భర్తను కారుతో ఢీకొట్టిన భార్య | Wife Accident To Husband With Car | Sakshi
Sakshi News home page

భర్తను కారుతో ఢీకొట్టిన భార్య

Published Tue, Mar 20 2018 8:39 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM

Wife Accident To Husband With Car - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బంజారాహిల్స్‌:  ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తన భార్య కోసం వెతుకుతున్న భర్తను ఆమె కారుతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాసబ్‌ట్యాంక్‌ రహమాన్‌ టవర్‌లో ఉంటున్న మహ్మద్‌ మన్నన్‌ఖాన్‌ జిమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం అతని భార్య బుతుల్‌ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె హైదరాబాద్‌లోనే ఉన్నట్లు సమాచారం రావడంతో మన్నన్‌ఖాన్‌ ఆమె కోసం గాలిస్తున్నాడు.

ఈ నెల 17వ తేదీ రాత్రి ఆమె బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లో కారులో వెళ్తున్నట్లు సమాచారం అందడంతో మన్నన్‌ఖాన్‌ అక్కడికి వెళ్లగా ఓ వైన్‌షాప్‌ వద్ద ఆమెను చూసి పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆమె కారు డోరుతో తోసేసింది. కిం దపడ్డ మన్నన్‌కు తీవ్ర గాయాలు కావడంతో  స్పృహతప్పి పడిపోయాడు. అతడి స్నేహితుడు నయీం బాధితుడిని అపోలో ఆస్పత్రికి తరలించాడు. తనను కావాలనే ఢీకొ ట్టిందని బాధితుడు తెలిపినట్లు అతని తండ్రి మాజిద్‌ఖాన్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బుతుల్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement