ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో సరయూ నది వరదల కారణంగా వందలాది గ్రామాలు నీట మునిగాయి. నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో సమీపంలోని గ్రామాల ప్రజలు వరదల బారిన పడ్డారు అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
వరద బాధితులకు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను అధికారులు పంపిణీ చేస్తున్నారు. బారాబంకి డీఎం సత్యేంద్ర కుమార్, ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేపాల్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా గత రెండు మూడు రోజులుగా సరయూ నది నీటిమట్టం ప్రమాద స్థాయి కంటే 20 సెంటీమీటర్ల మేర పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 15 గ్రామాల్లోని 500 ఇళ్లలోకి నీరు చేరిందని డీఎం పేర్కొన్నారు. ఈ కుటుంబాలకు చెందిన వారు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ శిబిరాల్లో అధికారులు వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment