Up: అశ్లీల వీడియో వైరల్‌.. పోలీసులకు ఎంపీ ఫిర్యాదు | UP BJP MP Obscene Fake Video Went Viral | Sakshi
Sakshi News home page

‘అది నేను కాదు’.. అశ్లీల ఫేక్‌ వీడియోపై పోలీసులకు బీజేపీ ఎంపీ ఫిర్యాదు

Mar 4 2024 10:55 AM | Updated on Mar 4 2024 11:45 AM

Up Bjp Mp Obscene Fake Video Went Viral - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి బీజేపీ ఎంపీ ఉపేంద్రసింగ్‌ రావత్‌కు సంబంధించి నకిలీదీగా భావిస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియలో వైరల్‌ అవుతోంది. తాజాగా బీజేపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలోనూ రావత్‌కు బారాబంకి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మళ్లీ టికెట్‌ దక్కింది.

ఈ జాబితా ప్రకటించిన వెంటనే రావత్‌ను పోలి ఉన్న వ్యక్తి బెడ్‌పై ఒక అమ్మాయితో అశ్లీల స్థితిలో లిక్కర్‌ గ్లాసు చేతిలో పట్టుకుని ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. వీడియో వచ్చిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది.

అయితే ఈ వీడియోలో ఉన్నది తాను కాదని ఎవరో ఫేక్‌ వీడియో క్రియేట్‌ చేశారని ఎంపీ కొత్వాలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వీడియోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్‌ ఎంపీ ప్రియాంక సింగ్‌ రావత్‌ను తప్పించి ఉపేంద్రసింగ్‌ రావత్‌కు బీజేపీ హైకమాండ్‌ టికెటివ్వగా ఆయన గెలిచారు. తాజాగా రెండోసారి ఉపేంద్రకు పార్టీ టికెట్‌ ప్రకటించింది. 

ఇదీ చదవండి.. ఈడీకి కేజ్రీవాల్‌ ఎనిమిదో‘సారి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement