక్కోవాలనుకుంటున్న వస్తువు ను అతను కొనివ్వడు. బంధువులు, స్నేహితులు వారి రాకపోకల గురించి, వాళ్ల ఇళ్లకు వెళ్లడం గురించి మాట్లాడుకోరు. వీలు కాదు, వీలవుతుంది, వెళ్లాలి, వెళ్లక్కర్లేదు.. ఇవి ఉమ్మడి అంగీకారంతో జరగాల్సిన నిర్ణయాలు. అలా లేనప్పుడే ఆగ్రహం, పంతం. ఫుల్స్టాప్ లేని వాదనలు: ఒకరు వాదిస్తుంటే మరొకరు తగ్గడం జరిగితే ప్రమాదం ఉండదని ఇరువురికీ తెలుసు. కాని వాదనలు పెంచుకుంటూ పోతారు. పాత గొడవలు తవ్వుతారు. పై చేయి సాధించడానికి చెత్త మాటలు, అబద్ధాలు, అభాండాలు వేసి గాయపరుస్తారు. ఒకరినొకరు అవమానించుకుంటారు. చదవండి: భయం లేకుండా స్త్రీలు పార్కులకు వెళ్లొచ్చు.. ఇవి వారికి మాత్రమే! ఆర్థిక సమస్యలు: పెళ్లి సమయంలోనే ఇరువురి ఆర్థిక స్థితి తెలుసుకాబట్టి ఆ గ్రాఫ్ చేరుకునే బిందువును అంచనా కట్టుకుని జీవితాన్ని మొదలెట్టాలి. మనం సామాన్య ఉద్యోగులం అయినా పెద్ద ఉద్యోగాలు చేసే జంటతో పోల్చుకుంటే ఆ ఇమిటేషన్‌తో అప్పుసప్పులు చేస్తే ఇ.ఎం.ఐలలో ఇరుక్కుపోతే ఆర్థిక సమస్య లు వస్తాయి. డబ్బు విషయంలో ప్రతి పైసా ఇద్దరి అవగాహనలోనే వచ్చినా, ఖర్చు అయినా మంచి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల్లో ఎవరికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోయినా సమస్యలు పెరుగుతాయి. ఇది మరీ రిపేరు చేసుకోలేని సమస్య మాత్రం కాదు. ఆరోగ్య సమస్యలు: బిజీ లైఫ్ వల్ల ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. భర్త ఆరోగ్యం గురించి భార్య శ్రద్ధ పెట్టకపోయినా, భార్య ఆరోగ్యాన్ని భర్త పట్టించుకోకపోయినా లోలోపల ఆ కోపం ఉంటుంది. ఒకవేళ ఇరువురిలో ఒకరికి అనారోగ్యం వస్తే దాని మిషగా హర్ట్ చేసుకోవడం సూటిపోటి మాటలనడం ఇంకా ప్రమాదం. అనారోగ్యకాలంలో భార్యాభర్తల మధ్య బంధం చాలా గట్టిగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యవంతులు అవుతారు. కుటుంబ ఆరోగ్యం కూడా కా΄ాడబడుతుంది. అవాంఛిత స్నేహాలు: చేతిలో ఫోను.. ఎవరెవరితోనో స్నేహాలు.. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య చేసే స్నేహాలు (లైంగికమే కానక్కర్లేదు) కాపురానికి ప్రమాదంగా మారుతాయి. అవి మానేయమని భర్త/భార్య కోరితే మానేయడమే మంచిది. కుటుంబం కంటే ఆ స్నేహం ముఖ్యం కాదు. ఇవాళ న్యూస్పేపర్లలో వస్తున్న చాలా వార్తలు కుటుంబ జీవనంలో చోటు చేసుకుంటున్న పెను విషాదాలను చూపుతున్నాయి. కుటుంబం అందమైనది. అందరికీ అవసరమైనది. చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని నిర్వహించాలి. ఆ సంగతి అందరూ అర్థం చేసుకోవాలి. -
క్షణికావేశంలో కన్న బిడ్డనే కడతేర్చాడు..
శ్రీకాళహస్తి(తిరుపతి): ఓ తండ్రి క్షణికావేశం ముక్కు పచ్చలారని మూడు నెలల చిన్నారి ప్రాణాలను బలి తీసుకొంది. భార్యతో గొడవతో సహనం కోల్పోయిన ఆ తండ్రి.. బిడ్డను గోడకేసి కొట్టడంతో ఆ పసిప్రాణాలు అక్కడికక్కడే గాలిలో కలిసిపోయాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శనివారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. శుకబ్రహ్మాశ్రమం సమీపంలోని వాటర్ హౌస్ కాలనీలో భార్యాభర్తలు మునిరాజా, స్వాతి నివాసముంటున్నారు. తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిది ప్రేమ వివాహం. రెండేళ్ల తర్వాత వీరికి నిఖిల్ పుట్టాడు. ప్రస్తుతం నిఖిల్ వయసు మూడు నెలలు. నాలుగు రోజుల కిందట పిల్లాడికి న్యుమోనియా సోకడంతో తిరుపతిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. ఇందుకోసం తన బైక్‌ను అమ్మేశాడు. రెండు రోజుల తర్వాత బిడ్డకు మళ్లీ జ్వరం రావడంతో.. నువ్వు ఆస్పత్రిలో సరిగా చూపించలేదంటూ భార్య గొడవకు దిగింది. మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తన తండ్రి బైక్‌ను తీసుకురాగా.. అప్పటికే వాళ్ల మధ్య విభేదాలుండటంతో ఆ బైక్ ఎక్కేందుకు ఆమె నిరాకరించింది. అంతేగాక తన తల్లిదండ్రుల మీద ఆమె నోరు పారేసుకోవడంతో మునిరాజా సహనం కోల్పోయాడు. అదే సమయంలో బాలుడు గుక్కపట్టి ఏడుస్తుండటంతో మునిరాజా.. బాలుడి కాళ్లు పట్టుకుని తలను గోడకేసి కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు వన్ టౌన్ సీఐ అంజుయాదవ్ చెప్పారు. -
భార్యాభర్తల గొడవలోకి దూరాడు.. దారుణంగా హత్యకు గురయ్యాడు
భోపాల్: భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే. చిన్న చిన్న విషయాలకు సైతం గొడవ పడినా.. మళ్లీ కలిసిపోతుంటారు. అయితే, ఇరువురు గొడవపడుతుంటే చుట్టుపక్కల వారు ఆపేందుకు ప్రయత్నించటమూ మామూలే. కానీ, ఒక్కోసారి అది ప్రాణాలపైకి తెస్తుందనేందుకు ఇదే సరైన ఉదాహరణ. భార్యాభర్తలు గొడవ పడుతున్నారని కలుగజేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. మా మధ్యకే వస్తావా అని దారుణంగా కొట్టి చంపాడు భర్త. ఈ అమానవీయ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. పప్పు అనే వ్యక్తి మంగళవారం రోజు ఇంట్లో మటన్ కూర వండాలని భార్యకు చెప్పాడు. అయితే, మంగళవారం మాంసం తినకూడదని వాదించింది భార్య. ఈ విషయంపై ఇరువురు గొడవకు దిగారు. గొడవ పడుతున్న భార్యాభర్తలను గమనించిన పొరుగింటి వ్యక్తి బిల్లు.. వారి వద్దకు వెళ్లి సర్దిచెప్పాడు. తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. కానీ, బిల్లుపై కోపం పెంచుకున్న భర్త పప్పు.. అతడి ఇంటికి వెళ్లి తీవ్రంగా కొట్టాడు. దీంతో బిల్లు ప్రాణాలు కోల్పోయాడు. పప్పు భార్య ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదీ చదవండి: చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే మరొకటి ఇచ్చారని.. రెస్టారెంట్‌కు నిప్పుపెట్టిన మందుబాబు.. -
హాయిగా సాగుతున్న కాపురంలో చిచ్చుపెట్టిన అనుమానం.. కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లి...
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: అనుమానం పెనుభూతమైంది. భర్త చేతిలో ఇల్లాలు హతమైంది. వివరాలను అనంతపురం నాల్గో పట్టణ సీఐ జాకీర్ హుస్సేన్ వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన బోయ రాజప్ప, సావిత్రి (50) దంపతులు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. బతుకు తెరువు కోసం నాలుగేళ్ల క్రితం అనంతపురానికి వలస వచ్చారు. వాచ్‌మెన్‌గా, కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. కొంత కాలంగా భార్య ప్రవర్తనపై రాజప్పకు అనుమానాలు మొదలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న అతను భార్యతో గొడవకు దిగాడు. రాజప్ప ఇటుక తీసుకుని సావిత్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో కుప్పకూలిన ఆమె కాళ్లు పట్టుకుని షెడ్లోకి లాక్కెళ్లి కొడవలితో తలపై నరికి హతమార్చాడు. శనివారం తెల్లవారుజామున రాజప్ప రుద్రంపేట బైపాస్ మీదుగా కాలినడకన వెళుతుంటే పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో విషయం వెలుగు చూసింది. నిందితుడిని అరెస్ట్ చేసి, హతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. (చదవండి: పోలీసులమంటూ కిడ్నాప్‌లు) -
షాకింగ్ క్రైమ్.. భర్త అలా చేశాడని.. భార్య దారుణం!
క్షణికావేశంలో చేసే తప్పులు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భర్త తనను కొట్టాడన్న కోపంతో భార్య దారుణానికి ఒడిగట్టింది. యాసిడ్‌లో కారం కలిపి అతడిపై పోసింది. వివరాల ప్రకారం.. బరేలీలో మొహమ్మద్ యాసీన్ తాగుడుకు బానిసై భార్య, పిల్లలను కొడుతుండేవాడు. ప్రతీరోజు మద్యం తాగి వచ్చి.. భార్య ఫర్హాతోపాటు నాలుగేళ్ల కుమార్తెను చితకబాదేవాడు. తాగుడు మానేయాలని భార్య ఎంత చెప్పిన వినుపించుకోలేదు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట తాగి ఇంటికి వచ్చిన భర్త.. భార్యను చెంపపై కొట్టాడు. దీంతో, భర్తపై కోపం తెచ్చుకుని క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకుంది. నిద్రిస్తున్న భర్తపై కారం కలిపిన యాసిడ్ పోసింది. దీంతో యాసీన్ తీవ్రంగా గాయపడంతో వారి కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, భర్తపై యాసిడ్ దాడి అనంతరం భార్య ఫర్హా, తన కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది.అనంతరం..యాసీన్ బంధువులు భార్య ఫర్హాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో పైలట్‌గా ప్రొఫైల్ పెట్టి 30మంది మహిళలకు టోకరా! -
భార్యాభర్తల మధ్య వివాదం.... చిన్నారుల ఉసురు తీసిన ఆర్థిక ఇబ్బందులు
ఆర్థిక సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవలతో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. క్షణికావేశంలో తల్లి తీసుకున్న నిర్ణయంతో అర్ధంతరంగా లోకం విడిచి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తల్లిని బాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులే తనను ఈ ఘటనకు ప్రేరేపించాయని ఆమె పోలీసుల ఎదుట గొల్లుమంది. సాక్షి, రోలుగుంట: మండలంలోని జె.నాయుడుపాలెం గ్రామానికి చెందిన గడదాసు నాగరాజుకు ఆరేళ్ల క్రితం వడ్డిప గ్రామానికి చెందిన సాయితో వివాహం జరిగింది. వీరికి కుమార్తె భాను(4), కుమారుడు పృథ్వీరాజ్(2) ఉన్నారు. నాగరాజు ఆటో నడపడం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బేరాలు తగ్గడంతో వీరికి ఏడాది కాలంగా ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. కుటుంబ పోషణ భారంగా మారడంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించే విషయంలో ఆదివారం రాత్రి వీరిద్దరి మధ్య తలెత్తిన గొడవ.. ఘర్షణకు దారితీయడంతో సాయి మనస్తాపం చెందింది. వెంటనే ఇద్దరు పిల్లలను తీసుకువెళ్లి యాదవుల వీధిలోని బావిలో తోసేసి.. తాను కూడా దూకేసింది. చివరి క్షణంలో ఆమె బావిలోని మెట్టును పట్టుకుని వేలాడుతూ కేకలు వేయడంతో.. చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకొని ఆమెను, పిల్లలను బయటకు తీశారు. కానీ అప్పటికే ఇద్దరు చిన్నారులూ మృతి చెందారు. సాయి ప్రాణాలతో బయటపడింది. ఈ సమాచారం తెలుసుకున్న ఎస్ఐ నాగకార్తీక్ ఘటనాస్థలికి చేరుకొని.. తల్లి సాయితో పాటు స్థానికులను విచారించారు. తన భార్య తోసేయడం వల్లే పిల్లలు చనిపోయారని నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ తల్లిని బాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులే తనను ఈ ఘటనకు ప్రేరేపించాయని ఆమె పోలీసుల ఎదుట గొల్లుమంది. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
దహెగాం(సిర్పూర్) : పెళ్లి అయి 15 సంవత్సరాలు అయినా సంతానం కావడం లేదని భర్త తో భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పెసరికుంట గ్రామంలో చోటు చేసుకుం ది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..చింతలమానెపల్లి మండలం రుద్రాపూర్ గ్రామానికి చెందిన దుర్గాదేవి(32), దహెగాం మండలం లక్కం కుమార్‌తో 2003లో వివాహామైంది. దుర్గాదేవికి సంతానం కలగకపోవడంతో భర్త మరో పెళ్లి చేసుకుంటానని వేధించేవాడు. దీంతో గురువారం ఇంట్లో పురుగుల మందు తాగి దుర్గాదేవి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్ తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలి తమ్ముడు మేకల లచ్చన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై దీకొండ రమేశ్ తెలిపారు. -
భర్తను కారుతో ఢీకొట్టిన భార్య
బంజారాహిల్స్: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తన భార్య కోసం వెతుకుతున్న భర్తను ఆమె కారుతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాసబ్‌ట్యాంక్ రహమాన్ టవర్‌లో ఉంటున్న మహ్మద్ మన్నన్‌ఖాన్ జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం అతని భార్య బుతుల్ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె హైదరాబాద్‌లోనే ఉన్నట్లు సమాచారం రావడంతో మన్నన్‌ఖాన్ ఆమె కోసం గాలిస్తున్నాడు. ఈ నెల 17వ తేదీ రాత్రి ఆమె బంజారాహిల్స్ రోడ్ నెం.12లో కారులో వెళ్తున్నట్లు సమాచారం అందడంతో మన్నన్‌ఖాన్ అక్కడికి వెళ్లగా ఓ వైన్‌షాప్ వద్ద ఆమెను చూసి పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆమె కారు డోరుతో తోసేసింది. కిం దపడ్డ మన్నన్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్పృహతప్పి పడిపోయాడు. అతడి స్నేహితుడు నయీం బాధితుడిని అపోలో ఆస్పత్రికి తరలించాడు. తనను కావాలనే ఢీకొ ట్టిందని బాధితుడు తెలిపినట్లు అతని తండ్రి మాజిద్‌ఖాన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బుతుల్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నకొడుకు ప్రాణం తీసిన భార్యాభర్తల గొడవ
నాగర్‌కర్నూల్ క్రైం: కలకాలం కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు గొడవ పడడమే కాకుండా నవమాసాలు కనిపెంచుతున్న పసి బిడ్డకు విషగుళికలు కలిపిన నీరు తాగించి చంపేశారు. వివరాలిలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుట్టలపల్లికి చెందిన రాములు– రాములమ్మ భార్యాభర్తలు. వీరికి కుమారుడు చింటూ(4) ఉన్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ సోమవారం భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ చిలికిచిలికి గాలివానగా మారగా విష గుళికలు కలిపిన నీటిని చింటూతో తాగించారు. దీంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఆయన తాత చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ చింటూ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా.. చింటూ పుట్టుకతోనే వికలాంగుడు. ఆ కారణంతోనే బాలుడికి విషగుళికల నీరు తాగించి చంపారా.. లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియరాలేదు. అయితే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిసింది. -
తాళిబొట్టు తెంపారు..
రూ.92వేలు జరిమానా వేశారు చింతకాని: భార్యాభర్తల గొడవపై కుల పెద్దలు పంచాయితీ నిర్వహించారు. శారీరకంగా, మా నసికంగా హింసిస్తున్న భర్తను వారించకపోగా.. బాధితురాలికే ఆ ‘పెద్దలు’ శిక్ష విధించారు. ఆమె తాళిబొట్టును లాక్కున్ని, 92వేల రూపాయలు జరిమానా కట్టాలని ‘తీర్పు’ ప్రకటించారు. దీనిపై ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రచింది. ఆమె తెలిపిన ప్రకారం... వరంగల్ జిల్లా కురవికి చెందిన భద్రమ్మ-బక్కయ్య దంపతుల రెండవ కుమార్తె ఉప్పమ్మకు, చింతకాని మండలం రాఘవాపురం గ్రామస్తుడు నెర్సుల కృష్ణతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం మూడు నెలలపాటు సజావుగా సాగింది. ఆ తరువాత నుంచి, ఆమె శీలాన్ని అతడు శంకించసాగాడు. ఈ నెపంతో ఆమెను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. కుల పెద్దలు 12సార్లు పంచారుుతీ నిర్వహించారు. వారి సూచనతో, ఆరు నెలల క్రితం రాఘవాపురం నుంచి లచ్చగూడెం గ్రామానికి మకాం మార్చారు. అరుునప్పటికీ భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా, ఆమె కూలీనాలీ చేసిన సంపాదించిన డబ్బుతో భర్త తాగి వచ్చి కొట్టేవాడు. అతడి దాడిలో ఆమె తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమె ఈ నెల 5న తన భర్తపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ‘పోలీస్ స్టేషన్‌కు వద్దు. కుల పంచారుుతీలో మాట్లాడుకుందాం’ అని కుల పెద్దలు చెప్పడంతో ఆమె తన ఊరుకుంది. ఆ తరువాత కూడా అతడి వేధింపులు కొనసాగుతుండడంతో కుల పెద్దలు ఇటీవల పంచాయతీ నిర్వహించారు. భర్త వేధింపులను ఇక భరించలేనని కుల పెద్దలతో చెప్పింది. దీనిని వారు జీర్ణించుకోలేకపోయూరు. ఆమెను తప్పుబట్టారు. ఆమె మెడలోని తాళిబొట్టును లాక్కుని, 92వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించలేనని చెబుతున్నా వినలేదు. ఆమె బాబాయి సంగయ్యపై దాడి చేసి, ఆయనతోప్రాంసరీ నోటుపై సంతకాలు తీసుకున్నారు. ‘‘నా నాలుగేళ్ల కుమారుడు మహేష్‌ను ఎక్కడో దాచిపెట్టారు. నాకు చూపించడం లేదు. నాకు అన్యాయం చేసిన కుల పెద్దలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. నాకు తగిన న్యాయం చేయాలి’’ అని, బాధితురాలు ఉప్పమ్మ పోలీసులను కోరింది.