టైలా పేజ్ అనే యువతి తన దీనగాథను సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది. బాధను భరించలేక తన కాలును తీసేయండంటూ వైద్యులను పలు విధాల ప్రాధేయపడిన ఉదంతాన్ని ఆమె షేర్ చేసింది. ఆమెకు భరించలేనంతగా కాలి నొప్పిరావడంతో దానిని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
రీజనల్ పెయిన్ సిండ్రోమ్ బారిన ఫుట్‌బాల్ కోచ్..
న్యూయార్క్ పోస్ట్‌లో వెలువడిన ఒక రిపోర్టు ప్రకారం బ్రిటన్‌కు చెందిన టైలా పేజ్‌కు అపెండిక్స్ తొలగించినప్పటి నుంచి కాలి నొప్పిని ఎదుర్కొంటోంది. అంతకుమందు ఆమె ఫుట్‌బాల్ కోచ్‌గా పనిచేసింది. ఆమెకు కాలినొప్పి ఎంతగా ఉండేందంటే ఆ నొప్పితో ఆమె నిరంతరం ఏడుస్తూనే ఉండేది. నొప్పిని భరించలేకపోతున్నానంటూ కనిపించిన అందరితోనూ చెప్పుకుని రోదించేది.
కాలు త్రీవంగా ప్రభావితం
టైలా 2016లో కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్ బారిన పడింది. ఈ సమయంలో ఆమె భరించలేనంత నొప్పిని అనుభవించింది. ఈ వ్యాధి సాధారణంగా కాలు లేదా చేయిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి మనిషిని శారీరకంగానూ, మానసికంగానూ కుంగదీస్తుంది. దీనిని ‘సూసైడ్ డీసీజ్’ అని కూడా అంటారు. ఈ నొప్పి సాధారణంగా ఏదైనా గాయం అయిన తర్వాత, సర్జరీ లేదా స్ట్రోక్, గుండెపోటు వచ్చిన తరువాత మొదలవుతుంది.ఈ నొప్పి కారణంగా టైలా ఏ పనీ చేయలేకపోయేది.
‘కాలి నొప్పి భరించడం అసాధ్యంగా మారింది’
తన అనుభవాన్ని వివరించిన ఆమె.. ‘ఒకానొక సమయంలో కాలును కదపడం కష్టంగా మారింది. విపరీతంగా నొప్పి వచ్చేది. చల్లని గాలి తాకినా, కాలు నీటిలో పెట్టినా భరించలేనంత నొప్పి పుట్టేది. కుర్చీలో కూర్చోలేకపోయేదానిని. స్కూలులో కొద్దిసేపు ఉండి వచ్చేసేదానిని’ అని తెలిపింది. భరించలేని నొప్పి కారణంగా ఆమె స్నానం చేయలేకపోయేది. దుస్తులు స్వయంగా ధరించలేకపోయేది. మంచానికే పరిమితం కావాల్సిన దుస్థితి ఏర్పడటంతో మానసికంగా కుంగిపోయింది.
తల్లి ఓదార్పుతో..
ఆ సమయంలో ఆమె తల్లి తన కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది. ఒకనాడు టైలా ఇక తాను ఆ కాలుతో జీవించలేనని అభిప్రాయపడింది. తన శరీరం నుంచి ఆ కాలిని తొలగించుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకుంది. ‘చేతులు ఎత్తి వేడుకుంటున్నాను.. నా కాలు తీసేయండి’.. అని వైద్యులను శతవిధాల వేడుకుంది. 2019లో ఆమెకు ఆపరేషన్‌చేసి, కాలిని తొలగించారు. అప్పుడామె ఎంతో సంతోషించింది. ఇకపై భరించలేనంత నొప్పి ఎదుర్కోవాల్సిన అవసరం లేదని సంబరపడింది.
ఇది కూడా చదవండి: ఇదే బ్రూస్ లీ జిమ్ వర్క్‌అవుట్ ప్లాన్..
అరుదైన ‘సూసైడ్ డిసీజ్’: నొప్పి భరించలేకపోతున్నా! కాలు తీసేయండి మహా ప్రభో!
Published Mon, Jul 3 2023 1:06 PM | Last Updated on Mon, Jul 3 2023 2:43 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment