లక్నో: ఓవైపు వ్యాక్సిన్ల కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లో కొంత మంది టీకాలు వేస్తామంటే చాలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. వైద్యాధికారులు వస్తున్నారని తెలిసి నదిలో దూకారు. ఈ వింత ఘటన యూపీలోని బారాబంకీలో శనివారం చోటుచేసుకుంది. ఈ విషయం గురించి రామ్‌నగర్ సబ్ కలెక్టర్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. కరోనా నిరోధక టీకాపై ఉన్న అపోహలే వల్లే సదరు గ్రామస్తులు ఇలా చేశారని చెప్పారు. కేవలం 14 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు.
‘‘అదొక విషపు ఇంజక్షన్. వ్యాక్సిన్ కాదు. అందుకే మేం సరయూ నదిలో దూకాం’’ అని గ్రామస్తులు తనకు చెప్పినట్లు శుక్లా వెల్లడించారు. కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2, 22, 315 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. 4, 454 కరోనా మరణాలు సంభవించాయి. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తంగా 27,20,716 యాక్టివ్ కేసులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఏప్రిల్ 15 తర్వాత ఇప్పుడిప్పుడే కేసుల్లో తగ్గుదల నమోదు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment