హాయిగా సాగుతున్న కాపురంలో చిచ్చుపెట్టిన అనుమానం.. కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లి... | Suspicion Felt Wife Killed By Her Husband At Ananthapur | Sakshi
Sakshi News home page

హాయిగా సాగుతున్న కాపురంలో చిచ్చుపెట్టిన అనుమానం.. కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లి...

Sep 18 2022 9:29 AM | Updated on Sep 18 2022 9:29 AM

Suspicion Felt Wife Killed By Her Husband At Ananthapur - Sakshi

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: అనుమానం పెనుభూతమైంది. భర్త చేతిలో ఇల్లాలు హతమైంది. వివరాలను అనంతపురం నాల్గో పట్టణ సీఐ జాకీర్‌ హుస్సేన్‌ వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన బోయ రాజప్ప, సావిత్రి (50) దంపతులు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. బతుకు తెరువు కోసం నాలుగేళ్ల క్రితం అనంతపురానికి వలస వచ్చారు.

వాచ్‌మెన్‌గా, కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. కొంత కాలంగా భార్య ప్రవర్తనపై రాజప్పకు అనుమానాలు మొదలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న అతను భార్యతో గొడవకు దిగాడు. రాజప్ప ఇటుక తీసుకుని సావిత్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో కుప్పకూలిన ఆమె కాళ్లు పట్టుకుని షెడ్‌లోకి లాక్కెళ్లి కొడవలితో తలపై నరికి హతమార్చాడు.

శనివారం తెల్లవారుజామున రాజప్ప  రుద్రంపేట బైపాస్‌ మీదుగా కాలినడకన వెళుతుంటే పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో విషయం వెలుగు చూసింది. నిందితుడిని అరెస్ట్‌ చేసి, హతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.  

(చదవండి: పోలీసులమంటూ కిడ్నాప్‌లు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement