eedamma
-
భారీగా ఉబ్బిన కడుపు.. క్రమంగా 15 కిలోల బరువు.. ఇంతలో ఇలా..
మహబూబ్నగర్: ఆదివాసి మహిళకు కడుపులో పెరుగుతున్న బరువు ప్రాణాల మీదకు తెచ్చింది. ఎలాగైనా వైద్యం అందించి ఆదుకోవాలని ఆమె వేడుకుంటుంది. అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్(బీకే) గ్రామానికి చెందిన ఈదమ్మ, భర్త బిక్షమయ్య నిరుపేద కుటుంబం. వారికి ముగ్గురు ఆడపిల్లలు, జీవాలు మేపుతూ జీవనం గడుపుతున్నారు. ఇంతలోనే ఈదమ్మ కడుపులో ఏదో పెరుగుతుంది. క్రమంగా 15 కిలోల బరువు వరకు వచ్చింది. వారికి ఉన్న స్థోమతలో ఆర్ఎంపీల వద్ద చూయించుకున్నా తగ్గలేదు. కడుపులో కణతి పెరుగుతుందని ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు తెలిపారని ఈదమ్మ బోరుమంటుంది. ఆపరేషన్ చేయించుకునే స్థోమతలేక అలాగే ఉన్నామని క్రమంగా బరువు పెరుగుతుండటంతో శ్వాసతీసుకోవడం కష్టం అవుతుందని ఈదమ్మ విలపిస్తోంది. తనకేమన్న అయితే పిల్లలు అనాథలు అవుతారని, ప్రభుత్వం వైద్యం అందించి ఆదుకోవాలని వేడుకుంటుంది. -
దొంగల ముఠా అరెస్టు
నాగోలు: బస్సుల్లో.. వస్త్ర దుకాణాల్లో దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్న ముఠాను ఎల్బీనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. అంబర్పేటలో నివాసముంటున్న ఇంగుర్తి శ్రీను (27), ఇంగుర్తి విశ్వరూపాచారి (50), ఖమ్మం పట్టణానికి చెందిన నల్లగొండ కౌసల్య, నల్లగొండ ఈదమ్మలు ముఠాగా ఏర్పడి దృష్టి మళ్లించి బస్సులు, దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. ఎల్బీనగర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముఠాను ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ. 20వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.