breath
-
మళ్లీ కలసి పనిచేస్తాం
‘‘మంచి సందేశంతో సమాజానికి అవసరమైన కథ ‘బ్రీత్’. వంశీకృష్ణగారు అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకొని ఈ సినిమాని తీర్చిదిద్దారు.. భవిష్యత్‌లో మేము మళ్లీ కలసి పనిచేస్తాం. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరో చైతన్య కృష్ణ అన్నారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో చైతన్య కృష్ణ, వైదిక సెంజలియా జంటగా నటించిన చిత్రం ‘బ్రీత్’. బసవతారకరామ క్రియేషన్స్ పై నందమూరి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నందమూరి జయకృష్ణ మాట్లాడుతూ–‘‘బ్రీత్’ మంచి ఎమోషనల్ థ్రిల్లర్. సినిమా చాలా బాగా వచ్చింది.. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘చైతన్య కృష్ణ కోసం అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన, ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని అద్భుతమైన కథని రెడీ చేశాను. ‘బ్రీత్’ సక్సెస్ తర్వాత అది కూడా చేయాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు వంశీకృష్ణ ఆకెళ్ల. ఈ వేడుకలో వైదిక సెంజలియా, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యో నారాయణో హరి..
చైతన్యకృష్ణ హీరో పరిచయమవుతున్న ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్రీత్’. ‘వైద్యో నారాయణో హరి’ అనేది ట్యాగ్‌లైన్. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో నందమూరి జయకృష్ణ నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 2న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. వైదిక సెంజలియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మార్క్ కె.రాబిన్ సంగీతం అందించారు. -
ఎమోషనల్ బ్రీత్
దివంగత ప్రముఖ నటులు ఎన్టీఆర్ మనవడు, నందమూరి జయకృష్ణ పెద్ద కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘బ్రీత్’. వైదిక హీరోయిన్గా నటించారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో నందమూరి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో చైతన్యకృష్ణ మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రానికి వంశీకృష్ణ లాంటి దర్శకులతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో నాకు ఆయన బ్రీత్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సాగే థ్రిల్లర్ ఫిల్మ్ ‘బ్రీత్’’ అన్నారు వంశీకృష్ణ. ‘‘నాన్నగారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశాం. ‘బ్రీత్’ ఓ ఎమోషనల్ థ్రిల్లర్’’ అన్నారు జయకృష్ణ. -
అదిరిపోయే గాడ్జెట్‌తో ఇంట్లో దుర్వాసనకు చెక్ పెట్టండిలా
ఇదో కొత్తతరహా ఎయిర్‌ప్యూరిఫయర్. మార్కెట్లో దొరికే మిగిలిన ఎయర్ప్యూరిఫయర్ల కంటే ఇది చాలా తేలిక. పోర్టబుల్ టేబుల్‌ఫ్యాన్ పరిమాణంలో ఉండే దీనిని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. కోరుకున్న చోట తేలికగా అమర్చుకోవచ్చు. ఇళ్లలోను, కార్యాలయాల్లోను వాడుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. ‘డాక్టర్ ఎయిర్పిక్’ పేరిట దక్షిణ కొరియాకు చెందిన బహుళజాతి సంస్థ పిక్సెల్రో కంపెనీ ఇటీవల దీనిని మార్కెట్లోకి తెచ్చింది. ఇందులోని కార్బన్ మల్టీకంపోజిట్ ఫిల్టర్, ప్లాస్మా డీయాడరైజర్లు గాలిలోని దుమ్ము ధూళి, పొగ, సూక్ష్మజీవకణాలు వంటివి తొలగించడమే కాకుండా, పరిసరాల్లోని ఎలాంటి దుర్వాసననైనా నిమిషాల్లో మటుమాయం చేస్తాయి. దీని ధర 75 డాలర్లు (రూ.6,134) మాత్రమే! ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో దొరుకుతోంది. -
అయ్యో దేవుడా: పాప ప్రాణం కోసం తండ్రి ఆరాటం..
లక్నో: ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ మంచం మీద నుంచి కిందపడడంతో అత్యవసర చికిత్స కోసం తల్లిదండ్రులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యం చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదు. వైద్యులు చేయకున్నా తన బంగారాన్ని కాపాడుకునేందుకు ఆ తండ్రే తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఎలాగైనా బతికించుకోవాలని కూతురికి నోటిలో నోరు పెట్టి శ్వాస అందించేందుకు ప్రయత్నించాడు. కానీ చివరకు ఆ చిన్నారి ప్రాణాలు దక్కలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. పాప ప్రాణం నిలిపేందుకు ఆ తండ్రి పడుతున్న కష్టాలు చూస్తుంటే కళ్లు చెమరుస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాకు చెందిన గౌస్పూర్కు చెందిన ఓ తండ్రి తన కూతురు మంచం పైనుంచి కిందపడిందని ఐదేళ్ల చిన్నారిని ఆస్పత్రికి తీసుకొచ్చాడు. బరాబంకిలోని ఆస్పత్రి వైద్యులు చికిత్స చేసేందుకు వెనకడుగు వేశారు. దీంతో కొన ప్రాణంతో ఉన్న తన కూతురిని బతికించేందుకు ఆ తండ్రి నోటితో శ్వాస అందించాడు. పలుమార్లు నోటితో పాప నోట్లో ఊది బతికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. అనంతరం ఊపిరితిత్తులను పలుమార్లు మెల్లగా నొక్కాడు. అయినా అతడి ప్రయత్నాలు ఫలించలేదు. పాప కన్నుమూసింది. వైద్యుల తీరుపై ఆ తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతోపాటు ఈ సన్నివేశాన్ని సెల్ఫోన్లలో వీడియోలు తీయడంపై మండిపడ్డాడు. దీనికి సంబంధించిన వివరాల కోసం ఈ వార్త చదవండి: నా కూతురు చనిపోయింది సార్, మీకు డ్రామాలా ఉందా? -
వైరల్ వీడియో: పాప ప్రాణం కోసం నోటితో తండ్రి ఆరాటం..
-
నోటి దుర్వాసన దూరమయ్యేదిలా!
నోటి దుర్వాసన సమస్య వచ్చిందంటే అందుకు ప్రధానంగా రెండు కారణాలుంటాయి. మొదటిది సరైన నోటి శుభ్రత (ఓరల్ హైజీన్) పాటించకపోవడం, రెండవది కడుపులో జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా లేకపోవడం. ఇటీవలి లాక్డౌన్ కాలంలో అందరూ ఇళ్లలోనే ఉండాల్సి రావడం, ఆఫీసులకు వెళ్లాల్సిన పని లేకపోవడం వంటి కారణాలతో నోటి శుభ్రత విషయంలో అంతగా శ్రద్ధ పెట్టడం లేదన్నది నోటివైద్యనిపుణుల తాలూకు పరిశీలనల్లో ఒకటి. దీనికి తోడు జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా లేకపోతే... నోటిదుర్వాసన పెరిగే అవకాశాలు మరింత ఎక్కువ. నోటి దుర్వాసన సమస్యను వైద్యపరిభాషలో ‘హాలిటోసిస్’ అంటారు. నోటి నుంచి దుర్వాసన వస్తోందంటూ డాక్టరును సంప్రదిస్తే, ఆయన మొట్టమొదట వారు ‘మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో కాస్త చెప్పండి’ అంటూ అడుగుతారు. ఇలాంటి ఆహారం మేలు... మంచి జీర్ణవ్యవస్థ కోసం ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం, తాజా తాజా పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తినాలంటారు. అలాగే ద్రవ పదార్థాలు పుష్కలంగా తాగాలంటారు. ఇవన్నీ మీ గ్యాస్ట్రో ఇంటస్టైనల్ ట్రాక్ట్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. కడుపులో ఎలాంటి అనారోగ్యకరమైన పరిస్థితులూ తలెత్తవు. ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాల్సిన మరో జాగ్రత్త కూడా ఉంది. అదే... ఆహారం తీసుకున్న ప్రతిసారీ దంతాలను శుభ్రం చేసుకోవాలి. వీలైతే బ్రషింగ్ లేదా ఫ్లాసింగ్ (దారంతో పళ్ల మధ్య చేరే వ్యర్థాలను శుభ్రం చేసుకోవడం). హాలిటోసిస్‌ను ఎదుర్కొనే హెర్బల్ మార్గం... నోటి దుర్వాసనను సమర్థంగా ఎదుర్కోవడంలో కొత్తిమీర, పుదీన, యూకలిప్టస్, రోజ్మేరీ, ఏలక్కాయ వంటివి బాగా పని చేస్తాయి. ఈ ఔషధీయ పదార్థాలను అలాగే నమలడం లేదా వాటిని నీటిలో మరిగించి ఆ టీని తాగడం వల్ల జీర్ణవ్యవస్థలోని అపసవ్యతలు తగ్గి, పనితీరు మెరుగవుతుంది. దాంతో నోటి దుర్వాసనా దూరమవుతుంది. అలాగే మనం రోజూ తీసుకునే ఆహారం తరవాత కూడా చివరగా ఏలక్కాయ, కొత్తిమీర, పుదీన వంటి వాటిని తినడం ద్వారా నోటి దుర్వాసనను దూరంగా ఉండవచ్చు. నోటి దుర్వాసనను దూరం చేసే చిన్న చిన్న చిట్కాలు తాజాపరిశోధనల ప్రకారం... రోజూ తాజా పెరుగు తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసనకు కారణమైన హైడ్రోజెన్ సల్ఫేడ్ పాళ్లను అదుపుచేయవచ్చు. పెరుగును క్రమంతప్పకుండా తీసుకోవడం ద్వారా దంతాల మీద పాచి పేరుకోవడాన్ని, చిగుళ్ల వ్యాధులను కూడా నివారించవచ్చు. నమిలినప్పుడు కరకరలాడే (అంటే క్రంచీగా అనిపించే పండ్లు) పండ్లు అయిన ఆపిల్స్, క్యారట్స్ వంటి పీచు పదార్ధాలు సమృద్ధిగా ఉండేవాటినీ, కూరగాయలు నోటి దుర్వాసనకు విరుగుడుగా పని చేస్తాయి. వీటిని తినడం వల్ల లాలాజలం ఎక్కువగా విడుదలై నోటిని శుభ్రంగా ఉంచుతుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లతో కూడిన చాలా రకాల పోషకాహారం దంతాల మీద పాచి పేరుకోవడానికి దోహదం చేస్తుంది. ఈ సమస్యను పండ్లు, ఆకుకూరలు, కాయగూరలను తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. హాలిటోసిస్‌కు చిగుళ్ల వ్యాధులు, జింజవైటిస్ వంటి దంతాల సమస్యలు ముఖ్యమైన కారణాలు. వీటిని నివారించాలంటే‘సి’ విటమిన్ పుష్కలంగా ఉండే నిమ్మజాతి పండ్లు, ఉసిరితో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇది నోటి దుర్వాసననూ అరికడుతుంది. విటమిన్–సి వల్ల ఈ కరోనా కాలంలో వ్యాధినిరోధక శక్తీ సమకూరుతుంది. -
అభిషేక్.. గట్టి హగ్ ఇవ్వాలనుంది
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌తో పాటు ఆయన తండ్రి అమితాబ్ బచ్చన్, భార్య ఐశ్వర్యారాయ్, కూతురు ఆరాధ్య కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరు త్వరగా కోలుకోవాలంటూ "బ్రీత్" నటుడు అమిత్ సాధ్ ఆకాంక్షించారు. ఈమేరకు సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. "అన్నయ్య(అబిషేక్).. మిమ్మల్ని గురు, యువ, బంటీ, బబ్లీ.. ఇలా ఎన్నో సినిమాల నుంచి దగ్గరగా చూస్తున్నాను. ముందుగా నాకు సీనియర్‌గా ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నన్ను మీతో సమానంగా చూశారు. మీరు ఎక్కువ, నేను తక్కువ అనే భావన నాకు రాకుండా చేశారు. మీరు లేకపోయుంటే బ్రీత్‌లో నా పాత్ర కబీర్ సావంత్ అసంపూర్తిగా మిగిలిపోయేది. ఈ విషయాన్ని ప్రస్తావించకుండా బ్రీత్ విజయ వేడుకకు ఆరంభం, ముగింపు ఏదీ ఉండదు. నన్ను ఎప్పుడూ ప్రేరేపిస్తూ ఉండే మీతో కలిసి పనిచేసేందుకు నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను". (రణ్‌బీర్ జిరాక్స్ ఇక లేరు) మీరు, మీ కుటుంబం ఎంతో త్వరగా కరోనాను జయించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అప్పుడు ఎంచక్కా మిమ్మల్ని కలుసుకోవచ్చు, మీకు గట్టిగా ఒక హగ్ కూడా ఇవ్వొచ్చు. అలా ఐతే నన్ను 2 వారాలు క్వారంటైన్లో ఉండమంటారేమో? రెండు వారాలేంటి, నెల రోజులైనా ఉంటాను. అంత ప్రేమ నాకు మీమీద! మిమ్మల్ని చూసే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటా" అని రాసుకొచ్చారు. కాగా అభిషేక్ బచ్చన్ తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ "బ్రీత్: ఇన్‌టూ ది షాడోస్". ఇందులో నటుడు అమీర్ సాధి కబీర్‌గా, అభిషేక్ అవినాష్‌గా నటించారు. (‘బిగ్‌బి, అభిషేక్‌లకు చికిత్స అవసరం లేదు’) -
తను నీడలో ఉంది
‘అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నిత్యా మీనన్. అంతేకాదు.. తన నటనతో మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ ప్రేక్షకుల హృదయాల్లోనూ చోటు సంపాదించుకున్న ఈ మలయాళ బ్యూటీ తొలిసారి ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్‌తో కలిసి ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. మాధవన్, అమిత్ సాధ్ నటించిన సూపర్ హిట్ ‘బ్రీత్’ వెబ్ సిరీస్‌కి ఇది రెండవ సీజన్. రెండో సీజన్లో అమిత్ సాధ్ కూడా కీలక పాత్రలో నటించారు. జూలై 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’ ప్రసారం కానుంది. కాగా అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్‌లకు ఇది తొలి వెబ్ సిరీస్ కావడం విశేషం. ‘తను నీడలో ఉంది... కనుగొనబడటానికి వేచి చూస్తోంది’ అంటూ ఈ సిరీస్ తొలి పోస్టర్ని విడుదల చేశారు. -
64% వర్షాన్ని పీల్చుకుంటున్న భూమి!
ఎక్కువ వర్షం పడినప్పుడు సాధారణంగా ఎక్కువ నీరు చెరువులు, నీటి ప్రాజెక్టుల్లోకి చేరటం రివాజు. కానీ, ఇటీవల కాలంలో అలా జరగడం లేదని, పెరుగుతున్న భూతాపం వల్ల భూమాత దాహం అంతకంతకూ పెరిగిపోవడమే ఇందుకు మూలకారణమని ఒక అధ్యయనంలో తేలింది. కుండపోత వర్షం కురిసినప్పుడు కూడా గతంలో మాదిరిగా వాగులు, వంకలు, నదుల్లోకి వరద నీరు ఎక్కువగా చేరటం లేదని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ బృందం అధ్యయనంలో వెల్లడైంది. 160 దేశాల్లో 5,300 నదీ పరీవాహక ప్రాంతాల్లో పరిశీలన కేంద్రాలు, 43 వేల వర్షపాత నమోదు కేంద్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఇదే అర్థమవుతోందని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ప్రతినిధి శర్మ ఇటీవల వెల్లడించారు. మనం ఇప్పటి వరకు అనుకుంటున్న దానికన్నా భూదాహం ఎక్కువగా ఉందన్నారు. వంద వాన చుక్కలు నేల మీద పడితే అందులో నుంచి 36 చుక్కలు మాత్రమే సరస్సులు, నదులు, భూగర్భ జలాల్లో కలుస్తున్నాయి. మనుషులకు అందుబాటులో ఉండే (ఈ నీటినే సాంకేతిక పరిభాషలో ‘బ్లూ వాటర్’ అంటారు) ఇదే. మిగతా మూడింట రెండొంతుల వర్షపు నీరు కురిసినప్పుడే మట్టిలోకి ఇంకిపోతున్నాయని (ఈ నీటినే సాంకేతిక పరిభాషలో ‘గ్రీన్ వాటర్’ అంటారు) ఈ అధ్యయనంలో తేలింది.వాతావరణ మార్పుల వల్ల కుండపోత వర్షాల సంఖ్య పెరిగినా నదులు, రిజర్వాయర్లలోకి వరద నీరు గతంలో మాదిరిగా పోటెత్తకపోవడానికి నేల ఉష్ణోగ్రత గతంలో కన్నా పెరిగి, ఆవిరైపోయే నీటి శాతం పెరిగింది. అందువల్లే వర్షపు నీటిని భూమి ఎక్కువ మొత్తంలో తాగేస్తోంది. సాధారణ వర్షాలకు నీరు పారి తరచూ రిజర్వాయర్లలోకి నీరు చేరుతుంటేనే రిజర్వాయర్లలో నీరు ఉంటుంది. భారీ వర్షపాతం నమోదైన అరుదైన సందర్భాల్లో మాత్రమే నదులు, రిజర్వాయర్లలోకి నీరు వస్తున్నదని ఈ అధ్యయనం తేల్చి చెబుతోంది. అంటే, గతంలో కన్నా భూమి త్వరగా బెట్టకు వస్తున్న సంగతిని రైతులు గుర్తించాలి. కందకాల ద్వారా ఎక్కువ నీటిని భూమిలోకి ఇంకింపజేసుకుంటేనే పంటలు, ముఖ్యంగా ఉద్యాన తోటలు బాగుంటాయని గుర్తించమని ఈ అధ్యయనం చెబుతోంది. -
కాలుష్యం బతికి ‘బట్ట’కట్టదు!
రెండు వందల కోట్లు.. ఏటా అమ్ముడయ్యే టీషర్ట్‌ల సంఖ్య ఇది. 440 పార్ట్స్ పర్ మిలియన్.. రికార్డుస్థాయికి చేరిన వాతావరణ కాలుష్యానికి ఓ లెక్క ఇది. టీషర్ట్‌లకు.. కాలుష్యానికి సంబంధం ఏమిటి? అనుకుంటున్నారా..! ఇప్పటివరకూ లేదు.. ఇకపై మాత్రం బోలెడంత ఉంటుంది. ఎందుకంటారా? టీషర్ట్ వేసుకుంటే కాలుష్యం తగ్గిపోతుంది కాబట్టి..!!! ఆగండాగండి.. మీరు మామూలుగా వేసుకునే టీషర్ట్‌తో ప్రయోజనం ఒక్కటే. ఒళ్లు కప్పుతుందంతే. అదే ఈ ఫొటోలో చూపించిన టీషర్ట్ వాడటం మొదలుపెట్టారనుకోండి. ఒక్కదెబ్బకు రెండు పిట్టలన్నట్లు గాల్లోని కాలుష్యాన్ని కూడా శుభ్రం చేసేయొవచ్చు. ఇటలీ కంపెనీ క్లాటర్స్ తయారు చేసిన ఈ వినూత్న టీషర్ట్ పేరు ‘రిపేయిర్’. ఛాతీ భాగంలో మూడు పొరలు ఉన్న వస్త్రాన్ని ఉంచుకుంటే చాలు.. మీరు అటు ఇటూ కదిలేటప్పుడు సోకే గాలిలో ఉండే ప్రమాదకరమైన విషవాయువులను పీల్చేసు కుంటుంది. స్వచ్ఛమైన గాలి మాత్రమే విడుదలయ్యేలా చేస్తుంది. ఫ్యాషన్ ఆసరాగా కాలుష్యంపై అవగాహన పెంచడం రిపేయిర్ అభివృద్ధి వెనుక ఉన్న లక్ష్యమని అంటున్నారు క్లాటర్స్ వ్యవస్థాపకులు ఫెడ్రికో సురియా, మార్కో లోగ్రీకో, సిల్వియో పెరుకాలు. మూడు పొరలు.. ఆరు రకాల కాలుష్యాలు.. రిపేయిర్ టీషర్ట్ ఛాతీ భాగంలో ఉండే ప్రత్యేక వస్త్రాన్ని ‘ద బ్రీత్’అని పిలుస్తున్నారు. అనిమోటెక్ అనే కంపెనీ తయారు చేసింది దీన్ని. ముందుగా చెప్పుకున్నట్లు ఇందులో మూడు పొరలు ఉంటాయి. ఒక్కోటి అతిసూక్ష్మమైన జల్లెడలాంటిది. ఎంత సూక్ష్మమంటే.. నానోస్థాయిలో ఉండే కాలుష్యాలను కూడా ఒడిసి పట్టగలిగేంత. గాల్లో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్లు, బెంజీన్ వంటి ప్రమాదకరమైన, కేన్సర్ కారకమైన వాయువులు ఒక పొరలోని జల్లెడలో చిక్కుకుపోతాయి. రెండోపొరలో ఉన్న ప్రత్యేకమైన పోగులు బ్యాక్టీరియాను చంపేస్తాయి. మూడో పొరకు దుర్వాసనలను పీల్చేసుకునే లక్షణం ఉంటుంది. ఈ మూడు ఒక్కటిగా పనిచేయడం ద్వారా ఎక్కడికక్కడ గాలి శుభ్రమవుతూంటుంది. స్వచ్ఛమైన గాలి మాత్రమే బయటకు వస్తూంటుంది. అనిమోటెక్ ద బ్రీత్ను ఇప్పటికే యూనివర్సిటీ పాలిటెక్నికా డెల్లే మార్సేలో పరీక్షించింది కూడా. సల్ఫర్ డయాక్సైడ్లను ఈ వస్త్రం 92 శాతం వరకూ ఒడిసి పట్టగలదని.. అదే సమయంలో నైట్రోజన్ ఆక్సైడ్లను 86 శాతం, ప్రమాదకరమైన సేంద్రీయ కణాలను 97 శాతం వరకూ తనలో నిక్షిప్తం చేసుకోగలదని ఈ పరీక్షల్లో రుజువైంది. టీషర్ట్లోని పొరలో పెట్టుకునే ద బ్రీత్ను ఏడాదికి ఒకసారి మార్చుకుంటే చాలు. ఎలాంటి శక్తిని వాడకుండా గాలిని శుభ్రం చేస్తూ ఉండవచ్చు. ద బ్రీత్ను ఇళ్లల్లో ఎయిర్ ప్యూరిఫయర్ల మాదిరిగా, బహిరంగ ప్రదేశాల్లో భారీ హోర్డింగ్‌లపై ప్రకటనల కోసమూ వాడుకోవచ్చని అనిమోటెక్ అంటోంది. ఒక టీషర్ట్.. రెండు కార్ల కాలుష్యం.. ద బ్రీత్‌తో కూడిన రిపేయిర్ టీషర్ట్‌ను ఏడాదిపాటు వాడితే దాదాపు రెండు కార్ల నుంచి వెలువడే కాలుష్యం వాతావరణంలోకి చేరకుండా అడ్డుకోవచ్చని క్లాటర్స్ అంటోంది. భూమ్మీద మొత్తం వంద కోట్ల కార్లు ఉన్నాయనుకుంటే.. రెండు వందల కోట్ల టీషర్ట్‌లలో ద బ్రీత్ ఏర్పాటైతే వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిపోతుందని ఫెడ్రికో సురియా అంటున్నారు. క్లాటర్స్ ప్రస్తుతం నిధుల సేకరణ కోసం కిక్‌స్టార్టర్‌లో ప్రత్యేకమైన ప్రచారాన్ని చేపట్టింది. ఒక్కో రిపేయిర్ టీషర్ట్‌ను 29 యూరోల (రూ.2,400)కు అమ్ముతోంది. వాణిజ్యస్థాయి ఉత్పత్తి ప్రారంభిస్తే దీని ధర రూ.3,600 అవుతుందని సురియా అంటున్నారు. ఇంకొన్ని నెలల్లో టీషర్ట్‌లతోపాటు ట్రాక్ సూట్లు, జాకెట్లను విడుదల చేస్తామని చెబుతున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అడినాయిడ్స్ వాపు ఎందుకు?
హోమియో కౌన్సెలింగ్ మా పాపకు తొమ్మిదేళ్లు. తరచూ జలుబు చేస్తోంది. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు చేసి అడినాయిడ్స్ వాచాయని, వాటిని శస్త్రచికిత్స చేసి తొలగించాలని చెప్పారు. మాకు ఆందోళనగా ఉంది. పాపకు శస్త్రచికిత్స అవసరం లేకుండా హోమియో మందులతో నయమయ్యే అవకాశం ఉందా? – నందిని, నిడదవోలు మన శరీర రోగనిరోధక వ్యవస్థలో భాగమైన అడినాయిడ్స్ చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్స్ కలిగించే బ్యాక్టీరియాను నశింపజేసి వ్యాధులను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఈ అడినాయిడ్స్ ఐదేళ్ల వయసు దాటాక కుంచించుకుపోవడం మొదలవుతాయి. యుక్తవయసునకు చేరేసరికి ఇవి పూర్తిగా అదృశ్యమైపోతాయి. బ్యాక్టీరియాను నశింపజేసే ప్రక్రియలో ఒక్కోసారి అవి వాపునకు గురై మళ్లీ మామూలుగా మారతాయి. కానీ కొన్ని సందర్భాల్లో అవి కూడా ఇన్ఫెక్షన్కు గురికావడం వల్ల, వాచిపోయి శ్వాసద్వారాలకు అడ్డుగా నిలిచి శ్వాస తీసుకోవడం ఇబ్బందిని కలగజేస్తాయి. అడినాయిడ్స్ గురైన సందర్భాల్లో టాన్సిల్స్ కూడా వాచేందుకు అవకాశం ఉంది. అడినాయిడ్స్ ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు కనిపించే లక్షణాలు ∙ముక్కు మూసుకుపోయినట్లుగా ఉండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. దాంతో నోటి దుర్వాసన, పెదవులు పగలడం, నోరు ఎండిపోయినట్లుగా అనిపించడం, ముక్కు దిబ్బడ ఏర్పడవచ్చు. ∙నిద్రంచే సమయంలో ప్రశాంతంగా లేకపోవడం, గురక వంటివి కనిపించవచ్చు. ∙గొంతు భాగంలోని గ్రంథుల వాపు, చెవి సమస్యలను గమనించవచ్చు. చికిత్స: హోమియో విధానంలో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స అందించడం ద్వారా అడినాయిడ్స్ సమస్యను పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడం వల్ల శస్త్రచికిత్స అవసరం లేకుండానే సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
ఆరోగ్యానికి ఆసరా
యోగా ఆరోగ్యానికి చేయూత నిచ్చేది యోగా. అలాంటి యోగా చేస్తున్నప్పపుడు తొలి దశలో కఠినంగా అనిపించని ఆసనాలు వేస్తాం. అలాంటి ఆసనాలు వేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటే కుర్చీని ఆసరాగా తీసుకోవచ్చు. నటరాజాసన తీరుగా నిలుచుని చేతుల్ని శరీరానికి పక్కగా ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కుడికాలిని వంచి, కుడికాలి చీలమండను లేదా కుడికాలి బొటనవేలిని కుడి చేత్తో పట్టుకోవాలి. వీలైనంత వరకూ కుడికాలిని పైకి ఎత్తాలి. తర్వాత ఎడమచేతిని ముందుకు చాచాలి. ఇలా 3 నుంచి 5 సాధారణ శ్వాసల పాటు ఉండి, నిదానంగా పూర్వ స్థితికి రావాలి. అదే విధంగా తర్వాత ఎడమకాలితో కూడా చేయాలి. దీని వల్ల కాళ్లు, చీల మండలు, తుంటి భాగం శక్తిమంతమవుతాయి. తొడల్లో కొవ్వు తగ్గడానికి, ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగు పడడానికి, మూత్ర విసర్జన వ్యవస్థ పనితీరు మెరుగుదలకు, ఉదర కండరాలు పటిష్ఠం కావడానికి సహకరిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది నిజానికి కఠినమైన ఆసనం. యోగాసనాల సాధనలో పరిణతి సాధించిన వారు వేయతగినది. అయితే కొన్ని చికిత్సా సందర్భాల్లో ఇది చేయవలసి వచ్చినప్పుడు ఇదే ఆసనాన్ని కుర్చీ ఆసరాగా చేయించవచ్చు. ఉత్కటాసన 1: కాళ్లు రెండూ కలిపి ఉంచి సమస్థితిలో నిలుచోవాలి. చేతులు రెండూ ముందుకు చాపి శ్వాస వదులుతూ (మోకాళ్లపై ఎక్కువ భారం పడకుండా) నడుం కింది భాగాన్ని వెనుకకు కొంచెం కొంచెంగా కిందకు తీసుకురావాలి. ఒకట్రెండు సాధారణ శ్వాసలు తీసుకుంటూ పైకి లేచి తిరిగి సమస్థితిలో నిలబడాలి. శరీరం బరువు మోకాళ్లు, తొడల మీద కాకుండా నడుం మీద పడేలా చూసుకోవాలి. ఈ ఆసనంతో తొడల్లో కొవ్వు కరుగుతుంది. ఉత్కటాసన 2: (కుర్చీ సాయంతో) సమస్థితిలో నిలబడి చేతులు ముందుకు చాపి శ్వాస వదులుతూ సీటును కిందకు తీసుకువచ్చి, మళ్లీ శ్వాస తీసుకుంటూ పైకిలేచి నిలుచోవాలి. ఈ విధంగా ఈ ఆసనాన్ని 5 లేక 6 సార్లు చేయవచ్చు. దీనివల్ల మోకాళ్లు, తొడలకు రక్తప్రసరణ బాగా జరిగి బలంగా తయారవుతాయి. పై రెండు ఆసనాలు అనంతరం వేయాల్సిన మరో ఆసనం ఉంది. అదే... ఉత్కటాసన 3: సమస్థితిలో నిలబడి కాలి మడమలు కలిపి పాదా లను వై ఆకారంలో ఉంచి రెండు చేతులను కిందకి ఉంచి ఇంటర్‌లాక్ చేసి మోకాళ్లు బయటకు మడుస్తూ వీలైనంత కిందకు కూర్చోవాలి. ఒకటి లేదా రెండు సాధారణ శ్వాసల తర్వాత శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి నిలబడాలి. ఈ విధంగా కిందకు కూర్చుంటూ పైకి లేస్తూ 5 నుంచి 10 సార్లు చేయవచ్చు. సయాటికా సమస్య ఉన్న వారికి నొప్పిని తగ్గిస్తుంది. వెన్నముకను బలంగా తయారు చేస్తుంది. పాదాలకు రక్తప్రసరణ సజావుగా జరిగేలా సహకరిస్తుంది. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
బజార్లో తిట్టాడని ఊపిరితీశారు!
కుందుర్పి : ఓ వృద్ధుడు తమను బజార్లో తిట్టాడని కోపోద్రిక్తులైన ఎనిమిది మంది చీరతో బిగించి ఊపిరితీశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు కళ్యాణదుర్గం సీఐ శివప్రపసాద్ తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. కుందుర్పికి చెందిన హరిజన అంజినప్ప (65)కు అన్నదమ్ములతో భూ వివాదం ఉంది. ఆదివారం సాయంత్రం ఇదే విషయంపై తనకు తాను తిట్టుకుంటున్నాడు. అయితే తమనే తిడుతున్నాడన్న భావించిన పక్కింటి తిప్పేస్వామి, తిప్పయ్యతోపాటు ఆరుగురు మహిళలు దాడికి దిగి.. చీరతో గొంతుకు బిగించారు. భార్య జయమ్మ విడిపించడానికి వచ్చేలోపు అంజినప్ప స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా ప్రాణాలు వదిలాడు. మృతుడి భార్య, కుమారుల ఫిర్యాదు మేరకు ఎనిమిది మంది హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
నిద్ర గురకాయ స్వాహా!!
‘నిద్ర... గురకను మింగుతుందా? గురక... నిద్రను మింగుతుందా?’ గురకే... నిద్రను మింగుతుందని నిపుణులు చెబుతున్నారు. ‘బాగా పడుకున్నావోయ్ రాత్రి... పక్క వీధి దాకా నీ గురక వినబడింది’ అని ఎవరైనా అంటే... ఆయన పెట్టిన గురకతో ఈయనకు నిద్ర పట్టలేదనే కాదు... ఆయన గురక వల్ల ఆయనకే నిద్ర పట్టలేదని గమనించండి. నిద్రకు అడ్డం పడేదే - గురక. దాన్నే ‘అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా’ అంటారు. ఈ ఆర్టికల్ చదివి...గురకను స్వాహా చేయండి. గురకనే స్వాహా చేయండి. శ్వాస తీసుకోవడం అనునిత్యం అవసరం. ఒక్క క్షణం ఆగినా తగినంత ఆక్సిజన్ అందక ప్రమాద పరిస్థితి వస్తుంది. శ్వాసకు అంతరాయం కలిగించే సమస్యే... ‘స్లీప్ ఆప్నియా’. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని ‘అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సిండ్రోమ్’ అంటారు. సాధారణంగా గురక పెట్టే సమయంలో శ్వాసనాళంలో కలిగే అంతరాయం వల్ల ఇది ఎక్కువగా సంభవిస్తుంది. అందుకే గురకను ఎప్పుడూ మంచి నిద్రకు సంకేతంగా కాక... శ్వాసకు అవరోధంగా భావించాలి. అలాంటి పరిస్థితిలో ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన చికిత్సపై అవగాహన కోసమే ఈ కథనం. ‘ఆప్నియా’ అంటే ‘శ్వాస లేకపోవడం’ అని అర్థం. ఆప్నియా అనే పరిస్థితిలో నాలుక వెనకే ఉండే శ్వాసనాళం కొద్దిగా మూసుకుపోయినట్లు అవుతుంది. దాంతో శ్వాస ఆడదు. ఫలితంగా మెదడుకు అందాల్సిన ఆక్సిజన్ పాళ్లు తగ్గిపోతాయి. అది ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీయవచ్చు. ఎందుకిలా అవుతుంది? మనం నిద్రపోయినప్పుడు మన కండరాలు రిలాక్స్ అవుతాయి. దాంతోపాటే మన గొంతు కండరాలు కూడా. ఇది చాలా మందిలో శ్వాసకు అవరోధం కాదు. కానీ... కొందరిలో వేలాడబడినట్లు (ఫ్లాపీ) మారిపోతాయి. ఒక్కోసారి శ్వాసనాళం కుంచించుకుపోయినట్లు అవుతుంది. కొందరిలో పూర్తిగా మూసుకుపోతుంది. ఇలా శ్వాసనాళం కుంచించుకుపోవడం వల్ల మొదట గొంతు నుంచి శబ్దం వస్తుంది. అదే - గురక. శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితి ఒక్కోసారి 10 సెకండ్లకు పైగానే కొనసాగవచ్చు. గొంతులోని శ్వాసకు సంబంధించిన కండరాల బలహీనత. ఇక ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఆ కండరాలు మరింతంగా రిలాక్స్ అయిపోవడం వల్ల గురక మరింత ఎక్కువగా రావచ్చు. సమస్య తీవ్రం కావచ్చు. కొందరిలో గొంతులోని కండరాలు మందంగా మారడం వల్ల గాలి ప్రవహించే నాళం సన్నబడవచ్చు. కొన్నిసార్లు అంగిలి వెనక మృదువుగా ఉండే భాగం పొడవు పెరగవచ్చు. కొన్నిసార్లు ముక్కులో ఏవైనా అడ్డంకులు వచ్చినందువల్ల శ్వాస తీసుకోవడానికి మరింత గట్టిగా గాలి పీల్చాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలోనూ శబ్దం వస్తుంది. కొన్నిసార్లు జలుబు చేయడం, సైనస్లలో ఇన్ఫెక్షన్లు, ఆ కారణంగా వచ్చే జ్వరం వల్ల గాలిని మరింత బలంగా పీల్చడంతోనూ గురక రావచ్చు. ఇక మరికొందరిలో ముక్కు దూలం కాస్త వంకరగా ఉండడం వల్ల కూడా గురక రావచ్చు. న్యూనతకు గురయ్యే వ్యక్తులు కొందరు కునుకు తీయడానికి కూడా భయపడి నిద్రలేమితో బాధపడతారు. గురకలో శ్వాస అందని పరిస్థితిని ‘అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా’ అంటారు. దాంతో రక్తంలో ఆక్సిజన్ తగ్గి, గుండెపై చాలా భారం పడుతుంది. రక్తసరఫరా కోసం, ఆక్సిజన్ కోసం గుండె మరింత ఎక్కువ శ్రమిస్తుంది. మెదడు ఒక అద్భుతం మన మెదడు ప్రమాదకరమైన పరిస్థితిని వెంటనే పసిగడుతుంది. వెన్వెంటనే ప్రమాదాన్ని నివారించడానికి అవసరమైన ఏర్పాట్లను చేస్తుంది. తక్షణం శ్వాస తీసుకోవాల్సిన పరిస్థితిని గుర్తెరిగి నిద్రలేచేలా ఆదేశాలు జారీ చేస్తుంది. అప్పుడు మనకు నిద్రాభంగమై మేల్కొంటాం. తగినంత శ్వాస తీసుకున్న తర్వాత మళ్లీ నిద్రలోకి జారుకుంటాం. ఈ పనులన్నీ మనకు తెలియకుండానే జరిగిపోయేలా మెదడు నిశ్శబ్దంగా పనిచేస్తుంటుంది. ఆ టైమ్‌లో మనల్ని ఎవరైనా చూస్తే అదేదో నిద్రలో ఒకసారి లేచి కాళ్లూ చేతులు ఆడించి, మళ్లీ పడుకున్నట్లుగా ఉంటుంది తప్ప... ఇంత ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్లినట్లు తెలియనే తెలియదు. పగటి నిద్రతో గుర్తించండి... నిద్రలో అనేక సార్లు ఇలా శ్వాస అందని ఆప్నియా స్థితి వస్తుంది. ఒక్కోసారి కొన్ని వందల సార్లు కూడా. ఇలా రాత్రివేళల్లో అనేక సార్లు నిద్రాభంగం కావడం వల్ల పగటి వేళ మందకొడిగా ఉంటుంది. అందుకే రాత్రుళ్లు గురకపెడుతూ, పగటి వేళల్లో మాటిమాటికీ నిద్రలోకి జారిపోతూ ఉంటే ఆప్నియా ఉన్నట్లు స్పష్టంగా గుర్తించవచ్చు. ఎవరెవరిలో ఆప్నియా? అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అన్నది ఏ వయసు వారిలోనైనా కనిపించవచ్చు. పిల్లల్లో కూడా ఇది ఉండవచ్చు. పిల్లల్లో టాన్సిల్స్, అడినాయిడ్స్ ఉన్నా, ముక్కు రంధ్రాల మధ్య ఉండే అడ్డుగోడ వంకరగా ఉన్నా స్లీప్ ఆప్నియా కనిపించవచ్చు. స్థూలకాయులైన మధ్యవయస్కుల్లో ఈ సమస్య ఎక్కువ. మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువ (మధ్యవయస్కులైన పురుషుల్లో 4% మందిలో ఈ సమస్య ఉంటే, మహిళల్లో 2% మందిలో ఇది ఉంటుంది). సాధారణంగా 45 శాతం మంది జీవితంలో ఏదో ఒక సమయంలో గురకపెడతారు. అయితే, వారిలో కేవలం 25 శాతం మందిలో మాత్రమే స్లీప్ ఆప్నియాకి చికిత్స అవసరమవుతుంది. ఆప్నియాను గుర్తించే లక్షణాలు... పగటి వేళ చురుగ్గా ఉండాల్సిన సమయంలో మాటిమాటికీ నిద్ర వస్తున్నట్లుగా అనిపించడం తెల్లవారుజామున నిద్రలేవగానే తలనొప్పి, నోరంతా తడారిపోయినట్లుగా ఉండటం నిద్ర లేచాక ఫ్రెష్‌గా లేకపోవడం మాటిమాటికీ మూడ్స్ మారిపోతూ, తరచూ కోపం వస్తున్నట్లు అనిపించడం ఎప్పుడూ అలసటగా ఉండటం రాత్రివేళల్లో పెద్ద శబ్దంతో గురకపెడుతుండటం గొంతులో ఏదో అడ్డుపడినట్లుగా శ్వాస ఆగడం మాటిమాటికీ నిద్రాభంగం కావడం రాత్రివేళ ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు లేవాల్సి రావడం నిద్రాభంగం కాగానే కాళ్లూ, చేతులు అకస్మాత్తుగా కుదుపునకు గురైనట్లు కదలడం ఎవరెవరిలో ఆప్నియాతో చేటు? మామూలుగానే ఆప్నియా ఉన్నవారిలో శ్వాసనాళం వేలాడబడినట్లుగా (ఫ్లాపీ) మారుతుంది. నిద్రమాత్రలు వాడే వారిలో నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకునేవారిలో పరిస్థితి మరింత తీవ్రమై ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. ఆప్నియాతో ఆందోళన ఎందుకంటే... సాధారణంగా ఆప్నియాతో ఎలాంటి ప్రాణాపాయమూ ఉండదు. అయితే కొందరిలో ఇది ఎంతో ప్రమాదకరంగా పరిణమించవచ్చు. మాటిమాటికీ రక్తంలో ఉండాల్సిన ఆక్సిజన్ పాళ్లు తగ్గి, మెదడుకు అవసరమైన మోతాదులో ప్రాణవాయువు అందకపోవడం వల్ల అది శరీరంలోని అన్ని ఆవయవాలపై దుష్ర్పభావం చూపవచ్చు. కొందరిలో స్టీప్ ఆప్నియా వల్ల గుండె స్పందనల్లో మార్పులు రావచ్చు. మరికొందరిలో రక్తపోటు పెరగవచ్చు. అప్పటికే గుండెజబ్బుతో బాధపడుతున్న రోగుల్లో ఇలా రక్తపోటు పెరగడం అన్నది గుండెపోటు లేదా యాంజినాకు దారితీయవచ్చు. నిర్ధారణ పరీక్షలు: వ్యాధి చరిత్ర, గురక గురించి సమాచారం సేకరించడం కోసం ఒక ప్రశ్నావళితో కూడిన పత్రాన్ని రోగి జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులకు ఇస్తారు. ఆ ప్రశ్నవళిలోని సమాధానాలను బట్టి కూడా వ్యాధిని, తీవ్రతను నిర్ణయిస్తారు. వాటితో పాటు స్లీప్ ఎండోస్కోపీ, సినీ ఎమ్మారై ద్వారా వారి శ్వాస వ్యవస్థలో నిర్మాణ పరమైన (అనటామికల్) ఇబ్బందులు తెలుసుకుంటారు. నిద్రలో గురకపెట్టేవారికి డాక్టర్లు కొన్ని పరీక్షలు చేసి స్లీప్ ఆప్నియా నిర్ధారణ చేస్తారు. దీన్ని స్లీప్ ల్యాబ్‌లో, ఒక్కోసారి ఇంటిలో చేయవచ్చు. స్లీప్ ల్యాబ్‌లో ఉన్నప్పుడు రోగి కొంత ఒత్తిడికి గురై, సరిగా నిద్రపోలేకపోవచ్చు. అందుకే ఇంటిలోనే ఈ పరీక్ష చేయడానికి డాక్టర్లు ప్రాధాన్యం ఇస్తారు. చికిత్స ఇలా... ఓ మోస్తరు స్లీప్ ఆప్నియా మొదలుకొని కాస్త తీవ్రమైన ఆప్నియా ఉన్నవారికి సీప్యాప్, లేదా బైప్యాప్ చికిత్సతో మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ చికిత్సలో భాగంగా నిద్రపోతున్నవారికి ఆక్సిజన్ మాస్క్ లాంటి ఒక మాస్క్ అమర్చుతారు. దీనికి ఒక ఎలక్ట్రిక్ పంప్ అమర్చి ఉంటుంది. దీని సహాయంతో ఆక్సిజన్ తీసుకునే శ్వాసనాళాన్ని తెరచి ఉంచేలా చేస్తారు. దాంతో శ్వాసనాళం తెరచుకుని ఉండేలా చేస్తారు. దాంతో ఎలాంటి ఆటంకం లేకుండా శ్వాస అందేలా చేస్తారన్నమాట. దీంతో రోగులకు మంచి శ్వాసతో పాటు, నాణ్యమైన నిద్ర ఉంటుంది. మరికొందరిలో ‘వ్యూలో పాలటో ఫ్యారింజియల్ ప్లాస్టీ’ అనే శస్త్రచికిత్స ద్వారా శ్వాసవ్యవస్థలోని నిర్మాణపరమైన లోపాలను సరిచేస్తారు. ఇంకొందరిలో థెర్మల్ అబ్లేషన్ చికిత్స ద్వారా ముక్కులో, గొంతులో, అంగిలిలో అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని తొలగిస్తారు. హయాయిడ్ సస్పెషన్, మాండిబులార్ అడ్వాన్స్మెంట్, టార్స్ అనే శస్త్రచికిత్సల ద్వారా కూడా స్లీప్ ఆప్నియాను నియంత్రించవచ్చు. కొన్ని దవడ ఉపకరణాలతో చికిత్స చేయవచ్చు. నివారించే మార్గాలు మీ బరువును అదుపులో పెట్టుకోవడానికి వాకింగ్ వంటి వ్యాయామాలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. నిద్రకు ముందు మత్తు కలిగించే పదార్థాలు, స్లీపింగ్ పిల్స్, ఎలర్జీని అదుపులో ఉంచే మందులైన యాంటీ హిస్టమైన్స్ తీసుకోకండి. మీరు ఆల్కహాల్ మానేయండి. అలా చేయలేకపోతే కనీసం నిద్రవేళకూ, మద్యం తీసుకోడానికీ మధ్య నాలుగు గంటలూ, నిద్రకూ, కడుపు నిండుగా భోజనానికి (హెవీ మీల్‌కు) మధ్య మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి. నిద్రవేళలు క్రమబద్ధంగా ఉండాలి. వెల్లకిలా పడుకోవడానికి బదులుగా ఒకవైపు ఒరిగి పడుకోండి. చికిత్స ఇలా... ఓ మోస్తరు స్లీప్ ఆప్నియా మొదలుకొని కాస్త తీవ్రమైన ఆప్నియా ఉన్నవారికి సీప్యాప్, లేదా బైప్యాప్ చికిత్సతో మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ చికిత్సలో భాగంగా నిద్రపోతున్నవారికి ఆక్సిజన్ మాస్క్ లాంటి ఒక మాస్క్ అమర్చుతారు. దీనికి ఒక ఎలక్ట్రిక్ పంప్ అమర్చి ఉంటుంది. దీని సహాయంతో ఆక్సిజన్ తీసుకునే శ్వాసనాళాన్ని తెరచి ఉంచేలా చేస్తారు. దాంతో శ్వాసనాళం తెరచుకుని ఉండేలా చేస్తారు. దాంతో ఎలాంటి ఆటంకం లేకుండా శ్వాస అందేలా చేస్తారన్నమాట. దీంతో రోగులకు మంచి శ్వాసతో పాటు, నాణ్యమైన నిద్ర ఉంటుంది. మరికొందరిలో ‘వ్యూలో పాలటో ఫ్యారింజియల్ ప్లాస్టీ’ అనే శస్త్రచికిత్స ద్వారా శ్వాసవ్యవస్థలోని నిర్మాణపరమైన లోపాలను సరిచేస్తారు. ఇంకొందరిలో థెర్మల్ అబ్లేషన్ చికిత్స ద్వారా ముక్కులో, గొంతులో, అంగిలిలో అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని తొలగిస్తారు. హయాయిడ్ సస్పెషన్, మాండిబులార్ అడ్వాన్స్మెంట్, టార్స్ అనే శస్త్రచికిత్సల ద్వారా కూడా స్లీప్ ఆప్నియాను నియంత్రించవచ్చు.కొన్ని దవడ ఉపకరణాలతో చికిత్స చేయవచ్చు. నివారించే మార్గాలు మీ బరువును అదుపులో పెట్టుకోవడానికి వాకింగ్ వంటి వ్యాయామాలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. నిద్రకు ముందు మత్తు కలిగించే పదార్థాలు, స్లీపింగ్ పిల్స్, ఎలర్జీని అదుపులో ఉంచే మందులైన యాంటీ హిస్టమైన్స్ తీసుకోకండి. మీరు ఆల్కహాల్ మానేయండి. అలా చేయలేకపోతే కనీసం నిద్రవేళకూ, మద్యం తీసుకోడానికీ మధ్య నాలుగు గంటలూ, నిద్రకూ, కడుపు నిండుగా భోజనానికి (హెవీ మీల్‌కు) మధ్య మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి. నిద్రవేళలు క్రమబద్ధంగా ఉండాలి. వెల్లకిలా పడుకోవడానికి బదులుగా ఒకవైపు ఒరిగి పడుకోండి. మీ తలను మీ పడక కంటే నాలుగు అంగుళాల ఎత్తుగా ఉండేలా తలగడ అమర్చుకోండి. రిస్క్ ఎవరిలో ఎక్కువంటే... స్లీప్ ఆప్నియా సమస్యాత్మకంగా మారే అవకాశాలు ఈ కిందివారిలో ఎక్కువ. స్థూలకాయుల్లో (అంటే... బాడీ మాస్ ఇండెక్స్ 30 కంటే ఎక్కువ ఉన్నవారిలో... మన బరువు కిలోగ్రాముల్లో తీసుకుని ఆ విలువను మన ‘ఎత్తు స్క్వేర్’తో భాగిస్తే వచ్చే విలువ 30, అంత కన్నా ఎక్కువ ఉంటే దాని స్థూలకాయంగా పరిగణిస్తారు). పెద్ద శబ్దంతో గురకపెట్టే వారిలో గతంలో గుండెపోటు వచ్చిన మెడికల్ హిస్టరీ ఉన్నవారిలో నియంత్రణ లేని రక్తపోటు ఉన్నవారిలో గుండె లయ సరిగా లేనివారిలో రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉన్నవారిలో ఇటీవల చాలా ఎక్కువగా బరువు పెరిగిన వారిలో. వీరిలో ప్రమాదం మరింత తీవ్రం గురకపెడుతున్న వారికి పొగతాగే అలవాటు ఉన్నా... గురక పెట్టేవారికి స్థూలకాయం ఉన్నా... వాళ్లలో ఒక్కోసారి పరిస్థితి అకస్మాత్తుగా ప్రమాదకరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్లలో ఆప్నియా కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మీ తలను మీ పడక కంటే నాలుగు అంగుళాల ఎత్తుగా ఉండేలా తలగడ అమర్చుకోండి. డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి - ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ -
ఊపిరాడట్లేదని అడిగితే వేధింపులా?
ఐఎన్టియూసీ ఏరియా ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య మందమర్రి : పని చేస్తున్న స్థలాల్లో గాలి సరఫరా సక్రమంగా లేదని అడిగిన కార్మికులను గని అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య పేర్కొన్నారు. గురువారం స్థానిక కేకే–5 గని అవరణలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని ప్రదేశాల్లో గాలి అందక ఊపిరి తీసుకునేందుకు కష్టంగా మారిందని కార్మికులు ఉన్నతాధికారుల దష్టికి తీసుకువస్తే ప్రయోజనం లేకుండా పోతోందని కార్మికులు వాపోతున్నట్లు వారు తెలిపారు. ఇదేంటని ప్రశ్నించిన కార్మికులను షిప్టులను మారుస్తూ వారిని మానసికంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. గాలి సరఫరా లేక ఇటీవల సింగరేణి వ్యాప్తం కార్మికులు మత్యువాత పడిన అధికారుల తీరులో మార్పులు రావడం లేదన్నారు. కార్మికుల ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఐఎన్టియూసీ తరుపున డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వెంకటరమణ, సంగ బుచ్చయ్య, మేడ సమ్మయ్య, మడక శశిధర్, కంది శ్రీనివాస్, ఎం సదానందం తదితరులు పాల్గొన్నారు. -
పాలిప్స్‌కు పరిష్కారం ఏమిటి?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 42. నాకు కొంతకాలంగా ముక్కులో కండమాదిరిగా పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచు జలుబు చేయడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్గారిని సంప్రదిస్తే, శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని, అయినా మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉందని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుందా? సలహా ఇవ్వగలరు. - ఎస్. పవన్ కుమార్, హైదరాబాద్ మీరు తెలిపిన వివరాలను బట్టి మీ సమస్య నేసల్ పాలిప్స్‌గా తెలుస్తోంది. ముక్కులో ఏర్పడే మృదువైన కండగలిగిన వాపును నేసల్ పాలిప్స్ అని అంటారు. ఇవి ముక్కు రెండు రంధ్రాలలో, సైనస్లలో ఏర్పడతాయి. ఏ వయస్సు వారైనా ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది. కానీ 40 సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో, స్త్రీలలో కంటే పురుషులలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ముక్కులోపలి భాగం, సైనస్‌లు (కపాల భాగంలో గాలితో నిండిన గదులు) ఒక విధమైన మృదువైన శ్లేష్మపు పొరతో కప్పబడి ఉంటాయి. ఈ పొర ఒక రకమైన పల్చని ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఈ ద్రవం ముక్కును సైనస్‌లను తేమగా ఉంచుతూ ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలో ప్రవేశించిన దుమ్మూ ధూళీ, ఇతర సూక్ష్మజీవులను చిన్న వెంట్రుకల లాంటి ఆకారాల సాయంతో గొంతులోకి, ముక్కులోకి చేరి తద్వారా బయటకు పంపేయడం జరుగుతుంది. ఇది సాధారణ ప్రక్రియ. ఈ శ్లేష్మపు పొర దీర్ఘకాలికంగా శోధకు గురవడం వల్ల పాలిప్స్ ఏర్పడతాయి. ఇవి ఒకటి లేదా చిన్న చిన్న పరిమాణంలో గుంపులుగా ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన పాలిప్స్ క్రమంగా పెరిగి ముక్కు రంధ్రాలకు అడ్డుగా నిలుస్తాయి. కారణాలు: తరచు ఇన్ఫెక్షన్స్కి గురికావడం, ఆస్త్మా, దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్లు, అలర్జిక్ రైనైటిస్, ఆస్ప్రిన్ వంటి మందులకు సున్నితత్వం కలిగి ఉండటం, వంశపారంపర్యత వంటివి. లక్షణాలు: ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నోటిద్వారా శ్వాస తీసుకోవడం, రాత్రిళ్లు నిద్ర సరిగా పట్టకపోవడం, గురక, వాసన, రుచిని గుర్తించే శక్తి మందగించటం, తలనొప్పి, ముఖం లేదా నుదురు భాగంలో నొప్పిగా ఉండటం, కళ్లలో దురద వంటివి. హోమియోకేర్ చికిత్స: అధునాతనమైన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా అసమతుల్యతకు గురయిన రోగనిరోధక శక్తిని సరిచేయడం వల్ల నాజల్ పాలిప్స్ సమస్య పూర్తిగా న యం అవుతుంది. అన్ని ప్రతికూల పరిస్థితులలో సైతం ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించేలా హోమియోలో వైద్యచికిత్స లభిస్తుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ హైబీపీ సమస్యా... ఇలా అధిగమించవచ్చు! బీపీ కౌన్సెలింగ్ నాకు ఇటీవల బీపీ ఉన్నట్లు తెలిసింది. ఎలా నియంత్రించుకోవచ్చు? - ఉమామహేశ్వరరావు, విజయవాడ రక్తనాళాల్లో పీడనం ఉండాల్సిన దానికంటే ఎక్కువ కావడాన్ని హైపర్‌టెన్షన్ అంటారు. దీనివల్ల సాధారణ రక్తప్రసరణపై ప్రభావం పడుతుంది. రక్తపీడనాన్ని సిస్టోలిక్, డయాస్టోలిక్ ప్రెషర్స్ అని కొలుస్తారు. సాధారణంగా సిస్టోలిక్ ప్రెషర్ 100-140 మి.మీ/హెచ్‌జీ ఉంటుంది. అదే డయాస్టోలిక్ ప్రెషర్ 60-90 మి.మీ/హెచ్‌జీ ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైబీపీగా వ్యవహరిస్తారు. కారణాలు: సాధారణంగా హైపర్‌టెన్షన్‌కి జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. కుటుంబంలో బీపీ ఉంటే ఆ తర్వాతి తరానికీ వచ్చే అవకాశం ఎక్కువ. 20 - 60 శాతం హైపర్‌టెన్షన్ వంశపారంపర్యంగా వస్తాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి వయసు పెరుగుతున్న కొద్దీ బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా స్త్రీలలో బీపీ తక్కువగా ఉంటుంది. మధ్య వయసుకు వచ్చేసరికి స్త్రీ, పురుషులిద్దరిలోనూ బీపీ సమానంగా ఉంటుంది. ఆ తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో బీపీ ఎక్కువగా ఉంటుంది బరువు పెరిగితే హైపర్‌టెన్షన్ అవకాశమూ పెరుగుతుంది. పొత్తికడుపులో కొవ్వు ఎక్కువగా ఉన్న పురుషుల్లో 70 శాతం మంది, స్త్రీలలో 60 శాతం మంది అధిక రక్తపోటు బారిన పడుతున్నారు రోజులో మూడు గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకునేవారిలో బీపీ వచ్చే అవకాశం తక్కువ ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకున్నా హైపర్‌టెన్షన్ రావచ్చు శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారిలో బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ పొగతాగే అలవాటు బీపీని తీవ్రస్థాయిలో పెంచుతుంది నడుము చుట్టుకొలత పురుషుల్లో 90 సెం.మీ కంటే ఎక్కువగానూ, స్త్రీలలో 80 సెం.మీ కంటే ఎక్కువగానూ ఉంటే బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: బీపీ ఉన్నవారిలో సాధారణంగా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. కానీ తలనొప్పి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో ఎక్కువ. నీరసంలాంటివి ఉండవచ్చు. పర్యవసానాలు: గుండెజబ్బులకు ప్రధాన కారణం అధిక రక్తపోటే. హైపర్‌టెన్షన్ సమస్య దీర్ఘకాలంగా ఉంటే అది కిడ్నీ ఫెయిల్యూర్‌కు కూడా దారితీస్తుంది. బీపీ లేనివాళ్ల కన్నా ఉన్నవాళ్లలో గుండెపోటు రావడానికి అవకాశం రెండింతలు ఎక్కువ. హార్ట్ ఫెయిల్యూర్ అవకాశం నాలుగింతలుంటుంది. పక్షవాతం వచ్చే అవకాశం ఏడింతలు ఉంటుంది. రక్తపోటు నివారణ కోసం : హైపర్‌టెన్షన్ వల్ల వచ్చే సమస్యలు గురించి అవగాహన పెంచుకోవాలి. జీవనశైలిలో మార్పులు, వ్యాయామం, బరువు తగ్గడం, పొగతాగే అలవాటు మానేయడం, ఆల్కహాల్ తగ్గించడం, ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. మంచి ఆహారపు అలవాట్ల ద్వారా హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడాన్ని ‘డయటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’ అంటారు. దీని ప్రకారం ఆహారంలో తాజా కూరగాయాలు, పండ్లు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలి. రోజుకి మూడు గ్రాముల కన్నా మించకుండా ఉప్పును చాలా పరిమితంగా తీసుకోవాలి. డాక్టర్ అనుజ్ కపాడియా సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నేను ఎముకని!
ఆనంద్ ఆరడుగులుంటాడు. ఆజానుబాహువుగా పెరిగాడు. అతనికి ఆ రూపం,ఆ ఆకృతి ఇచ్చింది ఎవరనుకున్నారు? మేమే... అంటే అతని ఎముకలం! మేము ఏమేం చేస్తామో, ముందుగా ఇక్కడ క్లుప్తంగా చెబుతాం. అవేమిటంటే... ఆనంద్ నడవడానికి అతని శరీరంలోని సున్నిత అవయవాల రక్షణకు, శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడతాం. అంతేకాదు... అతని రక్తం కోసం రసాయనాలు, ఎంజైములు మాలోనే ఉత్పత్తి అవుతాయి. అలాగే ఆనంద్ శరీరానికి కావలసిన కాల్షియం వంటి లవణాలకు గిడ్డంగిలా ఉపయోగపడతాం. ఇవన్నీ ఎలా చేస్తామో ఇప్పుడు వివరంగా చెబుతాను. మేము మొత్తం 206 సభ్యులం, అతని శరీరంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆకృతిలో ఉండి, ఒక ఎముకలగూడును తయారు చేసి అతని శరీరానికి అవసరమైన చట్రంలా ఉంటాం. దానిపై అతను మళ్లీ పైపై అందాలు దిద్దుకుంటాడనుకోండి. మా 206 మందిలో అతి చిన్నవాడి పేరు - స్టేపిస్, వాడు చెవి మధ్యలో ఉండి వినికిడికి సహాయపడతాడు. ఇక అతి పొడవైన వాడు తొడ ఎముక. ఆనంద్ పుట్టినప్పుడు మా సంఖ్య 300కు పైమాటే. అప్పుడు మేము మెత్తగా కూడా ఉండి కొంచెం వంగుతుంటాము. బహుశ ఆనంద్ అతని తల్లి గర్భం నుంచి అందువల్లనే సులువుగా బయటకు రాగలిగాడు. తరువాత ఆనంద్‌కు 18 సంవత్సరాలు వచ్చేసరికి మాలో పక్కపక్కనే ఉన్న కొంతమంది సభ్యులు ఒకరితో ఒకరు కలిసిపోయి పరిమాణం పెరుగుతుంది కానీ మా సంఖ్య 206కు తగ్గుతుంది. తల దగ్గర పెట్టెలా... ఛాతీ దగ్గర పంజరంలా... తలలో మేము పలుచగా, కాని చాలా గట్టిగా ఉండి ఆనంద్ పుర్రెను ఒక పెట్టెలా తయారు చేస్తాము. దానిలో మెదడును దాచి దానికి రక్షణ కలిగిస్తాం. అలాగే 12 జతల పక్కటెముకలతో ఆనంద్‌కు అందమైన, విశాలమైన ఛాతీ ఇచ్చాం. దానిలో ఆనంద్ గుండెను, ఊపిరితిత్తులను దాచి, వాటికి రక్షణ కల్పిస్తాం. ఆనంద్ నిటారుగా నిలబడడానికి అతని కాళ్లు ఎంత అవసరమో, అంతే పని అతని వెన్నెముక కూడా చేస్తుంది. మొన్నటికి మొన్న ప్రపంచ యోగా రోజున చక్కగా ఆసనాలు వేసి మనకు చూపించాడు కదా! అతను అలా మెలికలు తిరుగుతూ, వంగడానికి సాయపడింది వెన్నులో ఉన్న మా సభ్యులే. అతడి వెన్నులో మావాళ్లు 33 మంది పూసల రూపంలో ఉంటారు. సంఖ్య ఎక్కువైనా సమష్టి బాధ్యతలు ఇక ఆనంద్ చేతిలోను, పాదంలోను మావాళ్లు చాలామందే ఉంటారు. మేమంతా భిన్నమైన పరిమాణం, ఆకారాలలో ఉండి సున్నితమైన పనులు చేస్తుంటాం. మీకు ఇప్పుడు ఓ సందేహం రావచ్చు. ఆనంద్ శరీరంలో మేము ఇంతమంది ఉన్నప్పుడు మేం ముక్కలు ముక్కలుగా కాకుండా సమష్టిగా ఎలా ఉంటామని? అది ఎలాగంటే, మమ్మల్ని ఒక దానితో ఒకదాన్ని కలుపుతూ గట్టి తాళ్లు (లిగమెంట్స్) ఉంటాయి. అంటే ఏ ప్రమాదాలోనైనా ఈ తాళ్లు తెగిపోతే మేము విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం... మాలో మేము ఒకదానితో మరొకటి జతకలిసే చోటును ఏమంటారో తెలుసా మీకు? అదేనండి ‘కీలు’. మీకు ఉన్న కదలిక అంతా వచ్చేది ఈ కీలు వల్లనే. నేనెలా రూపొందానంటే...? ఇక నేను ఎలా తయారయ్యానో చెబుతాను. కొలాజెన్ అనే మాంసకృత్తుల తాళ్లతో తయారైన సూక్ష్మమైన వల ఉంటుంది. ఆ వలలో కాల్షియం, పాస్ఫరస్ వంటి అనేక లవణాలు బందీలై, వలకు గట్టిదనం ఆపాదిస్తాయి. మాకు ఆ గట్టిదనంలో కూడా కొంత మెత్తదనం ఉంటుంది. మేము పిల్లల శరీరంలో ఉన్నప్పుడు బాగా వంగగలం. కానీ ఆనంద్ పెద్దవాడు. అలాంటప్పుడు మాకు వంగే శక్తి తగ్గి, కొంత పెళుసుగా మారుతాం. ఎముకలలో ఈ పదార్థంలో (ఆస్టియోబ్లాస్ట్), ఆస్టియోక్లాస్ట్ అనే కణజాలం ఉంటుంది. మొదటి కణాలు నిరంతరం ఎముకను కరిగిస్తూ ఉంటాయి. నాలోని పదార్థం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఇప్పుడు నాలో ఉన్న మాంసకృత్తులు, లవణాలలోని 10 శాతం వచ్చే ఏడాది ఉండవు. సరికొత్తవి వచ్చి చేరతాయి. కాని ఆనంద్‌కు సుమారు 35 సం॥వచ్చేవరకు వచ్చే ఎముక పదార్థం ఎక్కువ, కరిగిపోయేది తక్కువ. అంటే మేము బలంగా లావుగా తయారవుతాం. కానీ తరువాత కరిగేది ఎక్కువ. కొత్తగా వచ్చి చేరేది తక్కువ. 50 ఏళ్లు పైబడ్డ తర్వాత ముఖ్యంగా ఆడవారిలో రుతుస్రావం ఆగిపోయిన తర్వాత కరిగిపోయే మరింత ఎక్కువ అవుతుంది. అప్పుడే అస్థిహీనత (ఆస్టియోపోరోసిస్) వస్తుంది. అప్పుడు మాలోని మాంసకృత్తులు, లవణాలు మొత్తంగా తగ్గి ఎముక తేనెపట్టులోని ఖాళీ గదుల్లా తయారవుతుంది. మరి దీనిని తగ్గించాలంటే ఏమి చేయాలి? ఆనంద్ ఎప్పుడూ కష్టపడి, బరువు పనులు చేస్తుండాలి. అదేపనిగా శరీరానికి విశ్రాంతి ఇవ్వకూడదు. పొగతాగరాదు. కష్టేఫలి. నేనో అద్భుతమైన గిడ్డంగిని... ఇక నేను చేసే గిడ్డంగి పని గురించి చెబుతాను. ఆనంద్ శరీరంలోని కాల్షియం, ఇతర లవణాలు సుమారు ఒక కిలో వరకూ నాలో దాచి ఉంచుతాను. ఆనంద్ తిన్న ఆహారంలో కాల్షియం, విటమిన్-డి సాయంతో నాలోకి తీసుకుని భద్రపరుస్తాను. ఒకవేళ రక్తంలో కాల్షియం తగ్గిందనుకోండి. అప్పుడు ఆనంద్ మెడలో ఉన్న పారా థైరాయిడ్ గ్రంథి ఆదేశాల మేరకు తగినంత కాల్షియంను రక్తంలోకి పంపిస్తాను. ఈ పని నేను ప్రతిక్షణం చేస్తూనే ఉంటాను తెలుసా! అప్పట్లో పిండికట్లు... ఇప్పుడు లోహపు ప్లేట్లు ఏదైనా ప్రమాదంలో మేము విరిగామనుకోండి, పూర్వం అయితే అందరికీ పిండికట్టు కట్టి నెలల తరబడి విశ్రాంతి ఇచ్చేవారు. కాని ఇప్పుడు అలాకాదు. లోహపు బద్దీలు, ఊచలు, తీగలు, మొదలైనవి ఉపయోగించి మా విరిగిన ముక్కల్ని కలిపి, రెండవ రోజు నుండే మాచేత మరల పని చేయిస్తున్నారు ఈ ఎముకల డాక్టర్లు. పని చేయడానికి మొరాయిస్తే ఫిజియోథెరపిస్టులను పెట్టి మరీ చేయిస్తారు. కాని డాక్టర్లకు తెలీని ఓ రహస్యం మేము ఇంక దాచిపెట్టాం. విరిగిన తర్వాత ఒక్కొక్కసారి మేము ఎందుకు అతుక్కోమో డాక్టర్లకు మేము చెప్పం. ఇక చివరగా పాపం మన ఆనంద్ జీవితం అంతా కాలుగాలిన పిల్లిలా తిరిగి మా ఎముక చివర్లను అంటే కీళ్లను అరగదీశా డనుకోండి లేదా కీళ్లవాతం వచ్చి కీళ్లు అరిగిపోయాయనుకోండి. పూర్వం అయితే ఆనంద్ పిల్లలు అతనికి రిటైర్మెంట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ ఎముకల డాక్టర్లు అరిగిపోయిన కీలు పొర తీసేసి, మరో కొత్త పొర వేసి, కీలును మళ్లీ పనిచేసేలా చేస్తున్నారు. కాలు చేయి మళ్లీ కదిపేలా చూస్తున్నారు. సోమరిగా ఉంటే... ఆనంద్ ఇప్పుడు ఏ పనీ, వ్యాయామం చేయకుండా సోమరిపోతులా తయారయ్యాడు అనుకుందాం. అప్పుడు ఆనంద్‌కు 60 లేదా 70 సం॥దాటిన తర్వాత చాలా సులువుగా మణికట్టు ఎముక, వెన్నెముక వంటి ఎముకలు విరుగుతాయి. చాలావరకు తుంటి ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా పూర్వపురోజుల్లో సౌకర్యాలు లేక వాళ్ల కాళ్లకు ఇసుక మూటలు కట్టి కదిలేసేవారు. ఇటువంటి సందర్భాల్లో ఊపిరితిత్తుల సమస్యలు, వీపుపైన పుండ్లు మొదలైనవి వచ్చి రోగి చనిపోవడానికి కారణమయ్యేవి. మితిమీరితే ముప్పు... ఒక్కొక్కసారి ఈ తయారీ కేంద్రాలు అతిగా పనిచేసి అవసరం లేనన్ని రక్తకణాలను పుట్టిస్తుంటాయి. దానినే లుకేమియా వ్యాధి అంటారు. దీనివల్ల మాకు చెడ్డపేరు వస్తుంది కూడా! అప్పుడు డాక్టర్లు మందులతో మాలో ఉన్న ఎముక మజ్జను, మొత్తం రక్తం తయారీ కేంద్రాలను నాశనం చేస్తారు. తరువాత ఆనంద్ శరీరానికి సరిపడే మరో వ్యక్తిలోని ఎముక మూలుగ కణాలను ఆనంద్ రక్తంలోకి ఎక్కిస్తారు. ఆ కణాలకు మేము ఆశ్రయం కల్పించి, మాలో ఉన్న మజ్జ ఖాళీస్థలంలో అవి పెరగడానికీ, మంచి రక్తం పుట్టించడానికి అవకాశం కల్గిస్తాం. ఒక్కొక్కసారి మాలోని మజ్జ తప్పు లేకపోయినా మాకే చివాట్లు పడతాయి. ఎందుకంటే కొన్ని రకాల రొమ్ము, థైరాయిడ్, ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎవరికీ తెలియకుండా మాలో ప్రవేశించి మమ్మల్ని నాశనం చేస్తాయి. మమ్మల్ని బలహీన పరచడం వల్ల, ఏ చిన్న దెబ్బ తగలకపోయినా మేము విరిగిపోతుంటాయి. ఎముక మధ్యన ఉండే మూలుగలో నిమిషానికి 18 కోట్ల ఎర్రరక్తకణాలు ఉత్పత్తి అవుతుంటాయి. అయితే ఆ ఎర్రరక్తకణాలను స్థిరంగా ఉంచడం కోసం పాత కణాలను నశింపజేయడానికి ప్లీహం (స్ప్లీన్) తోడ్పడుతూ ఉంటుంది. డాక్టర్ ఎన్. సోమశేఖర్‌రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ -
ఆసనాల్లో రాణింపు...
సర్వాంగాసన ఆసనంలో వెల్లకిలా పడుకుని చేతులు రెండూ శరీరానికి ఇరువైపులా ఉంచాలి. అరచేతులు భూమిమీద నొక్కుతూ రెండు పాదాలను, మోకాళ్లను కలిపి ఉంచి శ్వాస తీసుకుంటూ రెండు కాళ్లను నెమ్మదిగా పైకిలేపి 90 డిగ్రీల కోణంలోకి తీసుకు రావాలి. తర్వాత కాళ్లను ఇంకా తలవైపునకు తీసుకువెళుతూ నడుముకి రెండు చేతులతో సపోర్ట్ ఉంచి నడుమును, పిరుదులను ఇంకా పైకి లేపి వీపు మధ్య భాగానికి చేతులతో సపోర్ట్ ఉంచి భుజాలు మెడ మీద శరీరం మొత్తాన్ని పైకి గాలిలోకి లేపే ప్రయత్నం చేయాలి. పూర్తి ఆసన స్థితిలోకి వచ్చిన తర్వాత స్ట్రెచ్ చేసిన పాదాలను కొంచెం రిలాక్స్డ్గా సమంగా ఉంచాలి. ఈ స్థితిలో గడ్డం ఛాతీ భాగాన్ని అదుముతూ ఉంటుంది. ఆసనంలో స్థిరంగా సాధారణ శ్వాసలు 5 లేదా 10 తీసుకుని అంటే సుమారు రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉన్నట్లయితే రక్త ప్రసరణ తలవైపునకు ఎక్కువగా ఉండి క్రేనియల్ నెర్వస్ సిస్టమ్‌కి లాభం చేకూరుతుంది. ఆసనం మీద పట్టు ఉన్నట్లయితే సర్వాంగాసనంలో రెండు కాళ్లు పైన పక్కలకు సెపరేట్ చేయవచ్చు. ఒకకాలు ముందుకు ఒక కాలు వెనుకకు ఆల్టర్నేటివ్గా కదలించవచ్చు. సైక్లింగ్ చేయవచ్చు. మరింత ఫ్లెక్సిబులిటీ ఉంటే... నడుము, వెన్నెముకలో మరింత ఫ్లెక్సిబులిటీ ఉన్నట్లయితే పద్మాసనంలో కఠినమైన (వేరియంట్-1, వేరియంట్-2) సాధన చేయవచ్చు. సర్వాంగాసనంతోనే పద్మాసనం కూడా వేయవచ్చు. ఆ పద్మాసనాన్ని తల దగ్గరకు, నుదురు మీదకు ఇంకా వీలైతే తలవెనుక నేల మీదకు రెండు మోకాళ్లు సమంగా ఆనేటట్టుగా కూడా సాధన చేయవచ్చు. సర్వాంగాసనంలో నుంచి తిరిగి వెనుకకు వచ్చేటప్పుడు చేతులు రెండింటినీ నడుముకి సపోర్ట్‌గా ఉంచి కాళ్లు రెండూ నెమ్మదిగా నేల మీదకు తీసుకురావాలి. సీనియర్ సాధకులు చేతులు రెండూ నడుముకి సపోర్ట్‌గా ఉంచి పాదాలు మాత్రమే నేల మీద ఉంచి సేతు బంధనాసనంలోకి (బ్రిడ్జి పోస్చర్) రాగలుగుతారు. లేదా వెనుకకు హలాసనంలోకి తర్వాత ముందుకి సేతు బంధాసనంలోకి రాగలుగుతారు. మెడ భుజాల మీద భారం పడుతుంది కాబట్టి, దీని తర్వాత మత్స్యాసనం చేసినట్లయితే మెడ కండరాలు రిలాక్స్ అవుతాయి. ఉపయోగాలు క్రేనియల్ నెర్వస్ సిస్టమ్‌కి ఉపయుక్తం. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు ముఖ్యంగా హైపోథైరాయిడ్ సమస్యకి పరిష్కారం. రెండు, మూడు నిమిషాలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం ఉన్నట్లయితే కిడ్నీకి, అడ్రినలిన్ గ్లాండ్స్కి మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. మలబద్ధకం, నిద్రలేమితనం, వెరికోస్ వెయిన్స, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఇన్గ్యునల్ హెర్నియా సమస్యలున్నవారికి ఉపయుక్తం. కుర్చీ ఆసరాతో... ఫొటోలో చూపిన విధంగా చేయలేని నూతన సాధకులు చేతులున్న ప్లాస్టిక్ కుర్చీని ఆధారం చేసుకుని చేయవచ్చు. ఆసనంలో వెల్లకిలా పడుకుని తర్వాత కుర్చీని యోగా మ్యాట్ మీద నడుముకి దగ్గరగా ఉంచి రెండు చేతులతో కింద కుర్చీ కాళ్లను పట్టుకుని శరీరానికి దగ్గరగా కుర్చీని లాగుతూ సీటును కుర్చీ సీటు కన్నా పైకి తీసుకువెళుతూ కాళ్లు రెండింటిని నిటారుగా ఉంచవచ్చు. లేకపోతే కాళ్లు రెండూ కలిపి స్ట్రెయిట్‌గా ఉంచుతూ కుర్చీ బ్యాక్ రెస్ట్‌పై భాగంలో ఉంచవచ్చు. మెడ, భుజం మీద భారం ఎక్కువగా ఉన్నట్లనిపిస్తే పలచని దిండుని ఉపయోగించవచ్చు. అన్ని అంగాలకు మంచిది కనుక సర్వాంగాలూ ఉత్తేజితం చెందుతాయి కనక దీనికి సర్వాంగాసనం అని పేరు వచ్చింది. ఆసనంలో అన్నింటికంటే రాణి వంటి ఆసనం ఇది. ఆసనాలన్నింటిలోకి తొలి ఉత్తమ ఆసనం శీర్షాసనం అయితే దాని తర్వాత స్థానం ఇది. (శీర్షాసనం గురించి వచ్చేవారం) ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
76 ఏళ్ల వయసులోనూ...
ఆమె ప్రదర్శించే విన్యాసాలు చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కర్ర తిప్పే తీరు గమనిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. వయసుతో సంబంధం లేకుండా కర్రసాము కత్తి ఫైట్లతో ఇప్పుడా వృద్ధ మహిళ ఇంటర్నెట్ యూజర్లను ఇట్టే ఆకట్టుకుంటోంది. ప్రాచీన యుద్ధ కళా విన్యాసాల్లో తనదైన ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ఫేస్ బుక్ యూజర్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఫేస్ బుక్ లో ఆమె పోస్టు చేసిన వీడియో... లక్షలకొద్దీ వీక్షణలతో సంచలనం సృష్టిస్తోంది. కేరళ వటకారా లో నివసిస్తున్న మీనాక్షియమ్మ వయసు 76 సంవత్సరాలు. ఆమె పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. పురాతన భారతీయ యుద్ధ కళారూపం కలరిపయట్టు (కర్రసాము) లో నేటికీ అనేక మంది విద్యార్థులకు శిక్షణనిస్తూ అద్భుత నైపుణ్యాన్ని కనబరుస్తోంది. కర్రలు, కత్తులు, బాకులు ఉపయోగించి చేసే కర్రసాములో ఆమె చూపించిన విన్యాసాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా వ్యాపించాయి. ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ లో ఒకటైన, పురాతన కాలంనాటి కళగా గుర్తింపుపొందిన కర్రసాము బోధకురాలుగా మీనాక్షిమమ్మ ఎంతో గుర్తింపు పొందింది. ఏడు పదుల వయసు దాటినా ఆమె నేటికీ తనదైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. మీనాక్షియమ్మ వీడియో... ఫేస్ బుక్ లో ఇండియా అరైజింగ్ పేరున జూన్ 16న పోస్ట్ చేశారు. ఆ అద్భుత విన్యాసాల వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షియమ్మ వీడియోను కేవలం నాలుగు రోజుల్లోపే సుమారు 9 లక్షలమంది పైగా వీక్షించారు. వయోవృద్ధురాలైన ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ముగ్ధులైపోతున్నారు. కర్రను చేతపట్టి, చీరకొంగు నడుముకు చుట్టి ఓ వ్యక్తితో ఆమె తలపడిన తీరును చూస్తే నిజంగా అద్భుతం కళ్ళకు కడుతుంది. చూపరులు ఊపిరి బిగపట్టేలా చేస్తుంది. తనకన్నా వయసులో అతి చిన్నవాడు, ఆమె వద్దే శిక్షణ పొందిన వ్యక్తితో ఆమె యుద్ధకళను ప్రదర్శించిన తీరు ఫేస్ బుక్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. కేరళ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కలరిపయట్టు, పురాతన కాలానికి చెందిన ఓ ప్రత్యేక యుద్ధకళగా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ కళ అత్యంత క్లిష్టమైన విద్యగా కూడ పేరొందింది. -
వ్యాధులను కనిపెట్టే ‘ఈ- ముక్కు’
హోస్టన్: శ్వాసని విశ్లేషించి ఆరోగ్య పరిస్థితిని తెలిపే ఈ-ముక్కుని పరిశోధకులు తయారుచేశారు. దీన్ని తయారుచేసిన బృందంలో భారత సంతతికి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. దీని ఖరీదు కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుందంటున్నారు. కొన్ని సెమీకండక్టర్లను ఉపయోగించడం ద్వారా ఇలాంటి పరికరాలు శ్వాసని విశ్లేషించగలవు. కానీ ఇవి బాగా ఖరీదైనవి. వీటిలో సీఎంఓఎస్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను ఉపయోగించడం ద్వారా వీటి ధర భారీగా తగ్గనుందని తెలిపారు. సీఎంఓఎస్ అనేది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను ఉత్పత్తి చేసే ఓ సాంకేతిక పరిజ్ఞానం. దీన్ని స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లలో ఉపయోగిస్తారు. మనకు ఏదైనా వాసన వస్తుందంటే గాలిలో జరిగే రసాయన మార్పులు మనకు తెలుస్తున్నట్లే. ఈ-ముక్కు కూడా అదే పద్ధతిలో పనిచేస్తుంది.ఇది మనకు వచ్చే అనేక వ్యాధులను ముందుగా పసిగట్టగలదు. 2018నాటికి అందుబాటులోకి రానుంది. -
ఒకే మోతాదుతో ఉబ్బసం తగ్గదు
ఆయుర్వేద కౌన్సెలింగ్ కొన్ని వనమూలికలతో చేసిన మందును ఒక మోతాదులో తీసుకుంటే ఆస్తమా (ఉబ్బసవ్యాధి) పూర్తిగా తగ్గుతుందని కొంతమంది చెబుతున్నారు. అది సాధ్యమేనా? - ఎ. పార్వతీశం, హైదరాబాద్ వాడుక భాషలో ఉబ్బసం అని పిలిచే ఈ వ్యాధిని ఆయుర్వేద శాస్త్రం ‘తమక శ్వాస’ అనే పేరుతో వివరించింది. ఆధునికంగా ‘బ్రాంకియల్ ఆస్తమా’ అని వ్యవహరిస్తారు. ఇది శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధి. వాయునాళాలు మూసుకుపోవడం వల్ల శ్వాస విడవడం క్లిష్టంగా మారుతుంది. వాయునాళాల్లో కఫం కూడా పేరుకుపోతే దాన్ని తొలగించడం కోసం దగ్గు కూడా తోడై పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. దీని తీవ్రతను బట్టి జ్వరం, మూర్ఛ కూడా సంభవించవచ్చు. కారణాలు: 1. అసాత్మ్యాకర పదార్థాలు (అలర్జీ కలిగించేవి) : వాతావరణంలోని దుమ్ము, ధూళి, చల్లని మేఘావృత వాతావరణం, అధిక తేమ, పువ్వులలోంచి వచ్చే పుప్పొడి రేణువులు; బొగ్గు, సిమెంటు వంటి కొన్ని రసాయన ద్రవ్యాలు, కొన్ని తినుబండారాలు :ఉదాహరణకు కొన్ని నూనెలు, రంగులు, వాసనలు, నూనె మరుగుతున్నప్పుడు వెలువడే పొగ 2. వారసత్వం కూడా సంక్రమించవచ్చు 3. మానసిక ఒత్తిడి: భయం, ఆందోళన, అభద్రతాభావం, చింత, శోకం వంటి వ్యతిరేక ఉద్వేగాలు. చికిత్స: ఈ వ్యాధి ప్రధానంగా కఫం, వాతం ప్రకోపించి కలుగుతుంది. కాబట్టి ఛాతీకి, చెవులకు, శిరస్సుకు వెచ్చదనం సమకూర్చుకోవాలి. శీతల వాతావరణానికి దూరంగా ఉండాలి. పైన వివరించిన అసాత్మ్యకర భావాలు స్పష్టంగా తెలిస్తే, వాటిని దూరం చేయాలి. మానసిక ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహించాలి. అసలిపోయేంత శారీరక శ్రమ చేయకూడదు. అన్ని జాగ్రత్తలు వహిస్తూ వేడివేడి టీ వంటి పానీయాలు, తేలికగా జీర్ణమయ్యే జావులు సేవిస్తే ఆయాసపు తీవ్రత మూడు, నాలుగు రోజుల్లో తగ్గిపోయి, ఆరోగ్య స్థితి సమకూరుతుంది. ఔషధాలు: ఆయాసంగా ఉన్న సమయంలో 1. కనకాసవ, పిప్పలాసవ ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక గ్లాసులో కలిపి, నాల్గుచెంచాలు గోరువెచ్చని నీళ్లు కూడా కలిపి మూడు పూటలా తాగాలి. 2. శ్వాసకుఠారరస మాత్రలు : ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తీసుకోవాలి. ఆయాసం తగ్గిపోయిన తర్వాత శ్వాసకోశానికి బలం కలిగించేవి, తత్సంబంధిత ‘రోగ నిరోధక శక్తి’ని పెంపొందించే మందులను ఆరు నెలల పాటు వాడాలి. ఉదాహరణకు అగస్త్య హరీతకీ రసాయనం (లేహ్యం): ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా చప్పరించి పాలు తాగాలి. ఆమలకీ (ఉసిరికాయ) రసాన్ని ఒక చెంచా తేనెతో రోజూ తీసుకుంటే (ఎంతకాలమైనా తీసుకోవచ్చు) ఉబ్బసంతో పాటు ఎన్నో రకాల వ్యాధులు దరిచేరవు. రోజుకు రెండుపూటలా ఖాళీకడుపున ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులకు అమోఘమైన శక్తి పెరిగి ఎన్నో రకాల అలర్జీలనుంచి నివారణ కలుగుతుంది. వ్యాధి స్వభావం: చిన్నప్పుడు ఒకసారిగానీ, పలుమార్లు గానీ వచ్చి ఇంకెప్పుడూ జీవితంలో తిరగబెట్టదు. దీన్ని ‘పాల ఉబ్బసం’ అంటారు. చిన్నప్పుడు రాకపోవచ్చు. ఏ వయసు వారికైనా రావచ్చు. ఈ ఆయాసం ఎన్ని రోజులకొకసారి తిరగబెడుతుందన్నది ఇదమిత్థంగా చెప్పలేం. కొంతమందిలో దగ్గరదగ్గర విరామాల్లో రావచ్చు. కొంతమందిలో నెలలు లేక సంవత్సరాల విరామంలో రావచ్చు. ఇది వ్యాధికారణం, పరసరాల ప్రభావం, వ్యక్తి ప్రకృతి, తన పాటించే పథ్యాపథ్యాలు, వృత్తి మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొంతమందిలో కేవలం వార్థక్యలో సంభవించివచ్చు. సాధ్యాసాధ్యత: ఈ వ్యాధి సుసాధ్యమూ కాదు, అసాధ్యమూ కాదు. ఇది కష్టసాధ్యం (యాప్యం) అని ఆయుర్వేదం వర్ణించింది. వైద్యుడు రోగికి సరియైన అవగాహన కల్పించి, సరైన ఆహార విహార ఔషధాలు సేవిస్తే, ఈ వ్యాధిని తప్పకుండా నియంత్రణలోకి తేవచ్చు. కొత్తగా వచ్చినప్పుడు సరియైన చికిత్స చేస్తే శాశ్వతంగా నిర్మూలనమవుతుంది. (భావప్రకాశ : సయాప్య్యః తమకశ్వాసః సాధ్యోవాస్యాత్ నవ ఉత్థితః ) గమనిక: వైద్యార్హతలు లేని కువైద్యుల ప్రచారాలను నమ్మి ఆరోగ్య సమస్యలను మరింత జటిలం చేసుకోవద్దు. కేవలం ఒక్క మోతాదులో ఉబ్బసం శాశ్వతంగా పోతుందన్నది వాస్తవం కాదు. పైన వివరించినట్లుగా వ్యాధి స్వభావాన్నిబట్టి ఒక్కోసారి దానంతట అదే తగ్గిపోవచ్చు. అంతేకాని ‘ఒక్క మోతాదు’ ప్రభావం కాదు. ఒక్క మోతాదులో తగ్గుతుందన్నప్పుడు తర్కబద్ధమైన ప్రశ్న ఉద్భవిస్తుంది. ఆ ఒక్కమోతాదు దేనిని నిర్మూలిస్తుంది? వ్యాధి కారణాలా? ఆత్యయికంగా ఉన్న ఆయాసాన్నా లేదా రోగనిరోధకశక్తిని జీవితాంతం ఉండేలా ఒకేసారి పెంచుతుందా? ఊపిరిత్తుల బలాన్ని పెంచుతుందా?... కాబట్టి ఒక్క మోతాదులో తగ్గుతుందనే ప్రచారాలకు లోనై, అసలైన శాస్త్రీయ వైద్య చికిత్సలను దూరం చేసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి అలాంటి ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
మీ ఆదరణే ఊపిరిగా...
మీ అందరి ఆదరాభిమానాలతో ‘సాక్షి’ దినపత్రిక ప్రారంభమై ఎనిమిదేళ్లు పూర్తయింది. ఒక సుదీర్ఘ ప్రయాణంలో ఎనిమిదేళ్ల వ్యవధి చాలా స్వల్ప సమయమే కావొచ్చు. కానీ ఇంత తక్కువ వ్యవధిలోనే ‘సాక్షి’ మీ అందరికీ చేరువయింది. మీలో, మీ కుటుంబసభ్యుల్లో ఒకటైంది. ‘సత్యమేవ జయతే’ మకుటాన్ని శిరోధార్యంగా స్వీకరించింది మొదలు ఆ అమృత వాక్కును ‘సాక్షి’ మనసా వాచా కర్మణా ఆచరిస్తోంది. ఒక వార్త వెనకా, ఒక కథనం వెనకా ఉండే అన్ని కోణాలనూ నిత్యం మీ ముందు పరుస్తోంది. సరైన సమాచారం అందిస్తే సముచితమైన నిర్ణయం తీసుకోగల మీ విచక్షణా శక్తినీ, వివేకాన్నీ గౌరవిస్తోంది. నాణేనికి మరోవైపు చూపించే ప్రయత్నం నిరంతరం చేస్తూ తెలుగువారి మనస్సాక్షిగా నిలిచింది. అంతర్జాతీయ డిజైన్‌తో, 23 ఎడిషన్లతో, అన్ని పేజీలూ రంగుల్లో సర్వాంగసుందరంగా ముస్తాబై మీ ముందుకొచ్చి పత్రికారంగ చరిత్రలో రికార్డు సృష్టించింది. బుడిబుడి నడకలప్పుడే సాక్షి పెనుసవాళ్లను ఎదుర్కొంది. రకరకాల ఇబ్బందుల్ని చవిచూసింది. ఒక దశలో పత్రిక గొంతు నొక్కేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అయినా తన సంకల్పం నుంచి ‘సాక్షి’ అంగుళమైనా పక్కకు జరగలేదు. ధైర్యసాహసాలను ఇసుమంతైనా సడలనివ్వలేదు. వీటన్నిటినీ నిబ్బరంగా ఎదుర్కొనడంలో ‘సాక్షి’ పట్ల మీరు ప్రదర్శిస్తున్న ఆదరాభిమానాలు, అచం చల విశ్వాసం మాకు కొండంత అండగా నిలిచాయి. ‘సాక్షి’ ఆవిర్భావ సమయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న తెలుగు గడ్డ ఇప్పుడు రెండు రాష్ట్రాలైంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనైనా, ఇటు తెలంగాణలోనైనా ఉన్నదున్నట్టు నిజాయితీగా, నిర్భీతిగా, నిర్మొహమాటంగా నిజాలను నిగ్గుతేల్చుతున్నదీ, ప్రజావ్యతిరేక చర్యలను ఎండగడుతున్నదీ ‘సాక్షి’ మాత్రమే. అదే సమయంలో అభివృద్ధికి అవసరమైన సూచనలనూ, క్షేత్రస్థాయిలో లోటుపాట్లనూ పాలకుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజాప్రయోజనాల పరిరక్షణకు అహరహం పాటుపడుతోంది సాక్షి. ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఎంపికైన గ్రామాల్లో పాలక పార్టీ పెద్దలు బినామీల మాటున వేల ఎకరాలను కబ్జా చేసిన వైనంపై సాక్ష్యాధారాలతో సహా మూడు రోజులపాటు ధారావాహిక కథనాలను ‘సాక్షి’ వెలువరించింది. రాజధాని నిర్మించే ప్రాంతంపై వదంతులు సృష్టించి, స్థానిక రైతులను తప్పుదోవ పట్టించి చవగ్గా భూములు కొట్టేసిన తీరునూ... అసైన్డ్ భూములున్న నిరుపేద రైతులను భయాందోళనలకు గురిచేసి ఆ భూముల్ని అమ్ముకునేలా చేసిన వంచననూ వెలుగులోకి తెచ్చింది. అలా నాలుగైదు లక్షల రూపాయలకు భూములు కొన్నవారు కొన్ని నెలల్లోనే కోట్లకు పడగెత్తిన వైనాన్ని పక్కా ఆధారాలతో వెల్లడించింది. సంజాయిషీ ఇచ్చుకునేందుకు కూడా తోవ దొరకని భూ రాబందులు ‘డబ్బులున్నాయి... మేం కొనుక్కున్నాం, ఇందులో తప్పేముంది’ అంటూ చట్టసభల్లోనూ, వెలుపలా దబాయింపులకు దిగాయి. ‘సాక్షి’ పాత్రికేయ బృందాన్ని బెదిరించి, భయపెట్టి మరిన్ని కథనాలు రాకుండా చూసే కుట్రలకూ తెరతీశాయి. ఎన్నడూ లేనివిధంగా పాత్రికేయులను పోలీస్స్టేషన్లకు పిలిచి ప్రశ్నించే అప్రజాస్వామ్య సంస్కృతికీ దిగజారాయి. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీతో కుమ్మక్కయి ‘సాక్షి’ నోరు నొక్కాలనుకున్న టీడీపీ... ఇప్పుడు తమ చేతుల్లోనే అధికారం ఉన్నదన్న అహంకారంతో అవే ఎత్తుగడలను మరింత ఉధృతంగా ప్రయోగిస్తోంది. ఇటువంటి కుట్రలూ, కుహకాలకు ‘సాక్షి’ బెదిరిపోయే ప్రసక్తి లేదు. ఎంచుకున్న తోవ నుంచి కొంచెమైనా తప్పుకునే ప్రశ్న లేదు. గడిచిన 22 మాసాల్లో ఏపీ ప్రభుత్వం వివిధ జీవోల ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న తీరును ఎండగడుతూ వరస కథనాలు రావడానికి కారణం ఈ సంకల్పబలమే. అయితే, మాతో విభేదించినవారి అభిప్రాయాలకు కూడా పత్రికలో చోటివ్వకుండా పోలేదు. వాస్తవాలను వక్రీకరించిందన్న ఆరోపణలకు తావుండరాదన్న దృఢ నిశ్చయంతో సకల స్వరాలనూ వినిపిస్తున్నాం. ఏ కథనం ప్రచురించినప్పుడైనా సంబంధిత వర్గాల వివరణను సైతం తీసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో సైతం జనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ‘సాక్షి’ వెలుగులోకి తెస్తున్నది. ఉన్న ఊళ్లో పనులు కరువై వలసపోతున్న అభాగ్యుల గురించీ, అడ్డా కూలీలుగా మారిన రైతన్నల దైన్య స్థితి గురించీ వివరించడమే కాదు... హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చెరువుల్ని చెరబట్టిన జల మాఫియాల ఆగడాలనూ పతాక శీర్షికలకెక్కించాం. ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను సవివరంగా ఇస్తూనే, అమలు చేయని కార్యక్రమాల గురించి ప్రశ్నిస్తున్నాం. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకలను ఎత్తిచూపుతున్నాం. జనజీవన ప్రమాణాలను పెంపొందించేందుకు శక్తివంచన లేకుండా పాటుపడుతున్నాం. సమాజంలోని అన్ని వర్గాలవారికీ ఉపయుక్తమైన సమాచారాన్ని అందించడానికి ఎప్పటికప్పుడు అదనపు శీర్షికలు ప్రారంభించి కొత్త పుంతలు తొక్కుతున్నాం. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగార్థులు, యువతకూ అవసరమైన సమాచారం అందించే ప్రయత్నం విశేషంగా చేస్తున్నాం. సమాజ శ్రేయస్సే పరమావధిగా సాగుతున్న ఈ ప్రయాణంలో అడుగడుగునా మమ్మల్ని ఆదరించి, ఆశీర్వదించి, అక్కున చేర్చుకున్న తెలుగు పాఠక మహాశయులకూ, ప్రకటనకర్తలకూ, ఏజెంట్లకూ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రారంభంనాడే చెప్పినట్టు సమాజహితమే మా లక్ష్యం. సత్యసంధతే మా మార్గం. మీ అందరి ఆదరాభిమానాలూ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ.... అభినందనలతో -కె. రామచంద్రమూర్తి ఎడిటోరియల్ డైరెక్టర్ -
జీర్ణక్రియాసనాలు
1. ఉత్థానాసన తాడాసనం (సమస్థితి)లో నిలబడి చేతులు రెండు తుంటిమీద ఉంచాలి. శ్వాస మెల్లగా వదులుతూ తుంటికీలు నుండి (నడుము నుండి కాకుండగా ఇంకా క్రిందభాగం నుండి) ముందుకు వంగాలి. నడుము ఆ పై భాగాలను బాగా సాగదీస్తూ, వీలైనంత వరకు మోకాళ్ళను ముందుకు వంచకుండా నిటారుగా ఉంచాలి. చేతులను తుంటిమీద నుండి కిందకు, చేతివేళ్ళను కిందకు అరచేతులను నేలమీద ఉంచితే ‘పాద హస్తాసనము’అంటారు. అదే, చేతివేళ్ళతో కాలి బొటనవేళ్లను పట్టుకున్నట్లయితే ‘పాదాంగుష్టాసనం’ అంటారు. చేతులు రెండూ కలిపి వెనకకు తీసుకువెళ్లినట్లయితే ‘ఉత్థానాసనం’ అంటారు. 3 లేదా 5 సాధారణ శ్వాసలు తరువాత శ్వాస తీసుకుంటూ తిరిగి తాడాసన స్థితికి రావాలి. ఒక వేళ రెండు చేతులు నేలమీదకు తీసుకురాలేనివారు చేతులు కింద రెండు ఇటుకలను కావల్సిన ఎత్తులో ఉంచి వాటి సపోర్ట్ తీసుకోవచ్చు. జాగ్రత్తలు: ప్రారంభ సాధకులు, ఔ1 ఔ5 ప్రాంతంలో సమస్య ఉన్నవారు మోకాళ్లు ముందుకు వంచాలి. ఉపయోగాలు: కేంద్ర నాడీ మండల వ్యవస్థకు, ఉదర భాగాలైన కాలేయం, జీర్ణాశయం, క్లోమగ్రంధికి మంచిది. మైగ్రేయిన్, తలనొప్పి, నిద్రలేమి మెనోపాజ్ వంటి సమస్యలకు పరిష్కారం. స్పాండిలైటీస్కి పరీక్ష: చేతులు రెండు వెనుక భూమికి సమాంతరంగా వచ్చినట్లయితే స్పాండిలైటీస్ సమస్యలేనట్లు. కొంచెం ఆకాశం వైపునకు ఉన్నట్లయితే సమీప భవిష్యత్తులో స్పాండిలైటీస్ వస్తుందని, పూర్తిగా ఆకాశంవైపునకు ఉన్నట్లయితే స్పాండిలైటీస్తో బాధపడుతున్నట్లు గమనించగలరు. 2. ఉపవిష్ట కోణాసన/ భూనమనాసన ఉత్థానాసనంలో నుండి ప్రసారిత పాదోత్థానాసనంలోకి రావాలి. అంటే కాళ్లు రెండు బాగా స్ట్రెచ్ చేసి 4 లేదా 5 అడుగులు దూరం ఉంచి ముందుకి వంగాలి. తల నేలమీదకు తీసుకువచ్చి మాడు భాగం భూమి మీద పెట్టి చేతులు రెండూ వెనుకకు తీసుకువెళ్ళి, అరచేతులు ఇంటర్‌లాక్ చేసి పైకి సాగదీయాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ తలను పైకి లేపి, శ్వాస వదులుతూ సీటు భాగాన్ని భూమి మీదకి తీసుకువచ్చి కూర్చోవాలి. కాళ్లు రెండు వైపులకు స్ట్రెచ్ చేసిన స్థితిలోనే ఉంచి, శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పైకి తీసుకువెళ్ళి శ్వాస వదులుతూ నడుము క్రింద భాగం నుండి సాగదీస్తూ ముందుకు వంగి రెండు పాదాలను రెండు చేతులుతో పట్టుకొని, తలను భూమికి దగ్గరగా తీసుకురావాలి. వీలైతే ఛాతి భాగం, ఉదరభాగం కూడా భూమి మీద ఆనించే ప్రయత్నం చేయవచ్చు. జాగ్రత్తలు: ప్రారంభ సాధకులు ముందు భాగంలో ఒక బాలిస్టర్ను ఉంచి శ్వాస వదులుతూ పూర్తిగా బాలిస్టర్ మీదకు వంగి విశ్రాంత స్థితిలో ఉండవచ్చు. ఇంకా కష్టంగా ఉన్నట్లయితే సీటు క్రింద సమంగా ఉన్న ఒక దిండును పెట్టుకోవచ్చు. ఉపయోగాలు: గ్రాయిన్ భాగంలో స్టిఫ్నెస్ తగ్గుతుంది. కాళ్లు, తొడల భాగాలు బాగా స్ట్రెచ్ అవుతాయి. జీర్ణవ్యవస్థకు మంచిది. 3. పరివృత్త జానుశిరాసన పై ఆసనం తరువాత కుడికాలును మడచి, కుడిపాదం మడమను పెరీనియం (జననేంద్రియం)కు దగ్గరగా తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ అరచేతులు రెండూ ఆకాశంవైపునకు చూపిస్తూ పైకి తీసుకెళ్లాలి. నడుము క్రిందిభాగం నుండి పైకి శరీరాన్ని లాగుతూ, శ్వాస వదులుతూ ఎడమవైపుకి వంగి, ఎడమపాదాన్ని రెండు చేతులతో పట్టుకోవాలి. నడుమును పూర్తిగా ట్విస్ట్ చేస్తూ ఎడమకాలును నిటారుగా ఉంచి ఆకాశం వైపు చూస్తూ (వీలైతే) 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ పైకి లేవాలి. శ్వాస వదులుతూ చేతులు రెండూ ప్రక్క నుండి క్రిందకు తీసుకురావాలి. ఎడమ మోచేతిని భూమి మీద పెట్టే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా రెండోవైపు కూడా చేయాలి. జాగ్రత్తలు: పై విధంగా చేయడం సాధ్యపడని వారు మోకాలి సమస్య ఉన్నవారు మోకాలి క్రింద భాగంలో ఒక దిండును ఉపయోగించి మోకాలును పైకి లేపి ఉంచవచ్చ్చు. నడుము పైకి లాగటం, ట్విస్ట్ చేయడం మీద పూర్తిగా దృష్టి ఉంచడం చాలా ముఖ్యం. ఉపయోగాలు: పొట్టభాగాలు, పక్కటెముకలు, ఛాతీపై భాగాలకు మంచి టోనింగ్ జరుగుతుంది. జీర్ణవ్యవస్థకు, రక్తప్రసరణ వ్యవస్థకు, శ్వాసకోశ వ్యవస్థకు చక్కటి ఆసనం. యోగావగాహన ఆచారం: జీవనశైలికి సంబంధించిన 6 అంశాలలో గతవారం పేర్కొన్న ఆహారం, విహారం, వ్యవహారం, విచారం ఈనాల్గింటిని అనునిత్యం ఆచరిస్తూ భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగ మార్గానుసారం అవిద్యను తీసివేసే దిశగా పనిచేయాలి. గ్రహచారం: ఈ ఆచారమే మన గ్రహచారాన్ని నిర్ణయించి కైవల్యప్రాప్తిని కల్గిస్తుంది. అవిద్య అనగా: అనిత్యమైన దానిని నిత్యమనుకోవడం (శరీరం అనిత్యం. కానీ దానిని నిత్యమని భ్రమించడం) అశుచియైన దానిని శుచి అనుకోవడం దుఃఖాన్ని సుఖమనుకోవడం (జననం దుఃఖం, మరణం దుఃఖం - దీనిని గ్రహించి కైవల్యప్రాప్తికి ప్రయత్నించకుండా సుఖజీవనం గడపడం) అనాత్మను ఆత్మ అనుకోవడం (ఆత్మకాని ఐహిక సంబంధాలు, సుఖాలు పట్ల రాగం, మోహం పెంచుకుంటూ అదే ఆత్మ అని భ్రమించుడం) సమన్వయం: ఎస్. సత్యబాబు, సాక్షి ప్రతినిధి -
ఊపిరి పీల్చుకుంటున్న భూమి!
-
పల్మునాలజీ కౌన్సెలింగ్
బాబుకు ఎప్పుడూ పొడి దగ్గే, ఏం చేయాలి? మా అబ్బాయి వయసు 16 ఏళ్లు. వాడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. శ్వాస అందడం లేదు. కొద్దిగా జ్వరం కూడా వస్తోంది. మా డాక్టర్‌ను సంప్రదిస్తే వాడిది ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ అని చెప్పారు. అంటే ఏమిటి? - ఖాసీమ్, మహబూబ్‌నగర్ ఆస్తమా వ్యాధులలో అనేక రకాలు ఉంటాయి. కాఫ్ వేరియెంట్ ఆస్తమా అనేది ఆస్తమాలోనే ఒక రకం. దీనిలో బాధితుడికి ఎప్పుడూ పొడిదగ్గు వస్తూ ఉంటుంది. అంటే తెమడ పడదన్నమాట. వీళ్లకు పిల్లికూతలు లాంటి సంప్రదాయ ఆస్తమా లక్షణాలు కనపడవు. దీన్నే కొన్నిసార్లు ‘క్రానిక్ కాఫ్’ (దీర్ఘకాలం వచ్చే దగ్గు) అని కూడా అంటారు. అంటే ఇది ఆరు నుంచి ఎనిమిది వారాల పైగానే కొనసాగుతుంది. రాత్రీ పగలూ అనే తేడా లేకుండా దగ్గు వస్తూనే ఉంటుంది. రాత్రివేళ ఎడతెరపి లేని దగ్గు వల్ల నిద్రపట్టదు. ఇలాంటి రోగుల్లో వాళ్లకు సరిపడని దానికి ఎక్స్పోజ్ అయితే అది ఆస్తమాను ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు ఘాటైన వాసనలు, దుమ్ము, చల్లగాలి వంటివి. ఈ కాఫ్ వేరియెంట్ ఆస్తమా ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు తర్వాతి దశలో వస్తాయన్నమాట. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని వస్తువులు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా-బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలైన దాఖలాలు కొన్ని ఉన్నాయి. అలాగే గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. కాబట్టి మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. ఆ డాక్టర్ మీ కుమారుడిని అనేక ప్రశ్నలు అడిగి తెలుసుకొని, మీ కుటుంబ వ్యాధుల చరిత్రను అధ్యయనం చేసి, శ్వాసించే తీరును విని వ్యాధి నిర్ధారణా, తగిన చికిత్సా చేస్తారు. -
నోరు మంచిదైతే... ఊరు మంచిదౌతుంది!
నోటి దుర్వాసన (హ్యాలిటోసిస్) ఉదయం లేవగానే... మనం మన ఆత్మీయులతో తప్ప మాట్లాడం. ఇతరులతో మాట్లాడాలనుకుంటే తప్పనిసరిగా బ్రష్ చేసుకున్న తర్వాతే మాట్లాడతాం. కారణం... ఉదయం లేచాక మనందరి నోళ్ల నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇది చాలా సహజం. కానీ కొందరిలో మాత్రం బ్రష్ చేసుకున్న తర్వాత కూడా దుర్వాసన వస్తూనే ఉంటుంది. వాళ్లు మన సమీపంలోకి వస్తే మనకు తెలియకుండానే శ్వాస బిగబట్టేసి ముఖం పక్కకు తిప్పుకుంటాం. మీరు దగ్గరికి వచ్చిన ఎవరైనా అలా చేస్తుంటే న్యూనతకు గురికాకండి. మీ నోరు మంచిదిగా చేసుకోండి... అంతే... ఊరంతా మీకు మంచిదవుతుంది. మన నోట్లో, గొంతులో మొదలుకొని, జీర్ణకోశం దారి పొడవునా అనేక బ్యాక్టీరియా నివాసం ఉంటుంటాయి. ఇక మనం ఏదైనా తిన్న తర్వాత పళ్ల మధ్య మిగిలిపోయిన వాటిని మరింత చిన్నముక్కలుగా విడగొట్టి, దానిపై మనుగడ సాగించే బ్యాక్టీరియా నోట్లో, అలాగే గొంతులోనూ ఉంటాయి. రాత్రి మనం నిద్రపోయాక మన నోరు చాలాసేపటివరకు నమలడం, మింగడం లాంటి ఎలాంటి కార్యకలాపాలకూ తావులేకుండా ఉంటుంది. కాబట్టి నోట్లో, గొంతులో ఉన్న ఈ బ్యాక్టీరియా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. నోట్లో ప్లస్ గొంతులో ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్టీరియాకు ‘ఓరోఫ్యారింజియల్’ బ్యాక్టీరియా అని పేరు. ఉదయానికల్లా వాటి సంఖ్య పెరుగుతుంది కాబట్టి ముఖం కడుక్కోడానికి ముందుగా మన నోరు దుర్వాసన వేస్తుంటుంది. బ్రష్ చేసుకున్న తర్వాత ఆ బ్యాక్టీరియా గణనీయంగా తగ్గిపోతుంటుంది కాబట్టి మన నోటి నుంచి దుర్వాసన రావడం తగ్గుతుంది. బ్రష్ చేసుకున్న తర్వాత కూడా దుర్వాసన వస్తుంటే... కొందరిలో బ్రష్ చేసుకున్నా ఫలితం ఉండదు. ఇలాంటి వారిలో బ్రషింగ్ తర్వాత కూడా దుర్వాసన వస్తుంటే... దానికి కారణాన్ని తెలుసుకుని, అందుకు తగినట్లుగా చర్యలు తీసుకోవాలి. అప్పుడు దుర్వాసన తగ్గుతుంది. బ్రషింగ్ తర్వాత కూడా నోటి దుర్వాసనకు కారణాలివే... కొన్ని ఆహారాలతో: కొన్ని రకాల ఆహారాలు సహజంగానే దుర్వాసన కలిగించేవిగానూ లేదా పెంచేవిగానూ ఉంటాయి. ఉదాహరణకు ఉల్లి, వెల్లుల్లి, మసాలాల వంటివి తినగానే, నోటినుంచి ఘాటుగా వాసన వస్తుంటుంది. పైగా ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాల్లో సల్ఫర్ పాళ్లు ఎక్కువ. అందుకే వీటిని తినగానే గొంతులో వోలటైల్ సల్ఫర్ కాంపౌండ్స్ (వీఎస్సీ) ఏర్పడతాయి. అంటే వాయు రూపంలో ఉండే గంధకపు ధూమం అన్నమాట. దీనివల్ల విపరీతమైన దుర్వాసన వస్తుంటుంది. పరిష్కారం : పగటి వేళ వీలైనంత వరకు ఉల్లి, వెల్లులి, మసాలాలతో కూడిన ఆహారాన్ని తీసుకోకపోవడం మేలు. ఒకవేళ తిన్నా వెంటనే బ్రష్షింగ్ చేసుకోవడం మంచిది. ఇక నాలుకకు మరో చివర తెల్లగా పాచి పేరుకుపోతుంది. అప్పుడు టంగ్క్లీనింగ్తో దుర్వాసన తగ్గుతుంది. పలువరస చక్కగా లేకపోతే... : కొందరిలో పలువరస చక్కగా ఉండదు. పళ్లు గొగ్గిరిగా ఉంటాయి. దాంతో వాళ్లు తిన్న ఆహారం చక్కగా లేనికారణంగా పళ్ల సందులలో చిక్కుకుపోతుంది. ఆహారాన్ని మరింత చిన్నముక్కలు చేసే బ్యాక్టీరియా ఎప్పటిలాగే దానిపై పనిచేస్తుంటుంది. ఈ ప్రక్రియలో శిథిలమయ్యే ఆహారం నుంచి రసాయన వాయువులు వెలువడటం వల్ల నోటి దుర్వాసన వస్తుంటుంది. పరిష్కారం : పలువరస చక్కగా లేని కారణం వల్ల ఆహారం పళ్లమధ్య చిక్కుకుపోయి దుర్వాసన వస్తుంటే... వారు డెంటిస్ట్‌ను కలుసుకుని పళ్లకు మధ్య సందులు లేకుండా చూసుకునేందుకు అవసరమైన చికిత్స తీసుకోవాలి. పొగతాగడం లేదా పొగాకు నమలడం: పొగతాగే అలవాటు ఉన్నవారిలో పొగాకుకు సంబంధించిన దుర్వాసన భరించలేకుండా ఉంటుంది. అలాగే గుట్కా, ఖైనీ, జర్దా వంటివి తినేవారిలోనూ పక్కవాళ్లు భరించలేనంత దుర్వాసన వస్తుంటుంది. పరిష్కారం : పొగతాగడం, గుట్కా, ఖైనీ, జర్దా... ఇలా ఏ రూపంలో పొగాకును వాడినా అది కేవలం నోటి దుర్వాసన వంటి మామూలు సమస్యకు మాత్రమే పరిమితం కాదు. నోటి క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన, చాలా ఖర్చుతో కూడిన చికిత్సలు చేయించాల్సిన ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది. అందుకే ఈ అలవాట్లు ఉన్నవారు తక్షణం వాటిని మానేయాల్సిందే. పైగా పొగతాగే అలవాటు వల్ల ఏర్పడే ప్రమాదం వారికే పరిమితం కాదు. ప్యాసివ్ స్మోకింగ్ (వారు వదిలే పొగను కుటుంబ సభ్యులు, పక్కవారు పీల్చడం) వల్ల వారు ప్రేమించే అతి దగ్గరివారికీ అది ప్రమాదకరం. కాబట్టి ఈ అలవాటును ఎంత త్వరగా వదుల్చుకుంటే అంత మేలు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు / నోట్లో తడి ఆరిపోవడం: మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు అంటే మాంసాహారం, పప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని మన నోట్లోని బ్యాక్టీరియా మరింత చిన్న చిన్న అంశాలుగా విడగొడుతుంటాయి. ఉదాహరణకు ప్రోటీన్లను అమైనో ఆసిడ్స్గానూ, ఆ అమైనో ఆసిడ్స్‌ను మరింత చిన్న పదార్థాలుగానూ విడదీస్తాయి. నోట్లో తడి ఆరిపోయి ఉన్నప్పుడు, నోరు చాలాసేపు మూసి ఉన్నప్పుడు ఇలా ఆహారం ఇలా చిన్న అంశాలుగా విడిపోయే ప్రక్రియలో దానిపై జీవించే (థ్రైవింగ్) బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. పరిష్కారం : ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినగానే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే తరచూ మంచినీళ్లు తాగుతూ నోరు తడిగా ఉంచుకోవాలి. డయాబెటిస్ ఉన్నప్పుడు : మనం నోటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నా, ఎప్పటికప్పడు కడుక్కుంటున్నా... అప్పటికీ నోటి నుంచి దుర్వాసన వస్తుందంటే వాళ్లలో డయాబెటిస్ ఉందేమోనని అనుమానించాలి. డయాబెటిస్ ఉన్నవారిలోనూ తరచూ నోటిలో తడి ఆరిపోతుంటుంది. దాంతోనూ దుర్వాసన రావడం మొదలవుతుంది. పరిష్కారం : మనం నోటి పరిశుభ్రత చర్యలను తీసుకుంటున్నా నోరు దుర్వాసన వస్తుంటే ఒకసారి డెంటిస్ట్ లేదా జనరల్ ఫిజీషియన్‌ను కలిసి వారి సలహా మేరకు పరగడుపున చేయించే రక్షపరీక్ష, భోజనం తర్వాత చేయించే రక్తపరీక్షలు చేయించుకొని డయాబెటిస్ బయటపడుతుందేమో చూడాలి. డయాబెటిస్ లేనప్పుడు జీర్ణవ్యవస్థకు సంబంధించిన (గ్యాస్ట్రో ఇంటస్టినల్) వ్యాధుల వల్ల ఇలా జరుగుతుందేమో తెలుసుకొని దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. నోటి దుర్వాసనను తొలగించుకోడానికి కొన్ని మార్గాలు : ప్రతిరోజూ ఉదయం, రాత్రి... రెండుమార్లు పళ్లు తోముకోండి బ్రషింగ్ తర్వాత టంగ్‌క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోండి. నాలుకపైనున్న బ్యాక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేయండి చిగుళ్లపై పుళ్లు ఉన్నప్పుడు తప్పనిసరిగా డెంటిస్ట్‌ను కలిసి పరీక్షలు చేయించుకోండి. కొన్నిసార్లు దంతాల్లో పిప్పిపళ్లు ఉన్నప్పుడు ఫిల్లింగ్ చేయించుకోవాలి. ఆహారం సరిగా జీర్ణం కాకుండా గ్యాస్ వస్తున్నప్పుడు, సైనస్, టాన్సిల్స్ వంటివి ఉన్నప్పుడు, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్ వి. రమణకుమార్, డెంటల్ సర్జన్, ఆర్థోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్, స్మైల్ కేర్ డెంటల్ హాస్పిటల్స్, అమీర్‌పేట, హైదరాబాద్ -
ఉఫ్... అని ఊదితే రోగాన్ని చెప్పేస్తుంది!
సిడ్నీ: ఆవలిస్తే పేగులు లెక్కించడం కాదు.. ఒక్కసారి ఉఫ్ మని ఊదితే చాలు మీకున్న రోగాలను పట్టేసే లేజర్ పరికరం వచ్చేసింది! మనం వదిలే ఊపిరిలో ఏయే వాయువులున్నాయి.. అవి ఎంత గాఢతతో ఉన్నాయి.. అవి ఏ వ్యాధికి సంబంధించినవో చిటికెలో చెప్పేస్తుందట. అంతేనా... మన చుట్టూ ఉన్న వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే గ్రీన్హౌస్ వాయువులు ఏ కొద్ది మోతాదులో ఉన్నా పసిగడుతుంది. ఈ అద్భుతమైన పరికరాన్ని ఆస్ట్రేలియాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ అడెలేడ్’కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. మామూలు లేజర్ల కంటే ఈ కొత్త తరహా లేజర్ 25 రెట్లు అధికంగా కాంతిని ఉద్గారం చేస్తుందని పరిశోధనలో పాలుపంచుకున్న హిండర్సన్-సపైర్ తెలిపారు. దీనివల్ల వాయువులను కచ్చితంగా గుర్తించవచ్చని వివరించారు. వైద్య రంగంలో వివిధ వ్యాధుల నిర్ధారణకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఉదాహరణకు మధుమేహం ఉన్నవారి శ్వాసలో ఎసిటోన్ వాయువు ఉంటుంది. వారు ఊపిరి తీసుకొని వదిలినప్పుడు ఈ పరికరం ఆ వాయువును గుర్తిస్తుంది. దీన్నిబట్టి వారికి మధుమేహాన్ని నిర్ధారించవచ్చు. ఇదొక్కటే కాదు.. చాలా వ్యాధులకు సంబంధించిన వాయువులను కూడా ఈ లేజర్ పరికరం గుర్తిస్తుందట! -
ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది...
మా పాప వయసు ఏడేళ్లు. ఆమెకు తరచూ జలుబు చేస్తోంది. ఇటీవల ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తోంది. రాత్రుళ్లు ముక్కు బిగదీసుకుపోయి ఊపిరితీసుకోవడం సాఫీగా సాగడం లేదంటూ చెబుతోంది. డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుతున్నా ఫలితం తాత్కాలికంగానే ఉంటోంది. మా పాప సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. - విశాలాక్షి, అమరావతి మీరు రాసిన లక్షణాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్‌ను రైనైటిస్‌గా చెప్పవచ్చు. రైనైటిస్ అనేది ముక్కు లోపలి పొర ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ఇలాంటివారిలో మీరు చెప్పిన జలుబు మాత్రమే కాకుండా ముక్కుదిబ్బడ, ముక్కు కారడం, కొద్దిమందిలో ముక్కులోపల దురద, విపరీతమైన తుమ్ములు వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇటీవల రైనైటిస్ కేసులు పెరుగుతున్నాయి. కొద్దిమందిలో ఇది సైనసైటిస్, ఆస్తమాతో పాటు కనిపించవచ్చు. ఈ లక్షణాలు కొంతమందిలో ఎప్పుడూ ఉంటాయి. మరికొందరిలో సీజనల్‌గా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న చాలామందిలో అది ఏదో ఒక అలర్జీ వల్ల సంభవించడం మామూలే. అయితే కొద్దిమందిలో అలర్జీతో సంబంధం లేకుండాను, మరికొద్దిమందిలో ఇతరత్రా నాన్ ఇన్ఫెక్షియస్ కారణాల వల్ల కూడా కనిపించవచ్చు. అంటే... అలర్జెన్స్ వల్లనే కాకుండా చల్లటిగాలి, ఎక్సర్సైజ్, వాతావరణంలో మార్పులు, కాలుష్యాలు, ఉద్వేగాలకు లోనుకావడం (ఎమో షనల్ డిస్టర్బెన్సెస్) వల్ల కూడా వస్తుందన్నమాట. అరుదుగా కొన్నిసార్లు హార్మోన్లలో సమతుల్యం లోపించడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇక మీ పాప విషయంలో ఇది ఇడియోపథిక్ అలర్జిక్ రైనైటిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు కారణం తెలుసుకోవడం కష్టం అయినప్పటికీ- కంప్లీట్ హీమోగ్రామ్, ఇమ్యునో గ్లోబ్లులిన్ (ఐజీఈ) లెవెల్స్, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అలర్జెన్స్ పరీక్ష వల్ల కూడా కొంతవరకు కారణాలు తెలుసుకోవచ్చు. దీనికి చికిత్సగా ముక్కులో వేయాల్సిన చుక్కల మందు (సెలైన్ నేసల్ డ్రాప్స్), యాంటీ హిస్టమైన్ గ్రూపు మందులు వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేసల్ స్టెరాయిడ్స్ తో చాలావరకు ఉపశమనం ఉంటుంది. ఇక సమస్యను నివారించడం కోసం రైనైటిస్‌ను ప్రేరేపించే ఇతర అంశాలు అంటే... ఫేస్‌పౌడర్, ఘాటైన వాసనలు ఉండే పదార్థాలు, పెంపుడు జంతువులు, దుమ్ము ధూళి వంటి వాటికి దూరంగా ఉండాలి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని లేదా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్