కుమార్తెకు హెలికాప్టర్‌లో వీడ్కోలు పలికిన ఎడిటర్‌ | Father Book Helicopter for Bride Farewell | Sakshi
Sakshi News home page

Uttar Pradesh: కుమార్తెకు హెలికాప్టర్‌లో వీడ్కోలు పలికిన ఎడిటర్‌

Published Tue, Mar 5 2024 10:18 AM | Last Updated on Tue, Mar 5 2024 10:58 AM

Father Book Helicopter for Bride Farewell - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో చోటు చేసుకున్న ఒక ఆసక్తికర ఉదంతం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా నిలిచింది. ఓ తండ్రి తన కుమార్తెకు ఘనంగా వివాహం జరిపించాక, ఆమెను హెలికాప్టర్‌లో అత్తవారింటికి పంపారు.

ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోని పట్టి తహసీల్ ఉపాధ్యాయపూర్ గ్రామానికి చెందిన కృపాశంకర్ తివారీ తన కుమార్తె శివకు అత్యంత ఘనంగా వివాహం జరిపించారు. అనంతరం ఆమెకు హెలికాప్టర్‌లో వీడ్కోలు పలికారు. సుల్తాన్‌పూర్‌లోని శంకర్‌గఢ్‌కు చెందిన సత్యప్రకాష్‌ పాండే కుమారుడు సతీష్‌ పాండేతో శివకు వివాహం జరిగింది. ప్రతాప్‌గఢ్‌లోని రాణి రామ్ ప్రియా గార్డెన్‌లో వీరి వివాహ వేడుక జరిగింది. 

అనంతరం కృపాశంకర్ తివారీ తన కుమార్తె శివను తన స్వగ్రామం ఉపాధ్యాయపూర్ నుండి హెలికాప్టర్‌లో అ‍త్త వారింటికి పంపించారు. హెలికాప్టర్‌లో వధూవరులు కూర్చున్నారు. ఆ సమయంలో వీరిని చూసేందుకు  భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ముంబై నుండి ప్రచురితమయ్యే  ‘అభ్యుదయ వాత్సల్యం’ పత్రికకు కృపాశంకర్ తివారీ చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు అలోక్ రంజన్ తివారీ ఎటర్నల్ కార్పొరేట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement