daily wages
-
హాయిగా సాగుతున్న కాపురంలో చిచ్చుపెట్టిన అనుమానం.. కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లి...
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: అనుమానం పెనుభూతమైంది. భర్త చేతిలో ఇల్లాలు హతమైంది. వివరాలను అనంతపురం నాల్గో పట్టణ సీఐ జాకీర్ హుస్సేన్ వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన బోయ రాజప్ప, సావిత్రి (50) దంపతులు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. బతుకు తెరువు కోసం నాలుగేళ్ల క్రితం అనంతపురానికి వలస వచ్చారు. వాచ్‌మెన్‌గా, కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. కొంత కాలంగా భార్య ప్రవర్తనపై రాజప్పకు అనుమానాలు మొదలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న అతను భార్యతో గొడవకు దిగాడు. రాజప్ప ఇటుక తీసుకుని సావిత్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో కుప్పకూలిన ఆమె కాళ్లు పట్టుకుని షెడ్లోకి లాక్కెళ్లి కొడవలితో తలపై నరికి హతమార్చాడు. శనివారం తెల్లవారుజామున రాజప్ప రుద్రంపేట బైపాస్ మీదుగా కాలినడకన వెళుతుంటే పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో విషయం వెలుగు చూసింది. నిందితుడిని అరెస్ట్ చేసి, హతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. (చదవండి: పోలీసులమంటూ కిడ్నాప్‌లు) -
స్విగ్గీ చేసింది.. ఆమెకు అండగా... ఆరోజులలో సెలవు!
గతంలో జొమాటో తన డెలివరీ విమెన్‌కు సంవత్సరంలో 10 రోజుల బహిష్టు సెలవు ప్రకటించింది. ఆ సెలవులకు జీతం స్పష్టత లేదు. కాని స్విగ్గీ తన డెలివరీ విమెన్‌కు ప్రతి నెల రెండు రోజుల వేతన సెలవు ప్రకటించింది. అసంఘటిత రంగాలలో ఎందరో స్త్రీలు డెయిలీ వేజెస్ మీద పని చేస్తున్నారు. వారికి బహిష్టు సమయంలో రెండు రోజుల వేతన సెలవు ఎందుకు ఇవ్వకూడదు? స్విగ్గీ చేసిన ఆలోచన ఎందుకు చేయకూడదు? ఇంట్లో పనిమనిషిని అందరూ పెట్టుకుంటారు. రోజుకు రెండుపూట్ల రమ్మంటారు కొందరు. ఒకపూట చాలంటారు కొందరు. రోజూ పని చేయిస్తారు కొందరు. ఆదివారం రానక్కర్లేదు అంటారు మరికొందరు. పనిమనిషి అప్పుడప్పుడు పనికి రాదు. పోనీలే అని మొత్తం జీతం ఇస్తారు కొందరు. రాని రోజులకు జీతం కట్ చేస్తారు ఇంకొందరు. రాని రోజులకే జీతం కట్ చేసేవాళ్లు ఆమె బహిష్టు సమయంలో నలతగా అనిపించో, నొప్పిగా అనిపించో, చిరాగ్గా ఉండో, నీరసం వల్లో పనికి రానంటే జీతం ఇస్తారా? కాని ఇస్తే ఎంత బాగుంటుంది. ఆ ఇంటి యజమానురాలు ఏ ఆఫీస్‌లో అయినా పని చేస్తూ ఉంటే బహిష్టు సమయంలో సెలవు పెట్టుకుంటే ఆమె జీతం ఆమెకు వస్తుంది. కాని పనిమనిషికి రాదు. ఇది సబబా? పని మనిషి వరకూ అక్కర్లేదు. ఫ్యాక్టరీల్లో డెయిలీ లేబర్ ఉంటారు. భవన నిర్మాణరంగంలో స్త్రీలు ఉంటారు. బట్టల షోరూముల్లో, మాల్స్‌లో పని చేసే స్త్రీలు ఉంటారు. వీరందరికీ వారానికి సగం రోజు మాత్రమే సెలవు ఇచ్చేవారున్నారు. ఇక నెలలో ఏ రోజు రాకపోయినా ఆ రోజు జీతం కట్. వీరందరూ బహిష్టు సమయంలో కష్టమయ్యి సెలవు పెడితే ఆ రెండుమూడు రోజుల పాటు డబ్బు నష్టపోవాల్సిందే. బహిష్టు అనేది స్త్రీ శరీరధర్మం. ప్రకృతి ధర్మం. ఆ సమయంలో వారికి విశ్రాంతినివ్వడం, ఆర్థికంగా నష్టం జరక్కుండా చూడటం మానవీయ విషయం. కాని బహిష్టు వల్ల సెలవు పెడితేనే విడ్డూరం చాలాచోట్ల. ఇక ఆ సెలవుకు డబ్బు అడిగితే ఇంకేమైనా ఉందా? కాని ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ రెండు రోజుల క్రితం అందరి చూపు ఆకర్షించింది. దాదాపు 45 నగరాల్లో 45,000 హోటళ్ల నుంచి నెలకు 20 లక్షల ఆహార ఆర్డర్లు సరఫరా చేసే ఈ సంస్థకు దాదాపు లక్షన్నర మంది ఫుడ్ డెలివరీ పార్టనర్స్ (బాయ్స్/గర్ల్స్) ఉన్నారు. వారిలో 1000 మంది ఫుడ్ డెలివరీ విమెన్ ఉన్నారు. ఈ సంఖ్యను 2000కు పెంచాలని స్విగ్గీ అనుకుంది కాని కరోనా వల్ల ఆ భర్తీ మందగించింది. అయితే ఇప్పుడు ఆ సంస్థ తన ఫుడ్ డెలివరీ విమెన్‌కు నెలలో రెండు రోజుల వేతన సెలవును ఇస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఆ రెండురోజులు వాళ్లు రెగ్యులర్‌గా కనిష్టంగా రోజువారీ ఎంత కమీషన్ పొందుతారో అంత కమీషన్ వారికి ఇస్తారు. ‘నాకు పిరియెడ్స్. రెండు రోజులు సెలవు కావాలి’ అని మా డెలివరీ విమెన్ అడిగితే ఒక్క ప్రశ్న కూడా అడక్కుండా వెంటనే మంజూరు చేసే సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం అని స్విగ్గీ వైస్‌ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) మిహిర్ షా ప్రకటించారు. ఆ రెండు రోజులకు జీతం కూడా ఇస్తాం అని ఆయన తెలియచేశారు. 2014లో బెంగళూరులో ఆరు మంది డెలివరీ బాయ్స్‌తో మొదలైన స్విగ్గీ అనతికాలంలో మహా సంస్థగా అవతరించింది. 2016లో పూణెలో మొదటి డెలివరీ ఉమన్ ఉద్యోగంలో చేరితే 2019లో చెన్నైలో ఆ తర్వాత ముంబైలో డెలివరీ పార్టనర్స్‌గా చేరడం మొదలెట్టి ఇప్పుడు ఆ సంఖ్య వెయ్యికిపైగా మారింది. ‘మా మహిళా ఉద్యోగులకు ప్రత్యేక యాప్ ఉంటుంది. వారు దాని ద్వారా ఎమర్జన్సీ నంబర్‌కు కాల్ చేసే వీలు ఉంది. వారికి తక్షణం సహాయం కావాలంటే అందుతుంది. మేము వారి కోసం శుభ్రమైన టాయిలెట్లు కల్పిస్తున్నాము. షెల్ పెట్రోల్ బంకులతో ప్రత్యేకంగా చేసుకున్న ఏర్పాటు వల్ల మా డెలివరీ విమెన్ ఆ బంకుల్లోని టాయిలెట్లను ఉపయోగించుకోవచ్చు. డెలివరీ, ట్రావెల్ రంగాల్లో కేవలం బహిష్టు సమస్య వల్ల స్త్రీలు రాకుండా ఉండకూడదు. వారికి సౌకర్యాలు కల్పించాలి. అలాగే ఆ రోజులకు వేతన సెలవు ఇవ్వాలి’ అని స్విగ్గీ ప్రతినిధి ఒకరు అన్నారు. స్విగ్గీలో పని చేస్తున్న మహిళల్లో దాదాపు 90 శాతం మంది 45 ఏళ్ల లోపువారే. వీరిలో జీవితంలో తొలి సంపాదన స్విగ్గీతో మొదలెట్టిన వారు 24 శాతం మంది ఉన్నారు. తమకు వీలున్న టైమ్‌లోనే పని చేసే అవకాశం ఉండటంతో చేరుతున్నారు. చాలామంది తమ సంపాదన ఇంటి అద్దెకు, కరెంటు బిల్లుకు ఉపయోగిస్తున్నారు. కొంతమంది యువతులు చదువుకోవడానికి. ‘మహిళా డెలివరీ పార్టనర్స్‌కు వాహనాలు లేకపోతే వారి కోసం మా సంస్థ ఎలక్ట్రిక్ సైకిల్/బైక్‌లను అద్దెకు ఏర్పాటు చేయడానికి ఆయా సంస్థలతో మాట్లాడుతున్నాం’ అని కూడా స్విగ్గీ సంస్థ ప్రతినిధి అన్నారు. ప్రస్తుతం నగరాల్లో ఫుడ్ డెలివరీ సిబ్బంది తమ పెట్రోల్ ఖర్చులు పోను 20 వేల నుంచి 25 వేలు సంపాదిస్తున్నారు. బహిష్టు అనేది స్త్రీ శరీరధర్మం. ప్రకృతి ధర్మం. ఆ సమయంలో వారికి విశ్రాంతినివ్వడం, ఆర్థికంగా నష్టం జరక్కుండా చూడటం మానవీయ విషయం. కాని బహిష్టు వల్ల సెలవు పెడితేనే విడ్డూరం చాలాచోట్ల. ఇక ఆ సెలవుకు డబ్బు అడిగితే ఇంకేమైనా ఉందా? -
బకాయిలు చెల్లించండి
సినీ పరిశ్రమకు చెందిన దినసరి వేతనాలు అందుకునే సాంకేతిక నిపుణులు, నటీనటులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను నిర్మాతలు చెల్లించాలని ‘ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ (ఐఎమ్పీపీఏ) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘షూటింగ్స్ లేకపోవడం వల్ల చాలామంది ఉపాధిని కోల్పోయారు. ప్రభుత్వ ఆదేశానుసారంగా లాక్డౌన్ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పెండింగ్ వేతనాలు అందక దినసరి కార్మికులు, సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్లిష్టపరిస్థితుల్లో నిర్మాతలు కూడా కష్టాల్లోనే ఉన్నారు. అది అర్థం చేసుకోగలం. కానీ మానవీయ కోణంలో నిర్మాతలు ఆలోచించి బకాయిలను వీలైనంత తొందరగా చెల్లించాలని కోరుతున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో వారు గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించడానికి వీలవుతుంది’’ అని ఐఎమ్పీపీఏ పేర్కొంది. -
పనులు ప్రారంభమయ్యాయి కానీ..
న్యూఢిల్లీ: సోమవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ 3.0 ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా జోన్ల వారీగా మినహాయింపులు ఇచ్చిన నేపథ్యంలో.. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఇతర పలు చేతి వృత్తుల నిపుణులు తమ పనులు ప్రారంభించారు. ముఖ్యంగా, వేసవి కాలం ప్రారంభమై, భానుడు ప్రతాపం చూపుతుండటంతో ఏసీలు, కూలర్ల సర్వీసింగ్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. మరోవైపు లాక్ డౌన్ కారణంగా దాదాపు నెలన్నరగా వాయిదా పడిన గృహ సంబంధ పనులన్నీ ఒక్కటొక్కటిగా పూర్తి చేసుకునేందుకు ప్రజలు సమాయత్తమవుతున్నారు. పనులు చేసుకునేందుకు అనుమతిన్విడమే కాకుండా.. సంబంధిత స్పేర్ సామాన్లు అమ్మే షాపులు కూడా తెరిచేందుకు అనుమతినివ్వాలని ఢిల్లీకి చెందిన ఒక ఎలక్ట్రీషియన్ వ్యాఖ్యానించారు. ప్రతీ ఏప్రిల్‌లో ఏసీ రిపేర్, సర్వీసింగ్‌ల ద్వారా కనీసం రూ. 40 వేలు సంపాదించేవాడినని, ఈ సారి కరోనా కారణంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని వాపోయారు. ఢిల్లీలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు.. తదితర అసంఘటిత రంగ కార్మికులు దాదాపు 6 లక్షల వరకు ఉంటారని అంచనా. అయితే, కరోనా వ్యాప్తిపై భయాందోళనల కారణంగా చాలా మంది పౌరులు ఇంట్లో మరమ్మత్తు పనుల కోసం బయటి నుంచి ఎవరినీ పిలిచేందుకు సాహసించడం లేదు. -
జీతాలను ముందుగానే చెల్లించేశా!
కరోనా వైరస్ జనజీవనాన్ని తారుమారు చేసింది. ముఖ్యంగా దినసరి కార్మికుల జీవనశైలి తీవ్రంగా దెబ్బతింటోంది. సినిమా పరిశ్రమలో దినసరి వేతనాలు తీసుకునే చిన్న కార్మికుల సంఖ్య ఎక్కువే ఉంది. కొందరు సినిమా తారలు వారికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. తన సిబ్బందికి మూడు నెలల జీతాన్ని ముందుగానే చెల్లించానని పేర్కొన్నారు నటుడు ప్రకాష్‌రాజ్. ‘‘జనతా కర్ఫ్యూ రోజు నా మనసులో చాలా చాలా ఆలోచనలు వచ్చాయి. నా నగదు నిల్వను ఓసారి పరిశీలించుకున్నాను. నా ఇల్లు, ఫార్మ్‌హౌస్, ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్ లో ఉద్యోగం చేసేవారితో పాటు నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశాను. నేను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబంధించి దినసరి వేతనం తీసుకునే కార్మికుల గురించి ఆలోచించాను. కరోనా మహ మ్మా రితో పాటిస్తున్న సామాజిక దూరం మూలంగా చిత్రీకరణలు అన్ని నిలిచిపోయాయి. నా సినిమాల దినసరి వేతన కార్మికులకు సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించాను. ఇంకా నా శక్తి మేరకు చేస్తాను. అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే... మీ సహాయం అవసరమైన వారిని ఆదుకోండి. ఒకరి జీవితాన్ని మీరు నిలపగలిగే సమయం ఇది. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం ఇది’’ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు ప్రకాష్ రాజ్. -
పెరిగిన ఉపాధి కూలీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీల రోజువారీ గరిష్ట వేతనాన్ని పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణలోనూ మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో కూలీల రోజువారీ గరిష్ట వేతనం రూ.197 ఉండేది. ఈ మొత్తాన్ని రూ.205కు పెంచారు. ఈ నెల 1 నుంచి ఈ పెరిగిన వేతనం అమల్లోకి వచ్చింది. ఉపాధి కూలీల రోజువారీ గరిష్ట వేతనాన్ని ఏటా పెంచాలని చట్టంలోనే పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం ఎప్పటికప్పుడు పెంచుతోంది. దీనికి అనుగుణంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఉపాధి కూలీల రోజువారీ వేతనం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో దేశంలోనే గరిష్టంగా రూ.273 ఉంది. జార్ఖండ్‌లో అతి తక్కువగా రూ.168 వేతనం ఇస్తున్నారు. పెంచిన గరిష్ట వేతనం ప్రకారం కూలీలకు అందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
సిరిసిల్లలో నేత కార్మికుల సమ్మె
కరీంనగర్ : కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో చేనేత కార్మికులు సోమవారం సమ్మెకు దిగారు. దీంతో 7 వేల మరమగ్గాలు మూగబోయాయి. దాదాపు 3 వేల మంది నేత కార్మికులు రోడ్డెక్కి భారీ ర్యాలీ నిర్వహించారు. కూలీ రేట్లు పెంచేంత వరకూ సమ్మెను విరమించబోమని కార్మికులు ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు.