
మహబూబ్‌నగర్: ఆదివాసి మహిళకు కడుపులో పెరుగుతున్న బరువు ప్రాణాల మీదకు తెచ్చింది. ఎలాగైనా వైద్యం అందించి ఆదుకోవాలని ఆమె వేడుకుంటుంది. అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్(బీకే) గ్రామానికి చెందిన ఈదమ్మ, భర్త బిక్షమయ్య నిరుపేద కుటుంబం. వారికి ముగ్గురు ఆడపిల్లలు, జీవాలు మేపుతూ జీవనం గడుపుతున్నారు.
ఇంతలోనే ఈదమ్మ కడుపులో ఏదో పెరుగుతుంది. క్రమంగా 15 కిలోల బరువు వరకు వచ్చింది. వారికి ఉన్న స్థోమతలో ఆర్‌ఎంపీల వద్ద చూయించుకున్నా తగ్గలేదు. కడుపులో కణతి పెరుగుతుందని ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు తెలిపారని ఈదమ్మ బోరుమంటుంది. ఆపరేషన్ చేయించుకునే స్థోమతలేక అలాగే ఉన్నామని క్రమంగా బరువు పెరుగుతుండటంతో శ్వాసతీసుకోవడం కష్టం అవుతుందని ఈదమ్మ విలపిస్తోంది. తనకేమన్న అయితే పిల్లలు అనాథలు అవుతారని, ప్రభుత్వం వైద్యం అందించి ఆదుకోవాలని వేడుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment