
తాగిన మత్తులో చిన్నారిని కాలితో తన్నిన ఖాకీ
మెదక్ జిల్లా దుబ్బాక పోలీసు స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పాషా దౌర్జనానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మద్యం మత్తులో ఉన్న అతగాడి దౌర్జన్యానికి చిన్నారి నిఖిత ప్రాణాలు కోల్పోయింది. దాంతో నికిత బంధువులు దుబ్బాక పోలీసు స్టేషన్ ఎదుట బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. నిఖిత బంధువుల కథనం ప్రకారం...ఏఎస్ఐ పాషా భూవివాదం పరిష్కరించేందుకు నిఖిత తండ్రి కోసం ఇంటికి వచ్చాడు. అయితే ఆ సమయంలో నిఖిత తండ్రి ఇంట్లో లేకపోవడంతో అదే విషయాన్ని నికిత తల్లి పాషా వెల్లడించింది.
దాంతో అతడు ఆగ్రహంతో నికిత తల్లిపై చెయ్యి చేసుకున్నాడు. అంతే కాకుండా తాగిన మత్తులో కాలితో తన్నడంతో 6 నెలల చిన్నారి నిఖిత తీవ్ర గాయంతో మృతి చెందింది. పాషా వల్లే తమ నికిత మరణించిందని ఆ చిన్నారి తల్లితండ్రులు, బంధువులు దుబ్బాక పీఎస్ ఆందోళనకు దిగారు. ప్రస్తుతం పాషా పరారీలో ఉన్నాడు.