వైద్యం అందక చిన్నారి మృతి
సీతారామపురం : మండలంలోని అంకిరెడ్డిపల్లికి చెందిన గొల్లపల్లి దావీదు, నిర్మల దంపతుల ఏడాది చిన్నారికి సకాలంలో వైద్యం అందక శనివారం మృతి చెందింది. చిన్నారి న్యూమోనియా కారణంగా శనివారం అస్వస్థకు గురైంది. ఊపిరి ఆడకపోవడంతో ఉదయగిరిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కyì ఆక్సిజన్ లేకపోవడంతో సంబంధిత వైద్యులు వింజమూరు వెళ్లాల్సిదింగా తల్లిదండ్రులకు తెలిపారు. ఉదయగిరి నుంచి 108 వాహనానికి సమాచారం అందించినా వారు ఎంత సేపటికీ స్పందించపోవడంతో ప్రైవేట్ వాహనంలో వింజమూరుకు తరలించారు. ఆసుపత్రికి చేరిన కొద్ది సేపటికే పాప మృతి చెందింది. ఆక్సిజన్ అందటం ఆలస్యం జరగడం వల్లనే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పాప తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మారుమూల తమ ప్రాంతంలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం వలనే తమ పాప మృతి చెందిందని వాపోయారు. వైద్యం కోసం 50 కిలో మీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితుల్లోనే పాప మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు.