
రిత్విక్
గాంధారి: గొంతులో ఇనుప మేకు ఇరుక్కుని ఓ బాలుడు మరణించాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కరక్‌వాడి గ్రామానికి చెందిన రాధాబాయి, భాస్కర్‌రావుల కుమారుడు రిత్విక్(3) బుధవారం రాత్రి ఆడుకుంటూ నోట్లో ఇనుపమేకు పెట్టుకున్నాడు. అది గొంతులోకి జారిపోవడంతో శ్వాస ఆడక తీవ్రంగా ఏడవడం మొదలు పెట్టాడు. గమనించిన తల్లిదండ్రులు గాంధారి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి సిఫారసు చేయడంతో అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు.