పాపకు నోటితో శ్వాస అందిస్తున్న తండ్రి
లక్నో: ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ మంచం మీద నుంచి కిందపడడంతో అత్యవసర చికిత్స కోసం తల్లిదండ్రులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యం చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదు. వైద్యులు చేయకున్నా తన బంగారాన్ని కాపాడుకునేందుకు ఆ తండ్రే తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఎలాగైనా బతికించుకోవాలని కూతురికి నోటిలో నోరు పెట్టి శ్వాస అందించేందుకు ప్రయత్నించాడు. కానీ చివరకు ఆ చిన్నారి ప్రాణాలు దక్కలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. పాప ప్రాణం నిలిపేందుకు ఆ తండ్రి పడుతున్న కష్టాలు చూస్తుంటే కళ్లు చెమరుస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాకు చెందిన గౌస్‌పూర్‌కు చెందిన ఓ తండ్రి తన కూతురు మంచం పైనుంచి కిందపడిందని ఐదేళ్ల చిన్నారిని ఆస్పత్రికి తీసుకొచ్చాడు. బరాబంకిలోని ఆస్పత్రి వైద్యులు చికిత్స చేసేందుకు వెనకడుగు వేశారు. దీంతో కొన ప్రాణంతో ఉన్న తన కూతురిని బతికించేందుకు ఆ తండ్రి నోటితో శ్వాస అందించాడు. పలుమార్లు నోటితో పాప నోట్లో ఊది బతికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. అనంతరం ఊపిరితిత్తులను పలుమార్లు మెల్లగా నొక్కాడు. అయినా అతడి ప్రయత్నాలు ఫలించలేదు. పాప కన్నుమూసింది. వైద్యుల తీరుపై ఆ తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతోపాటు ఈ సన్నివేశాన్ని సెల్‌ఫోన్‌లలో వీడియోలు తీయడంపై మండిపడ్డాడు. దీనికి సంబంధించిన వివరాల కోసం ఈ వార్త చదవండి: నా కూతురు చనిపోయింది సార్, మీకు డ్రామాలా ఉందా?
Comments
Please login to add a commentAdd a comment