అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఓ భార్య ప్రియుడితో కలసి తన భర్తనే హత్య చేసింది. ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో ఈ సంఘటన జరిగింది. లాల్జీ యాదవ్ అనే వ్యక్తి భార్య కవితకు విశ్వనాథ్ అనే మరొకరితో అక్రమ సంబంధముంది. ఈ విషయం యాదవ్కు తెలియడంతో భార్యను మందలించాడు.
భర్త తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో కవిత ప్రియుడితో కలసి హత్యకు పథకం వేసింది. వీరిద్దరూ మరొకరి సాయం తీసుకుని యాదవ్ను హత్య చేశారు. పొదలచాటున పడిఉన్నయాదవ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించి విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేశారు. నేరం చేసినట్టు వారు అంగీకరించారని పోలీసులు తెలిపారు. మూడో వ్యక్తిని ఇంకా అరెస్ట్ చేయాల్సివుంది.
ప్రియుడితో కలసి భర్తను చంపిన భార్య
Published Sun, Sep 22 2013 3:39 PM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement
Advertisement